Main Menu

latest news

 
 

కోర్టు తీర్పుల‌తో బాబు ఉక్కిరిబిక్కిరి

ఏపీ సీఎం కి ప్ర‌స్తుతానికి రాజ‌కీయంగా ఎటువంటి ఆటంకాలు లేవు. అధికారికంగా ఆయ‌న ధీమాగా ఉండొచ్చు. అంతేగాకుండా ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌ని క‌ల‌లు కంటున్న ఆయ‌న ప్ర‌య‌త్నాలు నీరుగారిపోవ‌చ్చు గానీ ఆయ‌నకు తాత్కాలికంగా తిరుగులేని ప‌రిస్థితే ఉంది. అందుకే ఆయ‌న అనేక విష‌యాల్లో అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు అడ్డ‌గోలుగా దొరికిపోతున్నారు. ఇటీవ‌ల వ‌రుస‌గా కోర్టుల ముందు స‌ర్కారుకి చెంప‌దెబ్బ‌లు ప‌డుతున్న తీరు చూస్తుంటే ఏపీలో చంద్ర‌బాబు పాల‌న ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన అమ‌రావ‌తి నిర్మాణంలో చంద్ర‌బాబుకి ఎదురుదెబ్బ తగిలింది. స‌ర్కారు నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది. కోర్ట్ ముందు త‌ప్పుని అంగీక‌రించి స‌రిదిద్దుకుంటామ‌ని చెప్పుకోవాల్సి వ‌చ్చింది. సీడ్ క్యాపిట‌ల్ నిర్మాణం విష‌యంలో స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తి చ‌ట్ట విరుద్ధంగా సాగ‌డంతో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. మ‌ళ్లీ నోటిఫికేష‌న్ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితిRead More


న‌ల్ల‌ధ‌నం- న‌యా నిర్ణ‌యం- నిజాయితీ ఎంత‌?

భార‌తదేశాన్ని న‌ల్ల‌ధ‌నం స‌మ‌స్య వెంటాడుతోంది. దేశ సంప‌ద‌ను దోచుకున్న బ‌డా బాబుల తీరుతో దేశ‌మంతా వేద‌న‌కు గుర‌వుతోంది. ఈవిష‌యాన్ని గ్ర‌హించిన ప్ర‌భుత్వాలు న‌ల్ల‌ధ‌నం విష‌యాన్ని ఎన్నిక‌ల్లో అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో మోడీకి లాభించిన ప్ర‌ధానాంశాల్లో బ్లాక్ మ‌నీ ఒక‌టి. విదేశాల‌లో దాచిన న‌ల్ల‌ధ‌నం వెన‌క్కి తెచ్చి పంచితే ఒక్కో కుటుంబానికి 15ల‌క్ష‌లు బ్యాంక్ అకౌంట్ల‌లో ప‌డుతుంద‌ని మోడీఆశ చూప‌డంతో అనేక‌మంది మోడీకి జై కొట్టారు. అప్ప‌టికే వికిలీక్స్ స‌హా ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల పేరుతో వెలుగులోకి వ‌చ్చిన న‌ల్ల‌ధ‌నం వ్య‌వ‌హారాలే ల‌క్ష‌ల కోట్ల‌లోఉండ‌డంతో జాతీయాదానికి మించి సంప‌ద పోగుప‌డింద‌న్న విష‌యం జ‌నానికి బోధ‌ప‌డింది. అది నిజంగా దేశంలోకి వ‌స్తే దేశాభివృద్ది, సామాన్యుల‌కు ఎంతో మేలుకలుగుతుంద‌న్న ఆశ పెరిగింది రెండున్న‌రేళ్ళు గ‌డిచిపోయింది. విదేశాల‌లో ఉన్న న‌ల్ల‌ధ‌నంలో న‌యా పైసా కూడా దేశానికి వ‌చ్చింది లేదు. విదేశాల‌లో న‌ల్ల‌ధ‌నంRead More


