opposition

 
 

పెళ్ళి ఎఫెక్ట్: ఖాళీ అయిన అసెంబ్లీ

ap assembly

పెళ్లిళ్ల ఎఫెక్ట్ అసెంబ్లీ మీద పడింది. ఏకంగా సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ప్రతిపక్షం లేని అసెంబ్లీ కావడంతో పెద్దగా ప్రజల ద్రుష్టిలో పడే అవకాశం లేదు. ఈలోగా ఇప్పటికే పోలవరం ట్రిప్పు కోసం ఓ సారి సెలవు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పెళ్లిళ్లులున్నాయన్న పేరుతో సెలవు తీసుకున్నారు. వరుసగా మూడురోజుల పాటు పెళ్లిళ్ల సందడి నేపథ్యంలో వచ్చే సోమవారం వరకూ సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 23, 25 తేదీల్లో పెళ్లి ముహూర్తాలుండటంతో అసెంబ్లీ సమావేశాలకు సెలవులు ప్రకటించారు. తాము పెళ్లిళ్లకు హాజరు కావాల్సి ఉందని పలువురు శాసనసభ్యులు స్పీకర్‌ కోడెలను కలిసి 23,24,25 తేదీల్లో సెలవులు కోరారు. స్పీకర్‌ ఆ మూడు రోజులను సెలవు దినాలుగా ప్రకటించారు. తిరిగి అసెంబ్లీ 27 నుంచి ప్రారంభమై వారంతం వరకు ఉంటుందనిRead More


జ‌గ‌న్ క‌ట్టడికి అదే అస్త్రం..!

jagancbn

ఏపీ టీడీపీ రూటు మార్చింది. అసెంబ్లీలో కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. స‌భ‌లో విప‌క్షాన్ని అడ్డుకోవ‌డానికి మ‌రో దారి లేక‌పోవ‌డంతో ప‌ద్ధ‌తి మార్చేసింది. చ‌ర్చ క‌న్నా ర‌చ్చ‌కు దారితీసే ప‌రిస్థితి తీసుకురావాల‌ని భావిస్తోంది. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌వ‌ర్న‌ర్ ప్రసంగానికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని లెక్క‌ల‌తో నిల‌దీశారు. తాజాగా బ‌డ్జెట్ ప్ర‌సంగంలో విప‌క్షం త‌రుపును బుగ్గ‌న పిట్ట‌క‌థ‌లు, వాస్త‌వ లెక్క‌లు, ప్ర‌పంచ అనుభ‌వాల‌తో నిల‌దీశారు. దాంతో నీళ్లు న‌మ‌లాల్సిన ప్ర‌భుత్వం వేరే దారి ఉత్త‌మ‌మ‌మ‌ని భావించిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు చొర‌వ చూప‌డంతో మిగిలిన నేత‌లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సీఎం విప‌క్ష స‌భ్యుల‌ను అల‌గా జ‌నం అంటూ వ్యాఖ్యానించ‌డంతో మిగిలిన వారు స్ఫూర్తి పొంద‌నట్టు క‌నిపిస్తోంది. చింత‌మ‌నేనిRead More


మూగ‌బోయిన జ‌గ‌న్ వెనుక ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి?

ys jagan

ఏపీ అసెంబ్లీలో ఓ ప్ర‌త్యేక ప‌రిస్థితి త‌లెత్తింది. దేవాదాయ భూముల మీద చ‌ర్చ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. విప‌క్ష నేత జ‌గ‌న్ మాట్లాడుతుండ‌గా ఈ వ్య‌వ‌హారం క‌నిపించింది. దుర్గ‌మ్మ గుడి భూముల‌ను సిద్ధార్థ అకాడ‌మీకి కేటాయించ‌డంపై ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో విప‌క్షం ప్ర‌శ్నించింది. 70 కోట్ల విలువైన భూముల‌ను ఎక‌రం ల‌క్ష‌న్న‌ర‌కే లీజుకి ఇవ్వ‌డాన్ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి లేవ‌నెత్త‌డంతో చ‌ర్చ సాగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతుండ‌గా మైక్ క‌ట్ అయ్యింది. దాంతో జ‌గ‌న్ రెండు మార్లు మైక్ గురించి స్పీక‌ర్ ని ప్ర‌శ్నించారు. అయితే ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని స్పీక‌ర్ చెప్ప‌డం విశేషం. అసెంబ్లీలో స్పీక‌ర్ కే తెలియ‌కుండా మైక్ క‌ట్ కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స్పీక‌ర్ కూడా త‌న‌కేం జ‌రిగిందో తెలియ‌ద‌ని బ‌హిరంగంగాRead More


రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంచోడంటున్న చంద్ర‌బాబు..!

ys chandrababu

అవును ..మీరు చ‌ద‌వింది నిజ‌మే.. సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని నిత్యం త‌ప్పుబ‌ట్టిన చంద్ర‌బాబు ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ ను తెగ‌డం కోసం వైఎస్సార్ ను పొగ‌డ‌డానికి కూడా సిద్ధ‌ప‌డుతున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. ఏకంగా వైఎస్ వ్య‌వ‌హారశైలిని చంద్ర‌బాబు మెచ్చుకునే వ‌ర‌కూ వ‌చ్చాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించే వారంటూ ఆయ‌న ప్ర‌శంసించ‌డం విశేషం. ‘‘వైఎస్‌ రాజశేశఖరరెడ్డి వంటి వాళ్లు ఒక పద్ధతిలో ఉండేవారు. కానీ, జగన్‌ పద్ధతి లేని వ్యక్తి. ప్రతిపక్షనేతగా జగన్‌కు గౌరవం ఇస్తా. ఒక్కోసారి మాత్రం ప్రతిపక్షంతో మాట్లాడినా సమయం వృధా అనిపిస్తుంది. వారు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడాలని చూశారు. అమరావతికి అడ్డుపడాలనిRead More


చంద్ర‌బాబు పై విచార‌ణ జ‌ర‌పాలి

ysrcp srikanth reddy

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల మ‌త‌ల‌బు ఏంటో జ‌నానికి చెప్పాల‌ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. కేంధ్రం జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ చేసింది. బాబు విదేశీ పర్యటనలపై కేంద్రం విచారణ జరపాలని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప‌దే ప‌దే సాగుతున్న ప‌ర్య‌ట‌నల సారంశం ఏందో ప్ర‌జ‌ల‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు క‌లిగిన ప్ర‌యోజ‌నం ఏంటో చెప్పాల‌న్నారు. ప‌ర్య‌ట‌న‌ల వివరాలపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హోటల్లో కూర్చొని ప్లాన్లు గీస్తే పెట్టుబడులు రావని వ్యాఖ్యానించారు. బందరు పోర్టుకు లక్ష ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట…అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.