media kaburlu

 
 

జగన్ అసలు పరీక్ష అక్కడే..

news

కోర్టు తీర్పు రేపిన ఉత్కంఠ..పోలీసు ఆంక్షల చుట్టూ సాగిన చర్చ దాటి చివరకు జగన్ రోడ్డెక్కుతున్నారు. ప్రజా సంకల్పం అంటూ సాగుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేపట్టిన మూడో నాయకుడిగా కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. జగన్ యాత్ర గతంలో వైఎస్, చంద్రబాబు యాత్రలతో పోలిస్తే పూర్తి భిన్నం. ఇది సుదీర్ఘయాత్రే తప్ప నిరవధిక యాత్ర కాదు. పైగా జగన్ సొంత నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తుండడం కూడా విశేషమే. వాటికితోడు గతంతో పోలిస్తే జగన్ కి అనేక టెక్నికల్ అంశాలు తోడుగా నిలవబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ యాత్ర ఫలితాలు ఎలా ఎన్నప్పటికీ పెను ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా చేస్తున్న విమర్శలు గమనిస్తే అధికార పార్టీలో అలజడి రేగుతుందని అర్థమవుతోంది. పాదయాత్ర మధ్యలో జగన్ అరెస్ట్ అవుతారని,Read More


మీడియా ఇంతగా దిగజారాలా..?

22046921_1184587104974176_8072486538768234946_n

పత్రికా రంగం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకూ పరిణతి చెందినా ప్రమాణాలు మాత్రం పడిపోతూనే ఉన్నాయి. బాగా దిగజారిపోతున్నాయనే ఆందోళన అందరిలో వినిపిస్తున్నా మీడియా సంస్థల నిర్వాహకుల తీరు మారడం లేదు. విమర్శలను ఖాతరు చేయడం లేదు. సూచనలను పరిగణించడం లేదు. అందుకే చిన్న చిన్న అంశాలను, ప్రధానంగా సున్నితమైన విషయాలను కూడా రేటింగ్స్ కోసం సొమ్ము చేసుకునే తపన రానురాను తీవ్రమవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన యువతి మీద లైంగిక దాడికి సంబంధించిన విషయంలో మీడియా అతి ప్రవర్తన అందరినీ విస్మయం కలిగించింది. బాధిత కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న సన్నివేశాలను పదే పదే పునరావ్రుతం చేయడం ద్వారా మీడియా చానెళ్లన్నీ మరో అడుగు దిగజారి వ్యవహరించాయి. బాదితురాలి మీద బరితెగించిన యువకులకు బుద్ధి చెప్పాలంటే వారిని చూపించి,Read More


మీడియా ఏం చేసినా చెల్లుతుందా..?

papers telugu news

ఇదే ప్ర‌శ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు, మ‌త బోధ‌కులు, కుల సంఘాలు కూడా మీడియాలోకి ప్రవేశించిన త‌ర్వాత జ‌ర్న‌లిజం రూప‌మే మారిపోయింది. విలువ‌ల‌కు దాదాపుగా వ‌లువ‌లు ఊడ‌దీసినట్టే అయ్యింది. అందుకే పాత్రికేయానికి కొత్త అర్థాలు వెదుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది. పార్టీల వారీగా చీలిన మీడియాలో ఏ గూటిలో ఉంటే ఆ గూటి రాగ‌మే ఆల‌పించ‌డానికి త‌గ్గ‌ట్టుగా జ‌ర్న‌లిస్టులు రూపొందుతున్నారు. మ‌నుగ‌డ‌కు అంత‌కుమించిన మార్గం లేద‌ని భావిస్తున్నారు. మారుతున్న ప‌రిస్థితుల్లో ఇలాంటి ప‌రిణామాలు అనివార్య‌మ‌ని కూడా కొంద‌రు సూత్రీక‌రిస్తున్నారు. అలాంటి వారిలో కొంద‌రు ఏదైనా ఓ సంస్థ‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడు కేవ‌లం ఆ మేనేజ్ మెంట్ ల‌క్ష్యాల‌క‌నుగుణంగా క‌థ‌నాలు ఇవ్వ‌డం, వారి విరోధుల మీద బుర‌ద‌జ‌ల్ల‌డానికి ఎంత‌కైనా తెగించ‌డానికి త‌యార‌వుతున్నారు. వాస్త‌వాల‌ను విస్మ‌రించి, ఇంకా చెప్పాలంటే పాత‌రేసి త‌మ ప‌బ్బం గ‌డుపుకునే ప‌నిలో ఉన్నారు. అందుకే ఇప్పుడుRead More


