Main Menu

mlc

 
 

జ‌గ‌న్ కి, బాబుకి తేడా లేన‌ట్టేనా?

సందేహం తీరిపోయింది. జ‌గ‌న్ హూందాత‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫిరాయింపుల విష‌యంలో గ‌తంలో తాను చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిని రాజీనామా చేయాల‌ని ఆదేశించ‌డం ఆశావాహంగా క‌నిపిస్తోంది. ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ జంప్ అయ్యేముందు విలువ‌ల‌కు కొంతైనా క‌ట్టుబ‌డి ఉండేలా జ‌గ‌న్ నిర్ణ‌యం దోహ‌దప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌ల పార్టీ ఫిరాయింపుల‌కు సంబంధించిన పెద్ద చ‌ర్చ సాగింది. వైసీపీ త‌రుపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. చివ‌ర‌కు కోర్టులో కూడా జోక్యం చేసుకున్నాయి. న‌లుగురు ఫిరాయింపు మంత్రుల‌కు నోటీసులు కూడా అందాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నేత‌లు త‌మ పార్టీలో గెలిచిన వారంద‌రినీ రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలంటూ అనేక మార్లు డిమాండ్ చేశారు. జ‌గ‌న్ కూడా ప‌దే ప‌దే ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. కానీRead More


నంద్యాల టీడీపీకి షాక్: వైసీపీలోకి ఎమ్మెల్సీ?

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. ప‌లువురు నేత‌లు వైసీపీ వైపు క్యూ క‌డుతుండ‌డంతో టీడీపీ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఇటీవ‌ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే త‌న‌యుల‌తో క‌లిసి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మునిసిప‌ల్ కౌన్సిల‌ర్ గోడ‌దూకేశారు. ఇక ఈనెల 3న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నలో వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి ఎమ్మెల్సీ సిద్ధ‌ప‌డుతున్నార‌నే వార్త‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. తెలుగుదేశం నేత‌ల్లో గంద‌ర‌గోళం పెంచుతున్నాయి. శిల్పా బ్ర‌ద‌ర్స్ విడ‌దీయ‌లేనిది. సుదీర్ఘ‌కాలంగా క‌లిసే సాగారు. కానీ కొద్దిరోజుల క్రితం శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి మాత్రం తాను టీడీపీలోనేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మూడు నెల‌ల క్రిత‌మే జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటాలో వైసీపీ అభ్య‌ర్థి గౌరు వెంక‌ట‌రెడ్డిని ఆయ‌న ఓడించిన సంగ‌తి తెలిసిందే. అయితేRead More


సీఎం సాక్షిగా శిల్పాకి అవ‌మానం..!

ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో నంద్యాల కోసం చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఏదో ర‌కంగా గ‌ట్టెక్కే యోచ‌న‌లో ఉన్నారు. అందుకోసం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇద్ద‌రు మంత్రుల‌ను ప్ర‌త్యేకంగా ఇప్ప‌టికే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వారికితోడుగా ఇప్పుడు నేరుగా సీఎం రంగంలో దిగారు. ఇఫ్తార్ విందు పేరుతో టీడీపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ముస్లీం పెద్ద‌లు త‌మ గోడును చంద్ర‌బాబు ముందు చెప్పినా పెద్ద‌గా స్పందించిన‌ట్టుగా లేదు. ముఖ్యంగా మైనార్టీ నేత ఎన్ఎండీ ఫరూఖ్ కి మండ‌లి చైర్మ‌న్ గిరీ అప్ప‌గించాల‌ని వారంతా కోరినా చంద్ర‌బాబు స్పందించ‌లేదు. ఇక అదే స‌మ‌యంలో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి సీఎం టూర్ లో అవ‌మానం జ‌రిగింద‌ని ఆయ‌న అనుచ‌రులు వాపోతున్నారు. అధికారిక ప‌ర్య‌ట‌న అంతా అఖిల ప్రియ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగ‌డంతో శిల్పాకి చాన్స్ లేకుండా పోయింద‌ని చెబుతున్నారు. ప్రోటోకాల్ ప్ర‌కారంRead More


జ‌గ‌న్ కి పాఠం నేర్పిన జ‌నం..!

ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంది. దాదాపుగా అన్ని వ‌ర్గాలు ఆశించిన దానికి భిన్నంగా ప్ర‌భుత్వ తీరు క‌నిపిస్తోంది. రైతాంగం నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర‌కూ అంద‌రిలోనూ అసంతృప్తి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలున్నాయి. విద్యావంతులు, ఉపాధ్యాయులు క‌లిసి పాల‌ప‌క్షాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఐదు చోట్ల ఎన్నిక‌లు జ‌రిగితే నాలుగు స్థానాల‌లో చిత్తు చేశారు. కానీ తాజాగా కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో 37 వార్డులు, డివిజన్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 37 స్థానాలకు గాను 21 స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తంగా టిడిపి 34, వైసీసీ కేవ‌లం రెండు స్థానాల్లో గెలవగా ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. మంగళగిరి, రాయచోటి మున్సిపాల్టీలో మాత్ర‌మే వైసీపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. హిందుపురం,Read More


ఎమ్మెల్సీ లోకేష్

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఎమ్మెల్సీగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించారు. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటాలో నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌న రాజ‌కీయ జీవితంలో మ‌రో మెట్టు ఎక్కిన‌ట్ట‌య్యింది. తొలిసారిగా చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగుపెట్టారు. పెద్ద‌ల స‌భ‌లో చిన‌బాబు ఎంట్రీ ఇచ్చిన‌ట్ట‌య్యింది. ఈ సంద‌ర్భంగా అల్లుడు లోకేష్ ను హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ స‌హా ప‌లువురు అభినందించారు. ఛైర్మన్‌ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్‌ని బాల‌య్య ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు.వ‌చ్చే వారంలో లోకేష్ అమాత్య హోదా ద‌క్కించుకోబోతున్న నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ జీవితం కీల‌క‌మ‌లుపు తిర‌గుతున్న‌ట్టవుతోంది. నారా లోకేష్ తో పాటు మ‌రో 13 మంది నూత‌న ఎమ్మెల్సీలు ప్ర‌మాణాలు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్సీ లంతాRead More


టీడీపీ ఎమ్మెల్సీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ శాస‌న‌మండ‌లిలో టీడీపీ ఎమ్మెల్సీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కామెంట్స్ తో మండ‌లిలో కాక పుట్టింది. విప‌క్ష స‌భ్యులంతా తీవ్రంగా మండిప‌డ్డారు. నిర‌స‌న‌ల‌కు దిగారు. దాంతో మండ‌లిలో క‌ల‌క‌లం రేగింది. గంద‌ర‌గోళంగా మారింది. మండ‌లిలో టీడీపీ ఎమ్మెల్సీ ద్వార‌పురెడ్డి జ‌గ‌దీష్ మాట్లాడుతూ కుటుంబం ఎవ‌రు చ‌నిపోయినా ఆయ‌న కుటుంబంలో ఎవ‌రు బాధ‌ప‌డ‌డం లేద‌ని తెలిపారు. చంద్ర‌న్న బీమా ఉండ‌డంతో కుటుంబం సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించ‌డం వివాదానాకి కార‌ణ‌మ‌య్యింది. కుటుంబంలో ఎవ‌రు చనిపోయినా అంతా సంతోషంగా ఉంటున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించ‌డంపై మిగిలిన ఎమ్మెల్సీలంతా మండిప‌డ్డారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ స‌హా ఎమ్మెల్సీంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు. జ‌గ‌దీష్ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.


బీజేపీ దూకుడు- టీడీపీలో క‌ల‌వ‌రం

తెలుగుదేశం పార్టీ నేత‌ల స‌హ‌కారం లేదు. పైగా రాష్ట్ర‌మంతా ప్ర‌తికూల ప‌రిస్థితులున్న‌ట్టు సాగిన ప్రాచారం తోడ‌య్యింది. అయినా ఆటంకాలు అధిగ‌మించిన క‌మ‌లం శాస‌న‌మండ‌లిలో ప్ర‌వేశానికి అర్హ‌త సాధించింది. నామినేటెడ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు త‌ర్వాత రెండో ఎమ్మెల్సీగా మాధ‌వ్ మండ‌లిలో అడుగు పెడుతున్నారు. ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి క‌మ‌లం విజ‌య ఢంకా మోగించ‌డంతో కాషాయి ద‌ళం క‌ద‌న కుతూహాలం ప్ర‌ద‌ర్శిస్తోంది. దాంతో బీజేపీ దూకుడుతో మిత్ర‌ప‌క్షం టీడీపీకి క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ సంబంధాలు అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. బీజేపీలోని ఒక వ‌ర్గం టీడీపీతో సంబంధాల‌పై సీరియ‌స్ గానే ఉంది. సోము వీర్రాజు, పురందేశ్వ‌రి వంటి వారు నిత్యం టీడీపీ తీరును త‌ప్పుబ‌డుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ అధిష్టానంలో వెంక‌య్య వంటి వారు న‌డుపుతున్న మంత్రాంగం మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య స‌యోధ్య‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాRead More


