Main Menu

latestnews

 
 

దేశంలో న్యూస్ చానెళ్ళు ఎన్నున్నాయో తెలుసా..!?

గ‌త దశాబ్దంన్న‌ర‌ కాలంలో మీడియా రంగంలో పెనుమార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా శాటిలైట్ చానెళ్ల సంఖ్య అమాతంగా పెరిగింది.2000 త‌ర్వాత పెరిగిన ఇండియన్ చానెళ్ల సంఖ్య అనూహ్యంగా ఉంది. ప్రాంతీయ భాషల వారీగానూ ఈ పెరుగుద‌ల ఎక్కువ‌గానే ఉంది. తెలుగులో కూడా ఈ చానెళ్ళ సంఖ్య పెరుగుద‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. జెమీనీ, ఈటీవీల‌తో మొద‌లైన ఎంట‌ర్నైమెంట్ విభాగంలో ఇప్పుడు ప‌ది చానెళ్ల‌కు పైగానే ఉన్నాయి. న్యూస్ చానెళ్ల సంఖ్య 20 దాటింది. ఇక సినిమా, చిల్డ్ర‌న్, రిలీజియ‌న్ స‌హా వివిధ విభాగాల్లో చానెళ్లు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తెలుగులోనే కాకుండా ఇటీవ‌ల ఈ పెరుగుద‌ల అన్ని భాష‌ల్లోనే మంద‌గించింది. దానికి మీడియాలో మొద‌ల‌యిన సంక్షోభ‌మే ఓ కార‌ణంగా క‌నిపిస్తోంది. చానెళ్ల ఆదాయ ప‌రిమితులు ఏర్ప‌డ‌డంతో పెద్ద‌గా లాభాలు లేని రంగంలో అడుగుపెట్ట‌డానికి కొంద‌రు వెనుకంజ వేస్తున్నారు. ఓ ద‌శ‌లో పెద్దRead More


బాబు వారిని ముంచేస్తారా..?

ఏపీలో రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చంద్ర‌బాబుకి ఎలా ఉన్నా..ఆయ‌న అనుచ‌రులను మాత్రం అవ‌స్థ‌లు పాలుజేసేలా ఉన్నాయి. దాంతో చాలామంది నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ప్ర‌త్యేక హోదా పేరుతో త‌మ పుట్టి ముంచేలా ఉన్నార‌న్న ఆందోళ‌నలో క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజ‌ల్లో ఓ బ‌ల‌మైన సెంటిమెంట్ గా ప‌రిణ‌మించిన అంశంలో పార్టీ, అధినేత తీరు వారిని క‌ల‌వ‌రం పాలుజేస్తోంది. ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాంందోళ‌న‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్ర‌త్యేక ప్యాకేజీకి దాదాపుగా టీడీపీ సిద్ధ‌ప‌డిపోవ‌డంతో ప్యాకేజీతో సంతృప్తి చెంద‌ని జ‌నాలు ఏ స్థాయిలో స్పందిస్తార‌న్న‌దే వారిలో అల‌జ‌డికి మూల‌మవుతోంది. ప్ర‌త్యేక హోదా మీద గ‌ట్టిగా కేంధ్రాన్ని నిల‌దీయ‌లేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఉన్నార‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అందుకే ఆయ‌న ప్యాకేజీకి రెడీ అయిపోయారు. దాంతో కేంధ్రంలో కూడా ఓ మాదిరి క‌ద‌లిక వ‌చ్చింది. ఎప్ప‌టికి మోక్షం క‌లిగేన‌న్న దానిపైRead More


కొణ‌తాల కోరిక నెర‌వేరుతుందా..!?

ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ప‌థ‌కం పూర్తిచేయాలంటూ మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ ఉద్య‌మం సాగిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు చోట్ల స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఉత్త‌రాంధ్ర అభివృద్ధిని నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అదే స‌మ‌యంలో మంత్రులు య‌న‌మ‌ల‌, అయ్య‌న్న‌పాత్రుడు, కొల్లు ర‌వీంద్ర‌ల‌తో ఆయ‌న స‌మావేశం కావ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఓ వైపు ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్న కొణ‌తాల రామ‌కృష్ణ మ‌రోవైపు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో స‌మావేశం కావ‌డం వెనుక కార‌ణాలేంటా అని జ‌నం ఆరాతీస్తున్నారు. కొణ‌తాల రామ‌కృష్ణ వైఎస్సార్సీపీని వీడి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీలో చేరాల‌ని ప్ర‌య‌త్నించారు. నేరుగా చంద్ర‌బాబుని కూడా క‌లిశారు. కానీ ఆయ‌న లెక్క త‌ప్పింది. కేవ‌లం కొణ‌తాల శిష్యుడు గండి బాబ్జీకి త‌లుపులు తెరిసిన టీడీపీ కొణ‌తాల ను మాత్రం కాద‌ని చెప్పేసింది. దానికి ప్ర‌ధానంగా గంటా శ్రీనివాస‌రావు వ‌ర్గం నుంచిRead More