పేరు మారింది..కానీ తీరు..?

app times

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నుంచి శాటిలైట్ చానెళ్ల చ‌రిత్ర‌లో కొత్త సంచ‌ల‌నం అంటూ చెప్పుకున్న ఏపీ టైమ్స్ పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆర్థికంగా స‌మ‌స్య‌లు లేక‌పోయినా ఇత‌ర అంశాలు మాత్రం ఆ చానెల్ రాక‌ను అడ్డుకుంటున్నాయి. ఇప్ప‌టికే నాలుగు నెల‌ల క్రితం రిక్రూట్ మెంట్ జ‌రిగింది. నెల క్రితం కార్యాల‌యం కూడా ప్రారంభించారు. కానీ చానెల్ మాత్రం క‌నిపించ‌డం లేదు. యూట్యూబ్ లో వార్త‌లు చూసుకుని ఆ సంస్థ సిబ్బంది, అభిమానులు మురిసిపోవాల్సి వ‌స్తోంది. దాంతో అస‌లు ఎప్పుడు తెరంగేట్రం అనే సందేహం క‌నిపిస్తోంది. అమ‌రావ‌తి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క న్యూస్ చానెల్ కూడా రాలేదు. దాంతో తొలిచానెల్ గా ఏపీ టైమ్స్ చెప్పుకునే అవ‌కాశం ద‌క్కింది. కానీ చానెల్ పేరులో అభ్యంత‌రాలు వివాదం కావ‌డంతో చివ‌ర‌కు పేరు మార్చారు. ఏపీ టైమ్జ్ గా తీర్చిదిద్దారు.Read More


ప్రింట్ మీడియా కొత్త పుంత‌లు

papers telugu news

దేశంలో మీడియాకు గ‌డిచిన ద‌శాబ్ద‌కాలం ఓ స్వ‌ర్ణ‌యుగం అని చెప్ప‌వ‌చ్చు. ఎల‌క్ట్రానిక్ మీడియా రెక్కలు విచ్చుకుంది. న్యూస్ చానెళ్లు పుట్టలు పుట్ట‌లుగా పుట్టుకొచ్చాయి. వాటికితోడుగా ప్రింట్ మీడియా కూడా ప్రాభ‌వం నిల‌బెట్టుకోవ‌డ‌మే కాకుండా, దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌న‌మానం కావ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. భార‌తీయుల‌పై మీడియా ప్ర‌భావం ఏ స్థాయిలో పెరిగిందో ఈ ప‌రిణామం చాటుతోంది. ప్రాంతీయ న్యూస్ చానెళ్లు, ఉప ప్రాంతీయ చానెళ్లు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. అయినా ప్రింట్ మీడియాలో ప‌త్రిక‌ల సంఖ్య‌, స‌ర్క్యులేష‌న్, ఎడిష‌న్ సెంట‌ర్లు అన్నింటిలోనూ అభివృద్ధి క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌(ఏబీసీ) వెల్లడించిన లెక్క‌ల ప్రకారం ప‌త్రిక‌లు గ‌డిచిన ప‌దేళ్ల‌లో అనూహ్య ప్ర‌గ‌తి సాధించాయి. 2006 నుంచి 2016 మ‌ధ్య సాధించిన ప్ర‌గ‌తి వివ‌రాల‌ను ఏబీసీ ప్ర‌క‌టించింది. ఈ పదేళ్లలో పత్రికల కాపీల‌ సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదలRead More


ఆంధ్ర‌జ్యోతి ఉన్న‌దే అందుకా..?