టీడీపీలో ప‌ద‌వుల కోలాహ‌లం

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ప‌చ్చ‌దండులో క‌లహం సాగుతోంది టీడీపీ నేత‌ల్లో మేయ‌ర్ సీటు కోసం కుర్చీలాట మొద‌ల‌య్యింది. గ్రూపు వార్ కూడా పెరుగుతోంది. దాంతో న‌గ‌ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింది. కాకినాడ మేయర్ స్థానం జనరల్ (మహిళ)కు దాదాపు ఖరారైనట్టే అని చెప్ప‌వ‌చ్చు. దీంతో తమకు లైన్ క్లియర్ అయ్యిందని కాపు సామాజికవర్గ నేతలు ధీమాతో ఉన్నారు. జనరల్ మహిళ అంటే ఇతర కులాలకు చెందిన మహిళా నేతలూ పోటీచేసే అవకాశాలున్నప్పటికీ ప్రస్తుత సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికార పార్టీ కాపు సామాజికవర్గానికే మేయర్ టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పైగా కాకినాడ నగర పాలక సంస్థలో సామాజికపరంగానూ కాపులకు పట్టు ఉండటంతో ఆ వర్గం అభ్యర్థికే టిక్కెట్ కేటాయించడం సముచితమని జిల్లాకు చెందిన మంత్రుల నుండి కూడా అధినేత చంద్రబాబుకు వినతులు వెళ్ళాయి.Read More


న్యాయ‌మూర్తులు- చంద్ర‌బాబు- తిరుమ‌ల‌

ప‌రిస్థితులు మారుతున్నాయి. అన్ని రంగాల్లోనూ అది స్ప‌ష్ట‌మ‌వుతోంది. న్యాయ‌వ్య‌వ‌స్థ కూడా దానికి మిన‌హాయింపు కాద‌ని తేటతెల్ల‌మ‌వుతోంది. న్యాయ‌మూర్తుల వ్య‌వ‌హార శైలి దానికి అద్దం ప‌డుతోంది. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు అసలు కలుసుకునే వారు కారు. అధికారిక సంబంధం ఉన్న మీటింగ్స్ లో కలిసినా, ఆంటీ ముట్టనట్లు ఉండేవారు. రాజకీయ నాయకులతో కలిసి వేడుకల లో పాల్గొంటే తమ మీద ఏదైనా ప్రభావం పడుతుందని న్యాయమూర్తులు శంకించే వారు. రాజకీయాల్లో అవినీతి సహజం కాబట్టి, న్యాయమూర్తులు తో ప్రైవేటు గా కలవడానికి రాజకీయ నాయకులు బిడియపడేవారు. కానీ చంద్రబాబు తీరే వేరు. న్యాయమూర్తులు తిరుమల ప్రయాణం పెట్టుకున్న రోజునే ఆయన కూడా తిరుమల ప్రయాణం పెట్టుకుంటారు. కుటుంబ స్నేహితుల తో మెలిగినట్లు అక్కడే వారితో గడుపుతారు. నైతికంగా ఇది తప్పు అనిRead More


ఆ ఆంగ్ల ప‌త్రిక మూత‌ప‌డింది..!

తెలుగుమీడియాలో వ్యాపార పోక‌డ‌లు పీక్ స్టేజ్ లో ఉన్న మాట ఎవ‌రూ కాద‌న‌లేరు. వ్యాపారం, పాత్రికేయం క‌ల‌గలిసిన రోజుల్లో లాభాల కోస‌మే మీడియాలో అడుగుపెట్టే జ‌నం పెరిగిపోయారు.ఆ లాభాలు నేరుగా మీడియాలో వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ కాబ‌ట్టి మీడియాను అడ్డుపెట్టుకుని ఇత‌ర రూపాల్లో ప్ర‌యోజ‌నాలు ఆశించ‌డం పెరిగిపోయింది. అది నెర‌వేరితే ఓకే గానీ లేకుంటే మీడియా సంస్థ‌ల‌ను హ‌ఠాత్తుగా మూతేయ‌డం మామూల‌యిపోయింది. తాజాగా తెలంగాణాలో ఓ కాంట్రాక్ట‌ర్ చేతిలోనే మెట్రో ఇండియా మూత‌ప‌డింది. ఆయ‌న సాధార‌ణ కాంట్రాక్ట‌ర్ కాదు. న‌మ‌స్తే తెలంగాణా లాంటి ప‌త్రిక‌ను పెట్టి పెను సంచ‌ల‌నం సృష్టించిన మీడియా వ్యాపారి. కానీ న‌మ‌స్తే తెలంగాణాని కేసీఆర్ చేతుల్లో పెట్టి ఆయ‌న‌కో న‌మ‌స్కారం చెప్పేసిన త‌ర్వాత మెట్రో ఇండియా పేరుతో ఇంగ్లీష్ ప‌త్రిక‌ను తెచ్చారు. దాని కోసం ఏకంగా చ‌త్తీస్ ఘ‌డ్ లో కూడా ఎడిష‌న్Read More


జ‌గ‌న్ , జ‌న‌సేన చేతులు క‌లుపుతున్నారు..!?

రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాద‌ని మ‌రోసారు రుజువు కాబోతోందా..తెలుగు రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు శ్రీకారం ప‌డుతోందా..అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార కూట‌మి ఏకాకి కాబోతోందా..ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒకే గూటికింద‌కు రావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా..ముఖ్యంగా ఉప్పూ నిప్పులా క‌నిపిస్తున్న‌ జ‌న‌సేనాని, జ‌గ‌న్ చేతులు క‌ల‌ప‌బోతున్నారా..చంద్ర‌బాబుకి చుక్క‌లు చూపించే స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యిందా అంటే రాజ‌కీయంగా ఉన్న అవ‌కాశాల‌ను బ‌ట్టి అవున‌నే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మారుతున్న రాజ‌కీయాల్లో మూడేళ్ల‌కే యూటర్న్ తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మొన్న‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డానికి అవినీతి ప్ర‌దానాంశంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ హ‌యంలో సాగిన అవినీతి, జ‌గ‌న్ సీబీఐ కేసుల్లో ఇరుక్కోవ‌డం వంటి వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో చంద్ర‌బాబు అనుభ‌వం కొత్త రాష్ట్రానికి అక్క‌ర‌కొస్తుందంటూ ప‌వ‌న్ అండ‌దండ‌లందించారు. అయితే రెండున్న‌రేళ్ల‌లోనే ప‌వ‌న్ అంచ‌నాలు త‌ప్ప‌ని రుజువ‌య్యాయి.ఇప్పుడు ఏపీలో సాగుతున్నRead More


మైండ్ గేమ్ లో ముందెవరు..!?

ఏపీ రాజ‌కీయాల్లో మైండ్ గేమ్ మొద‌ల‌య్యింది. సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోతోంది. ముఖ్యంగా ఇద్దరు కీల‌క‌నేత‌లు మ‌ధ్య ఈ వైరం తార‌స్థాయికి చేరుతోంది. అయితే ఈ పోరులో నేరుగా లోకేష్ రంగంలో దిగ‌గా..జ‌గ‌న్ మాత్రం అనుచరులు, సొంత మీడియా సాయంతో స‌మరం చేస్తున్నారు. ఇరువ‌ర్గాలు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌తున్నాయి. దాంతో ఈ వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం రాజ‌ప్ప ను కేంద్రంగా చేసుకుని ప్రారంభ‌మైన ఈ వ్య‌వ‌హారం లో వైఎస్సార్సీపీ కాపుల‌ను ల‌క్ష్యం చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ తీరుతో కాపు సీనియర్ల‌కు కూడా అవ‌మానం జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం సాగించింది. అయితే ఈ విష‌యంలో కాస్త దూకుడుగా ముందుకొచ్చిన లోకేష్ బ‌హిరంగ‌లేఖ రాయ‌డం, వీడియో విడుద‌ల చేయ‌డంతో వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. టీడీపీ సంధించిన అస్త్రానికి వైఎస్సార్సీపీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అన‌వ‌సరంగా ఫోటో ప‌ట్టుకుని బొత్సా మాట్లాడ‌డం, సాక్షిలోRead More


ఒలింపిక్స్ రేసులో చంద్ర‌బాబు ఒక్క‌రే..!

అవును..నిజ‌మే..! ఇప్పుడు ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ పూర్తిగా వృధా వ్య‌వ‌హారం అనుకుంటున్నాయి. నిర్వ‌హ‌ణా రేసులో నిల‌వ‌డానికి నిరాక‌రిస్తున్నాయి. తాజాగా రోమ్ న‌గ‌రం కూడా ఒలింపిక్ రేసు నుంచి త‌ప్పుకుంది.. దాంతో ఇక చంద్ర‌బాబు మాత్ర‌మే రేసులో ఉంటార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ రానురాను విప‌రీత‌మైన ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారంగా మారిపోయింది. దానికి త‌గ్గ‌ట్టుగా ఆదాయం కూడా క‌నిపించ‌డం లేదు. ఆట‌గాళ్ల‌తో పాటు పెద్ద‌స్థాయిలో క‌దిలివ‌చ్చే టూరిస్టుల కోసం భారీగా ఏర్పాట్లు చేసి రియోడిజ‌న‌రీ చేతులు కాల్చుకుంది. అంత‌కుముందు బీజింగ్ లో కూడా అంతే. వ‌చ్చే టూరిస్టులు కూడా పూర్తిగా సెక్స్ టూరిజం కోస‌మే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం చాలామందికి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆర్థిక ప‌రిస్థితుల్లో స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణా భారంRead More


