Main Menu

POLITICS

 
 

ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?

వాస్త‌వానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కి సంబంధించి ప్ర‌స్తుతానికి ఎటువంటి ప్ర‌చారం లేదు. 2009 ఎన్నిక‌ల త‌ర్వాత ఒక‌టి రెండు మ‌హానాడు వేదిక‌ల మీద ద‌ర్శ‌న‌మిచ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌స్తుతం పూర్తిగా సినిమాల మీద కేంద్రీక‌రించారు. వ‌రుస హిట్స్ తో ఊపుమీదున్నారు. అయితే ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కి సంబంధించి ఓ సినీ న‌టి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్ప‌టికే టాలీవుడ్ లో లోక‌ల్ కి అవ‌కాశాలు ద‌క్క‌డం లేదంటూ కామెంట్స్ తో మాధ‌వీల‌త క‌ల‌క‌లం రేపింది. అందుకు కొన‌సాగింపుగానే అన్న‌ట్టుగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ పై కామెంట్స్ చేయ‌డం విశేషం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని, మంచి మాటకారి అని పేర్కొన్న మాధవి అతడిని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడంRead More


ఆనం బ్ర‌ద‌ర్స్ ని మోసం చేసిందెవ‌రు..?

అయ్యో..అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. రాజ‌కీయాల్లో అంతెత్తుకు ఎదిగిన వాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ప‌డిపోవ‌డం అనూహ్య‌మే అనిపిస్తోంది. అయినా పోలిటిక్స్ లో ఇలాంటి సీన్లు త‌ప్ప‌వేమో అని స‌రిపెట్టుకోవాలి. బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఏమిటో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే అంతా తామై అన్నింటా పెత్త‌నం చెలాయించిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు మోస‌పోయామ‌ని వాపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. స్వ‌యంగా ఆనం వివేకానంద‌రెడ్డి తాము మోస‌పోయామ‌ని చెప్పిన నేప‌థ్యంలో అస‌లు ఇంత‌కీ వాళ్ల‌ని మోస‌గించిందెవ‌రనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ‘మోసపోయాం బ్రదర్‌.. ఎన్ని అవమానాలను భరిస్తాం. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. అది కూడా చేజారింది. సొంత కళాశాల వీఆర్సీలో జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడు. ఇక ఇప్పట్లో నెల్లూరుకు రాలేను’… ఇవీRead More


ఆ ఇద్దరు టీడీపీ నేతలను క్యాంపు ఆఫీస్‌కు పిలిపించి…

వివాదాల్లో ఇరుకున్న టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు కన్నెర్ర చేశారు.వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్, రావి వెంకటేశ్వరరావులను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని క్లాస్ పీకారు. కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఈ ఘటనలు చంద్రబాబుకు తీవ్రఆగ్రహన్ని తెప్పించాయి. బాపట్ల టీడీపీ నేత ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ సూర్యలంక హరిత బీచ్ రీసార్ట్‌లో పర్యటక శాఖ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కారణం లేకుండా ఉద్యోగి శ్రీనివాస్‌ను కొట్టారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో అన్నం సతీష్‌పై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు రివాల్వర్ మిస్ పైర్ ఘటన సంచలనంRead More


చంద్రబాబు ఆగ్రహంతో ఆ ఇద్దరిపై …

సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలో శనివారం ఉదయం తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌.. వ్యహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా రావి, అన్న సతీష్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ తక్షణమే వచ్చి తనను కలవాలని సీఎం ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేక్షించవద్దని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఇటీవల గుడివాడ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తుపాకి మిస్‌ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. బాపట్ల సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌లో శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ అన్నం సతీష్‌, అనచరులు పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌, సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలుRead More


పవన్ ఎఫెక్ట్ తో .. స్పందించిన చంద్రబాబు

ఉద్దానంలో కిడ్నీ భాదితులను కలిసి పరామర్శించి వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన విజ్ఞప్తితో… సీఎం చంద్రబాబు స్పందించారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అధికారులను బాబు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 26వ తేది నాటికి బాధిత గ్రామాలకు తాగునీటిని అందించాలని డెడ్‌లైన్ పెట్టారు. కిడ్నీ సమస్య ఉన్న అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద రూ. 2కు 20 లీటర్లు నీరు ఇస్తామన్నారు. కిడ్నీ సమస్య ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారన్నారు. ఆక్సిన్‌ లెవల్స్‌ నీటిలో రావడం… సిలికాన్‌ నేలలో ఉండటం వల్ల వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారని సీఎం తెలిపారు. దీనిపై రెండు నిపుణులRead More


యూపీలో అధికారం వారిదే…

ఒపీనియన్ పోల్స్ సర్వేలో యూపీలో అధికారం బిజెపిదేనని తేలిపోయింది.ఇక వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ కమలనాధులపరం కాబోతోందని ఇండియా టుడే తెలిపింది. యాక్సిస్‌ సంస్థతో కలిసి ఒపీనియన్ పోల్స్ సర్వే జరిపిన ఇండియా టుడే యూపీలో బిజెపి ఘన విజయం సాధించబోతోందని తెలిపింది. బిజెపికి 206 నుంచి 216 స్థానాలు దక్కనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి 92 నుంచి 97 స్థానాలు దక్కే అవకాశం ఉంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 79 నుంచి 85 చోట్ల గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అతి దారుణంగా 5 నుంచి 9 స్థానాలకే పరిమితం కానుంది. ఇతరులు 7 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటారని ఇండియా టుడే ఒపీనియన్ పోల్స్‌లో తేలింది.


