Main Menu

polavaram

 
 

పోల‌వ‌రం ..మ‌ళ్లీ గంద‌ర‌గోళం!

పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో మ‌ళ్లీ కొర్రీలు ప‌డుతున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడిగా, జాతీయ ప్రాజెక్ట్ గా ప్ర‌క‌టించిన ఈ బ‌హుళార్థ‌క సాధ‌క ప్రాజెక్ట్ విష‌యంలో ఎగువ రాష్ట్రాల అభ్యంత‌రాల‌తో ఏపీ ఆశ‌లు నీరుగారిపోయేలా క‌నిపిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్ట్ ఆదేశాల‌తో వ్య‌వ‌హారం మొద‌టికొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఓవైపు అంచ‌నా వ్య‌యంపైనే కేంద్ర రాష్ట్ర‌ప్ర‌భుత్వాల మ‌ధ్య ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు సాగుతున్న ద‌శ‌లో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌ర‌పాల్సిందేనంటూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రభావంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ధర్మాసనం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపుపై సరైన అధ్యయనం జరగకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆ పనులనుRead More


స‌హించ‌లేక‌పోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత వ్య‌క్తిగ‌త శైలి భిన్నంగా ఉంటుంది. చంద్ర‌బాబు త‌న అధికారాన్ని కాపాడుకునేందుకు రాజ‌కీయాలు చేస్తారు. జ‌గ‌న్ ఈసారి ఖ‌చ్చితంగా అధికారం సాధించాల‌న్న త‌ప‌న‌తో ఉంటారు. కానీ ప‌వ‌న్ మాత్రం వారిద్ద‌రికీ భిన్నం. జ‌న‌సేన‌కు అధికారం వ‌స్తుంద‌న్న విశ్వాసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం చేప‌డ‌తాం అని ఓమారు చెబుతూ..మ‌ళ్లీ ఆ వెంట‌నే త‌మ‌కు అధికార‌మే ప‌ర‌మావ‌ధి కాద‌ని ప్ర‌క‌టిస్తుంటారు. మ‌ళ్లీ అంత‌లోనే క‌ర్ణాట‌క త‌రహాలో కీల‌క‌పాత్ర పోషిస్తామ‌ని చెప్పుకొస్తారు. ఇలా ప‌దే ప‌దే త‌న భ‌విష్య‌త్ విష‌యంలో గంద‌ర‌గోళ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డం ప‌వ‌న్ ప్ర‌త్యేక‌త‌. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత‌గూటి వ్య‌వ‌హారాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. జ‌న‌సేన‌లో వ‌ర్గ‌పోరు తార‌స్థాయికి చేరుతోంది. దిగువ స్థాయిలో కాకుండా ఏకంగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలోనే ఇలాంటి వ్య‌వ‌హారాలు ముందుకొస్తున్నాయి. ఇది చివ‌ర‌కుRead More


ఆర్టీఐతో దొరికిపోయిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం అబ‌ద్ధాలు చెబుతున్నారా..పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో ముఖ్య‌మంత్రి మాట‌లు న‌మ్మ‌శ‌క్యం లేవా..అంటే ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు వాటిని అబ‌ద్ధాల‌ని తోసిపుచ్చుతున్నారు. అధికారికంగానూ అదే రీతిలో స‌మాధానాలున్నాయి. తాజాగా ఆర్టీఐ ద్వారా సేక‌రించిన స‌మాచారంలో కూడా చంద్ర‌బాబు మాట‌ల‌కు, వాస్త‌వ లెక్క‌ల‌కు పొంత‌న క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ కోసం కేంద్రం నిధుల కేటాయింపు విష‌యంలో సీఎం మాట‌లు స‌త్య‌దూర‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఈనెల 22న పోల‌వ‌రం ప్రాజెక్ట్ అథారిటీ అందించిన రిపోర్ట్ ప్ర‌కారం నాటి వ‌ర‌కూ ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి బ‌కాయి లేదు. పూర్త‌యిన పనుల‌న్నింటికీ కేంద్రం నిధులు చెల్లించింది. పైగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి 1385 కోట్ల‌కు సంబంధించిన లెక్క‌లు పీపీఏకి చేరాల్సి ఉంది. అంటే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వానికి అన్ని ర‌కాలుగానూ స‌హాయం అందుతుండ‌గా, ఏపీRead More


