pawankalyan

 
 

బాబు ఆశలు నీరుగార్చేసిన జనసేన

chandrababu pawan

ప్రత్యేక విమానంలో వచ్చారు ..వెళ్లారు కానీ అసలు ఆశలు మాత్రం తీర్చలేదు. దాంతో ఇప్పుడు తెలుగుతమ్ముళ్లు కొంత నిరాశకు గురవుతారనే భావించాలి. వాస్తవానికి జనసేన గత ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి సాగింది. దాని ఫలితంగా పవన్ ఫ్యాన్స్ తో పాటు బలిజ ఓట్లలో కూడా టీడీపీకి అనుకూలంగా మారాయి. దాని ఫలితంగా ఆ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వగలిగింది. ఇక ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా జనసేన మద్ధతు తమకేనని, ఆయన ప్రచారానికి కూడా వచ్చే అవకాశం ఉందని కొందరు నంద్యాల తెలుగు తమ్ముళ్లు అత్యాశకు పోయారు. కానీ తీరా పవన్ కల్యాణ్ ప్రకటన చూసిన తర్వాత వారంతా నిరాశ చెందుతున్నట్టు కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన తటస్థ వైఖరి తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తద్వారా తెలుగుదేశంతొ దూరమయినట్టు భావించాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ టీడీపీ, జనసేనRead More


మెగా బ్ర‌ద‌ర్స్ క‌లిసే …!

chiru pawan selfie

మెగా మువీ కి సంబంధించిన వార్త‌లు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అందుకే ప్ర‌ముఖ నిర్మాత టీ సుబ్బారామిరెడ్డి ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గానే అంతా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. అయితే అంత‌లోనే అది సాధ్య‌మా అనే ప్ర‌శ్న‌లు కూడా వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్ లో మువీ సాధ్య‌మా అంటూ సందేహాలు వ్య‌క్తం చేశారు. అయినా టీఎస్సార్ మాత్రం నిరుత్సాహ‌ప‌డ‌లేదు. త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తునే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మెగా మువీకి సంబంధించి స్టోరీ క‌న్ఫ‌ర్మ్ అయ్యిందంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వాస్త‌వానికి మెగా బ్ర‌ద‌ర్స్ మువీకి స్టోరీ సెట్ కావ‌డ‌మే అత్యంత కీల‌కం. అలాంటిది స్టోరీ ఖ‌రార‌య్యింద‌నే ప్ర‌క‌ట‌న ఇప్పుడు కొత్త ఆశ‌లు రేకెత్తిస్తోంది. ఇక ఆత‌ర్వాత ఇద్ద‌రి డేట్స్Read More


జ‌న‌సేనాని మీద త‌మ్ముళ్ల మంట‌

pawan3

తెలుగుత‌మ్ముళ అరికాలి మంట నెత్తికెక్కింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు మీద పంచ్ లు పేలుస్తున్నారు. ఒక నాటి త‌మ మిత్ర‌ప‌క్షం నాయ‌కుడి మీద య‌ధేశ్ఛ‌గా నింద‌లు వేస్తున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించ‌డంతోనే స‌హించ‌లేక‌పోతున్నారు. దాంతో సోష‌ల్ మీడియాలో టీడీపీ నేత‌లు ఇప్పుడు ఏక‌కాలంలో అటు జ‌గ‌న్, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద గురిపెట్టాల్సి వ‌స్తోంది చాలాకాలంగా చిన్న‌గా విమ‌ర్శ‌లు వినిపిస్తున్న టీడీపీ బృందాలు తాజాగా ప‌వ‌న్ ఘాటు ట్వీట్ త‌ర్వాత శృతిపెంచారు. జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేసే స్థాయిలోనే ప‌వ‌న్ మీద దాడికి దిగ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామాల‌కు సంకేతంగా ఉంది. వాస్త‌వానికి ఏపీ రాజకీయాల్లో చాలా సంద‌ర్భాల్లో కూడా చంద్ర‌బాబు ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సానుకూల‌త‌నే ప్ర‌ద‌ర్శించారు. సీఎంకి ఇబ్బంది క‌లిగించే ప్ర‌య‌త్నాలు జ‌నసేనాని చేయ‌లేదు. రాజ‌ధాని భూముల్లో, తుందుర్ర ఆక్వాలోRead More


