Main Menu

kurnool

 
 

చిన‌బాబు చ‌ల‌వతోనైనా ఆ ఎంపీ గ‌ట్టెక్కేనా?

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాల‌కు కొద‌వ‌లేదు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉంటుంది క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక రాజ‌కీయ ప‌య‌నం. భ‌ర్త క‌నుస‌న్న‌ల్లో రాజ‌కీయ ప్ర‌వేశం చేసి అంత‌లోనే బ‌రిలో దిగిన తొలిసారి ఏకంగా పార్ల‌మెంట్ కి ఎన్నిక‌యిన రేణుక ఆ వెంట‌నే సొంత పార్టీకి సెల‌వు చెప్పే సాహ‌సం చేశారు. కానీ చివ‌రి క్ష‌ణంలో భ‌ర్త‌ను పంపించి , ఆమె మాత్రం వైసీపీలో ఆగిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర అంశంగా మారింది. ఆ త‌ర్వాత మూడేళ్లు వైసీపీ శిబిరంలో చేరి, చావైనా, రేవైనా జ‌గ‌నన్న‌తోనే అని ప్ర‌క‌టించి ఆఖ‌రికి గ‌త ఏడాది జంప్ చేసేవారు. టీడీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కానీ సీన్ చూస్తుంటే ఆమెకు చుక్క‌లు క‌నిపించేలా ఉన్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే క‌ర్నూలు లోక్ స‌భ స్థానానికి ఆమె పేరుని నేరుగా ప్ర‌క‌టించిన నారా లోకేష్Read More


హాట్ టాపిక్ అవుతున్న జేసీ కామెంట్స్

క‌ర్నూలు లో టీడీపీ ధ‌ర్మ‌పోరాట స‌భ వేదిక‌గా మ‌రోసారి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు చేసిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌లు సంతృప్తి ప‌ర‌చ‌డం లేద‌న్నారు. పొలాల‌కు నీరిస్తే జ‌నం గుర్తుంచుకుంటార‌న్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి వింటున్నా పోల‌వ‌రం ముందుకు సాగ‌డం లేద‌ని వాపోయారు. సోష‌ల్ స్కీముల మూలంగా క‌డుపు, జేబు కూడా బ‌రువు అయిపోతోంద‌న్నారు. ఇలాంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు మాని ప్రాజెక్టుల మీద దృస్టి పెట్టాల‌న్నారు. చ‌ప్ప‌ట్లు కొట్టించుకునే ప‌థ‌కాలు మానుకోవాల‌ని హితువు ప‌లికారు. ధ‌ర్మపోరాట స‌భ‌లు వేస్ట్ అంటూ జేసీ చేసిన కామెంట్స్ స‌భ‌లో క‌ల‌క‌లం రేపాయి. త‌న‌కు ఎటువంటి ప‌దవులు అవ‌స‌రం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆలోచ‌న కూడా లేద‌ని, తాను బాబు నుంచి ఏదీ ఆశించ‌డం లేద‌న్నారు. మీరు నాకు మంత్రి ప‌ద‌వి ఎలానూRead More


రేణుక ‘బుట్టా’ దాఖలు…!

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కలలు పండేలా లేదు. ఆమె ఆశలన్నీ అడియాశలయ్యేలా మారుతోంది. పార్టీ ఫిరాయించిన ఆమెకు వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు ఖాయం చేస్తూ చినబాబు ప్రకటన చేశారు. కానీ చంద్రబాబు ఆలోచన వేరుగా ఉంది. దాంతో ఎంపీ బుట్టా రేణుక కి వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ మొదలయ్యింది. ఆమె అనుకున్నట్టు జరుగుతుందన్న ధీమా లేకపోవడంతో బుట్టా వర్గంలో కలకలం మొదలయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖాయం అయ్యింది. తాజాగా నారా బ్రాహ్మణి నేరుగా రాహుల్ గాంధీతో సమావేశంలో కూర్చోవడం దానికో సంకేతంగా భావించవచ్చు. దాంతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ కి కేటాయించడం ఖాయంగా మారింది. వాటిలో అరకు స్థానంతో పాటు కర్నూలు ఎంపీ సీటుRead More


