Main Menu

newsupdates

 
 

నేష‌న‌ల్ మీడియా మీద గురిపెట్టిన బాబు..!

cbn

ఇప్ప‌టికే తెలుగు మీడియాలో చాలా సంస్థ‌ల మీద ఆయ‌న విమ‌ర్శ‌ల‌కు దిగారు. సాక్షి నుంచి మొద‌ల‌కుని ప్ర‌జాశ‌క్తి, 10టీవీ వ‌ర‌కూ చాలా మీడియా సంస్థ‌ల మీద ఆయ‌న విరుచుకుప‌డ్డారు. త‌న‌ను ప్ర‌శ్నించే హ‌క్కు లేద‌న్న‌ట్టుగా మాట్లాడారు. అదే ప‌రంప‌రంలో తాజాగా ఏపీ సీఎం జాతీయ మీడియా మీద గురిపెట్టారు. అవినీతి డ‌బ్బులు తీసుకుని క‌థ‌నాలు రాస్తున్నారంటూ మండిప‌డ్డారు. తాజాగా మ‌హిళా పార్ల‌మెంట్ స‌ద‌స్సు సంద‌ర్భంగా రోజా విష‌యంలో పోలీసుల తీరును ఆయ‌న పూర్తిగా స‌మ‌ర్థించారు. పోలీసులు అలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి ఉండ‌క‌పోతే తానే త‌ర్వాత వారి మీద చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌చ్చేద‌ని వ్యాఖ్యానించారు. అయితే దానిని జాతీయ మీడియాలో వ‌రుస‌గా క‌థ‌నాలు ఇచ్చి, ఏదో జ‌రిగిపోయింద‌నే రీతిలో ప్ర‌సారాలు చేశారంటూ ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. ఆహ్వానం ఉన్నంత మాత్రాన వ‌చ్చిRead More


ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబు సై..!

chandrababu

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. నేరుగా బ‌రిలో దిగాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఏకంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు నిధులు కూడా విడుద‌ల చేసింది. 28 కోట్ల రూపాయ‌ల విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. దాంతో ఇప్పుడీ ప‌రిణామం ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయాల్లో వేడి రాజేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అవి రాజ‌కీయంగా చూపించే ప్ర‌భావం క‌న్నా మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో శ్రీకాకుళం నుంచి తిరుప‌తి వ‌ర‌కూ అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. కీల‌క‌మైన విశాఖ‌, కాకినాడ‌, ఒంగోలు, క‌ర్నూలు ,Read More


తెలుగుదేశం నేత‌ల‌కు మ‌రో చెంప‌దెబ్బ‌..!

tg venkatesh-ray-1443881756-1

అధికార పార్టీకి మ‌రో చెంప‌దెబ్బ త‌గిలింది. అధికారం అండ‌తో ఏమైనా చేయ‌గ‌ల‌న్న దూకుడుకి అడ్డ‌కుట్ట ప‌డింది. న్యాయ‌స్థానం క‌న్నెర్ర చేయ‌డంతో క‌ర్నూలులో తెలుగు త‌మ్ముళ్ల త‌ల‌బొప్పి కొట్టింది. డిప్యూటీ సీఎం కేఈ, కార్పోరేట్ ఎంపీ టీజీ వెంక‌టేష్ అండ్ కో షాక్ త‌గిలింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లో ప‌డ్డారు. ప్ర‌త్యామ్నాయంగా ఎవ‌రూ ముందుకు రాకుండా చేసిన దందాల‌కు చెక్ పెట్టాల‌న్న కోర్ట్ ఆదేశాల‌తో ఇప్పుడు క‌క్కాలేక మింగాలేక అన్న చందంగా త‌యార‌య్యారు. కర్నూలు నగరంలో ఏర్పడిన సీమ కేబుల్‌పై అధికార పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యం, నిర్భంధం, అధికార దుర్వినియోగం చట్టం ముందు తలవంచింది. అన్యాయంగా, అక్రమంగా సీమ కమ్యూమనికేషన్స్‌ను నిషేధించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తప్పు పట్టింది. ప్రసారాలను నియంత్రించడం చట్ట విరుద్ధమంటూ అధికారులకు అక్షింతలు వేసింది. కర్నూలు నగరంలో కొన్ని దశాబ్ధాలుగాRead More


జ‌న‌తా గ్యారేజ్ లో నోరు జారిన నిత్య‌..!