జైల్లో మిత్రుడు: నోరుమెద‌ప‌ని ప‌వ‌న్

mallula suresh, pawan19332351_2444147278377198720_n

ఫిరంగులు ఎదురొచ్చినా నిల‌బ‌డ‌గ‌లిగే యువ సైన్యం త‌న‌కు కావాల‌న్నారు జ‌న‌సేనాని. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, ఓ యువ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని న‌మ్ముకున్నందుకు ఇక్క‌ట్లు పాల‌య్యార‌నే ప్ర‌చారం సాగుఓతంది. జ‌న‌సేనాని మూలంగా క‌ష్టాలు కొనితెచ్చుకున్నార‌ని భావిస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో సాగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే జైలుపాల‌యిన ఓ మాజీ జ‌ర్న‌లిస్టు జీవితం దానికి ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తుంది. కొద్దిరోజుల క్రితం తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ మీద జ‌న‌సేనాని స్పందించారు. జ‌నావాసాల మ‌ద్య ఆక్వాపార్క్ వీలులేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ప్ర‌భుత్వం నిర్ణ‌యం మార్చుకోక‌పోతే తానే రంగంలో దిగుతాని హెచ్చ‌రించారు. కానీ ఆయ‌న చెప్పిన‌ట్టు ప్ర‌భుత్వం నిర్ణ‌యం మార్చుకోలేదు. తుందుర్రు ప్ర‌జ‌ల మీద పోలీసుల‌ను ఉసిగొల్పి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం మాత్రం కొన‌సాగిస్తోంది. అయినా ప‌వ‌న్ కి పట్టిన‌ట్టు లేదు. తానే రంగంలో దిగుతాన‌ని, ప్ర‌జ‌ల త‌రుపునRead More


టీవీ9 కొత్త దారి

tv9

అవును..ఏపీలో రాజ‌కీయాలు మారుతున్న కొద్దీ మీడియాలో ప‌రిణామాలు కూడా మారుతున్నాయి. పార్టీకో చానెల్, జెండాకో ప‌త్రిక అన్న‌ట్టుగా ఉన్న త‌రుణంలో మెరుగైన స‌మాజం కోసం అని చెప్పుకునే టీవీ9 కూడా త‌న ఎజెండా కోసం ఓ జెండాకి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం చాలాకాలంగా వ‌స్తోంది. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త‌తో చంద్ర‌బాబుకి సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం అంద‌రికీ తెలిసిందే. అయితే తాజాగా చంద్ర‌బాబు క‌న్నా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన‌మ‌న్న‌ట్టుగా టీవీ9 తీరు క‌నిపిస్తోంది. అందుకే కొత్త దారి ప‌డుతోంది. కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో ఈ విష‌యాన్ని ర‌వి ప్ర‌కాష్ స్వ‌యంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేదు. అయితే ఆచ‌ర‌ణ ఎలా ఉంటుందో చెప్ప‌డానికి తాజా ప‌రిణామం ఓ ఉదాహ‌ర‌ణ‌గా చూడ‌వ‌చ్చు. స‌హ‌జంగా చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా లైవ్ ఇవ్వ‌డానికి టీవీ9 ప్రాధాన్య‌త‌నిస్తుంది. అందులోనూ అసెంబ్లీలో,Read More


బాక్సాఫీస్ వ‌ద్ద క‌దం తొక్కిన కాట‌మ‌రాయుడు

katamrayudu

కాట‌మ‌రాయుడు స‌త్తా చాటాడు. ఓపెనింగ్స్ అద‌ర‌గొట్టాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టాడు. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాటమరాయుడు సినిమా థియేటర్లలోకి రావ‌డంతోనే భారీ వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. అమెరికాలో ప్రిమీయర్ షోల దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా కాటయరాయుడు సందడి క‌నిపించింది. పేరుకు తగ్గట్టుకునే సినిమా కూడా మాస్ మాసాల ఎంటర్‌టైనర్ కావడంతో కాటమరాయుడికి అన్ని చోట్ల అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో మొత్తంగా కాటమరాయుడు సినిమా మొదటిరోజే అత్యథిక కలెక్షన్లు కొల్లగొట్టేశాడు. కలెక్షన్లలో కొత్త రికార్డుల సృష్టించేశాడు. ఓవర్సీస్‌లో ప్రిమీయర్ షోల ద్వారా కాటమరాయుడు దాదాపుగా $650,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో 4 కోట్లు పై మాటే) సాధించాడని సమాచారం. మరోపక్క తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా 23 కోట్లు పైనే సాధించిందని చెబుతున్నారు.Read More


సాఫ్ట్ రోల్ లో ప‌వ‌న్ ..!!

