Main Menu

KOLLYWOOD

 
 

మాస్ లుక్ తో ఫిదా చేస్తోంది..

మాస్ లుక్ తో ముచ్చ‌ట గొలుపుతోంది. ఫిదా మువీతో ప‌లువురి మ‌నసుదోచిన సాయి ప‌ల్ల‌వి తాజాగా చెల‌రేగిపోతోంది. ఇప్ప‌టికే క్లాస్, మాస్ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకలోకానికి దగ్గరైంది నాచురల్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత ‘ఎంసిఏ’ ద్వారా తన ఫాలోవింగ్ అమాంతం పెంచేసుకున్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన ‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో, తమిళంలో ధనుష్ సరసన ‘మారి 2’ చిత్రాల్లో నటిస్తోంది. కాగా.. ‘మారి’ చిత్రానికి సీక్వల్‌గా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మారి 2’ నుంచి తాజాగా వదిలిన సాయిపల్లవి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కా మాస్ లుక్‌లో ఆటో డ్రైవర్‌గా సాయిపల్లవి కనువిందు చేస్తోంది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ పాత్ర పోషించేందుకు.. ఆటో డ్రైవింగ్ కూడా నేర్చుకుందట సాయిపల్లవి. మొత్తానికైతేRead More


విశాల్ ని పెళ్లి చేసుకోవ‌డం లేదు…!

కోలీవుడ్ హాట్ జంట విశాల్, వ‌ర‌ల‌క్ష్మీ వ్య‌వ‌హారం నిత్యం వార్త‌ల్లో ఉంటుంది. తాజాగా వారి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా పందెంకోడి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి స‌క్సెస్ కొట్టింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన వ‌రూ కామెంట్స్ ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. వ‌రూ త‌న సోల్ మేట్ అంటూ విశాల్ చేసిన వ్యాఖ్య‌లు ఇంకా మ‌ర‌వ‌క‌ముందే వ‌ర‌ల‌క్ష్మీ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యే రీతిలో కామెంట్స్ చేసింది. ఇటీవలే రిలీజైన ‘పందెంకోడి2’ సినిమాలో లేడీ విలన్‌గా ఇంప్రెస్‌ చేసి, తొలి సినిమాకే తెలుగు ఆడియెన్స్‌ దగ్గర మార్కులు కొట్టేసింది వరలక్ష్మి. ఆ ఇంపాక్ట్‌ ఇంకా తగ్గనే లేదు. అప్పుడే విజరు ‘సర్కార్‌’ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఆ నేప‌ధ్యంలోనే విశాల్ కామెంట్స్ పై స్పందించింది. … ”విశాల్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. మాRead More


డైరెక్ట‌ర్ ని కొట్టిన హీరోయిన్, గాయాల‌తో ఆస్ప‌త్రి పాలు

ఆశ్చ‌ర్యంగా ఉందా..అవును నిజంగానే. అది కూడా సెట్లోనే జ‌రిగింది. దాంతో యూనిట్ అంతా అవాక్క‌య్యింది. వెంట‌నే స‌ద‌రు సినిమా ద‌ర్శ‌కుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించాల్సి వ‌చ్చింది. ఇదంతా ఓ కోలీవుడ్ సినిమా షూటింగ్ లో జ‌రిగింది. ఇంత‌కీ దాడి చేసింది మాత్రం తెలుగమ్మాయి కావ‌డం విశేషం. కోన‌సీమ కుర్ర‌ది అంజ‌లి ప‌లు తెలుగు సినిమాల‌లో కూడా మంచి గుర్తింపు సాధించింది. కానీ త‌మిళ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఓ డైరెక్టర్ ని పెనంతో కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సదరు డైరెక్టర్ కి తీవ్ర గాయం అయ్యింది. కోలీవుడ్ లో ‘లీసా’ అనే సినిమాలో నటిస్తోంది అంజలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో అంజలి తన చేతిలో ఉండే దోసRead More


శ్రీరెడ్డికి విశాల్ ఝ‌ల‌క్

కోలీవుడ్ స్టార్, హీరో విశాల్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న సీరియ‌స్ గా క‌నిపిస్తున్నారు. ఈ సంచ‌ల‌న న‌టి వ్య‌వ‌హారంపై ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా ఆమెకు నోటీసులు జారీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కొంతకాలంగా ప్రముఖ నటులను క్యాస్టింగ్ క‌\చ్ కాంట్రవర్శీలోకి లాగుతున్న శ్రీరెడ్డి ఇటీవ‌ల విశాల్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేసింది. తన ఫేస్‌బుక్ పేజిలో కొందరు కోలీవుడ్ ప్రముఖుల గురించి ఆరోపణలు గుప్పించింది. అంతేకాకుండా నడిగర్ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న విశాల్ తనను కాల్ చేసి బెదిరిస్తున్నాడంటూ ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దాంతో కోలీవుడ్ త‌రుపున విశాల్ ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా విశాల్ లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో విశాల్Read More


ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. హీరోగా, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కి విశేష‌మైన గుర్తింపు ఉంది. తెలుగువాడ‌యిన‌ప్ప‌టికీ త‌మిళ‌నాటే గుర్తింపు సాధించారు. అయితే తాజాగా ఆయ‌న ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. గ‌తంలో విశాల్‌ ఇరుంబుతిరై అనే చిత్రంలో నటించే సమయంలో గాయపడ్డాడు. అపుడు ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. కానీ, ఆయన తాత్కాలికంగా వైద్యం చేయించుకొని సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సండైకోళి 2 చిత్రం షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. దీంతో ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.Read More


