megastar

 
 

మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…

chiru saira

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. ఇప్ప‌టికే చాలా ఆల‌శ్యం అయ్యింది. తొలి షెడ్యూల్ మాత్ర‌మే పూర్తి చేసుకోగ‌లిగింది. రెండో షెడ్యూల్ కోసం చైనా, దుబాయ్ స‌హా ప‌లు ప్రాంతాలు ప‌రిశీలించారు. కానీ చివ‌ర‌కు మ‌ళ్లీ హైద‌రాబాద్ లోనే చిత్రీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యానికి చిరంజీవి సై అన‌డంతో ఈనెల 23 నుంచి రెండో షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభం కాబోతోంది. కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారు. షూటింగ్ ఆల‌శ్య‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇక‌పై షూటింగ్ వేగ‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ షెడ్యూల్‌లోనే చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న బిగ్ బి అమితాబ్, నయనతార కి సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌బోతున్నారు. అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత భారీRead More


చిరంజీవి ఇంకా నెల ఉంది…

chiru saira

రీ ఎంట్రీతో గ్రాండ్ కొట్టిన టాలీవుడ్ మెగాస్టార్ ఇప్పుడు తదుపరి సినిమా మీద ద్రుష్టి పెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22 నాడు లాంఛనంగా ప్రారంభమయిన సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం రంగం సిద్ధమయ్యింది. అది కూడా చారిత్రక చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి మాత్రం ఇంకా నెల సమయం పడుతుందని ప్రచారం సాగుతోంది. తెల్లదొరకలపై పోరాటం చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధునిగా చరిత్ర కెక్కిన ఉయ్యాడవాడ నరసింహారెడ్డి జీవితకథ ‘సైరా’ పేరుతో, రూ. 150 కోట్ల వ్యయంతో తెరకు ఎక్కుతున్న విషయం విదితమే. మెగాస్టార్‌ చిరంజీవి 151 చిత్రమిది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న లాంఛనంగా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు మెగా త నయుడు రాంచరణ్‌. అప్పటినుంచీ దీనికి సంబంధించిన ప్రీRead More


చెర్రీని ఆనందంగా ఉంచచుతానని చిరుకి మాటిచ్చింది

cherry upasana

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాలలోనూ సందడి కనిపిస్తోంది. అభిమానులు ఉత్సాహంగా బర్త్ డే సంబరాలు చేస్తున్నారు. అందులో భాగంగా చిరంజీవికి సొంత ఇంటి నుంచి అనూహ్యమైన బహుమతి లభించింది. అది కూడా కోడలు ఉపాసన నుంచి కావడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా ఆయన కోడలు ఉపాసన కామినేని ఆయనకు ఓ ప్రామిస్‌ చేశారు. చిరంజీవి త‌న‌కు ఇచ్చిన అతిపెద్ద బ‌హుమ‌తి రామ్ చ‌ర‌ణ్ అని, అత‌నితో పాటు కుటుంబాన్నంత‌టినీ ఎల్ల‌వేళ‌లా సంతోషంగా ఉంచ‌డానికి తాను ప్ర‌య‌త్నిస్తానని మామ‌య్య‌కు ప్రామిస్ చేసిన‌ట్లు ఉపాస‌న తెలిపారు. ఈ ప్రామిస్‌ను నిలుపుకోవ‌డం ఒక అంద‌మైన బాధ్య‌త అని ఆమె అన్నారు. చిరంజీవికి తానంటే ఎంతో న‌మ్మ‌క‌మ‌ని, తాను చేసిన ప్ర‌తి ప‌నిని ఆయ‌న పొగడుతార‌ని, ఇంకా బాగా చేయాల‌ని ప్రోత్స‌హిస్తారని ఉపాస‌న చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చ‌ర‌ణ్‌కిRead More


ముగ్గురు భామ‌ల‌తో మెగాస్టార్

chiranjeevi

తన 150వ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన 151వ చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ పూర్తికావచ్చింది. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ముగ్గురిలో అనుష్క, నయనతార, ఐశ్వర్యారాయ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటకే అనుష్కతో మంతనాలు జరిపారని, ఈ సినిమా చేయడానికి ఆమె సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార, ఐశ్వర్యలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని దాదాపు 150Read More


నానికి న్యాయం చేసిన చిరంజీవి

nani

ఈ మధ్య ‘చిరంజీవి’పై ‘నాని’ చేసిన పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ‘చిరంజీవి’ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఆయన కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో వరుస విజయాలతో ‘నాని’ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. అసలు ‘నాని’కి ‘చిరు’ ఏ మాట ఇచ్చాడనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా ‘నాని’ మరో ట్వీట్ చేశాడు. ‘చిరు’ మాట నిలబెట్టుకున్నారని ట్వీట్ చేశారు. చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు ‘నాని’ ఇటీవలే వెళ్లాడు. ‘మాస్టర్’ సినిమాకు తాను సైకిల్ పై వెళ్లడం జరిగిందని, కానీ టికెట్ దొరికిన ఆనందంలో తన సైకిల్ ను మరిచిపోయాయని ‘నాని’ ఆ షోలో పేర్కొన్నాడు. షో లో గెలుచుకున్న డబ్బుతో ఓ కొత్త సైకిల్ కొనుక్కుంటానని ‘నాని’ పేర్కొన్నాడు. తాను నటించిన సినిమా చూసేందుకుRead More


