Main Menu

narsaraopeta

 
 

రాయ‌పాటి రూటు ఎటు..!?

టీడీపీ ఎంపీలు త‌లోదారి ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జేసీ దివాక‌ర్ రెడ్డి జెండా దించేసే యోచ‌న‌లో క‌నిపిస్తున్నారు. అదే రీతిలో మరో సీనియ‌ర్ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా రూటు మార్చేస్తున్నారా అన్న అనుమానం క‌లుగుతోంది. తాజాగా ఆయ‌న తెలుగుదేశం పార్టీతో ఎడంగా ఉంటున్నారు. కీల‌క సంద‌ర్భాల్లో కూడా పార్టీ నేత‌ల‌కు అందుబాటులో క‌నిపించ‌డం లేదు. అనేక సంద‌ర్భాల్లో సాగుతున్న టీడీపీ ఎంపీల ఆందోళ‌న‌కు ఆయ‌న దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో సంబంధాలు కొన‌సాగుతున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే మోడీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దాంతో రాయ‌పాటి వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. పోల‌వ‌రం కాంట్రాక్ట్ విష‌యంలో రాయ‌పాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ స్థానంలో ప‌లు కీల‌క ప‌నుల‌కు వివిధ సంస్థ‌ల‌ను రంగంలో దింపారు. దాంతో రాయ‌పాటికి చంద్ర‌బాబుRead More


టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌

తెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేత‌లే రోడ్డెక్కారు. ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్ప‌టికే మూడు సార్లు వ‌రుస‌గా ఓట‌మి పాల‌యిన త‌ర్వాత కూడా పార్టీ నేత‌లు క‌ళ్లు తెర‌వ‌డం లేద‌ని వాపోతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం స్పందించ‌డం లేదంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. మార్కెట్ యార్డ్ క‌మిటీ చైర్మ‌న్ రామిరెడ్డి దీక్ష‌తో గుంటూరు జిల్లా న‌ర్సారావుపేట టీడీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డాయి. ఒక‌ప్పుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గంలో 2004 నుంచి టీడీపీ ఓట‌మి పాల‌వుతోంది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఇన్ఛార్జ్ ని నియ‌మించ‌డంలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. నేటికీ అది పూర్తిచేయ‌క‌పోవ‌డంతో జిల్లా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు, పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌హా అంద‌రికీ కార్య‌క‌ర్త‌లు ప‌దేRead More


రాజీనామా ఆలోచ‌న‌లో రాయ‌పాటి

ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు రాజీనామా కి సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే తాను రాజీనామా చేయ‌డానికి రెడీ గా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితే త‌న‌కు మాత్రం టీడీడీ చైర్మ‌న్ ప‌ద‌వి మాత్రం కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. జంట ప‌ద‌వుల అభ్యంత‌రం విష‌యంలో అనుమానం అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఎంపీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఈ నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి రాయ‌ప‌టి సాంబశివరావు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పదవిని తనకు కేటాయించాలని కోరుతూ తాజాగా సీఎం చంద్రబాబుకు రాయపాటి లేఖ రాశారు. ప్రస్తుతం టీటీడీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో రాయపాటి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా… ఈనెల 4వతేదీన సీఎం చంద్రబాబుRead More


రౌండ‌ప్: న‌ర్సారావుపేటలో నిలిచేదెవ‌రు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో న‌ర్సారావుపేట ఓ కీల‌క‌స్థానం. ఇక్క‌డి రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటాయి. అందులోనూ బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఢీ అంటే ఢీ అన‌డానికి సిద్ధ‌ప‌డే స‌మ‌యంలో అంద‌రి దృష్టి ఉంటుంది. ప‌ల్నాడు ప‌ట్టుద‌ల‌తో సాగే రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా ఉంటుంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు టీడీపీ పై చేయి సాధించింది. ఇక ఇప్పుడు మూడేళ్ల త‌ర్వాత రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. స‌మీక‌ర‌ణ‌ల్లో పెను మార్పులు సంభ‌విస్తున్నాయి. దాంతో ఈసారి ఎలా ఉంటుంద‌న్న‌ది మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో న‌ర్సారావు పేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్లీ సీట్ల వారీగా ప‌రిస్థితి ఎలా ఉందో ఈ రౌండ‌ప్ లో చూద్దాం 1.పెద‌కూర‌పాడు: సుదీర్ఘ‌కాలం పాటు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప్రాతినిధ్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ ప‌ట్టు సాధించింది.Read More


జ‌గ‌న్ స‌భ‌ను అడ్డుకుంటున్న‌దెవ‌రు?

వైఎస్సార్సీపీ వ్య‌వ‌హారం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ప‌ల్నాడు ప్ర‌ధాన కేంద్రంలో ప్ర‌తిప‌క్ష నేత స‌భ‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారుతోంది. న‌ర‌సరావు పేట‌, స‌త్తెన ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌భావం చూప‌గ‌ల స‌త్తా ఉన్న కాసు కుటుంబం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి స‌న్నాహాలు చేసుకున్నారు. మాజీ సీఎం కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌న‌వడు కాసు మ‌హేష్ రెడ్డి స‌హా ఆయ‌న అనుచ‌రులంతా వైఎస్సార్సీపీలో చేర‌డం పెనుమార్పుల‌కు సూచిక అన్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ లో ఉన్న కాసు ఫ్యామిలీ ఇప్పుడు జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌డానికి సిద్ధం కావ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది శుక్ర‌వారం న‌ర్సారావుపేట‌లో నిర్వ‌హించ‌బోతున్న స‌భ‌లో ఈ నేతలంతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అందులో భాగంగా న‌ర్సారావుపేట‌లోని పల్నాడు బ‌స్టాండ్ సెంట‌ర్ లో బ‌హిరంగ‌స‌భ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే స‌భ‌ను అడ్డుకోవ‌డానికి అధికార పార్టీRead More