Main Menu

nandyala

 
 

లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

క‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. అవ‌స‌రం లేని స‌మ‌యంలో టిక్కెట్లు ప్ర‌క‌టించి ఆయ‌న క‌ల‌క‌లం రేపారు. ఇప్ప‌టికే టీజీ వెంక‌టేష్ వంటి వారు బ‌హిరంగంగానే లోకేష్ ని ఛాలెంజ్ చేశారు. దాంతో టీడీపీ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. అయితే క‌ర్నూలు ఎంపీ , ఎమ్మెల్యే అభ్య‌ర్థులను లోకేష్ కార‌ణంగా తాజాగా మంత్రి అఖిల‌ప్రియ అవ‌స్థ‌ల్లో ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఆమె స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న స‌మ‌యంలో సొంత అన్న‌గా చెప్పుకున్న లోకేష్ ఏం చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఎన్నిక‌ల ముంగిట ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్ల‌పై అభ్యంత‌రం వ‌స్తే చివ‌ర‌కు అది త‌న‌కు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని గ్ర‌హించిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి తొలుత త‌న టికెట్ ఖాయం చేసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.Read More


చంద్రబాబుపై అలకబూనిన మంత్రి

తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా అధినేత చెప్పిందే వేదంగా వ్యవహరించిన పార్టీలో తాజాగా అధ్యక్షుడి తీరుతో అమాత్యులే అలకబూనే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు వైఖరి పట్ల గుర్రుగా ఉన్న మంత్రి అఖిలప్రియ అలకబూనినట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి వైఖరితో మొఖం మాడ్చుకున్న అఖిలప్రియ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. దాంతో ఈ పరిణామం తెలుగుదేశం వర్గాల్లో విస్త్రుత చర్చకు దారితీస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. ఏకంగా ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, సమస్యలన్నీ నాకే చెప్పుకోండి అంటూ సుబ్బారెడ్డి ప్రచారం చేస్తుండడం, వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని చెబుతుండడం అఖిలప్రియకు గిట్టడం లేదు. భూమా నాగిరెడ్డి అనుచరుడికి, ఆయన వారసురాలికి మధ్య ఏర్పడిన వివాదంతో ఆళ్లగడ్డ టీడీపీRead More


కర్నూలు రాజకీయాల్లో కొత్త మలుపులు

కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్త మలుపులు తప్పేలా లేవు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా నేతల్లో ఆందోళనకు దారితీస్తోంది. రెండు ప్రధాన పార్టీల్లోనూ గుబులు రేకెత్తుతోంది. నంద్యాల శాసన సభ ఎన్నికలో ఫలితాల అనంతరం భారీ ఎత్తున పార్టీ మా ర్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటికిపుడు ఉండకపోవచ్చని కొందరు, ఇదే వేడిలో పార్టీ మారుతారని మరి కొందరు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప ఎన్నికల ఫలితాల్లో అతి తక్కువ ఓట్లు రావడంపై రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. తన మాటలను అందరూ నమ్మి రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్తారే కాని తనను ప్రోత్సహించలేదని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పార్టీ నిర్వహించడంRead More


సర్వే ప్రసారం చేసిన జర్నలిస్టులు అరెస్ట్

నంద్యాల ఉప ఎన్నికల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల ఎన్నికలపై ప్రసారం చేసిన సర్వే వారి అరెస్ట్ కి మూలంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా సర్వే ప్రసారం చేసిన వెబ్ సైట్ నిర్వాహకుకలు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ముఖ్యంగా వాస్తవాలను వక్రీకరించడంతో వారు ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టయ్యింది. నంద్యాల ఉపఎన్నికలకు సంబంధించిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఓ తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం ద్వారా ప్రజల్లో అపోహలకు, అనుమానాలకు అవకాశం కల్పించిన మన తెలంగాణా న్యూస్ ఎడిటర్ కూన అజయ్ బాబు, వెబ్ డిజైనర్ డి రంజిత్ కుమార్ ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 4,551 ఓట్లతో విజయం సాధిస్తున్నారంటూ ఇంటిలిజెన్స్ నివేదిక పేరుతో ఓ కథనం ప్రసారం చేశారు. అది కూడాRead More


చంద్రబాబుకి సానుకూలమేనా?

ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇక తిరుగులేదంటున్నారు. తమ తడాఖా చాటామంటున్నారు. ప్రజలంతా తమనే ఆశీర్వదించాలంటున్నారు. సెమీ ఫైనల్ సత్తా చాటామంటున్నారు. ఇక ఫైనల్స్ లో కూడా తమకు పోటీ ఉండదంటున్నారు. వైసీపీలో చాలామంది నేతలు తమవైపు వచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. అంతేకాదు అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జగన్ మీద దాడి చేసి ప్రతిపక్షనేతను ప్రజల్లో పలుచన చేయడమే పనిగా పెట్టుకున్నారు. అంతేగాకుండా మిత్రపక్ష నేతలను కూడా వదలడం లేదు. తద్వారా 2019లో కూడా చంద్రబాబుకి పోటీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ జోరు ఆగదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాస్తవానికి నంద్యాల పరిస్థితి గమనించిన తర్వాత టీడీపీకి అంత సానుకూలత ఉందా అన్నది ఆలోచించాలి. నంద్యాల వైసీపీ సీటు అయినా ఇప్పుడు టీడీపీ చేజిక్కించుకోవడంRead More


మళ్లీ లగడపాటే..