నేష‌న‌ల్ అవార్డ్ రేసులో చిరు

chiranjeevi Khaidi-No.-150-Satellite-Deal-Closed

చిరంజీవి రీ-ఎంట్రీ మూవీగా రూపొందిన ‘ఖైదీ నంబర్ 150’.. సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తమిళంలో ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు గత ఏడాదే సెన్సార్ పూర్తవ్వడంతో.. జాతీయ చలన చిత్ర పురస్కారాలకు పంపించారు. రైతుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. రీమేక్ కాబట్టి.. ఉత్తమ చలన చిత్రం కేటగిరీలో కాకుండా.. మిగతా కేటగిరీల్లో పోటీలో ఉంది. మరి.. పాటలు, ఫైట్స్ పరంగా దుమ్మురేపిన ‘ఖైదీ నంబర్ 150’కి.. ఈ విభాగాల్లో ఏమైనా అవార్డ్స్ వస్తాయేమో చూడాలి. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రంగా వచ్చి.. సూపర్ హిట్ సాధించిన సినిమా ‘శతమానం భవతి’. శర్వానంద్ కథానాయకుడిగా వేగేశ్న సతీష్ రూపొందించిన ఈ చిత్రం కూడా గత ఏడాదే సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో.. నిర్మాత దిల్ రాజు ఈRead More


చిరు మువీ టైటిల్ తో చెర్రీ..!

chiru cherry

తాజాగా ధృవ సినిమా విజయంతో జోరుమీదున్నాడు రామ్‌చరణ్. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం వంద కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేసి దుమ్మురేపింది. ఈ రెండు ఆనందాలతో తన తదుపరి చిత్రానికి చరణ్ జోరు పెంచాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాపై అప్పుడే మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. సుకుమార్ మేకింగ్ స్టయిల్‌లో రూపొందే ఈ చిత్రం అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా? అనే ఆసక్తి అప్పుడే అందరిలో మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు అప్పుడే పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలుRead More


పవన్ ఇప్పడు హై సెక్యురిటీ పర్సన్…

chiranjeevi-wants-to-see-that-step-of-pawan-kalyan_b_2103160645

మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో తమ్ముడు పవన్ గురించి మాట్లాడుతూ, అతనెప్పుడూ మితభాషి అని, నలుగురితో కలిసి ఉండలేడని అన్నారు. తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని అన్నారు. బయటి ప్రపంచమే పవన్‌ను కొత్తగా చూస్తోందని కాని అతడు తనకెప్పుడు పాతేనని అన్నారు. అంతే కాకుండా పవన్ ప్రవర్తనలో ఇప్పటికీ ఎలాంటి మార్పులు రాలేదని అన్నారు. ఇప్పటికీ అవే లక్షణాలని, దానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాంచరణ్ ఫంక్షన్‌ను పవన్‌ను ఆహ్వానించారని కాని తనకు బాధ్యతలు ఎక్కువై రాలేక పోయాడు. తను రాకపోయినా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడని గుర్తు చేశారు.


మరో రెండు సినిమాలు మాత్రమే…

chiru

మెగాస్టార్ చిరంజీవి తన భవిష్యత్ కార్యాచరణ ముందే ప్రకటించేసారు. రానున్న రోజుల్లో మరో రెండు సినిమాలు చెయ్యగలనని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ‘ఖైదీ నంబరు 150’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘పరుచూరి బ్రదర్స్‌ చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను స్టాండ్‌బైగా పెట్టుకున్నాం. అలాగే డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి నాతో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. నా 152వ సినిమాను గీతా ఆర్ట్స్‌లో చెయ్యడానికి బోయపాటి శ్రీను సిద్ధంగా ఉన్నారు. ’’ అని చిరంజీవి పేర్కొన్నారు.


అక్కడ అది ప్లస్‌… ఇక్కడ ఇది ప్లస్‌…

khaidi balayya

ప్రస్తుతం అందరి దృష్టి ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాల మీదనే ఉంది. ఏది పెద్ద హిట్‌గా నిలుస్తుంది, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడుతుంది అని లెక్కలు వేస్తున్నారు.చారిత్రక సినిమా కావడంతోపాటు, తెలుగు వాడి కథ అన్న కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాకు పన్ను మినహాయింపును ప్రకటించాయి. దీంతో ఒక్క టిక్కెట్టుపై బాలయ్య సినిమా నిర్మాతలకు దాదాపు పది రూపాయల లాభం వస్తుంది. ఇది ‘గౌతమిపుత్ర..’ నిర్మాతలకు ఎంతో లాభం చేకూరుస్తుంది. అలాగే ‘ఖైదీ నెంబర్‌ 150’కి కూడా ఓ వెసులుబాటు ఉంది. బాలకృష్ణ సినిమా కంటే ఈ సినిమా ఒక రోజు ముందుగా విడుదలవుతోంది. అంటే ఆ ఒక్కరోజూ థియేటర్లన్నింటిలోనూ ‘ఖైదీనెంబర్‌ 150’ మాత్రమే ప్రదర్శితమవుతుంది. దీంతో ఆ ఒక్కరోజే ఆ సినిమా పదికోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగలిగే అవకాశముందని అంచనాRead More