Main Menu

pawan

 
 

మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?

ఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదల‌య్యింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నుంచి మొద‌ల‌యిన తంతు ఇప్పుడు కొత్త రూపు దాల్చింది. ముఖ్యంగా ప‌వ‌న్ ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. ద‌గ్గుబాటి అభిరామ్ వ్య‌వ‌హారం స‌మ‌సిపోయి కొణిదెల వారి కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల పాత్ర ముందుకొచ్చింది. టీవీ9, టీవీ5, ఏబీఎన్ చానెళ్లు ఒక‌వైపు జ‌న‌సేనాని మ‌రోవైపు అన్న‌ట్టుగా మారిపోయింది. ప‌వ‌న్ మీడియా మీద గురిపెట్ట‌డాన్ని కొంద‌రు త‌ప్పుబ‌డుతుండ‌గా, ప‌లువురు అభినందిస్తున్నారు. తెలుగు మీడియాలో మాఫియాగా మారిన ఓ వ‌ర్గం పెత్త‌నాన్ని నిల‌దీసినందుకు అభినందలు తెలుపుతున్నారు. అండ‌గా నిలుస్తున్నారు. పీకేకి తోడుగా నిలుస్తామ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి మీడియాలో కొంద‌రి పెత్త‌నాన్ని తొలుత నిల‌దీసింది వైఎస్ జ‌గ‌న్. కానీ ఆయ‌న కొంత వ‌ర‌కూ ప్ర‌య‌త్నించి ప్ర‌స్తుతం ఏబీఎన్ మిన‌హా మిగిలిన వారితో స‌ఖ్యంగా సాగిపోతున్న‌ట్టుRead More


జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!

కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏకంగా 40మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌నే రీతిలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు కూడా. వైసీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చాలాకాలంగా త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారంద‌రికీ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని చెప్పాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రోసారి ఫిరాయింపుల జోరు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి ప‌లువురు నేత‌లు సైకిల్ స‌వారీకి సెండాఫ్ చెప్పేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావుRead More


నంద్యాల ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ …!

పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డంతో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ర‌గిలిపోతున్నారు. కాపు జాతిని అణ‌చివేస్తున్నారంటూ చంద్ర‌బాబు మీద విరుచుకుప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఆయ‌న దూకుడు పెంచారు. 2019లో చంద్ర‌బాబుకి ముగింపు ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. దానికితోడుగా అధికారంలో క‌ల‌క‌లం ఉంటార‌ని కోమాలో ఉండి భావిస్తున్న‌ట్టు విమ‌ర్శించారు. పోలీసుల‌ను కూడా హెచ్చరించారు. 2019లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓట‌మి ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు తొత్తులుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ మీద ఆయ‌న లేఖాస్త్రాలు సంధించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చంద్ర‌బాబుకి ప‌దుల సంఖ్య‌లో లేఖ‌లు రాశారు. ఆత‌ర్వాత కేసీఆర్ కి కితాబునిస్తూ లేఖ‌రాశారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ కు హెచ్చ‌రిక‌లు చేస్తూ బాబు వ‌ల‌లో ప‌డొద్ద‌నే సూచ‌న‌ల‌తో లేఖ రాశారు. ఆ క్ర‌మంలోనే తాజాగా ముద్ర‌గ‌డ క‌న్ను నంద్యాల ఎన్నిక‌ల మీద ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌వ‌న్ తోRead More


నంద్యాల‌లో జ‌గ‌న్ కి పోటీగా ప‌వ‌న్ ..!

నంద్యాల ఉప ఎన్నిక‌లు ఏపీ రాజ‌కీయాల్లో హీటు పెంచుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు నంద్యాల మీదే దృష్టి కేంద్రీక‌రించాయి. ప్ర‌చారంలోనూ, పార్టీలో చేరిక‌ల‌తోనూ వైసీపీ ముందంజ‌లో ఉంది. దానిని అధిగ‌మించ‌డానికి టీడీపీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. దానికి అన్ని ర‌కాల అస్త్రాల‌ను వినియోగిస్తోంది. అందుబాటులో ఉన్న‌వారంద‌రినీ రంగంలో దింపుతోంది. స‌గం క్యాబినెట్ మంత్రులే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఎమ్మెల్యేలు, నేతలంతా మోహ‌రించి నంద్యాల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు. అయినా ఫ‌లితాలు ఆశావాహంగా లేవ‌ని తాజా స‌ర్వేలు చెబుతున్న నేప‌థ్యంలో కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగా జ‌న‌సేన రంగంలోకి వ‌చ్చింది. ఉద్దానం పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు రోజుల పొలిటిక‌ల్ సీన్ అంద‌రికీ తెలిసిందే. వైజాగ్ కి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి, ఆత‌ర్వాత విజ‌య‌వాడ‌కు కూడా ప్ర‌త్యేక విమానంలో ప్ర‌యాణాలు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడాRead More


ముద్ర‌గ‌డ కోసం ముంద‌డుగు నంద్యాల‌లో వెన‌క‌డుగు

పేరు ఉద్దాన‌మే అయిన‌ప్ప‌టికీ అస‌లు రాజ‌కీయ వ్యూహాలు మాత్రం స్ప‌ష్టంగానే ఉన్నాయి. రాజకీయాల‌కు అతీతంగా ఉన్నామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ ల‌క్ష్యాలు మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. పైకి చెబుతున్న ఎజెండా ఏమ‌యిన‌ప్ప‌టికీ అస‌లు ఎజెండా అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. వైజాగ్ లో హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ తిల‌కించ‌డానికి స‌మ‌యం లేద‌న్న ప‌వ‌ర్ స్టార్ అమ‌రావ‌తిలో మాత్రం ఎక్కువ స‌మ‌య‌మే కేటాయించారు. విందు రాజ‌కీయాలే కాకుండా ఆంత‌రంగిక స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. చార్టెడ్ ఫ్లైట్స్ లో రెండు రోజుల పాటు తిరిగిన ఆయ‌న క‌ర్త‌వ్యం అంద‌రికీ క‌నిపిస్తోంది. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌, నంద్యాల ఉప ఎన్నిక‌లే ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న ల‌క్ష్యాలు. దానికి త‌గ్గ‌ట్టుగానే పావులు క‌దిపారు. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమతిచ్చి ఉండాల్సిందంటూ ప‌వ‌న్ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం కాబోతున్నాయి. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తించే విష‌యంలో చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ఉన్నార‌న్న విష‌యానికిRead More