ఎన్టీవీలోనూ అంతే..!

తెలుగు మీడియాలో ఇప్పుడు కోత‌ల కాలం న‌డుస్తోంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జ‌ర్న‌లిస్టుల వెత‌లు పెంచ‌డ‌మే ప‌నిగా మీడియా యాజ‌మాన్యాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను చానెళ్లు వేత‌నాలివ్వ‌కుండా వేధిస్తున్నాయి. మీడియా సిబ్బందికి కూడా స‌మ్మెలు, ధ‌ర్నాలు, దీక్ష‌లు త‌ప్ప‌డం లేదు. అలాంటి ప‌రిస్థితికి మిన‌హాయింపుగా క‌నిపించే ఓ అర‌డ‌జ‌ను చానెళ్లలో ఎన్టీవీ ఒక‌టి. అయితే అక్క‌డ కూడా మ‌రో రూపంలో జ‌ర్న‌లిస్టులు స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అందుకు కార‌ణం బాసులు ఎక్కువ కావ‌డం ఒక కార‌ణ‌మైతే..వారి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రో కార‌ణం. ఆ రెండింటికీ మించి ఎన్టీవీ మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణ‌యాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఎన్టీవీలో ఉద్యోగం ఇప్పుడు క‌త్తిమీద సాములా మారింది. బాసులు ఎవ‌రు..ఎప్పుడు..ఎలాంటి ఆదేశాలిస్తారో తెలియ‌దు. ఏ బాసు ఆర్డరేసిన‌ప్ప‌టికీ దానిని పూర్తి చేయాలి. ప‌ని తొంద‌ర‌లో జ‌రిగిన చిన్న చిన్న త‌ప్పిదాలనుRead More


వారి కాపురంలో చిచ్చు పెట్టిన స‌మంత‌..!

ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌మంతా ఏం చేసినా సంచ‌ల‌న‌మే. దాంతో ఆమె తీసుకునే నిర్ణ‌యాల ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్ప‌టికే స‌మంతా పెళ్లి పీట‌లెక్క‌డానికి స‌న్నాహాలు చేసుకుంటోంది. నాగ చైత‌న్య‌ను మనువాడి అక్కినేని కోడ‌లిగా హైద‌రాబాద్ లో అడుగుపెట్ట‌బోతోంది. అయితే ఆ విష‌యంలో అలా ఉంచితే ఇప్పుడు స‌మంతా పెళ్లి మ‌రో సినీ న‌టి సంసారంలో చిచ్చు పెట్టింది. చివ‌ర‌కు ఆమె కాపురం కూలిపోవ‌డానికి కార‌ణ‌మ‌దేన‌ని కోలీవుడ్ వ‌ర్గాలు కోడై కూసే వ‌రకూ వ‌చ్చేసింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమంటే అమ‌లాపాల్ , ఆమె భ‌ర్త విజ‌య్ మ‌ధ్య ఇంటిపోరు వీధికెక్కింది. విడాకుల‌కు కూడా సిద్ధ‌ప‌డుతున్నార‌న్న క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దానికి ప్ర‌ధాన కార‌ణం అమలాపాల్ వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌డ‌మే అని చెబుతున్నారు. అంతేగాకుండా ఇటీవ‌ల స‌మంతా పెళ్లి మూలంగా ఓ కోలీవుడ్ ఆఫ‌ర్ నిRead More


ఫ్యాన్స్ కి నాగ్ గిఫ్ట్..!