లగడపాటి రాజగోపాల్ ఘనాపాటి అనిపించుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ అంచనాలు మాత్రం తప్పడం లేదు. ఎన్నికల విశ్లేషణలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించిన లగడపాటి తాజాగా నంద్యాల ఫలితాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఎన్నికల సర్వేలలో తాను సిద్ధహస్తుడినని చాటుకున్నారు. తాజాగా నంద్యాల ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు సర్వేలు చేశాయి. అప్ డేట్ ఏపీ కూడా సర్వే చేసినా ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కానీ లగడపాటి సర్వే మాత్రం వాస్తవాలకు అతి చేరువలో ఉండడం విశేషం. అయితే ఈసారి సర్వేను ఆయన ప్రకటించలేదు. కేవలం మీడియా ఆయన దగ్గర సమచాారం కోసం ఆరా తీసినప్పుడు మాత్రమే వివరించారు. ప్రభుత్వానికి సానుకూలత ఉందని, సానుభూతి ఉందని, పోలింగ్ శాతం పెరగడం టీడీపీకి అనుకూలంగా మారుతోందని ఆయనRead More


జ్యోతి వక్రభాష్యం, ఈనాడు వంతపాట

మీడియాలో మార్పులు అనివార్యం అని అందరికీ తెలుసు. సొంత ఎజెండా కోసమే సంస్థలు పుట్టిన తర్వాత మీడియాలో బాకా ఊదే బ్యాచ్ పెరుగుతూనే ఉంటుంది. దానికి అనుగుణంగా వార్తల వక్రీకరణలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డి మీద జరిగిన దాడిని చిత్రీకరించడానికి ఆంధ్రజ్యోతి తపన, అందుకోసం అడ్డగోలుగా రాసిన రాతలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఈనాడు కూడా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది రాకుండా చూసుకోవడమే లక్ష్యంగా సాగినట్టు స్పష్టమవుతోంది. ఆ ముసుగులో నంద్యాలలో అరాచకానికి తెరలేపి, ఆఖరికి కాల్పుల వరకూ వెళ్లిన అభిరుచి మధు భాగోతాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. నంద్యాలలో జరిగిన ఘటనలకు సంబంధించి పత్రికల్లో వివిధ కథనాలు వచ్చాయి. ఒక్కో పత్రిక ఒక రకంగా అక్కడి పరిస్థితిని పాఠకులకు అందించాయి. మీడియా చానెళ్లు వెనువెంటనే సమాచారం అందించాల్సిన నేపథ్యంలోRead More


టీడీపీదే విజయం

తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఆంధ్రా ఆక్టోపస్ జోస్యం చెప్పారు. తన అంచనాల ప్రకారం 17వేల వరకూ మెజారిటీ రావచ్చన్నారు. అది మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. 20వేలకు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. ద్యాల ఉపఎన్నికల తర్వాత ఆయన ఓ సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించినట్టు కథనం. దాంతో ఇప్పుడు సర్వే స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఓటింగ్ శాతం పెరగడానికి కూడా ఆయన కారణాలు చెప్పారు. ఉపఎన్నికలే అయినప్పటికీ ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి అదే కారణమన్నారు. ఓటింగ్‌ శాతం పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందనడం సరికాదన్నారు. పోలింగ్‌ శాతం పెరిగినా.. టీడీపీ 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందని తెలిపారు. 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీRead More


నంద్యాలపై ఆధారపడి జనసేన భవిష్యత్

మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలైన స్నేహితుడని అందరికీ తెలుసు. కానీ ఆపదలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చి తాను తటస్థం అని ప్రకటించిన పవన్ కల్యాణ్ తీరు టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. నమ్మకమైన మిత్రుడిగా తాము బావిస్తే తమ ఆశలను నీరుగార్చేశారని ఆపార్టీ నేతలు తల్లడిల్లుతున్నారు. చివరి క్షణం వరకూ ఊరించి ఉసూరుమనిపించిన జనసేనాని వ్యవహారం వారికి మింగుడుపడడం లేదు. తాజాగా తెలుగుదేశం అనుకూల పత్రికల్లో పవన్ కి వ్యతిరేక వస్తున్న రాతలు, పలు టీవీ చానెళ్లలో జనసేన విధానం మీద వస్తున్న విమర్శల కూతలు గమనిస్తే పవన్ తీరుతో టీడీపీ చాలా అప్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి మూలస్తంభంగా ఉన్న పవన్ కల్యాణ్ , ఆతర్వాత తానేమీ టీడీపీకి బానిసను కాదని ప్రకటించారు. రాజధానిRead More


గందరగోళంలో తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అంతస్థిమితంగా ఉండలేకపోతోంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీ పరిస్థితి తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈలోగానే వచ్చి పడిన నంద్యాల ఉప ఎన్నికలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీని తీవ్రంగా కలచివేస్తున్నాయి. దాంతో టీడీపీ వ్యూహాకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. నంద్యాలలో గట్టెక్కడానికి ఆర్థిక దన్నునే ఆసరాగా తీసుకున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. అయినా అది ఏమేరకు ఫలిస్తుందో తెలియక తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ అనే పేరుతో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను బరిలో దింపితే ఆయన కొంపముంచారు. దురుసు ప్రవర్తనతో వివాదంలో ఇరుక్కున్నారు. డబ్బులు పంచుతూ దొరికిపోయి పెద్ద సమస్యకు కారణంగా మారబోతున్నారు. ఎన్నికల్లో డబ్బులు భారీగా పంచుతున్నారన్న ప్రతిపక్షం ఆరోపణలకు ఊతమిచ్చేలా ప్రవర్తించారు. దాంతో బాలయ్య ప్రచారం నంద్యాలలో టీడీపీకి మేలు కన్నా కీడు ఎక్కువ చేసిందనే వాదన వినిపిస్తోంది.Read More