Main Menu

nayanatara

 
 

మళ్లీ సీనియర్ కి సై అంటున్న నయనతార

మరోసారి టాలీవుడ్ మువీకి నయనతార సై అంటోంది. మరో సీనియర్ హీరోతో చిందేయబోతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో జంటగా కనిపించి, మెప్పించిన విక్టరీ వెంకటేష్, నయనతార జంట మళ్లీ సందడి చేయబోతోంది. దానికి తగ్గట్టుగానే వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ మువీకి నయనతార రెడీ అయినట్టు కనిపిస్తోంది. మల్టీ స్టారర్ మువీస్ కాలంంలో మేనల్లుడితో కలిసి వెంకీ మువీకి సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా చివరిదశకు చేరుకుంది. కథ కి అనుగుణంగా వెంకటేష్ సరసన నయనతారను .. చైతూ జోడిగా రకుల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో వెంకటేశ్ .. నయనతార కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి .. తులసి .. బాబు బంగారం సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో కథానాయికగా నయనతారను సంప్రదించారట. త్వరలోనే ఆమెRead More


వాపోతున్న న‌య‌న‌తార‌

అటు టాలీవుడ్ సీనియ‌ర్ల‌తోనూ, ఇటూ కోలీవుడ్ స్టార్ హీరోల‌తోనూ న‌య‌న‌తార‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆచితూచి అడుగులేస్తోంది. అదే స‌మ‌యంలో అడ‌పాద‌డ‌పా లేడీ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్లు కూడా పోషిస్తోంది. తాజాగా మలయాళంలో ఆమె నటించిన ‘పుదియ నియమమ్‌’ చిత్రాన్ని తమిళంలో ‘వాసుకి’ , తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో విడుద‌ల చేశారు. అయితే ఇప్పుడా సినిమా రిలీజ్ వ్య‌వ‌హారం కోలీవుడ్ లో కాక రేపింది. పెద్ద వివాదంగా మారుతోంది. ఏకంగా న‌య‌త‌రా ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని నిర్మాత‌లు హెచ్చ‌రించే వ‌ర‌కూ వెళ్లింది. కోలీవుడ్ లో కొత్త సినిమాల విడుద‌ల విష‌యంలో నిర్మాత‌లు ఉమ్మ‌డిగా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. దాని ప్ర‌కారం కొత్త సినిమాల విడుద‌ల వాయిదా వేయాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ న‌య‌న‌తార సినిమా అలాంటి ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించి విడుద‌ల కావ‌డంతో నిర్మాత‌లు ఫైర్ అవుతున్నారు. దాంతో వ్య‌వ‌హారం అమ్మ‌డికి చేరింది.Read More


లవర్ తో జాయ్ చేస్తున్న నయనతార

ఓ వైపు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా సాగుతోంది. అత్యధిక రెమ్యూనేషన్ అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో నయన తార రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి షికార్లు చేస్తోంది. ఏకంగా న్యూయార్క్ సిటీలో సందడి చేస్తోంది.ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్ప టికీ, మరోవైపు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన తార విదేశాల్లో చెట్టాపట్టాలే సుకుని తిరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమించుకుం టున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఊతమిస్తూ ఇద్దరూ పబ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు జరుపుకోవడం కోసం విఘ్నేష్‌ శివన్‌ ఇటీవలే న్యూయార్క్‌ వెళ్లాడు. అతనితోపాటు నయన తార కూడాRead More


ఆ హీరోయిన్ రెమ్యునేషన్ 6 కోట్లు

ఆశ్చర్యమే అయినా సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా మారుతోంది నయనతార. సీనియర్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ తరగని ఇమేజ్ తో భారీ ఆఫర్లు సంపాదిస్తోంది. దానికి తగ్గట్టుగానే రెమ్యునేషన్ విషయంలోనూ రాజీ లేకుండా వ్యవహరిస్తోంది. సౌత్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా మారుతోంది. నయనతారను గజని, బిల్లా, యారడీ, నీ మోహినీ, బాస్‌ ఎన్గిర భాస్కరన్‌, రాజారాణి వంటి చిత్రాల విజయం ఈ బ్యూటీని టాప్ హీరోయిన్‌ రేంజ్‌లో కూర్చోబెట్టాయి. మధ్యలో లవ్ ఎఫైర్లతో కెరీర్ కొంత గందరగోళంగా మారినా మళ్లీ ట్రాక్ ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కాగా ప్రస్తుతం నటిస్తున్న ఇమైకానోడిగళ్‌ చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుందనే టాక్‌ కోలీవుడ్‌ వర్గాల్లో ఉంది. నయనతారకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. శ్రీరామరాజ్యం, సింహా వంటి చిత్రాలు మంచిRead More


అప్పుడు కాద‌ని ఇప్పుడు చిరుతో సై అంటోంది..!

చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ కోసం చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. చివ‌ర‌కు కాజ‌ల్ ఖ‌రారుకావ‌డం, సినిమాలో చిరు స‌ర‌స‌న మెప్పించ‌డం జ‌రిగిపోయింది. కానీ అప్ప‌ట్లో ఆ పాత్ర కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించిన‌ప్పుడు ఆమె కాద‌న్న‌ది. త‌న‌కు వీలు లేద‌ని చెప్పేసింది. కానీ ఇప్పుడీ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్ మెగాస్టార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు స‌మాచారం. ఖైదీ నంబర్‌ 150’ తర్వాత ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని చేసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్న విషయం విదితమే. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించనున్నారు. ఇందులో ఒక నాయికగా నటించేందుకు నయనతార అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెగా హీరోతో నయనతార జతకట్టనుండటం ఇదే తొలిసారి. ఇదివరకు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ప్రారంభించాలనుకున్న ఈ చిత్రాన్ని ఓ వారం ముందుగాRead More


ద్రౌప‌ది న‌య‌న‌తారే..!

