Main Menu

narayana

 
 

మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!

ఏపీ మంత్రి నారాయ‌ణ వ్య‌వ‌హారం మామూలుగా ఉండ‌దు. బ‌డా వ్యాపారిగా గుర్తింపు పొంది ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి వ‌చ్చారాయ‌న‌. ప్ర‌జ‌ల‌తో పెద్ద‌గా సంబంధం లేకుండానే పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టారు. ఆ వెంట‌నే అమాత్య హోదా ద‌క్కింది. కీల‌క‌మైన ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ పేరుతో రాజ‌ధాని వ్య‌వ‌హారాలన్నీ ఆయ‌న చేతుల్లోనే ఉన్నాయి. దాంతో ఆయ‌న ప్రాధాన్య‌త‌గ‌ల మంత్రిగా మారిపోయారు. కానీ పాత్రికేయులు మాత్రం ఈ మంత్రిని చూస్తే భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతంలో జ‌ర్న‌లిస్టుల‌యితే నారాయ‌ణ పేరెత్తితేనే ప‌రార‌వుతున్నారు. జ‌ర్న‌లిస్టులను ఓ రేంజ్ లో భ‌య‌పెడుతున్న మంత్రి వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీడియా ప్ర‌తినిధుల‌న‌గానే దాదాపుగా నారాయ‌ణ కాలేజీ సిబ్బంది త‌ర‌హాలో ఆయ‌న ట్రీట్ చేస్తున్నార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆయ‌న ఓ మీడియా స‌మావేశం పెట్టాల‌నుకుంటే ఉద‌యాన్నే ఏడుగంట‌కు ఏర్పాటు చేస్తారు. దాంతో ఆరుగంట‌ల‌కుRead More


వియ్యంకుల మంత్రుల వైభోగం చూశారా

ఏపీలో పాలక పెద్దల ఆడంబరాలు ఓ స్థాయిలో కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి సీఎం మనవడు, మంత్రి లోకేష్ దేవాన్ష్ అక్షరాభ్యాసం అత్యంత ఆడంబరంగా సాగింది. ఏస్థాయిలో అంటే చివరకు వెండి పలక మీద ఆక్షరాలు దిద్దించేటంత లెవెల్ లో ఆ కార్యక్రమం నడిచింది. అప్పట్లో అది అందరినీ ఆశ్చర్యపరిచింది. నేల మీద ఆక్షరాలు దిద్దిన రోజుల నుంచి చెక్క పలకలు, ప్లాస్టిక్ పలకల దశ దాటి ఇఫ్పుడు అమాత్యులు, అధికార పెద్దలు వెండి పలకల వరకూ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా వియ్యంకులైన మంత్రుల వ్యవహారం ముందుకొచ్చింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణల ముద్దుల మనవడు బారసాల జరిగింది. అది కూడా వారి స్థాయికి తగ్గట్టుగానే నిర్వహించారు. అసామాన్యంగా వెండి ఉయ్యాల, ముత్యాల ఉయ్యాలతో ఈ కార్యక్రమం సాగడంRead More


ఆనం బ్ర‌ద‌ర్స్ ని మోసం చేసిందెవ‌రు..?

అయ్యో..అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. రాజ‌కీయాల్లో అంతెత్తుకు ఎదిగిన వాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ప‌డిపోవ‌డం అనూహ్య‌మే అనిపిస్తోంది. అయినా పోలిటిక్స్ లో ఇలాంటి సీన్లు త‌ప్ప‌వేమో అని స‌రిపెట్టుకోవాలి. బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఏమిటో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే అంతా తామై అన్నింటా పెత్త‌నం చెలాయించిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు మోస‌పోయామ‌ని వాపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. స్వ‌యంగా ఆనం వివేకానంద‌రెడ్డి తాము మోస‌పోయామ‌ని చెప్పిన నేప‌థ్యంలో అస‌లు ఇంత‌కీ వాళ్ల‌ని మోస‌గించిందెవ‌రనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ‘మోసపోయాం బ్రదర్‌.. ఎన్ని అవమానాలను భరిస్తాం. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. అది కూడా చేజారింది. సొంత కళాశాల వీఆర్సీలో జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడు. ఇక ఇప్పట్లో నెల్లూరుకు రాలేను’… ఇవీRead More


న‌లిగిపోతున్న నారాయ‌ణ‌..!

ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఆయ‌న‌కు ఎటూ పాలుపోని సందిగ్ధంలోకి నెట్టింది. ముందు నుయ్యి వెన‌క గొయ్యి అన్న చందంగా మారింది. పార్టీ అధినేతకే ఏం చేయాలో పాలుపోని స‌మ‌స్య కావ‌డంతో దాని ప్ర‌భావంతో నారాయ‌ణ న‌లిగిపోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్క‌ట్లు పాల‌వుతున్నారు. తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలుగానీ నేత‌లు గానీ త‌న మాట వినే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఎటూ తేల్చుకోలేక త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల‌తో నారాయ‌ణ నానా ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు మినీమ‌హానాడు వ్య‌వ‌హారాల‌కు తోడు తాజాగా మ‌హానాడు లో కూడా ఆయ‌న మీద నేత‌ల ఒత్తిడి తీవ్రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఇప్పుడు నిలువునా చీల‌డం ఖాయంగా మారిపోయింది. గ‌డిచిన ఎన్నిక‌ల త‌ర్వా పార్టీలో చేరిన నేత‌లంతా ఒక్క‌ట‌వుతున్నారు. చీరాల, అద్దంకి, కందుకూరు,Read More


నారాయ‌ణ త‌న‌యుడికి అధికారిక నివాళి

ఏపీ మంత్రి నారాయ‌ణ త‌న‌యుడు నిషాంత్ మ‌ర‌ణం ఎంత విషాదం నింపిందో అంతే వివాదంగా కూడా మారింది. ఆ యువ‌కుడి మ‌ర‌ణం ప‌ట్ల మీడియా స్పందించిన తీరును ప‌లువురు ప్ర‌శ్నించారు. కొన్ని ప‌త్రిక‌లు మ‌రీ అతిగా వ్య‌వ‌హ‌రించి క‌థ‌నాలు ప్ర‌చురించ‌డాన్ని నిల‌దీశారు. అయితే ఇప్పుడు మ‌రో అడుగు ప‌డింది. ఏకంగా మంత్రి త‌న‌యుడు మ‌ర‌ణానికి అధికారికంగా నివాళుల‌ర్పించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, సంప్ర‌దాయాల‌ను అధిగ‌మించి ఏకంగా అమాత్యుడి కొడుకు మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేయ‌డం మ‌రో వివాదంగా మారింది. అధికారికంగా న‌గ‌ర‌పాల‌క సంస్థ వేదిక మీద నుంచి నివాళులు, సంతాప ప్ర‌క‌ట‌న‌లు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం న‌గ‌ర పాల‌క సంస్థ స‌మావేశం జ‌రిగింది. కౌన్సిల్ మీటింగ్ కి ముందుగా ఏకంగా మునిసిప‌ల్ మంత్రి త‌న‌యుడి మ‌ర‌ణానికి సంతాపంగా పాల‌క‌మండ‌లి త‌రుపున ప్ర‌క‌ట‌న రావ‌డం విశేషం. నిషాంత్ హ‌ద్దుల్లేకుండాRead More


సోమిరెడ్డికి మేలు చేసిన లీకేజీ…!

ఎట్ట‌కేల‌కు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ క్యాబినెట్ లో అడుగుపెట్ట గ‌లిగారు. ద‌శాబ్ధంన్న‌ర త‌ర్వాత మ‌రోసారి మంత్రి కాగ‌లిగారు. అయితే ఆ క్ర‌మంలో ఆయ‌న అనేక ఆటంకాలు అధిగ‌మించారు. ముఖ్యంగా తాజా క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు ఎదుర‌యిన అవ‌రోధాలు అన్నీ ఇన్నీ కావు. అయినా కీల‌క‌మ‌యిన నారాయ‌ణాస్త్రాన్ని కూడా చేధిచండంతో సోమిరెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. మ‌ధ్య‌లో బీసీ ని ప్ర‌యోగించి నెల్లూరు రెడ్ల‌కు ఛాన్స్ లేకుండా చేయాల‌ని భావించినా బాబు మాత్రం సోమిరెడ్డిని సెల‌క్ట్ చేసి, త‌న ప‌ట్ల ఉన్న విధేయ‌త‌కు కృత‌జ్ఞ‌త ప్ర‌క‌టించారు. చిన‌బాబు కాద‌న్నా పెదబాబు మాత్రం సోమిరెడ్డిని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సోమిరెడ్డి క్యాబినెట్ లోకి రావ‌డానికి ఇటీవ‌ల అసెంబ్లీలో ర‌చ్చ చేసిన పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం బాగా తోడ్ప‌డిన‌ట్టు భావిస్తున్నారు. నారాయ‌ణ సంస్థ‌ల్లో ప‌రీక్షా పత్రాలు లీక్ కావ‌డం,Read More