ఇటీవల ట్విట్టర్లో కింగ్ నాగార్జున చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తన ట్విట్టర్ పేజ్ పై ఈ నెల 23న అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు నాగార్జున. అయితే ఈ ట్వీట్ దర్శనమిచ్చిన దగ్గర నుంచి మీడియా సర్కిల్స్ నాగ్ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటన్న చర్చ జరగింది. కొంత మంది నాగ్ తన తనయుల పెళ్లి విషయం ప్రకటిస్తాడని, మరి కొంత మంది ప్రస్తుతం నాగ్ చేయబోయే సినిమాకు సంబందించిన అప్ డేట్ ఇస్తాడని మాట్లాడుకున్నారు. అయితే రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నాగ్ ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిర్మాలా కాన్వెంట్ సినిమాను నిర్మిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్, తనలోని మరోRead More


కొత్త డీజీపీ ప్ర‌స్థానం ఇలా..!

1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1987లో అదిలాబాద్ ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఇప్పుడు రాష్ట్ర డీజీపీ స్థాయికి ఎదిగారు. ఒంగోలులోని మిరియాల పాలెంకు చెందిన రామకోటయ్య, సూరమ్మలకు జన్మించిన సాంబశివరావు ఆఖరి వాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన ప్రా«థమిక విద్య నుంచి ఇంటర్ వరకు ఒంగోలులోనే చదువుకున్నాడు. 1967-72 వరకు పీవిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1972-74 వరకు శర్మ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అనంతరం 1974-79 వరకు ఆంధ్రా యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీర్‌గా పట్టభద్రులయ్యారు. 1979-81లో కాన్పూరు ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్‌కు ఎంపికై 1984 ఐపీఎస్ బ్యాచ్‌లో ఆంధ్రా కేడర్‌లో విధుల్లో చేరారు. 1987లో అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిRead More


న‌మ్మి చేర‌నిస్తే ఎంపీ ముంచేస్తున్నారు: మహిళ ఆవేద‌న‌

గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌పై గుంటూరుకే చెందిన పద్మజ అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎంపి తన ఇంటిని కాజేయాలనుకుంటున్నారని, తనకు న్యాయం చేయాలంటూ ఆమె విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎంను వేడుకుంది. టిడిపి మీద అభిమానంతో సొంత పార్టీ వాళ్లే అని నమ్మి ఇంటిని అద్దెకిస్తే, చివరికి తమకే అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంక్‌ అధికారులతో కుమ్మక్కై తమ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని గల్లా జయదేవ్‌ కుట్ర పన్నారని ఆమె ఆరోపించింది. బ్యాంక్‌ లోన్‌ చెల్లించని కారణంగా రూ.8కోట్ల విలువైన ఇంటిని వేలంలో అతి తక్కువకే కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఎంపి జయదేవ్‌ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి హైకోర్టు స్టేను వెకేట్‌ చేయించారని పద్మజ పేర్కొన్నారు. గుంటూరు బందావన్‌ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడుRead More


కేవీపీ ఫైర్..!

ప్రైవేటు బిల్లును కూడా అడ్డుకోవ‌డంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ వైఖ‌రి తేట‌తెల్ల‌మ‌య్యింద‌న్నారు. ఏపీకి తీర‌ని అన్యాయం చేస్తోంద‌న్నారు. టీడీపీ, బీజేపీ క‌లిసి నాట‌కాలాడుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా కోరుతూ ప్రైవేటు బిల్లు ప్ర‌వేశానికి చైర్మ‌న్ ప్ర‌తిపాదించిన‌ప్ప‌టికీ బీజేపీ ఎంపీలు అడ్డుకోవ‌డం సిగ్గుచేట‌న్నారు. స‌భ్యుల హ‌క్కుల‌ను కాల‌రాచేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఏపీ కి ప్ర‌త్యేక హోదా సాధించేవ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుంద‌న్నారు.


బిల్లుకి మ‌ద్ధ‌తుగా ఓటేస్తాం..!

పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేక హోదాకోసం ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు ఓటింగ్ కి వ‌స్తే దానికి సిద్ధంగా ఉన్నామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. ఏపీ ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్యం అని తెలిపింది. రాష్ట్రం కోస‌మే తాము బిల్లుకి మ‌ద్ధ‌తిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. రాష్ట్రాభివృద్ధి కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టి, ఏపీని అప్పుల ఊబిలో నెట్టేసిన కాంగ్రెస్ నేడు సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్లుకు మద్దతు ఇస్తున్నామని, ఓటేసుందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ నాని తెలిపారు.