తండ్రిని తప్పించి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనయుడు..

తన తండ్రిని తప్పించి పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్న తనయుడి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. సమాజ్ వాదీ పార్టీలో తండ్రీతనయుల వైరం మరింత ముదురుపాకాన పడింది. పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేశారు. జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయం సింగ్ యాదవ్‌‌ను తొలగించి అఖిలేశ్ యాదవ్‌కు ఆ పదవిని కట్టబెట్టాలని, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించాలని, పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను నియమించాలని ప్రతిపాదించారు. పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఈ ప్రతిపాదనలను చేస్తుండగా సభకు హాజరైనవారంతా చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. పార్టీRead More


మోడీకి మూడిందా..!?

కేంద్రంలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత నోట్ల మార్పిడితో మోడీ తీసుకున్న నిర్ణ‌యం అంద‌రినీ విస్మ‌య ప‌రుస్తోంది. వాస్త‌వానికి ఇది మోడీ చెబుతున్న‌ట్టు ఇది నోట్ల ర‌ద్దు కాదు. వెనిజులా గానీ ఆస్ట్రేలియాలో గానీ జ‌రిగింది నోట్ల ర‌ద్దు. కానీ మ‌న దేశంలో మాత్రం నోట్ల మార్పిడి జ‌రుగుతోందంతే. ఇప్ప‌టికే 500 నోటుకి ప్ర‌త్యామ్నాయం విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో కొత్త వెయ్యి నోటుకి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. వాటికితోడుగా 2వేల నోటును కూడా ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా నోట్ల మార్పిడి మాత్ర‌మే చేశారు. దాంతో ఈ నిర్ణ‌యం వెలువ‌రించిన న‌వంబ‌ర్ 8 త‌ర్వాత దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయు. మోడీ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌గానే జైజైలు ప‌లికినోళ్లే వేగంగా స్వ‌రం స‌వ‌రించారు. స‌మ‌స్య‌లు చవి చూడ‌గానే స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టారు. నిర్ణ‌యం అమ‌లులో చేతులెత్తేసిన తీరుతో తీవ్ర ఆగ్ర‌హంRead More


జ‌గ‌న్ క‌ట్ట‌డికి బాబు బ్ర‌హ్మాస్త్రం..!

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు కొత్త వార్ ముదురుతోంది. ఇప్ప‌టికే హోరాహోరీగా త‌ల‌బ‌డుతున్న పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల స‌మ‌రం కొత్త పుంత‌లు తొక్కుతోంది. అందులో భాగంగా వ్య‌వ‌హారం న్యాయ స్థానాల‌కు చేరుతోంది. గ‌తంలో జ‌గ‌న్ ని కోర్టుల సాయంతో క‌ట్ట‌డి చేసిన చంద్ర‌బాబు మ‌ళ్లీ అదే బ్ర‌హ్మాస్త్రం బ‌య‌ట‌కు తీస్తున్నారు. దానికి ప్ర‌తిగా జ‌గ‌న్ కూడా కేసులను ఆయుధంగా మ‌ల‌చుకుంటున్నారు. చంద్ర‌బాబును చిక్కుల్లో నెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పాత కేసులు తిర‌గ‌దోడాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తే..చంద్ర‌బాబు మీద ఉన్న కేసుల‌ను అస్త్రంగా చేసుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. దాంతో ఇరు వ‌ర్గాల వైరం న్యాయ‌స్థానాల ముందుకు చేరుతోంది. జ‌గ‌న్ పై టీడీపీ నేత‌లు వేసిన కేసుకి తోడు ఆనాటి కాంగ్రెస్ కూడా చేతులు క‌ల‌ప‌డంతో వైఎస్సార్సీపీ నేత‌ను కొంత ఇర‌కాటంలో పెట్ట‌గ‌లిగారు. అయితే ఇప్పుడు అదే కేసుల అస్త్రం జ‌గ‌న్Read More


టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా వారికే ఉంది..

ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజల ఆశలపై నీరు చల్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని వీఆర్‌ఎన్‌ గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం గిరిజన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకి తప్ప ఏ ఇతర పార్టీకి లేవన్నారు. మజ్లి్‌సను మట్టికరిపించే సత్తా కూడా బీజేపీకే ఉందన్నారు. హామీలను విస్మరించిన కేసీఆర్‌ ముస్లింల రిజర్వేషన్‌లను తెరపైకి తీసుకువచ్చి తగదాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలు ముందుకొస్తుంటే కేసీఆర్‌ అసెంబ్లీలో అమోదం తెలిపి చేతులు దులుపుకున్నారన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ చరిష్మా పోయిందని, టీఆర్‌ఎస్ పై బ్రమలు తొలగిపోయాయని, టీడీపీ బలహీనపడిందని, ఇక భవిష్యత్తంతాRead More