భారతీయ చలనచిత్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో వెయ్యి కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం మ‌హా భార‌తం. బీ. ఆర్. శెట్టి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కుమార్ మీనన్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇక నటీనటుల ఎంపిక ప్రక్రియని కూడా వేగవంతం చేశారు. మోహన్ లాల్ ని ఇప్పటికే ఓ ప్రధాన పాత్రకి ఎంపిక చేయగా ప్రభాస్, నాగార్జున, మహేష్‌ ఇలా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కన్నడలో కూడా అదే మాదిరిగా మహా భారతం నేపథ్యంలో కురుక్షేత్ర అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగాణంతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. మహా భారతంలోని స్త్రీ పాత్రలలో ముఖ్యమైన పాత్ర ద్రౌపది కాగా ,Read More


బాల‌య్య 102లో జ‌త‌క‌డుతున్న బ్యూటీ

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో 100 సినిమాలని పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ ఆ తరువాత వేగం పెంచాడు. ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఇప్పటికే తన 102వ చిత్రాన్ని ప్రారంభించాడు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నదట. తమిళనాడులోని కుంభకోణంలో షెడ్యూల్‌ను మొదలుపెట్టి అక్కడే 40 రోజులపాటు జరుపుతారట. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొంటారట. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారా? అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


గొంతు విప్పుతున్న న‌య‌న‌తార‌

నయన తారకు తమిళ్‌ చిత్రసీమలో క్రేజ్‌ పెరిగిపోయింది. ‘మాయ’ సినిమా తర్వాత ఆ తరహా చిత్రాల్లో చేసేందుకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయట. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఇటువంటి కథలు చెప్పి నయన తార నుంచి గ్రీన్‌సిగల్‌ పొందినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాలూ అవే. ఇప్పటి వరకూ నయన తార తన చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పుకోలేదు. ఎన్ని సినిమాలు చేసినా అరువుగొంతే ఉపయోగించేవారు. కానీ ఈ సారి మాత్రం తన గొంతే వినిపించింది. ఆ సినిమాయే తన ప్రియుడని ప్రచారం జరుగుతున్న విఘ్నేశ్‌ శివ దర్శకత్వంలో నటించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’. ఆ చిత్రానికి నయనతార సొంతంగా చెప్పిన డబ్బింగ్‌ చాలా ప్లస్‌ అయ్యిందట. దీంతో ఈమె చేస్తున్న ‘అరమ్‌’, ‘దోరా’ చిత్రాలకు తననే డబ్బింగ్‌ చెప్పాలని దర్శకుల నుంచి ఒత్తిడిRead More


ఏడుకి చేరిన న‌య‌న్..!

ఆశ్చ‌ర్య‌మే అనిపించిన‌ప్ప‌టికీ న‌య‌న‌తార వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా క‌నిపిస్తోంది. అనేక ఆఫ‌ర్లు కాదంటున్న‌ప్ప‌టికీ ఈ భామ‌కు క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు అందుకు త‌గ్గ‌ట్టుగానే రెమ్యునేష‌న్ కూడా అమాంతంగా పెరిగిపోతోంది. కోలీవుడ్‌లో రూ.10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన ఆమె కెరీర్‌ ఇప్పుడు కోట్లకు చేరింది. మొన్నటి వరకూ మూడు కోట్లు పుచ్చుకున్న ఈ మాలీవుడ్‌ సంచలన తార ఇటీవల నాలుగు కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట. నయనతార ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్‌ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాయ చిత్రం నుంచి ఈ తరహా చిత్రాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎక్కువైంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న డోరా, ఇమైక్కా నోడిగళ్, అరం, కొలైయుధీర్‌ కాలం తదితర చిత్రాలన్నీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రాలే. ఇలాంటి చిత్రాలకు హాట్ న‌య‌న్ రెమ్యునేష‌న్Read More


న‌య‌న్ చీర క‌థ‌..!

సౌత్ లో స‌త్తా చాటుతున్న న‌య‌నతార వ్య‌వ‌హారం నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ కేరళకుట్టి ‘కాష్మోరా’ సక్సెస్‌ తరువాత ‘డోరా’, ‘ఇమైక్క నొడిగల్‌’, ‘అరమ్‌’, ‘కొలైయుదిర్‌ కాలం’ చిత్రాల్లో నటిస్తూ యమా బిజీగా ఉంది. హర్రర్‌ సబ్జెక్టుతో రూపొందుతున్న ‘డోరా’ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో ఆమె నటించిన ‘మాయ’ తరహాలోనే ‘డోరా’ కూడా మంచి పేరు తీసుకువస్తుందని నయన ఆశాభావంతో ఉంది. అధర్వ నటిస్తున్న ‘ఇమైక్కనొడిగల్‌’లో కీలక పాత్రలో నటిస్తుండగా, హీరోయిన ప్రాధాన్య చిత్రం ‘అరమ్‌’లో జిల్లా కలెక్టర్‌గా కనిపించనుంది. గోపి నయనార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఒకే కాస్ట్యూమ్‌లో కనిపించనుందట. ఒకేరోజు జరిగే కథతో తెరకెక్కుతున్న ‘అరమ్‌’లో ప్రారంభం నుంచి చివరి వరకు చీరకట్టులోనే నయన కనిపిస్తుందని, ఇది ఆమె కెరీర్‌లోనే విభిన్నమైన చిత్రంగాRead More