Main Menu

modi

 
 

మోడీకి మూఢిన‌ట్టేనా..!

ప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రు చేయాల్సిన అవ‌స‌రం రాలేదు. ఆ త‌ర్వాత బీహార్ లో భారీ ఆశ‌లు నీరుగారినా ఇబ్బంది ప‌డ‌లేదు. ఉప ఎన్నిక‌ల ఓట‌ములు కూడా క‌ష్టంగా క‌నిపించ‌లేదు. క‌ర్ణాట‌క‌లో ఖంగుతిన్న‌ప్ప‌టికీ ఖాత‌రు చేయ‌లేదు. కానీ సెమీఫైన‌ల్స్ గా భావించిన చోట క‌మ‌లం కుదేలుకావ‌డంతో ఆ క్యాంపులో క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా మోడీ కి 2014 ఎన్నిక‌ల‌కు ముందు శుభారంభం ప‌లికిన రాష్ట్రాల్లో ఈసారి ఓట‌మి పాలుకావ‌డం క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేస్తోంది. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. బీజేపీకి సింపుల్ మెజార్టీతో అధికార పీఠం అందించిన ఉత్త‌రాది గాలి వ్య‌తిరేకంగా వీస్తుండ‌డ‌మే దానికి కార‌ణం. మందిరం వివాదం మ‌ళ్లీ రాజుకున్న వేళ‌, మోడీ తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు తిరిగి ప్ర‌సారం నిర్వ‌హించినRead More


మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

సెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్ త‌గిలింది. ఎన్డీయే నుంచి మ‌రో పార్టీ చేజారిపోయింది దాంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. బీహార్ రాజ‌కీయాల్లో మార్పుల‌కు సంకేతంగా భావిస్తున్నారు. ప్రధాని మోడీకి ఇది మరో షాక్ అని భావిస్తున్నారు. ఆయన మంత్రి వర్గంలో. మాన‌వ వ‌న‌రుల శాఖ కేంద్ర స‌హాయ మంత్రిగా ఉన్న‌ ఉపేంద్ర కుష్వాహ్ మంత్రి వదవి నుంచి త‌ప్పుకున్నారు. బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీకి చెందిన ఆయ‌న‌.. గత కొన్నాళ్లుగా మోడీ ప్రభుత్వ వ్యవ‌హార‌శైలిపై ఆగ్రహంతో ఉన్నారు. వ‌చ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. త‌మ పార్టీతో సీట్ల పంప‌కం స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. అయిదేళ్ల క్రితం ఎన్డీఏలో క‌లిశామ‌ని, ఎన్నో ఆశ‌ల‌తో చేరామ‌ని తెలిపారు. బీహార్ ప్రజ‌ల‌కు ఎన్నోRead More


యూపీలో బీజేపీకి ఝ‌ల‌క్

బీజేపీకి ఉత్త‌రాదిలో ఎదురుదెబ్బ‌లు త‌ప్పేలా లేవు. రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాజ‌స్తాన్ లో ఆ పార్టీ ఓట‌మి అంచున ఉంది. ఇక తాజాగా త‌న‌కు అధికారం ద‌క్క‌డానికి మూల‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కూడా ఝ‌ల‌క్ త‌గిలింది. ఇప్ప‌టికే బీఎస్పీ, ఎస్పీతో కలిసి క‌మ‌లంలో క‌ల‌వ‌రం పుట్టిస్తోంది.అందుకు తోడుగా సొంత గూటిలోనే లుక‌లుక‌లు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ గానే భావించ‌వ‌చ్చు. దళిత నాయకురాలు, న్యాయవాది, ఎంపీ సావిత్రి బాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దేశ బడ్జెట్‌ను విగ్రహాలను నెలకొల్పడానికే ఖర్చుచేస్తోందని విమర్శించారు. గత కొంతRead More


ఫేస్ బుక్ చుట్టూ రాజ‌కీయ‌ ప్ర‌కంప‌న‌లు

ఫేస్ బుక్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అధికార పార్టీకి అండ‌గా ఉంటూ, అనేక స‌మ‌స్య‌ల‌కు ఫేస్ బుక్ కార‌ణం అవుతోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ తీరు మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తో చివ‌ర‌కు ఆ సంస్థ సీఈవో వైదొల‌గాల‌నే డిమాండ్ ముందుకొస్తోంది. ఈ ప‌రిణామాల‌తో ఫేస్ బుక్ యాజ‌మాన్య వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. అదే స‌మ‌యంలో సుమారు 22 కోట్ల మంది వినియోగ‌దారులున్న ఇండియాలో ఫేస్ బుక్ తీరుపై ది వైర్ సంస్థ స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేసింది. ఫేస్‌బుక్‌ వ్యవహార శైలిపై ది వైర్‌ ఈ ఏడాది జూన్‌ నుంచి ఐదు నివేదికలు తయారు చేసింది. దేశవ్యాప్తంగా 50 మందితో ఫేస్‌బుక్‌ తీరుపై పరిశోధన జరిపించింది. అందులోని మొదటి నివేదికను ది వైర్‌ దేశ ప్రజల ముందుంచింది. ది వైర్‌ పరిశోధనలో తేలిందేమంటే..భారత్‌లో పనిRead More


మోడీ మళ్లీ గెలుస్తారా?: పీకే ఏమన్నారంటే!

