NTR

 
 

జై లవకుశ మువీ రివ్యూ

jai lavakusa

సినిమా: జై లవకుశ తారాగణం: ఎన్.టి.ఆర్‌, నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా, సాయికుమార్, పోసాని త‌దిత‌రులు సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌ నిర్మాత: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌ ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌ హ్యాట్రిక్ హిట్లతో ఊపు మీదున్న తారక్ తాజా సినిమా `జై ల‌వ‌కుశ‌`. అందులోనూ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రిభినయం చేసిని సినిమా కావడంతో మరింత ఆసక్తిని రాజేసింది. చాలాకాలం తర్వాత ఓ స్టార్ హీరో త్రిపాత్రిభినయం చేసిన సినిమా ఇదే కావడం విశేషం. దానికి తగ్గట్టుగానే ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడం, ట్రైలర్ కి రికార్డ్ వ్యూస్ రావడంతో సినిమా కోసం ఫ్యాన్స్ లో జోష్ కనిపించింది. మరి వారి అంచనాలు హై పీక్ లో ఉన్న దశలో వాటిని అందుకోవడంలో జై లవకుశ సక్సెస్ అయ్యాడా…ఈ రివ్యూలో చూద్దాం క‌థ: సినిమా క‌థ రామ‌చంద్రా పురం గ్రామంలో మొద‌లవుతుంది. ఆRead More


ఎన్టీఆర్ అంతగా ఊహించలేదట..

ntr

యంగ్‌టైగర్‌, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ నగరంలో సందడి చేసారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో మీరు పోటీ విజేతలతో ఆయన సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆయన తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ జై లవ కుశ. అందులో తనకు జై పాత్ర అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పారు. మరిన్ని విశేషాలు తారక్‌ మాటల్లోనే.. ఈ వారంలో విడుదల కానున్న జై లవకుశ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. తుంటరితనం, మంచితనం, రాక్షసత్వం కలగలిపిన మూడు పాత్రలు ఈ చిత్రంలో పోషించా. అందులో జై పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ చిత్రం నా తల్లిదండ్రులకు, అభిమానులకు సంతోషం పంచడానికే చేశా. సినిమా ఫలితం ఎలా ఉన్నా మా అన్నదమ్ముల అనుబంధంలో ఎలాంటి తేడా ఉండదు. సోషల్‌ మీడియా ఓ ఉబిRead More


ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కల్యాణం

ntr

జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస టీజర్లు, ఆడియో వేడుకలతో ఆడియోన్స్ లో జైలవకుశ హల్ చల్ చేస్తోంది. ఇక లవకుశ తర్వాత ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ తో జతకట్టబోతున్నాడు. మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్ సినిమా చర్చనీయాంశం అవుతోంది. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం పూర్తైన తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ సూపర్‌హిట్ చిత్రం శ్రీనివాస కళ్యాణం గుర్తుందా.. ఆ టైటిల్‌నేRead More


ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

1504486592jai01

జైలవకుశ ఆడియో జోష్

jailavakusa

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్ర ఆడియో విడుదలైంది. ఆదివారం సినిమాలోని పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ జ్యూక్‌ బాక్స్‌లో మొత్తం నాలుగు పాటలున్నాయి. రాక్‌స్టార్‌ ఎప్పటిలాగే ఆకట్టుకున్నారని, పాటలు బాగున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జనం, వర్షాల కారణంగా ఫ్యాన్స్‌ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చిత్ర బృందం ఆడియో విడుదల వేడుకను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం సెప్టెంబరు 10న హైదరాబాద్‌లో ఘనంగా వేడుకను నిర్వహించి, ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ‘జై లవకుశ’లో రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు.. సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. సెప్టెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఎన్టీఆర్ కి షాకిచ్చిన దగ్గుబాటి రానా

young-tiger-ntr-vs-rana-daggubati-with-television-shows_b_2207170924

టాలీవుడ్ లో రెండు పెద్ద కుటుంబాల నేపథ్యంలో వచ్చిన హీరోలే అయినప్పటికీ ఎన్టీఆర్, దగ్గుబాటా రానా ఇద్దరిదీ ప్రత్యేక శైలి. ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. సగటు ప్రేక్షకుడిని సంత్రుప్తి పరచడంలో ముందుంటున్నారు. అయితే తాజాగా ఇద్దరూ ఒక విషయంలో పోటీపడ్డారు. అది కూడా వెండితెరపై మాత్రం కాదు. బుల్లితెరపై ఇద్దరూ ఏకకాలంలో అడుగపెట్టి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోరులో తొలుత ఎన్టీఆర్ తిరుగులేని స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ అంటూ మా టీవీని ముందుకు తీసుకెళ్లాడు. కానీ తాజాగా రానా ఆ విషయంలో ఎన్టీఆర్ ని దాటేశాడు. వాస్తవానికి ఓపెనింగ్ డేనాడే బిగ్ బాస్ ఏకంగా 16.18 రేటింగ్ తో నంబర్ వన్ పొజిషన్‌లో నిలిచింది బిగ్ బాస్ షో… అయితే… వీకెండ్‌లో ఎన్టీఆర్ పాల్గొన్న ఎపిసోడ్స్‌కు ఉన్న వీవర్ షిప్ మిగిలినRead More


ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న ఎన్టీఆర్

jai lavakusa

కెరీర్ లోనే తొలిసారిగా త్రిపాత్రిభినయంతో చేస్తున్న ఎన్టీఆర్ దానికి తగ్గట్టుగా ప్రేక్షకులను సిద్ధం చేస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్, టీజర్స్ తో ఇప్పటికే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. అయితే మూడు పాత్రలతో విడివిడిగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రతినిధులు తాజాగా మూడు క్యారెక్టర్లను కలిపి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.‘జై లవకుశ’లో ఎన్టీఆర్‌ పోషిస్తున్న పాత్రలు. నటుడొక్కడే. కానీ, పాత్రలు వేర్వేరు, పాత్ర స్వభావాలు, హావభావాలు వేర్వేరు. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ హావభావాలు, గెటప్ సహా అన్నీ కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడు కలిపి ఒకేసారి ముందుకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందనాకి హద్దులు కనిపించడం లేదు.


ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తీపి, చేదు వార్తలు

ntr jailavakusa

తారక్ తదుపరి చిత్రం జోరుగా సాగుతోంది. జై లవకుశ అంటూ త్రిపాత్రిభినయంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా షూటింగ్ వేగంగా నడుస్తోంది. అయితే సినిమా ఆడియో ఫంక్షన్ కి ముహూర్తం ప్రకటించిన నిర్మాత హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. సెప్టెంబర్ 3న ఆడియో ఫంక్షన్ కి ముహూర్తం పెట్టిన నిర్మాత కళ్యాణ్ రామ్ తన నిర్ణయం మార్చుకోవడంతో ఫ్యాన్స్ హర్టవుతున్నారు. సెప్టెంబర్ 3 కోసం ఎదురుచూస్తున్న వారిని ఒక్కసారిగా నిరాశ పరిచనట్టయ్యింది. దానికి కారణాలు కూడా కల్యాణ్ రామ్ వివరించాడు. ఆడియో విడుదల వేడుకను ఘనంగా చేయాలని ప్లాన్ చేసిన మాట వాస్తవమేనని.. అయితే నగరంలో భారీ వర్షాలు, గణేశ్ నిమజ్జనం కూడా ఆ సమయానికి జరగనుండటంతో భద్రతా కారణాల వల్ల ఈ ఈవెంట్‌ను విరమించుకున్నట్లు తెలిపాడు. అయితే అదే సమయంలో ఫ్యాన్స్ ని అలరించడానికి పాటు మాత్రం నేరుగాRead More


కుశతో ఖుషీ

kusa11503642524

తారక్ అభిమానులకు వినాయక చవితి కానుక అందింది. చడీచప్పుడు లేకుండా యంగ్ టైగర్ అందించిన కానుక ఖుషీ చేసింది. ఇప్పటికే జై, లవ ఫస్ట్ లుక్ , టీజర్లతో ఎన్టీఆర్ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపు ఎన్టీఆర్ పండగ నాడు కుశతో ఖుషీతో చేశాడే. మొత్తంగా జై లవ కుశ సినిమాలో తొలిసారిగా త్రిపాత్రిభినయం చేస్తున్న ఎన్టీఆర్ తన మూడు క్యారెక్టర్లను పరిచయం చేసేశాడు. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో..’, ‘జనతా గ్యారేజ్’ వంటి వరుస విజయాలతో ఎన్టీఆర్ మంచి ఊపుమీదున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో ‘జై లవ కుశ’ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్లకు రికార్డ్ వ్యూస్ లభిస్తున్నాయి. సాఫ్ట్ లుక్ తో లవగానూ, రఫ్ లుక్ తో జై గాను అభిమానుల జైజైలు అందుకున్నాడు. ఇక తాజాగా కుశ ఫస్ట్ లుక్ బయటకు రావడంRead More


ఎన్టీఆర్ బిగ్ బాస్ లో హాట్ బ్యూటీ

tapsee

బిగ్ బాస్ కొత్త సంచలనం రేకెత్తించబోతోంది. తాజాగా రేటింగ్స్ లో దూసుకుపోతున్న ఈ రియాలిటీ షోకి కొత్త హంగులు అద్దుతున్నారు. బిగ్‌బాస్ షో‌లో హాట్ బ్యూటీ అడుగుపెడుతోంది. హీరోయిన్ తాప్సీ ఎంట్రీ విశేషంగా మారుతోంది. అయితే కంటెస్టంట్‌గా మాత్రం కాదండోయ్. ఆనందో బ్రహ్మ సినిమా ప్రమోషన్ కోసం ఆమె బిగ్‌బాస్ గడప తొక్కనుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఆనందో బ్రహ్మ సినిమాలో తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే గుబులు రేపుతోంది. ఈ నెల 18న ఆనందో బ్రహ్మ రిలీజ్ కానుంది. సినిమా ప్రచారం తర్వాత ఆమె తిరిగి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. గతంలో దగ్గుబాటి రానా కూడా ఇలాగే తన సినిమా నేనే రాజు నేనే మంత్రిని ప్రమోట్ చేసుకున్నారు.Read More