NITHYA-MENON-ALLU-ARJUN-JANATHA-GARAGE

జ‌న‌తా గ్యారేజ్ ఆడియో వేడుక అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. ఎన్టీఆర్ ప్ర‌సంగం మ‌రోసారి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందే స్థాయిలో ఎన్టీఆర్ వ్య‌వ‌హారం సాగింది. అయితే ఈ వేడుక‌లో హీరోయిన్ స‌మంత మాత్రం క‌నిపించ‌లేదు. తాను హాజరుకావ‌డం లేద‌న్న విష‌యాన్ని ముందుగానే స‌మంత త‌న ఫ్యాన్స్ కి తెలిపింది. దాంతో సంతూ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. మ‌రో హీరోయిన్ నిత్యామీన‌న్ మాత్రం హ‌ల్ చ‌ల్ చేసింది. అదే స‌మ‌యంలో వేదిక మీద మాట్లాడుతూ ఓ వివాదాస్ప‌ద వ్యాఖ్య కూడా చేసింది. అనూహ్యంగా నోరు జారి అంద‌రిలో ఆస‌క్తి రేపింది. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. స‌హ‌జంగా నిత్యా కాస్త హూందాగానే వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. అయితే ఆమె మాట‌ల్లో మాత్రం కాస్త ప్రౌడ్ నెస్ ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడు ఆమెRead More


ఆఖ‌రి రోజు అనూహ్య మార్పులు..

ajinkyarahane

విండీస్ తో జ‌రుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో టీమిండియాకు ఆధిక్యం ల‌భించిన‌ప్ప‌టికీ మ్యాచ్ మాత్రం డ్రా దిశ‌గా సాగుతోంది. ఆఖ‌రి రోజు అనూహ్య మార్పులు జ‌రిగితే త‌ప్ప చివ‌ర‌కు మ్యాచ్ డ్రా కావ‌డం ఖాయ‌మ‌నే భావిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై భారత్‌ పట్టుబిగిస్తోంది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌట్‌ చేసి 128 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రహానె(51 బ్యాటింగ్‌ : 93బంతుల్లో, 1×4) అర్ధశతకం సాధించగా.. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ(41 బ్యాటింగ్‌: 57 బంతుల్లో, 1×4, 3×6) సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌ మొత్తం 285 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్‌ బౌలర్లలో కమిన్స్‌ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌Read More


ఆంధ్ర‌జ్యోతి మ‌రో అబ‌ద్ధ‌మా..!?

chandrababu venkaiah

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని టీడీపీ దాదాపు ప‌క్క‌న పెట్టేసింది. ప్ర‌జ‌లంతా కోరుకుంటున్న హోదా విష‌యంలో కేంధ్రాన్ని గ‌ట్టిగా నిల‌దీయ‌డం ఇబ్బందిక‌ర‌మ‌ని టీడీపీ భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌క‌టించారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తెలుగుదేశం పార్టీ త‌రుపున కేంధ్ర‌మంత్రిగా ఉన్న సుజ‌నా చౌద‌రి ఓ ప్యాకేజీ రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. వాస్త‌వానికి ప్ర‌త్యేక హోదాను చంద్ర‌బాబు ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. ఆఖ‌రికి అమ‌రావ‌తి శంకుస్థాప‌న వేదిక మీద క‌నీసం ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించిన పాపాన పోలేదు. పైగా ప్ర‌జ‌లంతా ప్ర‌శ్నిస్తే..మ‌ర‌చిపోయానంటూ దాట‌వేశారు. అప్పుడే చంద్ర‌బాబు ఆకాంక్షించిన‌ట్టు ఇప్పుడు ప్యాకేజీ అంటూ టీడీపీ నేత‌లు, అనుకూల మీడియా హ‌డావిడి చేస్తోంది. తాజాగా ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నం గ‌మ‌నిస్తే పుష్క‌రాల త‌ర్వాతRead More


దేశంలో నెంబ‌ర్ వ‌న్ మంత్రి నారాయ‌ణ‌..!

narayana

ఇప్ప‌టికే ఏపీ ఆత్మ‌హ‌త్య‌లు..అందులోనూ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల్లో నెంబ‌ర్ వ‌న్ గా మారుతోంది. అంతేగాకుండా ఇప్పుడు నారాయ‌ణ విద్యాసంస్థల అధినేత‌గా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి ఇప్పుడు ఏకంగా మంత్రిగా కొన‌సాగుతున్న నారాయ‌ణ కూడా టాప్ ప్లేస్ లో నిలిచారు. అందుకే నారాయ‌ణ ఏపీలోనే కాకుండా దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ మంత్రి అంటూ ఓ స‌ర్వే తేల్చేసింది. అయితే ఆయ‌న నెంబ‌ర్ వ‌న్ గా ఉన్న‌ది మాత్రం రిచెస్ట్ మంత్రుల్లో అన్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిగా మారుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై ఓ సంస్థ చేసిన విశ్లేషణలో ఆ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలపై విశ్లేషణ జరిపిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలు తెలిపింది.Read More