అమ‌రావ‌తికి త‌ర‌లుతున్న చానెళ్లు!

తొలుత చంద్ర‌బాబు ప‌య‌న‌మ‌య్యారు. ఆత‌ర్వాత మంత్రులు మొద‌ల‌య్యారు. ఇటీవ‌ల ఉద్యోగులు త‌ర‌లిపోయారు. దాంతో హైద‌రాబాద్ లోని సెక్ర‌టేరియేట్ లో ఏపీకి కేటాయించిన భ‌వనాలు వ‌చ్చే ఏడేళ్ల‌లో మెయింటెన్స్ త‌ప్ప ఎందుకు కొన‌సాగిస్తున్నారో తెలియ‌ని సందిగ్ధం ఏర్ప‌డింది. ఆ విష‌యం అలా ఉంచితే ఇప్పుడు మీడియా కూడా ప‌రుగులు పెడుతోంది. చాలాకాలంగా ఆంధ్రా మీడియా అంటూ ముద్ర‌డిన నేప‌థ్యంలో ఇప్పుడు చేస్తున్న హ‌డావిడి దానికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. ఏపీలో ప్ర‌భుత్వం ఇంకా పూర్తిగా స్థిర‌ప‌డిన దాఖ‌లాలు లేవు, వెల‌గ‌పూడి వెత‌ల పూడిగా క‌నిపిస్తోంది. ఉద్యోగులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఏకంగా సీఎం కార్యాల‌యం కూడా పూర్తిగా సంస్ధిత క‌నిపించ‌డం లేదు. అయినా తెలుగు చానెళ్ల హ‌డావిడి మాత్రం క‌నిపిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి నాడే కార్యాల‌యాల ప్రారంభోత్స‌వానికి కొంద‌రు శ్రీకారం చుట్టారు. అందులో ఈటీవీ చాలాకాలంగా వేసుకున్న ప్రణాళిక‌లో భాగంగా ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్Read More


రాజ‌ధానిలో క‌బ్జాల ప‌ర్వం..!

హ‌డావిడిగా సాగుతున్న అమ‌రావ‌తిలో అక్ర‌మాల ప‌రంప‌ర‌కు కూడా అడ్డుక‌ట్ట క‌నిపించ‌డం లేదు. ఇష్టారాజ్యంగా స‌ర్కారీ భూములు కాజేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అందులొ భాగంగానే ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో ఏకంగా కోట్లాది రూపాల భూములు కాజేసే స్కెచ్ న‌డుస్తోంది. ఆరున్నెర ఎక‌రాల స్థ‌లాన్ని సొమ్ము చేసుకునే సెక్ష‌న్ రంగంలో దిగింది రైతుల‌ను మోస‌గించి, అధికారుల సాయంతో ద‌ర్జాగా క‌బ్జా చేసే య‌త్నం న‌డుస్తోంది. దొండ‌పాడులోని స‌ర్కారు భూముల్లో పెద్ద త‌ల‌కాయ‌ల సాయంతో అక్ర‌మార్కులు రెచ్చిపోతున్నారు. భూమితో ఎటువంటి సంబంధమూ లేని వ్యక్తులు ఇచ్చిన 9.3 అంగీకార పత్రాన్ని తీసుకున్న దొండపాడు సిఆర్‌డిఏ అధికారి దానికి సంబంధించిన వివరాలేమీ తనకు తెలియవని, ఏదైనా ఉంటే తుళ్లూరు తహశీల్దార్‌ను అడిగి తెలుసుకోవాలని సమాధానమిచ్చారు. ఇదే భూమికి దొండపాడు సిఆర్‌డిఏ అధికారులు దేవాదాయ శాఖకు కౌలు పరిహారం చెక్కు కూడా పంపించారు. అక్కడRead More