Main Menu

khaidi no 150

 
 

పవన్ ఇప్పడు హై సెక్యురిటీ పర్సన్…

chiranjeevi-wants-to-see-that-step-of-pawan-kalyan_b_2103160645

మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో తమ్ముడు పవన్ గురించి మాట్లాడుతూ, అతనెప్పుడూ మితభాషి అని, నలుగురితో కలిసి ఉండలేడని అన్నారు. తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని అన్నారు. బయటి ప్రపంచమే పవన్‌ను కొత్తగా చూస్తోందని కాని అతడు తనకెప్పుడు పాతేనని అన్నారు. అంతే కాకుండా పవన్ ప్రవర్తనలో ఇప్పటికీ ఎలాంటి మార్పులు రాలేదని అన్నారు. ఇప్పటికీ అవే లక్షణాలని, దానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాంచరణ్ ఫంక్షన్‌ను పవన్‌ను ఆహ్వానించారని కాని తనకు బాధ్యతలు ఎక్కువై రాలేక పోయాడు. తను రాకపోయినా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడని గుర్తు చేశారు.


ఎన్టీఆర్ కన్నా వెనుకంజలో చిరు…

Jr-NTR-Chiranjeevi

టాలీవుడ్లో ఎన్టీఆర్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జనతాగ్యారేజ్. ఈ సినిమాతో ఎన్టీఆర్ పలు రికార్డులను తన ఒరలో చేర్చుకున్నాడు. ఇక, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం విడుదలకు సిద్ధమైంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఎందుకూ అంటే.. ఓ విషయంలో చిరు ఖైదీ నంబర్ 150 సినిమా తారక్‌ను దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ సినిమా విడుదల కాబోతోంది. దానికన్నా ముందు స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు కర్ణాటకలో. ఆ ప్రీమియర్ షోల విషయంలో జనతాగ్యారేజ్‌ను దాటలేకపోయింది చిరు ఖైదీ నంబర్ 150. కన్నడ నాట జనతాగ్యారేజ్‌కు 24 ప్రీమియర్ షోలు వేస్తే.. ఖైదీ నంబర్ 150కి మాత్రం 18 స్పెషల్ షోలే వేస్తున్నారట. వాస్తవానికి ధృవ సినిమాతోనే జనతాగ్యారేజ్Read More


సేం టు సేం దించేసి….

chiru vijay

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ప్రిరిలీజ్ వేడుక విజయవాడ-గుంటూరు హైవేలోని హాయ్‌లాండ్‌లో ఘనంగా జరిగింది. ఆ వేడుక వేదికగానే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. తమిళ్ సినిమా కత్తికి ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సినిమా మొత్తాన్ని దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు చెప్పారు సినిమా దర్శక నిర్మాతలు. చిరంజీవి 150వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వీవీ వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే.. మార్పులు చేర్పులు చేసినట్టు చెబుతున్నా.. తమిళ్ ఒరిజినల్ సినిమా కత్తి ట్రైలర్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఖైదీ నంబర్ 150 ట్రైలర్‌నూ రూపొందించారు. సినిమాలో మార్పులు చేర్పులన్నది విడుదలయ్యాక తెలుస్తుందేమో కానీ.. ట్రైలర్ విషయంలో మాత్రం మక్కీ టు మక్కీ దించేశారంటూ ఫిల్మ్‌నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.Read More


స్వీట్ వార్నింగ్ తో స‌త్తా చాటిన బిగ్ బాస్..!

khaidi-no-150-768x432

తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా సందడి మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన తన సొంత సినిమాలో సొంత గొంతుతో ప్రేక్షకులను పలకరించారు. విలన్ల దుమ్ముదులిపారు. గట్టి పంచ్‌ డైలాగ్‌ పేల్చారు. అదే స్టైల్‌తో, అదే నడకతో మెగాస్టార్‌ మెరుపు మరింత రెట్టింపయిందనుకునేలా చేశారు. ఆయన నటిస్తున్న ఖైదీ నంబర్‌ 150 చిత్ర టీజర్‌ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌తోనే అభిమానుల ఆశలు చిగురింపజేసిన ఆయన ఈ టీజర్‌తో చిత్రంపై మరోసారి అంచనాలు అమాంతం పెంచేశారు. తన దూకుడు తగ్గలేదనిపించారు. అదిరిపోయే నేపథ్య సంగీతం, పోరాట దృశ్యంతో ప్రారంభమైన ఈ టీజర్‌ విలన్‌కు ఓ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇవ్వడం ద్వారా ముగిసింది. ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా..కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌’ అని పంచ్‌ డైలాగ్‌Read More