వియ్యంకుల‌కు ఎస‌రు పెట్టిన‌ జ‌గ‌న్

జ‌గ‌న్ ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్టే భావించ‌వ‌చ్చు. క‌డప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎదుర‌యిన అవ‌మానానికి ఆయ‌న త్వ‌ర‌గానే బ‌దులిచ్చేశారు. దాంతో ఇప్పుడు వియ్యంకుళ్లు ఇర‌కాటంలో ప‌డ్డారు. ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. మూడు రోజుల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌డంతో తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. వారిలో గంటా శ్రీనివాస‌రావుకి గ‌ట్టి దెబ్బే ఖాయం అంటున్నారు. క‌డ‌ప ఇన్ఛార్జ్ మంత్రిగా గంటా చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. సీఎం ర‌మేష్ సీన్ లో ఉన్న‌ప్ప‌టికీ క‌డ‌ప‌లో గంటా స్కెచ్ గ‌ట్టిగానే ఫ‌లించిన‌ట్టు చెప్ప‌వ‌చ్చు. దానికి బ‌దులుగా గంటాను అంతా అభినందించారు. ప్ర‌త్తిపాటి పుల్లారావు లాంటి వాళ్లు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆయ‌న్ని క‌డ‌ప నుంచి పోటీ చేయించాలని ప్ర‌తిపాదించే వ‌ర‌కూ వెళ్లారు. అలాంటి గంటా హ‌ఠాత్తుగా లీకేజీలో గ‌లీజు కావ‌డం కొంత అస‌హ‌నంగా మార్చేసింది. చివ‌ర‌కు స‌భ‌లో ఆయ‌న తీరు కూడా చంద్ర‌బాబును సంతృప్తిప‌ర‌చ‌కపోవ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది.Read More


నారాయ‌ణ లీకేజీల‌పై ద‌ద్ద‌రిల్లిన అసెంబ్లీ

ఏపీలో ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం స‌భ‌లో దుమారం రేపింది. అసెంబ్లీలో విప‌క్షం ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌య్యింది. ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారంలో వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంతో స‌భ దద్ద‌రిల్లింది. స్పీక‌ర్ కోడెల వాయిదా తీర్మానాన్ని తిర‌స్క‌రించ‌డంతో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. పోడియంలోకి దూసుకొచ్చారు. నినాదాలు చేశారు. దాంతో స‌భ ప‌ది నిమిషాలు వాయిదా వేస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. అయితే ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని అడ్డుకుంటున్నారంటూ ఆరోపించింది. విప‌క్ష స‌భ్యులు మాత్రం ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. క్యాబినెట్ మంత్రిగా ఉన్న నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో లీకేజీ జ‌రిగితే స్పందించ‌క‌పోవ‌డం అన్యాయ‌మ‌న్నారు. నారాయ‌ణ వియ్యంకుడు గంటా శ్రీనివాస‌రావు విద్యా మంత్రిగా ఉండ‌డం, నారాయ‌ణ లీకేజీల‌కు నిల‌యం కావ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడుకుంటున్నార‌ని వాపోయారు. దానిమీద స‌భ‌లోRead More


నారాయ‌ణ లీకుల భాగోతం

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఒకరోజు ముందే తెలుగు-1 పేపరు లీకైందా..? ఈ లీకేజీ వెనుక కార్పొరేట్‌ విద్యాసంస్థల హస్తం ఉందా..? పిల్లలకు పేపరు ముందే చెప్పి.. పరీక్షలకు పంపారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అనంతపురం జిల్లా మడకశిరలో పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌లో కార్పొరేట్‌ విద్యాసంస్థ నారాయణ స్కూల్‌ సిబ్బంది హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఆ స్కూల్‌ ఎఇ ముత్యాలును పోలీసులు అదుపులో తీసుకున్నారు. మడకశిరలో ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం వాట్సాప్‌ ద్వారా బయటికి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మరో కొత్తకోణం వెలుగుచూసింది. హిందూపురం పట్టణంలో ఓ కార్పొరేట్‌ పాఠశాల నుంచి తెలుగు కాంపోజిట్‌ ప్రశ్నపత్రం-1 ఒక రోజు ముందుగానే బయటకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడయినప్పటికీ.. రాష్ట్ర మంత్రి విద్యాసంస్థల నుంచి లీకు జరిగిన విషయాన్నిRead More


రోజాని చూడ‌గానే కాళీమాత క‌నిపిస్తోంది..!!

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కే నారాయ‌ణ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. ఆర్కే రోజా అంటే టీడీపీ నేత‌ల‌కు భ‌య‌మ‌ని నారాయ‌ణ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. కాళిమాతను చూసినట్లుగా రోజాను చూసి వణికిపోతున్నారన్నారు. ఏపీలో టీడీపీతో పాటుగా తెలంగానాలో టీఆర్‌ఎస్ కూడా ప్రతిపక్షాలను చూసి ప్యాంటులు తడుపుకుంటున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఏళ్ల త‌ర‌బ‌డి ఎమ్మెల్యే మీద వేటు వేయ‌డం త‌గ‌ద‌న్నారు. అసెంబ్లీలో ఇలా సస్పెండ్‌ చేసుకుంటూ వెళితే ఎవరు మిగలరని నారాయణ అన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…అమెరికాలో భారతీయులపై దాడులను పట్టించుకోవడం లేదని నారాయణ విమర్శించారు. మన దేశంలో కూడా మత విద్వేషాలు కొనసాగడం విచారకరమని ఆయన అన్నారు.