nara lokesh

 
 

టీడీపీ నేతలకు థామస్ పరీక్ష

Chandrababu-naidu-NAra-Lokesh

తెలుగుదేశం నేతలకు అనూహ్య పరీక్ష ఎదురయ్యింది. ఇప్పటికే ఫీల్డ్ లో నంద్యాల, కాకినాడ పరీక్షల్లో గట్టెక్కిన నేతలకు కూడా ఈ పరీక్ష చుక్కలు చూపించింది. ప్రశ్నలకు జవాబులు రాయాల్సి రావడంతో ఖంగుతినాల్సి వచ్చింది.అయినా మానసిక స్థితి విశ్లేషణ అంటూ నాయకుడు నిర్ణయంతో నేతలు పరీక్షకు సిద్ధం కావాల్సి వచ్చింది. తమ ముఖ్య నేతలకు టీడీపీ అధినాయకత్వం వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష నిర్వహించడం టీడీపీలో చర్చనీయాంశం అయ్యింది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఇటువంటి పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాతిగాంచిన థామస్‌ కంపెనీ రూపొందించిన ప్రశ్నపత్రాన్ని ప్రతి నేతకు ఒక ట్యాబ్‌లో ఇచ్చి వారితో వాటికి సమాధానాలు ఇప్పించారు. ఈ ప్రశ్నపత్రంలో 24 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు ఇచ్చే వ్యక్తి వ్యక్తిత్వం.. వివిధ సందర్భాల్లోRead More


నారా లోకేష్ ఎందుకు దూర‌మయ్యారు?

nara lokesh

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఆస‌క్తిక‌రంగా మారుతోంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆయ‌న‌. ఏపీలో కీల‌క శాఖ‌లు నిర్వ‌హిస్తున్న మంత్రి ఆయ‌న‌. అంత‌కుమించి భూమా అఖిల‌ప్రియ‌తో స‌న్నిహితంగా మెలుగుతున్నారాయ‌న‌. అందుకే చెల్లి రంగంలో ఉంటే అన్న‌య్య దూరంగా ఎందుకుంటున్నారా అనే సందేహం వ‌స్తోంది. పార్టీ యావ‌త్తు అక్క‌డే ఉంటే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌త్తా లేక‌పోవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. మంత్రులంతా నంద్యాల‌లో ఉంటే ఆయ‌న మాత్రం క‌నిపించ‌డం లేదేమిటా అనే అనుమానం వ‌స్తుంది. పార్టీ అధినేత‌గా ఉన్న తండ్రి పూర్తిగా నంద్యాల కోసం క‌స‌ర‌త్తులు చేస్తుంటే త‌న‌యుడు లోకేష్ ని ఎందుకు దూరంగా పెడుతున్నారా అనే ఆస‌క్తి ఎదుర‌వుతోంది. కార‌ణాలేమ‌యినా నంద్యాల ఉప ఎన్నిక‌ల వేడిలో చిన‌బాబుకి చోటు ద‌క్క‌క‌పోవ‌డం విశేష‌మే. అయితే నెల రోజుల క్రితం క‌ర్నూలు జిల్లాలో నారా లోకేష్ ప‌ర్య‌ట‌న ఆయ‌న ప‌రువు తీసింది.Read More


అవి టీడీపీ వేసిన రోడ్లు: వాటిని చూస్తే ఆగ‌లేక‌పోతున్నా!

nara lokesh

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం రోడ్లు ప్ర‌స్తావ‌ని తీసుకొచ్చి ఇప్ప‌టికే అభాసుపాల‌య్యారు. ఏకంగా ఈసీ వ‌ర‌కూ ఆయ‌న మీద ఫిర్యాదు వెళ్లింది. అయినా ఆయ‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఎన్నిక‌ల్లో ఓట్లు అడ‌గాలంటే ఎవ‌రైనా టీడీపీ వేసిన రోడ్ల మీదే న‌డిచి వెళ్లాలంటూ వ్యాఖ్యానించ‌డ‌డం విశేషం. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప‌లు మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే త‌మ‌కు 140 సీట్లు వ‌స్తాయ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. జ‌న‌సేన‌తో పొత్తు కొనసాగుతోంద‌న్నారు. నంద్యాల‌లో త‌మ‌దే గెలుపు అని చెప్పుకొచ్చారు. ఐటీ రంగంలో లక్ష, ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలను రెండేళ్లలో కల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అమరావతిలో హెచ్‌సీఎల్‌ తన పరిశోధన,Read More