లవర్ తో జాయ్ చేస్తున్న నయనతార

ఓ వైపు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా సాగుతోంది. అత్యధిక రెమ్యూనేషన్ అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో నయన తార రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి షికార్లు చేస్తోంది. ఏకంగా న్యూయార్క్ సిటీలో సందడి చేస్తోంది.ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్ప టికీ, మరోవైపు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన తార విదేశాల్లో చెట్టాపట్టాలే సుకుని తిరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమించుకుం టున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఊతమిస్తూ ఇద్దరూ పబ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు జరుపుకోవడం కోసం విఘ్నేష్‌ శివన్‌ ఇటీవలే న్యూయార్క్‌ వెళ్లాడు. అతనితోపాటు నయన తార కూడాRead More


రాధికా ఆప్టేతో అతిగా ప్ర‌వ‌ర్తించిన హీరోకి షాక్

అందం అభినయం రెండూ ఉన్న అరుదైన హీరోయిన్ రాధికా ఆప్తే. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై బాలకృష్ణ తో లెజెండ్, లయన్ వంటి మాస్ చిత్రాల్లో తో కూడా మెప్పు పొందింది రాధికా. అయితే ఆతర్వాత టాలీవుడ్ లో పురుషాధిక్యం ఎక్కువని అనుచిత వ్యాఖ్యలు చేసి తెలుగు పరిశ్రమ వారి ఆగ్రహాన్ని చవి చూసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అద్భుత నటన తో కంట తడిపెట్టించిన రాధిక ఆ మధ్య ఓ అంతర్జాతీయ చిత్రం ‘పర్చడ’ లో న్యూడ్ గా నటించి సంచలనం సృష్టించింది. ఇదే విషయంలో మీడియా వారి పై కస్సు బుస్సులాడగా రాధికా ఆప్తే కు ఫైర్ బ్రాండ్ లేడీ అనే ముద్ర పడింది. ఈ మరాఠీ భామ ఇటీవలే మరో తమిళ చిత్రం ఒప్పుకుంది.Read More


ద్రౌప‌ది న‌య‌న‌తారే..!

భారతీయ చలనచిత్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో వెయ్యి కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం మ‌హా భార‌తం. బీ. ఆర్. శెట్టి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కుమార్ మీనన్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇక నటీనటుల ఎంపిక ప్రక్రియని కూడా వేగవంతం చేశారు. మోహన్ లాల్ ని ఇప్పటికే ఓ ప్రధాన పాత్రకి ఎంపిక చేయగా ప్రభాస్, నాగార్జున, మహేష్‌ ఇలా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కన్నడలో కూడా అదే మాదిరిగా మహా భారతం నేపథ్యంలో కురుక్షేత్ర అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగాణంతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. మహా భారతంలోని స్త్రీ పాత్రలలో ముఖ్యమైన పాత్ర ద్రౌపది కాగా ,Read More


జేజ‌మ్మ కు మ‌రో గోల్డెన్ ఛాన్స్!

ఇటీవలే బాహుబలి సినిమాతో దేవసేనగా అందరి మన్ననలు అందుకున్న అనుష్కకు, ఆ చిత్రం తరువాత క్రేజ్ మామూలుగా లేదు. అటు గ్లామర్ పాత్రలు, ఇటు డీగ్లామరైజ్డ్ పాత్రలతో ఇప్పటికే అనుష్క తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుంది. మహిళా ప్రాధాన్యత కలిగిన పెద్ద చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఆ సమయంలో ఆమె చేసిన బాహుబలి సాధించిన విజయం గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులో దేవసేన పాత్ర కీలకం కనుక, ఆమె క్రేజ్ మరింత హైట్స్‌కు చేరింది. దీంతో అనుష్కను దృష్టిలో పెట్టుకునే సోలో హీరోయిన్ చిత్రాలు రూపొందించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రుద్రమదేవి, అరుంధతి, భాగమతి వంటి చిత్రాల్లో నటించిన అనుష్క చేతికి, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు రాబోతోందని అంటున్నారు. బాహుబలి స్ఫూర్తితో తమిళ దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ‘సంఘమిత్ర’ సినిమాRead More


టాప్ హీరోపై కేసు

అభిమానుల అత్యుత్యాహం ఒక్కోసారి సెలబ్రిటీ లను ఇబ్బందులకు గురిచేస్తుందనడానికి నిదర్శనంగా విజయ్‌పై పోలీసు కేసు నమోదైంది. విజయ్‌కి వీరాభిమాని అయిన ఒక యువకుడు త్రిశూలం పట్టుకు న్నట్టు విజయ్‌ ఫోటోని రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌ కావ డంతో అందరి దృష్టిలో ఫోటోపైకి మళ్లింది. అయితే ఫోటోలో విజయ్‌ షూస్‌ ధరించి ఉండడంపై హిందూ మక్కల్‌ మున్నని పార్టీ అభ్యంతరం తెలిపింది. షూస్‌ ధరించి త్రిశూలం చేతపట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.