Main Menu

pawan kalyan

 
 

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏ పాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కూడా ఆయ‌న వ‌దిలిపెట్ట‌లేదు. ఏపీలో త‌న‌కు విశేష‌మైన ఫాలోయింగ్ ఉంద‌ని కేఏ పాల్ చెప్పుకున్నారు. అందులో భాగంగా త‌న ఇంట‌ర్వ్యూ ని యూట్యూబ్ లో చూసిన వారి సంఖ్య‌ను ఆయ‌న ఆధారంగా చేసుకున్నారు.. కే ఏ పాల్ త‌న ఇమేజ్ గురించి చెబుతూ . ‘‘వారం క్రితం ఓ చానెల్‌లో మాట్లాడుతూ బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పా. యూట్యూబ్‌లో ఆ వీడియోను 14 లక్షల మంది చూశారట. ఉన్న సత్యం అది. నేను ఇండియా వదిలి 30 సంవత్సరాలు అయింది. అక్కడ ఎంజిలినా జోలిని చూశారు.. షారుఖ్‌ఖాన్‌ను చూశారు.. అమితాబ్ బచ్చన్‌ను చూశారు. నేను ఆంధ్రాలో ఉన్నదేRead More


ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం చేరారు. జ‌న‌త‌రంగం పేరుతో జ‌నాల‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల పై దృష్టి పెట్టారు. వివిధ పార్టీల నేత‌ల‌ను చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో త‌న పోటీ విష‌యంలో మాత్రం క్లారిటీ ఇంకా లేద‌ని తేల్చేశారు. ఇప్ప‌టికే ఇచ్ఛాపురంలో త‌న‌ను పోటీ చేయ‌మ‌ని కోరుతున్నార‌ని, పిఠాపురం, అనంత‌పురం వంటి సీట్ల విష‌యంలోనూ ఆలోచ‌న‌లున్నాయ‌ని చెబుతున్న త‌రుణంలో తాను మాత్రం ఫిబ్ర‌వ‌రిలో స్ప‌ష్ట‌త ఇస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో కోఆర్డినేష‌న్ క‌మిటీలు వేసే ఆలోచ‌న‌లో జ‌న‌సేనాని ఉన్న‌ట్టు తెలుస్తోంది. దానికి తోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపుగా పోటీకి సిద్ధ‌మ‌యిన పిఠాపురం,Read More


ప్ర‌జారాజ్య పౌరుడిని టార్గెట్ చేసిన జ‌న‌సైన్యం

ఆయ‌న ప్ర‌జారాజ్యంలో కీల‌క నేత‌. నేటికీ మెగాస్టార్ మాట‌కు విలువ ఇస్తుంటారు. స‌న్నిహితంగా మెలుగుతుంటారు. కానీ ఆయ‌నంటే జ‌న‌సైన్యానికి గిట్ట‌డం లేదు. జ‌న‌సేన అధినేత సైతం ఆయ‌న మీద గురిపెట్ట‌డంతో కింది స్థాయి కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోతున్నారు. ఊరూవాడ ఆయ‌న్ని అడ్డుకోవ‌డ‌మే త‌మ ల‌క్ష్యంగా సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌ప‌డుతున్న ఆయ‌న్ని చిక్కుల్లో నెట్ట‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో తూర్పు గోదావ‌రిజిల్లా రాజ‌కీయాల్లో ఇదో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారుతోంది. ముఖ్యంగా కాకినాడ రూర‌ల్ లో మాజీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు తో జ‌న‌సేన ప‌దే ప‌దే క‌య్యానికి దిగుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప‌వ‌ర్ స్టార్ అభిమానులకు ఓ ల‌క్ష‌ణం ఉంది. అది సినిమా సంస్కృతి నుంచి వ‌చ్చిన అల‌వాటు. అయినా రాజ‌కీయాల్లో కూడా కొన‌సాగిస్తున్నారు. గ‌తంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌, క‌త్తి మ‌హేష్ వంటి విమ‌ర్శ‌కుల‌తోRead More