కేంద్రం తీరును త‌ప్పుబ‌ట్టిన ప‌వ‌న్

రుణ‌మాఫీ విష‌యంలో కేంద్రం తీరును జ‌న‌సేన అధినేత త‌ప్పుబ‌ట్టారు. అన్ని రాష్ట్రాల‌ను స‌మానాంగా చూడాల‌న్నారు. ఎక్కువ మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న తెలుగు రాష్ట్రాల‌లో రుణ‌మాఫీకి ఎందుకు స‌హ‌క‌రించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. యూపీలో కేంద్రం ప్ర‌భుత్వ‌మే రుణ‌మాఫీ చేయ‌డం , తెలుగు రాష్ట్రాలకు అంగీకారం ఇవ్వ‌క‌పోవ‌డం త‌గ‌ద‌న్నారు. అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూడ‌క‌పోతే దేశ స‌మగ్ర‌త‌కే ప్ర‌మాదం త‌ప్ప‌ద‌న్నారు. ఉత్త‌రాది రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు వ‌చ్చే స‌రికి చిన్న‌చూపు గా మార‌డం అన్యాయ‌మ‌న్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌ను నిర్ల‌క్ష్యం చేయొద్ద‌న్నారు.


చిరు మువీపై ప‌వ‌న్ షాకింగ్ న్యూస్..!

మూవీ లవర్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి రేపిన ఆ మల్టీస్టారర్ ప్రాజెక్టు ముందుకు సాగేలా కనిపించడం లేదు. అసలు ఈ సినిమా ప్రపోజల్ తన వరకు రాలేదని క్రేజీ స్టార్ చెప్పడంతో ఈ మల్టీస్టారర్ మూవీ ప్రకటనకే పరిమితం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లోని సినిమా గురించి కొద్ది రోజుల క్రితం తెగ ప్రచారం జరిగింది. సీనియర్ నిర్మాత సుబ్బిరామిరెడ్డి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాఫోన్ పట్టుకుంటాడనే న్యూస్… మూవీ లవర్స్‌లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే దానిపై ఎవరి నుంచి క్లారిటీ లేకపోవడంతో… ఇప్పుడప్పుడే ఈRead More


క‌విత‌కు ప‌వ‌న్ థాంక్స్..!

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటులో పాల్గొన్న కవిత.. అక్కడ మాట్లాడుతూ ‘జై తెలంగాణ.. జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న పవన్… ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ, ఏపీ కలిసి పనిచేస్తే ఇరు రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలకు సులభంగా పరిష్కారాలు దొరుకుతాయని పవన్ అభిప్రాయపడ్డారు. కలిసుంటే నిలబడగలమని, విడిపోతే పడిపోతామని పవన్ ట్వీట్ చేశారు.


జ‌గ‌న్, ప‌వ‌న్ మ‌ధ్య‌లో చంద్ర‌న్న‌

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం పాల‌క‌ప‌క్షంగా ఉన్న టీడీపీతో ఓవైపు వైఎస్సార్సీపీ మ‌రోవైపు జ‌న‌సేన ఢీకొట్టేలా క‌నిపిస్తున్నాయి. ఇరువైపులా రెండు పార్టీలు పోటీప‌డితే అప్పుడు జ‌గ‌న్, ప‌వ‌న్ మ‌ధ్య పోటీ త‌ప్ప‌ద‌నే వాద‌న వినిపిస్తోంది. ప‌వ‌న్ ప్ర‌భావాన్ని బ‌ట్టి జ‌గ‌న్ గెలుపు ఓట‌ములు ఆదార‌ప‌డి ఉంటాయ‌న్న అంచ‌నాలున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ప‌వ‌న్ భారీగా చీలిస్తే అది జ‌గ‌న్ మీద తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దానికి భిన్నంగా చంద్ర‌బాబు అనుకూల ఓటులో చీలిక తీసుకొస్తే ప్ర‌తిప‌క్షం పీఠానికి మ‌రింత చేరువ కాగ‌లుగుతుంది. అందుకే ప‌వ‌న్ చుట్టూ ఏపీ ప‌వ‌ర్ పొలిటిక్స్ తిరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌లుమార్లు స్ప‌ష్టం చేసిన‌ట్టు ఆపార్టీ ప‌వ‌ర్ కోసం రాలేదు. ప‌ద‌వుల‌తో సంబంధం లేకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడాRead More


మెగా మువీకి రంగం సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే చూడాల‌నివుంది అని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీని సుప్రసిద్ధ నిర్మాత,ఎం.పి, క‌ళా బంధు డా. టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. ఈ భారీ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలో త‌న స‌త్తా చాటిన‌ మెగాస్టార్ ఇటీవ‌ల 150 సినిమా ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ సంద‌ర్భంగా క‌ళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆత్మీయ స‌త్కారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ తో సినిమా చేస్తాన‌ని ఎనౌన్స్ చేసారు. ఆత‌ర్వాతRead More