పోల‌వ‌రంపై క‌న్నేసిన క‌మ‌ల‌నాధులు

ఏపీ బీజేపీ నేత‌లు దూకుడు పెంచుతున్నారు. క్ర‌మంగా చంద్ర‌బాబు స‌ర్కారుపూఐ ఒత్తిడి పెంచే య‌త్నం చేస్తున్నారు. కొద్దికాలం క్రితం ఏపీకి కొత్త సార‌ధి ఎంపిక విష‌యంలో ఏర్ప‌డిన వివాదంతో బీజేపీలో కొంత సందిగ్ధం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం అలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ స‌ర్థుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పార్టీ నేత‌లంతా ఉమ్మ‌డిగా పాల‌క టీడీపీ మీద ఎదురుదాడికి సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై బీజేపీ నేత‌లు క‌న్నేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో స‌మావేశ‌మ‌యిన బీజేపీ రాష్ట్ర నేత‌లంతా క‌లిసి ఉమ్మ‌డిగా పోల‌వ‌రం యాత్ర సాగిస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు ఇదో అవ‌కాశంగా భావిస్తోంది. ముఖ్యంగా డ‌యా ఫ్ర‌మ్ వాల్ చూపించి ప్రాజెక్ట్ పూర్తి చేశామ‌న్నంత స్థాయిలో ప్ర‌చారం సాగిస్తున్న నేప‌థ్యంలో ప్రాజెక్ట్ నిర్మాణంలోRead More


టీడీపీ ఏం చెప్పుకోవాలి…?

ఏపీలో దాదాపుగా ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌ల‌య్యినట్టే చెప్ప‌వ‌చ్చు. షెడ్యూల్ కి ఏడాది ముందు నుంచే పార్టీల‌న్నీ త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రి ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటారు..ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద ఆయుధంగా మారుతోంది. పాల‌క టీడీపీ కూడా ఉద్య‌మంలోకి వ‌చ్చినా క్రెడిట్ మాత్రం విప‌క్షాల‌కే ద‌క్కుతోంది. పాచిపోయిన ల‌డ్డూలంటూ కామెంట్స్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి, ఆమ‌ర‌ణ‌దీక్ష కూడా చేసి, యువ‌భేరీల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ఎజెండా ప్ర‌త్యేక హోదానేన‌ని తేల్చిచెప్పిన జ‌గ‌న్ కి ప్ర‌జ‌ల్లో మార్కులు ప‌డుతున్నాయి. అది చంద్ర‌బాబుకి, టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. మీడియా స‌హాయంతో ఎంత‌గా ప్ర‌చారం చేసినా ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని టీడీపీ శ్రేణులే భావిస్తున్నాయి. చివ‌ర‌కు అధినేత దీక్ష ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తుందోRead More


ఒక్కరోజుకే మరచిపోతే ఎలా పవన్?

నాలుగు రోజుల పర్యటన కోసం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో పర్యటనలు పూర్తి చేసుకుని దక్షిణాంధ్ర వైపు పవన్ కళ్యాణ్ కదులుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన పలు కీలక సమస్యలను ప్రస్తావించారు. డీసీఐ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానికి గట్టి హెచ్చరికలే పంపించారు. బీజేపీ ఓటమికి విశాఖ నుంచే బీజం పడకుండా చూసుకోవాలని సూటిగానే చెప్పేశారు. అయితే దానిమీద బీజేపీ నేతలు మాత్రం పెద్దగా స్పందించకపోవడంతో పవన్ కి ఇబ్బంది రాలేదు. కానీ అదే సమయంలో పోలవరం విషయంలో చంద్రబాబు మాత్రం పవన్ కి కౌంటర్ ఇచ్చేశారు. వాస్తవానికి పవన్ ఏపీ సర్కారుని తప్పుబట్టారు. పోలవరం విషయంలో కేంద్రానికే కాకుండా తనకు కూడా సందేహాలు పెరుగుతున్నాయన్నారు. మన బంగారం మంచిదయితే అంటూ మాట్లాడి..కేంద్రాన్ని తాను నిలదీయాలంటే ముందు చంద్రబాబు చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. శ్వేతపత్రం విడుదల చేసి, అఖిలపక్షRead More


జైలుకి పోతారని హెచ్చరించిన బీజేపీ నేత

బీజేపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. టీడీపీకి గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత యడ్లపాటి రఘునాధ బాబు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. పోలవరం విషయంలో చంద్రబాబు స్పందన చూసిన బీజేపీని బద్నాం చేస్తున్న విషయం గ్రహించని భాజపా దళం దానికి తగ్గట్టుగా కౌంటర్లు వేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరైనా జైలుకి పోతారంటూ రఘునాథ్ బాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇఫ్పటికే మోడీని ఎదురించిన నేతలందరి మీద పలు కేసులతో వేధింపులు తప్పడం లేదు. దాంతోనే చంద్రబాబు కూడా బీజేపీ విషయంలో ఇబ్బందులున్నప్పటికీ, చివరకు మోడీ మొఖం చాటేస్తున్నప్పటికీ స్నేహబంధం కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టెండర్లను మార్చడంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఘాటు లేఖ రాయడం గరంగరంగా మారుతోంది. ఈ తరుణంలోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణRead More


ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో ఆస‌క్తిక‌ర క‌ల‌యిక‌. ఎందుకంటే వాళ్లిద్ద‌రూ స‌హ‌చ‌రులు కాదు. ఇంకా చెప్పాలంటే చాలాకాలం పాటు విరోధులు కూడా. స‌మాకాలికులు అస‌లు కాదు. స‌మఉజ్జీలు కాదు. అయినా క‌లిశారు. మాజీలు కాస్త మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపారు. గోదావ‌రి గ‌ట్టు మీద ఆస‌క్తిగా జ‌ట్టుక‌ట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మాజీ మంత్రి. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు టీడీపీలో చ‌క్రం తిప్పిన పెద్ద‌ల్లుడు. కానీ చంద్ర‌బాబు సార‌ధ్యం వ‌హించిన త‌ర్వాత ఆయ‌న ప్రాభ‌వం కోల్పోయారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరినా చివ‌ర‌కు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, చివ‌ర‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో క‌నిపించ‌కుండా పోయారు. ఉండ‌వ‌ల్లి సుదీర్ఘ‌కాలంగా కాంగ్రెస్ వాది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు స‌మైక్యాంధ్ర‌లో చేరినా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌కుండా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి దూర‌మ‌య్యారు. కానీ తాను రాజ‌కీయ నాయ‌కుడిన‌ని ఆయ‌న నిత్యం చెబుతూనే ఉంటారు.Read More


బాబు పాల‌న‌లో బీట‌లు

ఆశ్చ‌ర్య‌మే అయినా ఒకే రోజు రెండు వార్త‌లు ఏపీ ప్ర‌భుత్వ తీరును తేట‌తెల్లం చేస్తున్నాయి. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఒక‌టి ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అయితే, మ‌రోటి సెంట‌ర్ పాయింట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ . అలాంటి రెండు నిర్మాణాల్లోనూ లోపాలు వెలుగుచూడ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అభివృద్ధిలో డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంది. తాజాగా అమ‌రావ‌తి లో నిర్మించిన స‌చివాల‌యం భ‌వ‌నానికి ప‌గుళ్లు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. దాదాపుగా వెయ్యి కోట్లు వ్య‌యం చేసిన త‌ర్వాత నిర్మించిన భ‌వనాల్లో ఏమేర‌కు ప్ర‌మాణాలు పాటించారో తేట‌తెల్ల‌మ‌వుతోంది. రాజ‌ధానిలో సాగిస్తున్న నిర్మాణాల‌కే నాణ్య‌త లేక‌పోతే ఇక రాష్ట్రంలో మిగిలిన వాటి ప‌రిస్థితి ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌రిపాల‌నా కేంద్రంలోనే భ‌వ‌నాల‌కు బీటలు వారుతుంటే అది పాల‌న‌కు బీట‌లు వారిన‌ట్టేన‌నే అనుమానం బ‌ల‌ప‌డుతుంది. అదే స‌మ‌యంలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ‌కుమార్ మ‌రో బాంబ్ పేల్చారు. ఏకంగాRead More


బాబుకి అంత భ‌య‌మా..?

ఏపీకి మ‌రో టోపీ పెట్ట‌డం ఖాయం అయ్యింది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీని న‌మ్మించి మోస‌గించిన కేంద్రం పోల‌వ‌రం వ్య‌వ‌హారంలో జాతీయ హోదా ఉన్నప్ప‌టికీ హ్యాండివ్వ‌డానికి రెడీ అయ్యింది. ఈ విష‌యం కూడా ఏకంగా సీఎం ఢిల్లీలో ఉండ‌గానే వెలువ‌డింది. పార్ల‌మెంట్ సాక్షిగా జ‌ల‌వ‌న‌రుల మంత్రి స్ప‌ష్టం చేసేశారు. 2014 నాటికి ఉన్న అంచ‌నా వ్య‌యం త‌ప్ప అంత‌కు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేద‌ని చెప్పేశారు. అంటే గ‌డిచిన మూడేళ్లుగా పెరిగిన పోల‌వ‌రం వ్య‌యం, ఇంకా పూర్తికావ‌డానికి ప‌ట్టే స‌మ‌యం నాటికి పెర‌గ‌బోతున్న వ్య‌యం కూడా ఏపీ ప్ర‌భుత్వం భ‌రించాల్సిందే అన్న‌ది కేంద్రం తేల్చేసిన అంశం. అలాంటి స‌మ‌యంలో అస‌లే ఆర్థికంగా అవ‌స్థ‌లు ప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశ‌ల ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌డం అతి క‌ష్టంగా మారుతుంది. ఇప్ప‌టికే ఈ ఏడాది బ‌డ్జెట్Read More