Main Menu

kohli

 
 

టీమిండియా కెప్టెన్ గా అశ్విన్..!

అనిల్ కుంబ్లే త‌ర్వాత మ‌రో ఏస్ స్పిన్న‌ర్ కి సార‌ధ్య బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ లో ప‌ర్య‌టిస్తున్న టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా ర‌విచంద్ర అశ్విన్ కి అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మూడో టెస్ట్ మ్యాచ్ కి కెప్లెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండ‌డం లేద‌ని స‌మాచారం. దానికి కార‌ణాలు మాత్రం ఇంకా వెల్ల‌డికాలేదు గానీ టీమిండియా వ‌ర్గాల్లో చ‌ర్చ ప్రారంభ‌మ‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో కొత్త కెప్టెన్ ఆలోచ‌న మొద‌ల‌య్యింది. వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానేకి అవ‌కాశాలున్న‌ప్ప‌టికీ అత‌డు పూర్తిగా పేల‌మైన ఫామ్ తో ఉండ‌డంతో అశ్విన్ కి అవ‌కాశాలున్నట్టు తెలుస్తోంది. మ‌రో వైపు టీమిండియా రెండోటెస్ట్‌లో అవ మానకరంగా ఓటమి చెందడంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) కోచ్‌, కెప్టెన్‌లను ప్రశ్నించనుంది. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో టీమిండియాRead More


వ‌రుస ప‌రాభ‌వాలు

టీమిండియాకు స్వింగ్ రుచి క‌నిపిస్తోంది. వ‌రుస‌గా రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. రెండో టెస్టులో ఏక‌యితే ఏకంగా రెండు ఇన్నింగ్సుల‌లో క‌లిసి 247 ర‌న్స్ కే చాప చుట్టేసింది. దాంతో ఇంగ్లండ్‌ పర్యటనలో వరసగా రెండో టెస్టులోనూ భారత క్రికెట్‌ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 47 ఓవర్లలో 130 పరుగులకే కోహ్లి సేన ఆలౌటయింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండో టెస్టు నాలుగో రోజుల్లోనే ముగిసింది. వ‌రుస‌గా రెండు టెస్టుల‌లో ఓట‌మి కార‌ణంగా 2-0 తేడాతో టీమిండియా వెనుక‌బ‌డి ఉంది. ఈ సిరీస్‌లో మూడో టెస్టు ఈ నెల 18న ప్రారంభం కానుంది. రెండో టెస్టులో నాలుగో రోజున ముందుగా ఇంగ్లాండ్‌ 396/7 వద్ద జోరూట్‌Read More


17 ఏళ్ల‌కు విరాట్

టీమిండియా ప‌రాజ‌యం ఎలా ఉన్నా కెప్టెన్ కోహ్లీ మాత్రం విరాట ప‌ర్వం న‌డుపుతున్నాడు. టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో కొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. ఆస్ట్రేలియ‌న్ స్టీవ్ స్మిత్ సుదీర్ఘ‌కాల రికార్డ్ కి చెక్ పెట్టాడు. ప్ర‌స్తుతం స‌స్ఫెన్ష‌న్ లో ఉన్న స్మిత్ స్థానంలో టెస్ట్ క్రికెట్ లో టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. ఎడ్జ్ బాస్ట‌న్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 149, రెండో ఇన్నింగ్స్ లో 49 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. దాంతో ఆయ‌న‌కు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్ర‌స్థానం ద‌క్కింది. టెస్ట్ క్రికెట్ లో నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్ అనిపించుకున్న భారత ఆటగాళ్లలో కోహ్లీ ఏడోవాడు. 2011లో సచిన్ ఈ స్టేటస్ సాధించిన తరువాత, 17 ఏళ్ల‌కు ఇప్పుడు కోహ్లీకే ఆ రికార్డు దక్కింది. గతంలో రాహుల్ ద్రవిడ్, గౌతమ్Read More


కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్

కెప్టెన్ కోహ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. గ‌డిచిన సిరీస్ లో ఘోరంగా విఫ‌లం కావ‌డంతో ప‌లువురి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విరాట్ ఈసారి తానేంటో చాటిచెప్పాడు. ఏకంగా టీమిండియా స్కోర్ లో 55శాతం ప‌రుగులు తానే సాధించాడు. ఎడ్జ్ బాస్ట‌న్ లో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ 287 ర‌న్స్ వ‌ద్ద ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఆత‌ర్వాత బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు మంచి ఓపెనింగ్ భాగ‌స్వామ్యం ల‌భించిన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్ ఘోరంగా విఫ‌లం అయ్యింది. ముఖ్యంగా లోకేష్ రాహుల్ 4 ర‌న్స్, దినేష్ కార్తీక్ సున్నాకే అవుట్ కాగా, అజింక్యా ర‌హానే కూడా రాణించలేక‌పోయాడు. దాంతో 100రన్స్ కే 5 వికెట్లు కోల్పోయిన జ‌ట్టుని కోహ్లీ ఒంటిచేత్తో నడిపించాడు. టెయిల్ ఎండ‌ర్స్ స‌హాయంతో ఇంగ్లాండ్ స్కోర్ కి చేరువ‌లోకి తీసుకొచ్చాడు. 218 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయిన త‌ర్వాతRead More


ఎడ్జ్ బాస్ట‌న్ లో ఎడ్జ్ తీసుకున్నారు..

ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా ఎడ్జ్ తీసుకుంది. స్పిన్న‌ర్ అశ్విన్ తిప్పేయ‌డంతో ఆతిథ్య జట్టు ని నియంత్రించారు. జో రూట్, బెయిర్ స్ట్రో రాణించ‌డంతో కొంత గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది. మొత్తంగా టీమిండియా బౌల‌ర్ల‌లో అశ్విన్ , ష‌మీ రాణించారు. ఉమేష్, ఇషాంత్ కూడా తోడ‌య్యారు. దాంతో తొలిరోజు ఆట ముగిసే స‌య‌మానికి ఇంగ్లాండ్ జ‌ట్లు 285 ర‌న్స్ చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (80 పరుగులు), జానీ బెయిర్‌ స్టో (70 పరుగులు) అర్థ సెంచరీలతో రాణించారు. ఈ టెస్టులో ముందుగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 26 వద్ద 8.5 ఓవర్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ తన వికెట్ల వేట ప్రారంభించాడు. అశ్విన్‌ ధాటికి ఫామ్‌లో ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌Read More


కూల్చేసిన కుల్దీప్, శ‌త‌క్కొట్టిన శ‌ర్మ‌

చైనామెన్ దెబ్బ‌కు బ్రిటీష్ బ్యాచ్ బెంబేలెత్తింది. ఇప్ప‌టికే టీ20 సిరీస్ లో రాణించిన కుల్దీప్ యాదవ్ చైనామెన్ బౌలింగ్ కి ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు మ‌రోసారి విల‌విల్లాడారు. తొలి వ‌న్డేలో సునాయాసంగా టీమిండియా విజ‌యం సాధించింది. తొలుత కుల్దీప్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. ప్రారంభంలో ఓసారి, చివ‌రిలో మ‌రోసారి కుల్దీప్ విజృంభించాడు. దాంతో ఆ జట్టు 268 ర‌న్స్ కే ఆలౌట్ అయ్యారు. ఇటీవ‌ల ఆసీస్ ను హ‌డ‌లెత్తించిన ఇంగ్లాండ్ జ‌ట్టు టీమిండియా ముందు మాత్రం తేలిపోయింది. చ‌మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగుల వద్ద ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (103 బంతుల్లో 50; 2 ఫోర్లు) రాణించారు. ఉమేశ్‌ యాదవ్‌ 2,Read More