టీడీపీ మెడ‌కు క్వారీ ప్ర‌మాదం

తెలుగుదేశం పార్టీ నేత‌ల వ్య‌వ‌హారాలు రానురాను వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. ఇప్ప‌టికే గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు మైనింగ్ భాగోతంపై ఏకంగా కోర్ట్ సీరియ‌స్ అయ్యింది. స‌ర్కారు నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వ్య‌వ‌హారంపై నోటీసులు జారీచేసింది. ఇక తాజాగా టీడీపీ నేత శ్రీనివాస చౌద‌రికి చెందిన క్వారీలో ప్ర‌మాదం 12మందిని పొట్ట‌న పెట్టుకుంది. క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన ఈ ప్ర‌మాదం ఇప్పుడు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. అధికార పార్టీ పెద్ద‌లు అనుమ‌తులు కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకి ఈప్ర‌మాదం ద‌ర్ప‌ణం ప‌డుతోంది. డ‌జ‌ను మంది ప్రాణాలు అగ్నికి ఆహుతి కావ‌డంలో అధికార పార్టీ పెద్ద‌ల లాభాల వేట ఉంద‌న్న వాస్త‌వం అంద‌రినీ ఉలికిపాటుకి గురిచేస్తోంది. మైనింగ్ లో ఉప‌యోగించ‌డానికి అనుమ‌తి లేని ఎల‌క్ట్రానిక్ డిటోనేట‌ర్లు వాడినట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇప్ప‌టికే చాలాకాలంగా ఇలాంటి ప్ర‌మాద‌క‌ర డిటోనేట‌ర్లు వాడుతున్న‌ప్ప‌టికీ అటుRead More


రూటు మార్చిన బైరెడ్డి, టీడీపీ, వైసీపీకి దెబ్బ‌!

క‌ర్నూలు రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ‌కాలం టీడీపీలో ప‌నిచేసి, ఆత‌ర్వాత ఆర్ఎస్పీ నేతగా గుర్తింపుసీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌స్తం అందుకున్నారు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. రాహుల్ స‌మ‌క్షంలో ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో తెలుగుదేశంతో పాటు వైసీపీకి కూడా కొంత‌మేర‌కు న‌ష్ట‌పోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి బైరెడ్డి లాంటి వాక్చూతుర్యం ఉన్న నాయ‌కుడిని టీడీపీలో చేర్చుకోవాల‌ని చంద్ర‌బాబు ఆశించారు. అయితే క‌ర్నూలు సమీక‌ర‌ణాల్లో ఆపార్టీకి కొంత స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బైరెడ్డికి సైకిల్ మీద చోటు ద‌క్క‌లేదు. చివ‌ర‌కు హ‌స్తం గూటికి చేర‌డం అనివార్యం అయిపోయింది. అయితే చంద్ర‌బాబు రాజ‌కీయ ఎత్తుల్లో భాగంగా కాంగ్రెస్ రూపంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను చీల్చ‌డ‌మే ల‌క్ష్యంగా బైరెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించి ఉంటార‌నే సందేహాలు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.Read More


లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

క‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. అవ‌స‌రం లేని స‌మ‌యంలో టిక్కెట్లు ప్ర‌క‌టించి ఆయ‌న క‌ల‌క‌లం రేపారు. ఇప్ప‌టికే టీజీ వెంక‌టేష్ వంటి వారు బ‌హిరంగంగానే లోకేష్ ని ఛాలెంజ్ చేశారు. దాంతో టీడీపీ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. అయితే క‌ర్నూలు ఎంపీ , ఎమ్మెల్యే అభ్య‌ర్థులను లోకేష్ కార‌ణంగా తాజాగా మంత్రి అఖిల‌ప్రియ అవ‌స్థ‌ల్లో ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఆమె స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న స‌మ‌యంలో సొంత అన్న‌గా చెప్పుకున్న లోకేష్ ఏం చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఎన్నిక‌ల ముంగిట ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్ల‌పై అభ్యంత‌రం వ‌స్తే చివ‌ర‌కు అది త‌న‌కు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని గ్ర‌హించిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి తొలుత త‌న టికెట్ ఖాయం చేసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.Read More