యూర‌ప్ లో చిరు జోరు

1479228392.chiru

ఖైదీ జోరు సాగుతోంది. యూర‌ప్ లో సంద‌డి చేస్తున్నాడు. పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో సాగుతున్నాడు. చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కాజల్‌ అగర్వాల్‌ కథనాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్‌ సంస్థ బ్యానర్‌లో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గీతాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను వినాయక్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈనెలతో షూటింగ్‌ పూర్తి కానుంది. డిసెంబర్‌లో పోస్టు ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మెగా మువీస్ కి షాక్..!

chiru

మెగా అభిమానుల‌కు ఇది షాకింగ్ న్యూస్. అటు మెగాస్టార్..ఇటు మెగా ప‌వ‌ర్ స్టార్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ క‌లిగించ‌డం ఖాయంగా మారుతోంది. నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ తో న‌యా సినిమాల‌న్నీ పోస్ట్ పోన్ చేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప్ర‌బావం ఇప్పుడు మెగా మువీస్ ను తాకుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ధృవ, మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నంబర్ 150 సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది షాక్ ఇచ్చే వార్త. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమా ఆడియో రిలీజ్ కూడా అయిపోయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ధృవ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల విషయంలోRead More


బాహుబ‌లి ‘ఖైదీ’

chiru

ఒకరు మెగాస్టార్.. ఇంకొకరు యంగ్ రెబల్ స్టార్. ఇద్దరూ ఆత్మీయంగా కలుసుకున్న వేళ పక్కనే రాజమౌళి చిరునవ్వులు చిందిస్తున్న వేళ.. ఈవేళ ఏ వేళ అయ్యుంటుందా? అని ఆలోచించడం మొదలుపెట్టేశారా? మరేం లేదు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నం. 150’, ప్రభాస్ ‘బాహుబలి 2’ షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో జరిగాయి. రెండు సినిమాల షూటింగ్ లొకేషన్ దగ్గర దగ్గరే కావడంతో ఈ స్టార్స్ ఇద్దరూ మీట్ అయ్యారు. షాట్ గ్యాప్‌లో ‘ఖైదీ నం. 150’ లొకేషన్‌కి వెళ్లిన ప్రభాస్, రాజమౌళీలను చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.


విజ‌య్ మాల్యాతో చిరు సినిమా..!

chiru-150-film-updates-600x400

చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’లో.. విజయ్ మాల్యా తరహా పాత్ర ఒకటి ఉండబోతోందట. తమిళంలో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేయబోతున్నాడు. దాంతో చిరు పక్కన తొలిసారి నటించే అవకాశం ఈ ముంబై నటుడికి దక్కింది. తన వయసు కంటే చాలా పెద్దవయసు పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నానని, దర్శకుడు ఆ పాత్రను ఏమాత్రం మార్చకపోయినా.. తెలుగులో టేకింగ్ మాత్రం కొంత విభిన్నంగా ఉంటుందని అరోరా చెప్పాడు. ఇది చాలా విభిన్నమైన విలన్ పాత్ర అని తెలిపాడు. సినిమా మొత్తం తాను సూట్లలోనే కనిపిస్తానని, విజయ్ మాల్యా మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తాను అచ్చం అలాగే కనిపిస్తానని అన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూలు పూర్తయింది. మళ్లీ బుధవారం నుంచి సెట్లRead More


‘ఖైదీ’ విడుదల తేదీ ఖరారైంది…

khaidee no.150

‘ఖైదీ’ విడుదల తేదీ ఖరారైంది.అవునండి, మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’విడుదల తేదీ ఖరారైంది.ఇది మెగాస్టార్ అభిమానులకు నిజంగా శుభవార్తే.వివరాల్లోకి వెళితే.. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్ర విడుదలపై సినీ దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చారు.వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని ఆయన వెల్లడించారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను వి.వి వినాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్ భారీ హిట్‌ అందుకోవడం సంతోషంగా ఉందని వి.వి. వినాయక్ అన్నారు.