mudragada

 
 

గేరు మార్చిన ముద్ర‌గ‌డ

mudragada-and-wife

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గేరు మార్చేశారు. గ‌డిచిన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ముద్ర‌గ‌డ మ‌రోసారి స‌మ‌ర‌సంకేతాలు ఇచ్చేశారు. గ‌తంలోనే ప్ర‌క‌టించిన రీతిలో మార్చి నెల వ‌ర‌కూ చూసి కార్యాచ‌ర‌ణ‌లోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న దానికి త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కాపు జేఏసీ స‌మావేశం ఏర్పాటు చేశారు. కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ముద్ర‌గ‌డ రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపించారు. ముఖ్యంగా టీడీపీని సాగ‌నంపేద్దాం అనే ప్ర‌క‌ట‌న ద్వారా చంద్ర‌బాబుని ఓడించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు మీద కాపుల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని తేల్చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కాపుల‌ను బీసీ ఎఫ్ లో చేరుస్తామ‌ని చెప్పిన హామీ కోసం రోడ్డెక్కెస్తామ‌ని తేల్చేశారు. త‌ద్వారా కాపులంతా చంద్ర‌బాబుని ఓడించాల‌నే సంకేతం ఇచ్చేశారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో కూడాRead More


జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు

mudragada pawan'

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌నే అర్థంలో కామెంట్ చేసిన ఆయ‌న తాజాగా జ‌న‌సేనానికి వంత పాడారు. ప‌వ‌న్ మాట‌లు అక్ష‌ర‌స‌త్య‌మ‌న్నారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థించారు. ముఖ్యంగా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ అవినీతి వ్య‌వ‌హారాల్లో ప‌వ‌న్ చెప్పిన మాట‌లు అక్ష‌రాలా నిజ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ మాట‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. గ‌డిచిన మూడేళ్లుగా ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడుతున్నారు. తొలుత ప‌వ‌న్ కూడా ఆయ‌న్ని స‌మ‌ర్థించ‌లేదు. కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 5శాతం రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించ‌గానే జ‌న‌సేనాని కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. విందు భోజ‌నం పెడ‌తామ‌ని పిలిచి, ఆవ‌కాయ బ‌ద్ధ‌తో పెడ‌తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగాRead More


మరో రాజకీయ పార్టీ ఆలోచనలో ముద్రగడ

harsha mudragada chintha mohan

రాష్ట్రంలో కాపులు, దళితులు మరో కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపుతోంది. కీలక పరిణామాలకు మూలంగా మారబోతోంది. సామాజిక సమీకరణాలతో రాజకీయ రంగం వేడెక్కబోతోంది. దాంతో ఇప్పుడు ముద్రగడ కొత్త వ్యూహం రాజకీయాల్లో మరోసారి కాక రాజేయబోతోంది. తాజాగా ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం దానికి కేంద్రం అయ్యింది. ఇంతవరకూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలను దళితులు వారి పేటల్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి భిన్నంగా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో కాపుల నివాస ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌, రాష్ట్ర మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్‌ ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెత్తందార్లుRead More


వ్యూహం మార్చేసిన ముద్రగడ

MUDRAGADA

ముద్రగడ మాట మార్చేశారా

mudragada

ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేత. ఏపీ రాజకీయాల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన నాయకుల్లో ఒకరు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కాపు సామాజికవర్గంలో ఇప్పుడు చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకతను రాజేయడంలో ముద్రగడ విజయవంతమయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో కాపులు దాదాపుగా టీడీపీకి దూరమయ్యారు. దాని ప్రభావం కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కనిపించే అవకాశం కొంతవరకూ ఉంది. వాస్తవానికి నంద్యాల ఫలితాల ప్రభావం లేకపోతే కాకినాడలో కాపులు టీడీపీకి కాక పుట్టించే వారే. కానీ నంద్యాల మూలంగా కాపులు కొంత చల్లబడ్డారు. ఇక తాజాగా ముద్రగడ అనుకున్నట్టుగానే పాదయాత్ర ప్రారంభించారు. కానీ అనూహ్యంగా విరమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ముప్పై ఐదు రోజుల పాటు పోలీసులను ఆయన ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు ఖాకీలు కాస్త ఏమరపాటు ప్రదర్శించగానే పాదయాత్ర ప్రారంభించేసిRead More


ముద్రగడకి పరీక్షగా మారిన కాకినాడ

mudragada-and-wife

నంద్యాల ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్టయ్యింది. అంచనాలు, జోస్యాలకు తోడు బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఇప్పుడు అందరి ద్రుష్టి కాకినాడ వైపు మళ్లింది. రాయలసీమ ఓటర్ల మనోగతం నంద్యాల వెల్లడిస్తే, కీలకమైన కోస్తా ప్రజల అభిప్రాయం కాకినాడలో బయటపడుతుందని భావిస్తున్నారు. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరుగుుతన్న ఎన్నికలు కావడంతో స్థానిక ఎన్నికలే అయినప్పటికీ అందరిలో ఆసక్తిని రాజేస్తున్నాయి. అయితే ఇప్పుడు కాకినాడ ఎన్నికలు అందరికన్నా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాబానికి కీలకంగా మారాయి. కాపులు కీలకంగా ఉన్న ప్రాంతంలో, అందులోనూ ఒకనాడు ముద్రగడ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇప్పుడు ముద్రగడ పాత్ర కీలకంగా మారింది. వాస్తవానికి కాపుల రిజర్వేషన్ల అంశంలో చంద్రబాబు హామీ అమలుకోరుతూ ముద్రగడ ఉద్యమం సాగిస్తున్నారు. మూడేళ్లుగా ఆయన విశ్రమించకRead More