దుమారం రేపుతున్న బుట్టా రేణుక‌

butta-renuka-meets-nara-lok

క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్య‌వ‌హారం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆమె అడుగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఆమె క్లారిటీ ఇచ్చినా క‌ల‌క‌లం మాత్రం కొన‌సాగుతోంది. ఆమె పార్టీ మారిపోతున్నార‌నే ప్ర‌చారం మ‌రోసారి ఊపందుకుంది. మూడేళ్ల క్రితమే బుట్టా రేణుక వైసీపీ నుంచి జంప్ అవుతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఆమె ప్ర‌య‌త్నాలు కూడా అలానే క‌నిపించాయి. చివ‌ర‌కు ఆమె భ‌ర్త టీడీపీ కండువా క‌ప్పుకున్నా రేణుక మాత్రం సైలెంట్ ఉండిపోయారు. ఆత‌ర్వాత క్ర‌మంగా వైసీపీలో యాక్టివ్ గా మారారు. ఇటీవ‌ల ప్లీన‌రీలోనూ పాల్గొన్నారు. అంతేగాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంట్ కి కాకుండా, అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దానిలో భాగంగా త‌న సామాజిక‌వ‌ర్గీయులు కీల‌కంగా ఉన్న ఎమ్మ‌గ‌నూరు స్థానాన్ని ఆమెకు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికేRead More


లోకేష్ కి షాకిచ్చిన క‌ర్నూలు వాసులు

nara lokesh

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కర్నూలు సభలో మంత్రి లోకేష్‌కు స్థానికులు సూటి ప్రశ్న సంధించడంతో నీళ్లు నమలడమే మంత్రి వంతయింది. రాయలసీమకు భారీగా పరిశ్రమలొచ్చాయని తమ ప్రభుత్వ పనితీరు కారణంగానే పెట్టుబడులొస్తున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కియ మోటార్స్‌ కంపెనీ రావడంతో 5 లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పడంతో అక్కడి ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అయితే 5 లక్షల ఉద్యోగాలు వచ్చిన వారిలో ఒక్కరిని చూపిస్తే చాలంటూ స్థానికులు మంత్రి లోకేష్‌ను నిలదీశారు. వెంటనే స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు లోకేష్‌ను ప్రశ్నించిన వారిని అడ్డుకుని వారించే యత్నాలు మొదలుపెట్టారు. దీంతో స్థానికుల ఆగ్రహం రెట్టింపయింది. మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ మాట్లాడలేరు.. కనీసం మమ్మల్ని అయినా మాట్లాడనివ్వాలంటూRead More


లోకేష్ కి షాకిచ్చిన నెటిజ‌న్స్

lokesh tweet

ఏపీ సీఎం త‌న‌యుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ వ్య‌వ‌హారం మారుతున్న‌ట్టుగా లేదు. ఆయ‌న ప‌దే ప‌దే అభాసుపాల‌వుతున్నా తీరు మార్చుకోవ‌డం లేదు. అనేక‌సార్లు సోష‌ల్ మీడియాలో ఆయ‌న మీద సెటైర్ల హోరు క‌నిపిస్తున్నా ప‌దే ప‌దే అదే త‌ర‌హాలో సాగుతున్నారు. అయితే ఇన్నాళ్లుగా మాట్లాడేట‌ప్పుడు త‌డబ‌డి జ‌నాల‌కు దొరికిపోయిన నారా లోకేష్ ఈసారి ట్వీట్ తో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇది నెటిజ‌న్స్ కి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ‌రాలు వెల్లువ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నారా లోకేష్ కూడా నంద్యాల సమీపంలోని అబండం తండా ఫోటో అంటూ ఓ ఇమేజ్ ని లోకేష్ పోస్ట్ చేశారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా మురికినీరు, నిండిపోయిన డ్రైనేజీల‌తో ఉన్న ఆ వీధి అనూహ్యంగా మారిపోయిందంటూ మ‌రో ఇమేజ్ పోస్ట్Read More


నారా లోకేష్ కి ఓటు లేదు..!

naralokesh31454909222

అవును…ఏపీ మంత్రిగా, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేష్ కి దేశ ప్ర‌ధ‌మ పౌరుడి ఎన్నిక‌లో భాగ‌స్వామిగా ఉండే అవ‌కాశం లేదు. లోకేష్ తో పాటు మ‌రో ముగ్గురు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అందులో సీనియ‌ర్లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, నారాయ‌ణ స‌హా మొత్తం న‌లుగురు ఏపీ మంత్రుల‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు లేదు. దానికి కార‌ణం వారంతా శాస‌న‌మండ‌లి స‌భ్యులు కావ‌డ‌మే. శాస‌న‌మండ‌లి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారు ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో ఎన్నిక కాబ‌డిన వారు కావ‌డంతో మ‌రోసారి ప‌రోక్ష ఎన్నిక‌ల‌కు వారికి ఓటు హ‌క్కు ఉండ‌దు. కేవ‌లం అసెంబ్లీకి ప్ర‌జ‌ల ద్వారా ఎన్నిక కాబ‌డిన వారు మాత్ర‌మే ఎల‌క్ట్రోల్ ఓట‌ర్ల జాబితాలో ఉంటారు. దాంతో నారా లోకేష్ కి అవ‌కాశం లేకుండా పోయింది. ఎన్డీయే అభ్య‌ర్థి రామ్Read More