Vemuri-Radhakrishna-RK-170614

మీడియాకి ద్విముఖ వ్యూహం ఉంటుంది. త‌మ‌కు అనుకూలంగా ఉన్నంత వ‌ర‌కూ వారికి అధిక ప్రాధాన్య‌త ద‌క్కుతుంది. ప‌తాక శీర్షిక‌ల్లోనూ, బులిటెన్ హెడ్ లైన్స్ లోనూ వార్త‌లు వినిపిస్తారు. అదే స‌మ‌యంలో త‌మ‌కు గానీ, తాము ఎవ‌రికోసం ప‌నిచేస్తున్నామో వారికి గానీ ఇబ్బంది క‌లిగితే ఎదుటి వారి మీద ఎదురుదాడికి దిగుతుంది. లోపాల‌ను ఎత్తిచూపి వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తుంది. బుర‌ద‌జ‌ల్లి త‌మ మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను జ‌నం విశ్వ‌సించ‌కుండా చేయాల‌ని చూస్తుంది. స‌రిగ్గా ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ను చూస్తే అదే జ‌రుగుతోంది. ద్విముఖ వ్యూహంతో సాగుతోంది. ఓ వైపు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నుంచి పొందుతున్న న‌జ‌రానాల కార‌ణంగా బాబు, చిన‌బాబు కి వంత పాడుతూ, వారికి వ్య‌తిరేకంగా ఉన్న వారి మీద బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ రూపంలో బాబుని కాపాడేయ‌త్నం సాగిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ మీదRead More


సాక్షి ముందుకి- ఏబీఎన్ వెన‌క్కి

sakshi-building

తెలుగు టీవీ చానెళ్ల రేటింగ్స్ ఆస‌క్తిగా మారుతున్నాయి. దాదాపు ఆరేడు చానెల్ల రేటింగ్స్ లో పెద్ద మార్పులు క‌నిపించ‌డం లేదు. అన్నీ దాదాపు 5,10 పాయింట్ల తేడాలో స‌మానంగా క‌నిపిస్తున్నాయి. కానీ చిన్న చిన్న తేడాల‌తోనే స్థానాలు మారిపోతున్నాయి. తాజాగా అదే ప‌రంప‌ర‌లో సాక్షి ముందుకు దూసుకువ‌చ్చింది. ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. దాంతో ఏబీఎన్ ఓ అడుగు వెన‌క్కి వేసింది. 4తో సంతృప్తి ప‌డింది. 12 వ వారం ఓవ‌రాల్ రేటింగ్స్ లో టీవీ9 మ‌ళ్లీ మొద‌టి స్థానానికి చేర‌గా, ఎన్టీవీ రెండో స్థానంలో ఉంది. అయితే టీవీ9 మాత్రం ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది. 70 పాయింట్ల‌తో ముంద‌జ వేసింది.. రెండో స్థానంలో ఎన్టీవీతో పోలిస్తే ఏకంగా దాదాపు 18 పాయింట్ల తేడా ఉండ‌డం విశేషం. ఏబీఎన్ తో స‌మానంగా టీవీ5 ఐదో స్థానంలోRead More


మ‌ళ్లీ త‌ప్పులో కాలేసిన ఈనాడు..!