దేశంలో ఎన్నికల ఫలితాలపై సర్వే బ్రుందాలకు ప్రాధాన్యత పెరగింది. గడిచిన ఎన్నికల్లో మోడీ విజయానికి ప్రశాంత్ కిషోర్ చేసిన క్రుషి కూడా బాగా తోడ్పడిందన్నది అందరికీ తెలిసిన విషయం. అయితే వచ్చే 2019 ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. మోడీ భవితవ్యం గురించి ప్రస్తుతం జేడీయూలో చేరిన పీకే కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. జేడీయూ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం కూడా కావడం విశేషం. మోడీ మిత్రపక్ష నేతగా ప్రశాంత్ కిషోర్ జోస్యం బీజేపీ శ్రేణులకు మింగుడుపడకుండా తయారయ్యింది. దేశంలో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీయే జనాదరణ కలిగిన నాయకుడని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అయినప్పటికీ 2014 లోక్‌సభ ఎన్నికల స్థాయి ఫలితాలు పునరావృతం కావడం అసాధ్యమని పీకే తేల్చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 272 సీట్లు రావడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘విపక్షంRead More


సీఎం ర‌మేష్ ఎదుగుద‌ల‌లో ఆయ‌న పాత్ర ఎంత‌?

ఓ సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన సీఎం ర‌మేష్ అసాధార‌ణంగా ఎదిగారు. ఏపీలోని కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా మారారు. చంద్ర‌బాబుకి అత్యంత స‌న్నిహితుడు కాగ‌లిగారు. అనేక ర‌కాల ప్ర‌య‌త్నాల త‌ర్వాత కాంట్రాక్ట‌ర్ అవ‌తారం ఎత్తి అమాంతంగా ఎదిగారు. రాజ‌కీయాల్లో కూడా అదే స్థాయిలో ప‌దేళ్ల‌లోనే దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్య‌త గ‌డించారు. తాజాగా ఐటీ దాడుల‌తో ఆయ‌న పేరు మ‌రోసారి మారుమ్రోగుతోంది. ఆయ‌న సంస్థ‌ల మీద‌, ఇళ్ల మీద సాగుతున్న దాడుల‌తో పెద్ద చ‌ర్చ మొద‌ల‌వుతోంది. వాస్త‌వానికి సీఎం ర‌మేష్ స్వ‌ల్ప‌కాలంలో సాధించిన అబివృద్ధి వెనుక చంద్ర‌బాబు చేదోడుతో పాటు మాజీ సీఎం వైఎస్ స‌హ‌కారం కూడా ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అయినా వైఎస్ వ్య‌తిరేక పార్టీలో ఉన్నారు కాబ‌ట్టి, ర‌మేష్ స‌క్సెస్ లో వైఎస్ పాత్ర‌ను చాలామంది ప‌ట్టించుకోరు. కానీ వాస్త‌వానికి సీఎం ర‌మేష్ కి 2004-09 మ‌ధ్య‌లోRead More


ఐటీ ఉచ్చులో సీఎం!

ఏపీలో ప‌రిణామాలు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నా్యి. ముఖ్యంగా ఇన్ క‌మ్ ట్యాక్స్ అధికారుల దూకుడు అల‌జ‌డి రేపుతోంది. ముఖ్యంగా అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ నేత‌ల మీద వ‌రుస దాడుల‌తో ఆపార్టీ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. ఇక తాజాగా వ్య‌వ‌హారం నేరుగా సీఎం ర‌మేష్ వ‌ర‌కూ వ‌చ్చేసింది. టీడీపీలో కీల‌క‌నేత‌గా ఉన్న సీఎం ర‌మేష్ చాలాకాలంగా చంద్ర‌బాబుకి స‌న్నిహితుడు. ముఖ్యంగా టీడీపీ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో సుజ‌నా, సీఎం ర‌మేష్ ల‌దే చాలాకాలంగా ముఖ్య‌పాత్ర అని ప్ర‌చారంలో ఉంది. ఇప్పుడు చంద్ర‌బాబు స‌న్నిహిత సీఎం ర‌మేష్ ఇళ్లు, ఆఫీసులు ఇత‌ర చోట్ల ఐటీ దాడులు ఆస‌క్తిరేపుతున్నాయి. పైగా తోపుదుర్తిలో సీఎం ర‌మేష్ ఇంటిముందు ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌న‌కు దిగ‌డం, ఐటీ అధికారులు, మోడీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం విశేషంగా మారింది. ఐటీ దాడుల‌ను నేరుగా రాజ‌కీయ కోణంలోనే టీడీపీRead More