మ‌ళ్లీ అంతే…చిత్తుచేసిన టీమిండియా

ఐర్లాండ్ తో జ‌రిగిన రెండో టీ20లోనూ అదే ఫ‌లితం క‌నిపించింది. మ‌రోసారి టీమిండియా ఆతిథ్య జ‌ట్టుని చిత్తుగా ఓడించింది. ప‌సికూన‌పై భార‌త బౌల‌ర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా స్పిన్న‌ర్లు సంపూర్ణ ఆధిక్యం కొన‌సాగించారు. మొద‌టి వ‌న్డేలో ఇద్ద‌రూ క‌లిసి ఏడు వికెట్లు తీసిన స్పిన్న‌ర్లు ఈ మ్యాచ్ లో కూడా చెరో మూడు చొప్పున ఆరు వికెట్లు నేల‌కూల్చారు. దాంతో ఐర్లాండ్ జ‌ట్టు భారీ టార్గెట్ తో రంగంలో దిగి చ‌తికిల‌ప‌డింది. 214 పరుగుల విజయలక్ష్యం కాగా కేవ‌లం 12.3 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ జ‌ట్టు 143 పరుగుల తేడాతో నెగ్గినట్లైంది. భారత బౌలర్లలో చాహల్, కుల్దీప్ యాదవ్ చెరి మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, సిద్ధార్ధ్ కౌల్, హార్ధిక్ పాండ్యా చెరొక వికెట్ తీశారు. అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్Read More


ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ

ప్రపంచంలోనే ఖరీదైన ఆటగాళ్లలో కోహ్లీకి స్థానం దక్కింది. వివిధ క్రీడాకారుల సంపాదన వివరాలను ఫోర్బ్స్ పత్రిక తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి స్థానం దక్కడం విశేషం. భారత్‌ నుంచి ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక ఆటగాడు కోహ్లీ ఒక్కడే. ఈ జాబితాలో టాప్‌ 100లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. కోహ్లీ 83వ స్థానంలో నిలిచి, ఇండియన్ ప్లేయర్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటించింది. ఏడాదికి 24 మిలియన్ల డాలర్ల ఆదాయానికిగాను 4మిలియన్ల డాలర్లను జీతంగానూ… మిగతా 20 మిలియన్‌ డాలర్లను వాణిజ్య ఒప్పందాల ద్వారాRead More


కోహ్లీకి ఛాలెంజ్ విసిరిన మంత్రి

టీమిండియా కెప్టెన్ కి ఛాలెంజ్ విసరడం చిన్న విషయం కాదు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ లో కూడా కింగ్ కోహ్లీతో మాటల యుద్దానికి దిగిన వాళ్లు కూడా ప్రతిఫలం చెల్లించారు. అయితే ఇప్పుడు తాజాగా ఛాలెంజ్ విసిరింది సామాన్యుడు కాదు. ఏకంగా పొలిటీషియన్ టర్న్డ్ ఒలింపియన్. అందుకే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఛాలెంజ్ చర్చనీయాంశం అయ్యింది. క్రీడల మంత్రి విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ కోహ్లీ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ దేశ ప్రజలకు ట్విటర్‌లో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరారు. స్వయంగా బస్కీలు తీస్తున్న తన వీడియోను అప్‌లోడ్‌ చేశారు. అంతేకాకుండా విరాట్‌ కోహ్లీ, ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, హీరో హృతిక్‌ రోషన్‌కు సవాల్‌ విసిరారు. వారు వర్కవుట్‌ చేస్తున్న వీడియోలు, ఫొటోలనుRead More


కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..

ఉద్దండుల వ‌ల్ల కానిది విరాట్ సాధించాడు. సచిన్, గంగూలీ, ధోనీ వంటి కెప్టెన్లు సాధించ‌లేని కోహ్లీ సేన సాధించి చూపింది. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఆ జ‌ట్టును సునాయాసంగా ఓడించింది. ఆరు వ‌న్డేల సిరీస్ ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. తొలి మూడు వ‌న్డేల‌లో సునాయాసంగా గెలిచిన టీమిండియా నాలుగో వ‌న్డేలో అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యింది. అయితే పోర్ట్ ఎలిజ‌బెత్ లో జ‌రిగిన ఐదో వ‌న్డేలో మాత్రం మ‌రోసారి నెంబ‌ర్ వ‌న్ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించింది. 73 ప‌రుగుల తేడాతో సునాయాసంగా విజ‌యం సాదించింది. ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి 4-1 తేడాతో సిరీస్ ని ద‌క్కించుకుంది. చివ‌రి వ‌న్డే 17నాడు జ‌ర‌గ‌బోతోంది. కొంత‌కాలంగా ఫామ్ లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న రోహిత్ శ‌ర్మ బ్యాట్ కి ప‌నిచెప్ప‌డంతో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 50Read More