pawan in usa

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ‘కాటమరాయుడు’ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటిస్తున్న..నటించబోయే చిత్రాలపై అభిమానులు ఆసక్తి పెంచుకుంటుంటారు. ‘కాటమరాయుడు’ చిత్రం అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరి కాంబినేషన్ లో ‘జల్సా’..’అత్తారింటికి దారేది’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడో ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో ‘పవన్ కళ్యాణ్’ సాఫ్ట్ వేర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ‘దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్రత్యేక సెట్ ని రామోజ్ ఫిలిం సిటీలో రెడీ చేస్తున్నారని, సమ్మర్ కారణంగా సెట్ మొత్తం చల్లగా ఉండేలా దానిని తయారు చేయిస్తున్నట్టు టాక్. మార్చి 25 నుండి ఈ చిత్రంRead More


ప‌వ‌న్ తో ఫిల్మ్ సిటీలో విద్యార్థుల భేటీ

jnasena pawan

జ‌న‌సేన అధినేత‌తో విద్యార్థులు భేటీ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్ర‌త్యేకంగా సామావేశ‌మ‌య్యారు. విక్ర‌మ సింహ‌పురి యూనివ‌ర్సిటీ విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల‌ను మొర‌పెట్టుకున్నారు. వర్సిటీ సమస్యలు, అక్రమాలపై విద్యార్థులు పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థులు పవన్‌కు విన్నవించారు. త‌మ స‌మ‌స్య‌ల మీద అనేక మార్లు యూనివ‌ర్సిటీ అధికారుల‌ను, విద్యాశాఖ మంత్రి స‌హా అంద‌రినీ క‌లిశామ‌ని తెలిపారు. దాంతో జ‌న‌సేన అధినేత స్పందించారు. త‌క్ష‌ణం యూనివ‌ర్సిటీలో నిజ నిర్దారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి పవన్ సూచించారు. గంటా శ్రీనివాస‌రావు స్పందించాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌న్నారు.


ప‌వ‌న్ క‌ల్యాణ్ కి స‌ర్ ప్రైజ్..!

katamarayudu-working-stills-2

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం సెట్స్ మీదున్న కాట‌మ‌రాయుడు సినిమా పూర్తి చేయ‌డంపై దృష్టి కేంద్రీక‌రించారు. మార్చి చివ‌రిలో సినిమా విడుద‌ల‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా చ‌క‌చ‌కా షూటింగ్ కంప్లీట్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో సాగుతున్నారు. సినిమాకు సంబంధించిన మూడు పాట‌ల చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంది. వాటిని విదేశాల్లో చిత్రీక‌రించడానికి స‌న్నాహాలు చేశారు. ఇక శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కిశోర్‌ కుమార్‌ పార్ధసారధి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షన్‌ నాయకుడిగా చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ స‌ర్ ప్రైజ్ వీడియో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఓ ఫైట్ కోసం ఉపయోగించేందుకు ప్రత్యేకంగా కత్తిని తయారు చేశారు. ఈ ఫైట్‌ సినిమాకే హైలైట్‌గా ఉంటుందట. దానికి సంబంధించిన వీడియోను పవన్‌ అభిమానుల కోసం చిత్రబృందం విడుదల చేసింది. అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.


ప‌వ‌న్ క‌ల్యాణ్ కి బ్యాడ్మింటన్ బ్యూటీ మ‌ద్ధ‌తు

janasena

ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ బ్యూటీ గుత్తా జ్వాల అనూహ్య నిర్ణ‌యం తీసుకుంటున్నారా..పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నారా…జ‌న‌సేన‌కు జై కొడుతున్నారా అన్న చ‌ర్చ సాగుతోంది. తాజాగా ఆమె చేసిన ప్ర‌క‌ట‌న ఆధారంగా ఇప్పుడీ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అటు క్రీడా వ‌ర్గాల్లోనూ, ఇటు రాజకీయ‌వ‌ర్గాల్లోనూ చ‌ర్చ మొద‌ల‌య్యింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పవన్ కళ్యాణ్‌తో జత కట్టనున్నారా? అనే విష‌యంపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. గ‌తంలో నితిన్ తో క‌లిసి టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసిన ఈ భామ‌కు మంచి క్రేజ్ ఉంది. దాంతో గుత్తా జ్వాల ప్ర‌క‌ట‌న ఇప్పుడు అంద‌రిని ఆమెవైపు దృష్టి మ‌ళ్లేలా చేసింది. తనకు పవన్ ప్రసంగాలు నచ్చుతాయని గుత్తా జ్వాల చెప్పారు. ప్రజా సమస్యలు, వ్యవసాయం, విద్యా వ్యవస్థ వంటి సామాజిక అంశాల గురించి ప‌వ‌న్ ఎక్కువగా మట్లాడతారని చెప్పారు.Read More