య‌న‌మ‌లకు అవ‌మాన‌మా?

yanamala

తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. తెలుగుదేశంలో సుదీర్ఘ‌కాలంగా చ‌క్రం తిప్పిన య‌న‌మ‌ల‌కు బ్రేకులు ప‌డుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. చిన‌బాబు పెత్త‌నం పెరిగిన త‌ర్వాత టీడీపీ వ్య‌వ‌హారాల్లో య‌న‌మ‌ల మాట‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే తూర్పు జెడ్పీ చైర్మ‌న్ గిరీ రాజ‌కీయం మారింది. య‌న‌మ‌ల కు ప‌రాభ‌వం ఎదుర‌య్యింది. ఆయ‌న‌తో పొస‌గని ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వార‌సుడు జిల్లా జెడ్పీ చైర్మ‌న్ పీఠం ఎక్క‌డానికి రంగం సిద్దం అయ్యింది. గ‌తంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన జ్యోతుల నెహ్రూతో సుదీర్ఘ‌కాలంగా య‌న‌మ‌ల‌కు వైరం ఉంది. అయితే ఏడాదిన్న‌ర క్రితం మ‌ళ్లీ సైకిలెక్కిన జ్యోతుల నెహ్రూ త‌న చేరిక‌కు య‌న‌మ‌ల అడ్డు చెప్ప‌డంతో నేరుగా ఆయ‌న్ని కలిసి ఆమోద ముద్ర వేయించుకున్నారు. అయినా మెట్ట‌లో పుట్టిన ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య పెద్ద‌గాRead More


క్లాస్ పీకుతున్న బాబు, లోకేష్

chandrababu-naidu-nara-lokesh

తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబు ప‌దే ప‌దే క్ర‌మ‌శిక్ష‌ణ గురించి మాట్లాడుతుంటారు. క్యాడ‌ర్ కి కిందిస్థాయి నుంచి అవ‌గాహ‌నా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డానికి దానిలో భాగ‌మే బాబు ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. అయితే ఇటీవ‌ల పార్టీలో ప‌రిస్థితి అదుపుతప్పుతోంది. కిందిస్థాయి నుంచి కీల‌క నేత‌ల వ‌ర‌కూ ఎవ‌రూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటిస్తున్న‌ట్టు దాఖ‌లాలు లేవు. దాంతో బాబు మ‌రోసారి శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈసారి నారా లోకేష్ , బాబు క‌లిసి నేత‌ల‌కు క్లాస్ పీకే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు సాధార‌ణ నేత‌ల‌కు మాత్ర‌మే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల‌కే ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలోని నాలుగు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి గ‌తంలోనే లోకేష్ సార‌ద్యంలో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. వాటి ద్వారా నేత‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డం, విప‌క్షానికి త‌గిన రీతిలో జ‌వాబులిచ్చేRead More


చిన‌బాబుని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే..!?

Chandrababu-naidu-NAra-Lokesh

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కొడుకులా క‌నిపించే పోలిటిక్స్ లో ఏమాత్రం తేడా వ‌చ్చినా తాడే పామై క‌రుస్తుంది. దానికి ఉదాహ‌ర‌ణగా అనేక మంది ఉన్నారు. తాజాగా నారా లోకేష్ ప‌రిస్థితి అదే రీతిలో మార‌బోతోందా అన్న సందేహం క‌లుగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అటు పార్టీలోనూ ఇటు ప్ర‌భుత్వంలో తెర‌వెనుక చ‌క్రం తిప్పిన ఆయ‌న మూడు నెల‌ల క్రిత‌మే మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రాజ‌కీయంగా తండ్రి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుంటార‌నే అభిప్రాయంతో అడ్డ‌దారే అయినా ఎమ్మెల్సీగా గెలిపించి అమాత్యుడ‌నిపించారు. అదే ఇప్పుడు పొర‌పాటు చేసిన‌ట్టుగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. నారా లోకేష్ ప్ర‌మోష‌న్ల విష‌యంలో చంద్ర‌బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రించి ఉండాల్సిందనే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. లోకేష్ వ‌ల్ల పార్టీకి ప్ర‌యోజనం ఏంట‌నే చ‌ర్చ సాగుతోంది. లోకేష్ స్థానంలో దూళిపాళ , పయ్యావులRead More