చంద్ర‌బాబుకి గంటా ఝ‌ల‌క్..!

ganta babu

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. తాజాగా కాపుల వ్య‌వ‌హారాన్ని కొలిక్కి తీసుకొద్దామ‌ని భావిస్తున్న ఏపీ సీఎం కి ఆయ‌న స‌హాయ నిరాక‌ర‌ణ చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. విజ‌య‌వాడ‌లో కాపు నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి ఆయ‌న దూరంగా ఉండ‌డం విశేషంగా మారింది. ఏపీ క్యాబినెట్ లో న‌లుగురు కాపు మంత్రులున్నారు. కాగా వారిలో ఒక‌రు బీజేపీకి చెందిన మాణిక్యాల‌రావు. మిగిలిన ముగ్గురిలో ఒక‌రు డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప‌, మిగిలిన ఇద్ద‌రూ వియ్యంకుళ్లు నారాయ‌ణ‌, గంటా శ్రీనివాస‌రావు. వారంద‌రిలోనూ గంటానే సీనియ‌ర్ మంత్రి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం మీదు చంద్ర‌బాబు స‌మావేశానికి దూరంగా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు కాపుల విష‌యంలో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో కూడా ముద్ర‌గ‌డ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్Read More


కాపులు చ‌ల్లారతారా? కొత్త చిచ్చు రాజేస్తారా??

chandrababu-naidu-remembers-rela

కాపు ఉద్య‌మం కొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఏపీలో చంద్ర‌బాబు నిర్ణ‌యంతో కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం కొలిక్కి వ‌స్తుంద‌ని కాపుల్లోని ఓ వ‌ర్గం భావిస్తోంది. మ‌రోవైపు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు లేని నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు సాగుతున్న ప్ర‌చారంతో ఉద్య‌మ‌కారులు మాత్రం వ్య‌తిరేక‌త చూపుతున్నారు. దాంతో ఇప్ప‌టికే కాపుల్లో పెరిగిన అసంతృప్తిని చ‌ల్లార్చాల‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నం ఫ‌లితాన్నిస్తుందా లేక వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్క‌ని ప‌రిస్థితి తెస్తుందా అన్న సందేహంగా మారింది. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం మూడేళ్లుగా ఏపీలో పెనువివాదంగా ఉంది. ఓ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు మాదిరిగా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. నిర‌వ‌ధిక పాద‌యాత్ర‌కు పిలుపునిచ్చి ప్ర‌తీరోజు ఆయ‌న ఇంటి ముందు కిర్లంపూడిలో హంగామా చేస్తున్నారు. పోలీసులు ప‌దే ప‌దే అడ్డుకుంటున్నా ఆయ‌న ప్ర‌య‌త్నాలు వీడ‌డం లేదు. దాంతో కాపులు ప‌లు చోట్ల ఆయ‌న‌కు సంఘీభావంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.Read More


నంద్యాల ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ …!

mudragada-and-wife

పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డంతో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ర‌గిలిపోతున్నారు. కాపు జాతిని అణ‌చివేస్తున్నారంటూ చంద్ర‌బాబు మీద విరుచుకుప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఆయ‌న దూకుడు పెంచారు. 2019లో చంద్ర‌బాబుకి ముగింపు ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. దానికితోడుగా అధికారంలో క‌ల‌క‌లం ఉంటార‌ని కోమాలో ఉండి భావిస్తున్న‌ట్టు విమ‌ర్శించారు. పోలీసుల‌ను కూడా హెచ్చరించారు. 2019లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓట‌మి ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు తొత్తులుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ మీద ఆయ‌న లేఖాస్త్రాలు సంధించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చంద్ర‌బాబుకి ప‌దుల సంఖ్య‌లో లేఖ‌లు రాశారు. ఆత‌ర్వాత కేసీఆర్ కి కితాబునిస్తూ లేఖ‌రాశారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ కు హెచ్చ‌రిక‌లు చేస్తూ బాబు వ‌ల‌లో ప‌డొద్ద‌నే సూచ‌న‌ల‌తో లేఖ రాశారు. ఆ క్ర‌మంలోనే తాజాగా ముద్ర‌గ‌డ క‌న్ను నంద్యాల ఎన్నిక‌ల మీద ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌వ‌న్ తోRead More


బాబు మాట‌ను ఖాత‌రు చేయ‌ని టీడీపీ ఎమ్మెల్యే

thota trimurtulu

ఆశ్చ‌ర్య‌మే అయినా అధినేత తీరుతో ఆ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. నేత‌లంతా ఆ ప‌నిలో ఉండాల‌ని ఆదేశించినా ఈ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ఓవైపు కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఉప‌యోగించుకుని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌భుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు. చంద్ర‌బాబుని ఇర‌కాటంలో పెడుతున్నారు. దాంతో టీడీపీ నేత‌ల‌కు పెద్ద తల‌నొప్పిగా మారుతోంది. చివ‌ర‌కు టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న త‌మ సామాజిక‌వ‌ర్గ నేత ఇంటిని కూడా కాపులు ముట్ట‌డించారు. స‌లాది రామ‌కృష్ణ‌లాంటి మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు మాత్రం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌క‌పోతే టీడీపీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చ‌రించారు. ఇలా టీడీపీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో కూడా ఆ ఎమ్మెల్యే పెద‌వి విప్ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అందులోనూ గ‌తంలో ముద్ర‌గ‌డ ఉద్య‌మాల స‌మ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, రాయ‌బారాలు కూడా న‌డిపిన తోట త్రిమూర్తులు ఇప్పుడుRead More