మంత్రి నారాయ‌ణ‌కు సామాన్యుడు ఝ‌ల‌క్

మంత్రి నారాయ‌ణ‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న క‌ల‌లు పండ‌లేదు. ఆయ‌న స‌మీప బంధువులు ప‌రాజ‌యం పాలుకావ‌డం ఆయ‌న‌కు కోలుకోలేని అంశంగా మారింది. అది కూడా ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లాలో కావ‌డంతో మ‌రింత ఆస‌క్తి రేపుతోంది. సామాన్యుడి చేతిలో కార్పోరేట్ విద్యాసంస్థ‌ల య‌జ‌మానులు ఓడిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. చిత్తూరు-నెల్లూరు-ప్ర‌కాశం జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి పాల‌యిన నారాయ‌ణ మంత్రాంగం చివ‌ర‌కు గ్రాడ్యుయేట్స్ స్థానంలో నారాయ‌ణ సంస్థ‌ల సీఈవో ఓడిపోవ‌డంతో ఖంగుతినాల్సి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి సిట్టింగ్స్ ఎమ్మెల్సీ యండ‌ప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి రెండో సారి జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. ఇక్క‌డ గెలుపుకోసం నారాయ‌ణ సర్వ‌శ‌క్తులు ఒడ్డారు. భారీగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డారు. ఈసీ నోటీసులు కూడా అందుకున్నారు. అయినా ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డంతో దిగాలు చెందిన‌ట్టు క‌నిపిస్తోంది. మొద‌టి ప్రాధాన్య‌తా ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే స‌రికి యండ‌ప‌ల్లికి 64వేల‌కు పైగాRead More


ఆస్తుల ప్ర‌క‌ట‌న‌పై చ‌ర్చ‌కు సిద్ధం..!

త‌న ఆస్తుల విష‌యంలో విప‌క్షం ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి పట్టిస్తోందని ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. నామినేష‌న్ ప‌త్రాల‌లో తాను వెల్ల‌డించిన ఆస్తుల వివరాల‌న్నీ ఈసీ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఉన్నాయ‌న్నారు. మార్కెట్ రేట్ ప్ర‌కార‌మే ఆస్తులు వెల్ల‌డించాల‌ని ఈసీ పేర్కొన్న విష‌యం విస్మ‌రించి వైఎస్సార్సీపీ కావాల‌నే బుర‌ద‌జ‌ల్లుతోంద‌న్నారు. ఆస్తుల‌ను స్వ‌శ్చందంగా వెల్ల‌డించే కుటుంబం మాద‌ని లోకేష్ పేర్కొన్నారు. 12 కేసుల్లో నిందితుడుగా ఉన్న జ‌గ‌న్ ఎప్పుడైనా త‌న ఆస్తులు ప్ర‌క‌టించారా అని లోకేష్ ప్ర‌శ్నించారు. త‌న ఆస్తు ల విష‌యంలో ఎవ‌రితోనైనా తాను చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని లోకేష ప్ర‌క‌టించారు. గ‌త కొన్నేళ్లుగా తాను ప్ర‌క‌టిస్తున్న ఆస్తుల విలువ ప్ర‌కారం హెరిటేజ్ లో 1993 నాటి షేర్ వాల్యూ ప్ర‌కారం చెప్పిన‌ట్టు లోకేష్ వివ‌రించారు. అందుకే ఎన్నోరెట్ల‌కు హెరిటేజ్ షేర్ వాల్యూ పెర‌గ‌డంతో దానికి అనుగుణంగా త‌న ఆస్తులు పెరిగియాన్నారు.Read More


లోకేష్ కి షాక్ త‌ప్ప‌దా..?

ఏపీ రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. అంతా సాఫీగా సాగిపోతుంద‌ని భావించిన పాల‌క‌ప‌క్షాన్ని ఇర‌కాటంలో నెడుతున్నాయి. వ‌రుస ప‌రిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. పార్టీ అధినేత‌కే అత్యున్న‌త కోర్ట్ ఆదేశాలు మింగుడుప‌డ‌డం లేదు. ప‌లువురు నేత‌లు కూడా వ‌రుస‌గా న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డుతున్నారు. దానికితోడుగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కార‌ణంగా పార్టీలో అసంతృప్తులు పెల్లుబికుతున్నాయి. అదుపు చేయ‌డం కూడా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌క‌పోవ‌డంతో స‌త‌మ‌తం కావాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో త‌ల‌నొప్పిని నెత్తిన నెట్టుకోవ‌డానికి చంద్ర‌బాబు సిద్ధంగా లేర‌ని స‌మాచారం. చివ‌ర‌కు చంద్ర‌బాబు ఆలోచ‌న‌తో చిన‌బాబుకి షాక్ త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌తో ఏపీలో 13 జిల్లాల‌కు గాను ఏడెనిమిది జిల్లాల్లో అసంతృప్తులు హ‌ద్దులు దాటుతాయ‌నే అనుమానాలు క‌నిపిస్తున్నాయి. అనంత‌పురంలో దీప‌క్ రెడ్డిని ఎంపిక చేయ‌డంతో జేసీ వ్య‌తిరేక వ‌ర్గానికి చెందిన వారంతాRead More