జ‌న‌సేన‌కు ఎదురుదెబ్బ‌లు..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా త‌న వైఖ‌రి మార్చుకున్న త‌ర్వాత పార్టీకి కొంత ఊపు వ‌చ్చింది. జ‌న‌సేన జ‌వ‌స‌త్వాలు పొందుతున్న‌ట్టు క‌నిపించింది. ఒక్కో నాయకుడు వ‌చ్చి చేర‌డంతో జ‌న‌సేనానికి ఊపు వ‌స్తున్న‌ట్టుగా అంతా భావించారు. ఆ క్ర‌మంలో వివిధ పార్టీల నేత‌ల‌తో పాటు ఏపార్టీలోనూ చేర‌ని కొంద‌రు మేథావులు కూడా జ‌న‌సేన వైపు మొగ్గు చూపారు. అలాంటి వారిలో మాజీ ఆర్టీఐ క‌మిష‌న‌ర్ విజ‌య‌బాబు వంటి వారు ఒక‌రు. అయితే తాజాగా విజ‌య్ బాబు రాజీనామా చేశారు. వాస్త‌వానికి తోట చంద్ర‌శేఖ‌ర్ పార్టీ మారిన త‌ర్వాత విజ‌య్ బాబు జ‌న‌సేన‌లోకి వ‌చ్చారు. విజ‌య్ బాబుని జ‌న‌సేన‌లో చేర‌కుండా అడ్డుకోవ‌డానికి జ‌న‌సేన మీడియా విభాగంలో కీల‌క వ్య‌క్తులు కొంద‌రు ప్ర‌య‌త్నించారు. కానీ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగానే కాకుండా, రాజ‌కీయంగా అవ‌గాహ‌న ఉన్న విజ‌య్ బాబుని తోట తోడ్పాటుతో జ‌న‌సేన‌లో చేర్చుకున్నారు. అంత‌కుముందుRead More


ప‌వ‌న్ అమెరికా ప‌య‌నం!

జ‌న‌సేన అధినేత అమెరికా ప‌య‌నం అవుతున్నారు. జ‌న‌సేన అధినేత హోదాలో ఇప్ప‌టికే ఆయ‌న లండ‌న్, అమెరికా ప‌ర్య‌ట‌న‌లు సాగించారు. ఈసారి మ‌ళ్లీ ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌కు స‌న్నాహాలు పూర్త‌య్యాయి. ప్ర‌వాస గ‌ర్జ‌న పేరుతో జ‌న‌సేన అధికారికంగా ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. డిసెంబర్ 7 తేదీన జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ అమెరికా బ‌య‌లుదేరుతారు. అమెరికాలో భారీ ర్యాలీ నిర్వాహించాల‌ని భావిస్తున్నారు. జ‌న‌సేన ఎన్ఆర్ఐ ప్ర‌తినిధుల‌తో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. వారం రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న సాగుతుంది. అందులో భాగంగా యూఎస్ లోని ప‌లు న‌గ‌రాల్లో జ‌న‌సేన అభిమానులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. .డిసెంబర్ 15 తేదీన డల్లాస్ లో ఎన్నారైలతో పవన్ సమావేశం ఉంటుంద‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. న్యూయార్క్ స‌హా మ‌రికొన్ని న‌గ‌రాల్లో కూడా ప‌వ‌న్ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంద‌నిRead More


ప్ర‌మాదాలు: మొన్న ప‌వ‌న్, నేడు నాదెండ్ల‌

జ‌న‌సేన నేత‌ల చుట్టూ ఏం జ‌రుగుతోంది. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. వ‌రుస‌గా ఆపార్టీ నేత‌ల‌కు జ‌రుగుతున్న ప్ర‌మాదాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే వాటిని కొంద‌రు కొట్టి పారేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం సందేహాలు సంపూర్ణంగా నివృత్తి కాక‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న మాత్రం వెలిబుచ్చుతున్నారు. గ‌డిచిన వారంలో తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్ లో ప్రమాదం జ‌రిగింది. అప్ప‌ట్లో ప‌వ‌న్ సెక్యూరిటీ సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఓ లారీ దూసుకురావ‌డంతో రంగంపేట స‌మీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో కాన్వాయ్ వాహ‌నానికి ప్ర‌మాదం జ‌రిగింది. అయితే అది ప‌వ‌న్ ని టార్గెట్ చేసి ఉంటార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే దానిని అత్య‌ధికులు కొట్టి పారేశారు. అలాంటి అనుమానాల‌కు ఆస్కారం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే అది జ‌రిగిన నాలుగురోజుల‌కే మ‌రోRead More


ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన మహా సహస్రావధాని

జ‌న‌సేన అధినేత‌కు అనుకోని మ‌ద్ధ‌తు ల‌భించింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ మహా సహస్రావధాని వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ముఖ్యంగా బీజేపీతో జ‌న‌సేన సంబంధాల‌పై ఇప్ప‌టికే చ‌ర్చ సాగుతోంది. టీడీపీ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. మోడీ చేతిలో పావుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నార‌ని ప‌దే ప‌దే చెబుతోంది. బీజేపీ అంటే జ‌గ‌న్, ప‌వ‌న్ కూడా క‌లిపి ఉన్న‌ట్టుగా ఆరోపిస్తోంది. అయితే ఇటీవ‌ల కాకినాడ‌లో ముస్లీం నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో బీజేపీతో సంబంధాల‌పై నిల‌దీసిన ముస్లీంల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన స‌మాధానం ప‌ట్ల మహా సహస్రావధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహ‌రావు ఆనందం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ ని స‌మ‌ర్థించారు. ప‌వ‌న్ స‌మాధానం ఎంతో పరిపక్వతతో ఉందంటూ గరికపాటి ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ హిందువుల పార్టీ కాద‌ని, అది కూడా ఓ రాజ‌కీయ పార్టీ అంటూ ప‌వ‌న్ మాట్లాడ‌డాన్ని గ‌రిక‌పాటి స‌మ‌ర్థించారు. .Read More


ప‌వ‌న్ క్లోజ్ ఫ్రెండ్ తో జ‌త‌గ‌డుతున్న మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి స్నేహితులు కొంత త‌క్కువ‌గానే ఉంటారు. అలాంటి అత్యంత స‌న్నిహితుల్లో మాట‌ల మాంత్రికుడు ఒక‌రు. త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ స్నేహం గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి ప‌వ‌ర్ స్టార్ స్నేహితుడితో సినిమాకి మెగాస్టార్ ముందుకొస్తున్నారు. ప్ర‌స్తుతం సైరా అంటూ 151 వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న చిరంజీవి ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో చిరంజీవి సినిమా చెబుతున్నారు. త్రివిక్ర‌మ్ తో సినిమాకు రెడీ అన్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చాలామంది తెలుగు డైరెక్టర్లకు ఒక కల. ఆయన ఓ పదేళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉండడంతో చాలామంది ఈ జెనరేషన్ స్టార్ దర్శకులకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఆ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ త్రివిక్రమ్‌కు గ్రీన్Read More


తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలోకి ప‌వ‌న్


జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

రాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతిన కూడా పెద్ద‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేని నాయ‌కుడు ఆయ‌న‌. ప‌వ‌న్ వ‌స్తున్నార‌ని తెలిస్తే చాలు సొంత ఖ‌ర్చుతో వ‌చ్చి వాలిపోయే వేలాది మంది అభిమానులున్నారు. అదే ఇప్పుడు జ‌న‌సేన‌కు బ‌లం. అదే పెట్టుబ‌డి కూడా. అలాంటి అభిమానులున్న స‌మ‌యంలో దానిని అందిపుచ్చుకుని పార్టీని నిర్మించుకోవ‌డం ద్వారా ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌లు పండించుకోవాల్సి ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ వాస్త‌వంలో దానికి భిన్నంగా ఉంది. అందుకు కార‌ణం నిజాలు జ‌న‌సేన నాయ‌కుడి వ‌ద్ద‌కు చేర‌క‌పోవ‌డ‌మేన‌ని సందేహం వ‌స్తోంది. జ‌న‌సేన‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ కి పూర్వం ప‌వ‌న్ చుట్టూ ఉన్న వారంతా దాదాపుగా ఉద్యోగులే. లేక ప‌వ‌న్ కి పాత స్నేహితులే. రాజ‌కీయ నేత‌లుRead More