బాబుని మోడీ ఏమీ చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం అత‌డే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల పూర్తి అభ‌ద్ర‌తా భావంతో క‌నిపిస్తున్నారు. ఎక్క‌డ చీమ చిటుక్కు మ‌న్నా త‌న‌కోస‌మే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రో వ్యాపార‌వేత్త‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులు జ‌రిగితే ఏకంగా క్యాబినెట్ లో చ‌ర్చించిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. తెలంగాణాలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం త‌న కొంప‌మీద‌కు వ‌స్తుంద‌నే క‌ల‌వ‌రం చంద్ర‌బాబులో క‌నిపిస్తోంది. తాజా ప‌రిణామాల‌న్నీ క‌లిసి చివ‌ర‌కు త‌న మెడ‌కు చుట్టుకునేలా ఉన్నాయ‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ధ‌ర్మాబాద్ కోర్ట్ నోటీసులు, ఆ వెంట‌నే ఐటీ దాడులు, మ‌ధ్య‌లో ఐటీ శాఖ‌లో అవినీతిపై ప్ర‌జాప్ర‌యోజ‌నాల వ్యాజ్యం ఇలా వ‌రుస‌గా చంద్ర‌బాబుని ప‌లు అంశాలు చికాకు ప‌రుస్తున్నాయి. స‌మ‌స్య‌ల్లోకి నెడుతాయ‌నే ప్ర‌చారం సాగ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే చంద్ర‌బాబు స్పందించ‌డంతో ఏదో జ‌రుగుతోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. పైగా ఆప‌రేష‌న్ గ‌రుడ అనే పేరుతో సాగిన ప్ర‌చారం కూడా చివ‌ర‌కుRead More


మోడీ పాల‌న‌లో నిందితుల‌కు న‌యా పాల‌సీ!

కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త ట్రెండ్ అమ‌లవుతోంది. వ‌రుస‌గా ప‌లువురు నేత‌లు దేశంలో ఆర్థిక‌నేరాల‌కు పాల్ప‌డి, ద‌ర్జాగా దేశం దాటిపోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. ల‌లిత్ మోడీ నుంచి మొద‌లు పెడితే విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోడీ లాంటి వ్య‌వ‌హారాలు దేశ‌మంతా సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా అదే జాబితాలో మ‌రో వ్య‌వ‌హారం చేరింది. ఈసారి దేశానికి క‌లిగిన న‌ష్టం 5వేల కోట్లు ద‌ర్జాగా బ్యాంకుల‌ను ముంచేసి, నైజీరియాకు చెక్కేసిన ఈ తాజా నిందితుడి వ్య‌వ‌హారం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టికే నీరవ్ క‌థ జ‌నం మ‌ర‌చిపోలేదు. విజ‌య్ మాల్యా నిత్యం మ‌న వ్య‌వ‌స్థ‌ల వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెడుతూనే ఉన్నారు పైగా అరుణ్ జైట్లీకి చెప్పి తాను లండ‌న్ వ‌చ్చేశానంటూ ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు. ఇక వారికి తోడుగా ఫార్మా దిగ్గజం నితిన్‌ సందేసర రూ 5000 కోట్ల అక్రమRead More


అమాంతంగా పెరిగిన మోడీ ఆస్తులు

ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఆస్తులు అమాంతంగా పెరిగాయి. ఓవైపు నోట్ల‌ర‌ద్దు త‌ర్వాత 35ల‌క్ష‌ల మంది ఉపాధి కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్న త‌రుణంలో మోడీ ఆస్తుల పెరుగుద‌ల ఆశ్చ‌ర్యంగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గ‌త ఏడాదితో పోల్చితే ప్ర‌ధాని మోడీ ఆస్తుల్లో పెరుగుద‌ల చ‌ర్చ‌కు ఆస్కారం ఇస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోడీ స్థిరచరాస్తులు పెరిగాయి. ఆయన బ్యాంక్‌ ఖాతాలో నగదు నిల్వ అమాంతం 8రేట్లు పెరిగింది. గాంధీనగర్‌(గుజరాత్‌)లోని ఎస్‌బీఐ పొదుపు ఖాతాలో నగదు నిల్వ రూ.1.33 లక్షల నుంచి రూ.11.2లక్షలకు చేరుకుంది. అలాగే రూ.90లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.కోటీ 7లక్షలకు చేరుకుంది. గ‌త ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖకు ప్రధాని మోడీ సమర్పించిన ఆదాయ వివరాల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా మీడియాకు విడుదల చేసింది. అంతకుముందు (2016-17) ఆర్థిక సంవత్సరంలో మోడీ వద్దRead More