టీడీపీ, వైసీపీల‌కు ఒకే త‌ల‌నొప్పి

ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు ఒకే స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నాయి. ఒకే రీతిలో ఇబ్బందులు ప‌డుతున్నాయి. అయితే ఒక‌రు క‌ర్నూలు లో క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తే, మ‌రొక‌రు నెల్లూరులో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌స్తుతం టీడీపీ క‌న్నా వైసీపీదే పెద్ద క‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఫిరాయింపుల మూలంగా రెండు పార్టీల్లోనూ ప్ర‌కంప‌న‌లు త‌ప్పేలా లేవు. అయితే వైసీపీలో స‌మ‌స్య‌కు జ‌గ‌న్ జాగ్ర‌త్తప‌డ‌క‌పోవ‌డం కార‌ణ‌మ‌యితే, టీడీపీలో త‌గాదా తెర‌మీద‌కు రావ‌డానికి చిన‌బాబు ముందుచూపు లేక‌పోవ‌డ‌మేన‌ని భావిస్తున్నారు. నెల్లూరు వైసీపీలో పెద్ద వివాద‌మే రాజుకుంది. ఆనం రాం నారాయ‌ణ రెడ్డి రాక ఖ‌రారు కావ‌డంతో మేక‌పాటి ఫ్యామిలీ గుర్రుగా ఉంది. నేరుగా క‌ర‌ప‌త్రాలు వేసి పంచుతూ పార్టీ ప‌రువు తీసే ప‌నిలో ఉంది. ఈ విష‌యంలో మేక‌పాటి కుటుంబీకులు కూడా జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిపై కొంత ఆగ్ర‌హంతో ఉన్నారు. గ‌డిచినRead More


వైసీపీలో చేరిన బైరెడ్డి

క‌ర్నూలు జిల్లాలో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. బైరెడ్డి కుటుంబం నుంచి ఇప్ప‌టికే సిద్ధార్థ రెడ్డి వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకోగా తాజాగా మ‌రో బైరెడ్డి పార్టీ కండువా క‌ప్పేసుకున్నారు. గార్గేయపురం సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ బైరెడ్డి కరుణాకరరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు. . తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం సమీపంలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు వివరించారు. పార్టీలో చేరిన వారిలో ఆయనతోపాటు పల్లె రమణారెడ్డి, పోతుల సీతారామిరెడ్డి, బైరెడ్డి నాగేశ్వరరెడ్డి ఉన్నారు. దాంతో క‌ర్నూలు జిల్లాలో ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలో కి క్యూ క‌డుతున్న నేత‌ల సంఖ్య పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.


వైసీపీలో క‌ల‌హాలు త‌ప్ప‌వా?

వైసీపీ కి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లాల్లో క‌ర్నూలు ఒక‌టి. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌ను మిన‌హాయిస్తే క‌ర్నూలులో ఆపార్టీకి దాదాపు తిరుగులేదు. చివ‌ర‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాన్ని ఫ్యాన్ పార్టీ కైవ‌సం చేసుకుంది. అయితే వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్న వేళ వైసీపీకి కొత్త క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ముఖ్యంగా పార్టీ అంత‌ర్గ‌త క‌ల‌హాలు అస‌లుకే ఎస‌రు తెస్తాయా అన్న సందేహం వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా పార్టీ ప‌ట్ల ఎంతో విశ్వాసంతో వ్య‌వ‌హ‌రిస్తున్న గౌరు చ‌రితారెడ్డి కుటుంబం ప‌ట్ల జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రితో వారు నిరాశ చెందే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమారుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఆయన ఈ నెల 7వ తేదీ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థంRead More


వైసీపీలోకి బైరెడ్డి వార‌సుడు

సీమ రాజ‌కీయాల్లో మరో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఖాయంగా మారింది. టీడీపీలో చేర‌డానికి బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి సిద్ధ‌ప‌డుతుంటే ఆయ‌న‌కు షాకిచ్చేలా కుటుంబ వ్య‌వ‌హారాలు క‌నిపిస్తున్నాయి. చివ‌ర‌కు సొద‌రుడి కొడుకు సిద్ధార్థ‌రెడ్డి చూపు వైసీపీ వైపు మ‌ళ్లింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నందికొట్కూరు బాధ్య‌త‌ను భుజాన మోస్తానంటూ వైసీపీ అధినేత ముందు సిద్ధార్థ రెడ్డి పెట్టిన ప్ర‌తిపాద‌న ఆస‌క్తిగా మారింది. జ‌గ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే సిద్ధార్థ రెడ్డి కండువా మార్చేసుకునే అవ‌కాశాలు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లాలో వైసీపీ దూకుడు మీద ఉంది. టీడీపీలో వ‌ర్గ‌పోరు కార‌ణంగా వ‌స్తున్న త‌గాదాలు పెద్ద స‌మ‌స్య‌గా మారుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె వంటి చోట్ల అఖిల‌ప్రియ కార‌ణంగానూ, క‌ర్నూలులో టీజీ వెంక‌టేష్ తీరుతోనూ స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డుతోంది. అదే స‌మ‌యంలో వైసీపీలోకిRead More