రాష్ట్రానికి మోడీ మెగా ప్యాకేజీ

Prime minister Narendra modi with other ministers after the BJP Parliamentary board meeting at the parliament in New Delhi on Tuesday. Express Photo by Prem Nath Pandey. 10.05.2016. *** Local Caption *** Prime minister Narendra modi with other ministers after the BJP Parliamentary board meeting at the parliament in New Delhi on Tuesday.

తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ రాష్ట్రానికి రూ.17 వేల కోట్ల పథకాలను ప్రకటిస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కార్యకర్తల సమావేశం పనులను పరిశీలించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు సంబంధం లేదని, అవి రెండూ వేరువేరని కేంద్రమంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. గజ్వేల్‌ సభలో కేంద్రమంత్రులు వెంకయ్య, గంగారాం పాల్గొంటారు కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడించారు.


సెక్ర‌టేరియేట్ లో ఏపీ సిబ్బంది అరాచ‌కం

13912661_10206958013004073_1927719011203644065_n

ఉపాధ్యాయులు స‌మాజానికి ఆద‌ర్శంగా ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుల మీద పెత్త‌నం చేసేవాళ్లు మ‌రింత ఉన్న‌తంగా ఉండాలి. కానీ ఆంధ్రప్ర‌దేశ్ విద్యాశాఖ అధికారుల తీరును చూసి ఇప్పుడంతా సిగ్గుప‌డాల్సిందే. ఇన్నాళ్లుగా త‌మ‌కు నీడ‌నిచ్చిన ఆఫీసుల్లోనే వాళ్లు చేసిన ప‌నులు చేసి ముక్కున వేళ్లేసుకోవాల్సిందే. వెల‌గ‌పూడిలోని కొత్త సెక్ర‌టేరియేట్ కి త‌ర‌లింపు పేరిట ఏపీ ప్ర‌భుత్వం ఒత్తిడి తీసుకురావ‌డంతో సిబ్బంది అంతా అనివార్యంగా హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే తప్పనిసరిగా విజయవాడకు తరలివెళ్తూ ఆంధ్రప్రదేశ్ సర్వశిక్షా అభియాన్ సంచాలకుల కార్యలయ ఉద్యోగులు త‌మ కార్యాల‌యంలో కూతిమూక‌ల్లా వ్య‌వ‌హ‌రించారు. నానా భీభ‌త్సం చేశారు. కిటీకీలు, కుర్చీలు, ఆఖరికి టాయిలెట్లను కూడా వదలకుండా ధ్వంసం చేశారు. మనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు అనుకునే సెల్ఫీజం పుట్టకొచ్చిన ముదనష్టపు దాష్టీకానికి ఈ చర్య ప్రతీకగా క‌నిపిస్తోంద‌నుకుంటున్న‌ప్ప‌టికీ ఇలాంటి దుస్థితికి దిగ‌జార‌డం స‌హించ‌రానిద‌నే అంతాRead More


పెళ్లి త‌ర్వాత కూడా తగ్గ‌డం లేదు..!

bips2

గత రెండు దశాబ్దాలుగా తన అందచందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది బాలీవుడ్ హాట్ భామ బిపాసా బసు. సినిమాల్లో నిత్యం అందాల పంట పండించే ఈ భామ, సినిమాలు లేని సమయంలో సైతం అభిమానులకు ఏ మాత్రం లోటు చేయదు. సాధారణంగా సినిమాలతో అభిమానులకు అందాల విందు చేసిన భామలు పెళ్లైన తరువాత కొన్ని పరిమితులు విధించుకుంటారు. కానీ, బిపాసా మాత్రం.. పెళ్లైనా సరే ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నిన్నమొన్నటి వరకూ ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో బిపాసా విపరీతంగా ఎంజాయ్ చేసింది. ఇటీవలే ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. తన చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో భర్తతో కలిసి బిపాసా ఇండోనేషియా సమీపంలోని ‘బాలి’ ఐలాండ్‌కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి సముద్ర తీరంలో బిపాసా ఎంజాయ్ చేస్తున్న తీరును, దానికి సంబంధించి సోషల్ మీడియాలోRead More