17522925_1527672527285279_5719636288289112835_n

ఈనాడు ప‌త్రిక ఎట్ట‌కేల‌కు త‌ప్పు అంగీక‌రించింది. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో వెన‌క‌డుగు వేసింది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ మీద త‌న రాత‌ల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ అదే క్ర‌మంలో మ‌రో తప్పిదం చేసేసింది. మ‌రోసారి తాను త‌ప్పులు కాలేసి, అంద‌రూ వాటిని విశ్వ‌సించాల‌నే స్థాయిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఈనాడు రాత‌ల ప్ర‌కారం 500 టీఎంసీల నీటిని త‌ర‌లించ‌డం సాధ్యం కాద‌ని అంగీక‌రించింది. అదే స‌మ‌యంలో క్ర‌స్టు గేట్లు ఎత్తి 50ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వదులుతామ‌ని రాశారు. అంటే దిగువ‌కు వ‌దిలే జలాలే 500టీఎంసీలు ఒక్క‌రోజుక‌ని లెక్క‌లు చెప్ప‌డం బాగానే ఉంది. కానీ నిజంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి భారీగా గేట్లు సిద్ధం చేసి, అన్ని జాగ్ర‌త్త‌ల‌తో 50ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వ‌దిలితే ఏమ‌వుతుంద‌నే విష‌యాన్ని ఒక్క‌సారయినా ఆలోచించిందా అన్న‌ది సందేహ‌మే. ప్ర‌ధానంగా పోల‌వ‌రంRead More


రోడ్డెక్కిన మరో టీవీ చానెల్ సిబ్బంది

EXAM

తెలుగు మీడియా చానెళ్ల యాజ‌మాన్యాల తీరు అంద‌రిలో ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తోంది. మీడియాకు ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న‌ప్పుడు వినియోగించుకుని, ఇప్పుడు కొంత అన‌నుకూల‌త రాగానే జ‌ర్న‌లిస్టుల జీవితాల‌తో ఆడుకోవ‌డం అల‌వాటుగా మార్చుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈ జాబితాలో ప‌లు చానెళ్లు చేరిపోయాయి. తాజాగా ఎక్స్ ప్రెస్ టీవీ యాజ‌మాన్యం వైఖ‌రితో ఆ చానెల్ లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టులంతా రోడ్డెక్కారు. ఆందోళ‌న‌ల‌కు దిగారు. ధ‌ర్నాలు చేప‌ట్టారు. వేత‌నాలు చెల్లించాల‌ని నిర‌స‌న‌ల హోరెత్తించారు. ఎక్స్ ప్రెస్ టీవీని ప్రారంభించి ఐదేళ్లు కూడా నిండ‌కుండానే ఆ చానెల్ ప‌లు వివాదాల్లో ఇరుక్కుంది. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు ఈ చానెల్ ప్రారంభించిన కోస్ట‌ల్ బ్యాంక్ అధినేత‌, చిగురుపాటి వారు ఆ త‌ర్వాత చానెల్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ప‌లుమార్లు వ్య‌వ‌హారం అదుపు త‌ప్పింది. కేసుల వ‌ర‌కూ వెళ్లింది. అయినా మార్పు రాలేదు. నెల‌లRead More


సుప్రీం నోటీసులు- మీడియా

papers telugu news

ఓటుకు నోటు వ్య‌వ‌హారం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలుగుదేశం నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌ల‌య్యింది. ఏకంగా హైకోర్ట్ ఈ కేసును కొట్టేస్తే ..ఆ తీర్పును నిలిపివేసిన అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ‌కు స్వీక‌రించింది. కేసులో నిందితులుగా ఉన్న వారికి నోటీసులు జారీఅయ్యాయి. సుప్రీం కోర్ట్ నుంచి ఓ రాష్ట్ర సీఎంకి నోటీసులు జారీ కావ‌డం సామాన్య విష‌యం కాదు. అందులో ఓట్లు కొన‌డానికి డ‌బ్బులు ఇచ్చిన కేసులో కాబ‌ట్టి అత్యంత ప్రాధాన్య‌త‌తో కూడుకున్న అంశం. దానికి త‌గ్గ‌ట్టుగానే ఇంగ్లీష్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ స‌హా అంద‌రూ మొద‌టి పేజీలు వార్త‌ను ఇచ్చారు. కేసు గురించి స‌మాచారం ఇస్తూ తాజా కోర్ట్ ఆదేశాల‌ను ఉటంకించారు. కానీ తెలుగు మీడియా మాత్రం దానికి భిన్నం. త‌న రూటే సెప‌రేటు అని చాటుకుంది.Read More