Main Menu

kcr

 
 

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

తెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే టీవీ చ‌ర్చ‌ల్లో రాజేసిన వేడి కూడా క్షేత్ర‌స్థాయిలో లేకుండా సాధార‌ణంగా ముగిసింది. పోలింగ్ శాతం మీద కొంద‌రు పెద‌వి విరుస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లితాలు మాత్ర‌మే మిగిలి ఉండ‌డంతో ఎవ‌రి భ‌విత‌వ్యం ఎలా ఉంద‌నే దానిపై ఉత్కంఠ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆస‌క్తిగా మారాయి. మొత్తంగా చూస్తే మ‌హాకూట‌మికి కొంత మొగ్గు ఉంద‌న్న‌ది మెజార్టీ అబిప్రాయంగా ఉంది. ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధ‌మ‌వుతూ సెప్టెంబ‌ర్ లో అసెంబ్లీని ర‌ద్దు చేసిన నాడు కేసీఆర్ లో ఉన్న ధీమా మొత్తం కోల్పోయిన‌ట్టుగా పోలింగ్ బూత్ ల వ‌ద్ద ప‌రిస్థితి క‌నిపించింది. టీడీపీ, కాంగ్రెస్ ల తో పాటు టీజేఎస్, సీపీఐ కూట‌మి కార‌ణంగా చివ‌రి నిమిషంలో సంద‌డి చేశారు. పంపిణీల విష‌యంలోRead More


తెర‌మీద‌కు ల‌గ‌డ‌పాటి భార్యలు…!

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్. ఒకప్పుడు ఆంద్రా ఆక్టోప‌స్ గా చెప్పుకునే ఈ స‌ర్వేల సంచ‌ల‌నం ఇప్పుడు తెలంగాణా ఎన్నిక‌ల‌లో హాట్ టాపిక్ అయ్యారు. ల‌గ‌డ‌పాటి చుట్టూ పెద్ద చ‌ర్చే సాగింది. అయితే ల‌గ‌డ‌పాటి మాట‌కు ఆయ‌న ఇంట్లోనే భిన్న‌మైన వాద‌న‌లు వినిపించ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. ఒక‌వైపు కూట‌మి స‌త్తా చాటుతుంద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెబుతుండ‌గానే ఆయ‌న భార్య జానకీ రాజ‌గోపాల్ మాత్రం భిన్న‌మైన అంచ‌నాలు వేశారు. త‌న ఫేస్ బుక్ వాల్ లో జాన‌కీ రాజ‌గోపాల్ చేసిన పోస్ట్ ప్ర‌కారం టీఆర్ఎస్ 55 నుంచి 70 సీట్ల‌ను ద‌క్కించుకోబోతోంది. కాంగ్రెస్ సుమారు 35 సీట్ల‌కు ప‌రిమితం అవుతుండ‌గా, టీడీపీకి 4 నుంచి 7 సీట్లు , బీజేపీకి 3 నుంచి 5 సీట్లు ద‌క్కుతాయ‌ని అంచ‌నాలు వేశారు. దాంతో టీఆర్ఎస్ అధికారానికి ఢోకా లేద‌ని తేల్చేశారు. ఎంఐఎం మ‌ద్ధ‌తుRead More


చంద్ర‌బాబులో విశ్వాసం పెంచుతున్న తెలంగాణా

ఏపీలో అధికార తెలుగుదేశం మ‌రోసారి పీఠం ద‌క్కించుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకు తెలంగాణా ఎన్నిక‌లు పునాది కావాల‌ని ఆశిస్తోంది. సొంత రాష్ట్రంలో ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించేందుకు తెలంగాణా వ్య‌వ‌హారాలు త‌న‌కు తోడ్ప‌డ‌తాయని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌హాకూట‌మి పేరుతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తో చెలిమి చేస్తూ ప్ర‌చార‌ప‌ర్వంలో జోరు పెంచుతున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు తొలుత తెలంగాణా ఎన్నిక‌ల ప‌ర్వానికి దూరంగా ఉండాల‌ని భావించారు. అత్య‌వ‌స‌ర‌మ‌యితే ఒక‌టి రెండు చోట్ల స‌భ‌ల‌లో పాల్గొని స‌రిపెట్టుకోవాల‌నే ఉద్దేశం వెలిబుచ్చారు. నేటికీ నారా లోకేష్ ని ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉంచ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కానీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు త‌న స‌మ‌యాన్నంతా తెలంగాణాకే వెచ్చిస్తున్నారు. ఇప్ప‌టికే స‌భ‌లు , రోడ్ షోల‌తో ఒక రౌండ్ ప‌ర్య‌ట‌న చేసి ఇప్పుడు రెండోసారి ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార గ‌డువుRead More


కారు పార్టీలో క‌ల‌వ‌రం రేపుతున్న స‌ర్వే

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆస‌క్తిగా మారాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై వాటి ప్ర‌భావం ఉంటుంద‌ని తేల‌డంతో అంద‌రి దృష్టి తెలంగాణా వైపు మ‌ళ్లింది. అదే స‌మ‌యంలో స‌ర్వేల వైపు అంద‌రి చూపు మ‌ళ్లింది. ఇప్ప‌టికే జాతీయ సంస్థ‌ల స‌ర్వేల ప్ర‌కారం అటు టీఆర్ఎస్, ఇటు మ‌హా కూట‌మికి స‌మాన‌వ‌కాశాలు క‌నిపిస్తుండ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక తాజాగా ఆంధ్రా ఆక్టోప‌స్ గా భావించే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా వెల్ల‌డించిన స‌ర్వే మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ల‌కు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తేలిన‌ట్టు లగ‌డ‌పాటి స్ప‌ష్టం చేశారు. దాంతో అధికార పార్టీ మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఏకంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పడం విశేషం. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్Read More


వైసీపీ ని టెన్ష‌న్ పెడుతున్న తెలంగాణా!

రాజ‌కీయాల్లో చిన్న అవ‌కాశాన్ని కూడా సానుకూలంగా మ‌ల‌చుకున్న వారే రాణిస్తారు. చిన్న చిన్న అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌యితే చివ‌ర‌కు చేతులెత్తేయ‌క త‌ప్ప‌దు. అందుకే తెలంగాణా ఎన్నిక‌ల రూపంలో కేసీఆర్ అందించిన అవ‌కాశం త‌న‌కు ఉప‌యోగ‌పడాల‌ని జ‌గ‌న్ ఆశిస్తున్నారు. మ‌హాకూట‌మి పేరుతో తెలంగాణా టీడీపీ మిత్ర‌ప‌క్షాల‌తో జ‌త‌గ‌ట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలో దిగింది. 14 స్థానాల‌కు పోటీ చేస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో 14మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న టీడీపీ ఈసారి అదే నెంబ‌ర్ కి పోటీ చేయాల్సి రావ‌డం విచిత్ర‌మే. అయితే తెలంగాణా ఎన్నిక‌ల్లో పోటీకి వైసీపీ దూరంగా ఉంది. త‌న‌కు తాను జాతీయ అధ్య‌క్షుడిగా చెప్పుకున్న జ‌గ‌న్ కూడా తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలో దిగితే అది కాంగ్రెస్ ఓట్ల‌కు గండికొట్టేది. రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో కొంత ఫాలోయింగ్ ఉన్న జ‌గ‌న్ కి ఏమేర‌కు ఓట్లుRead More


జ‌గ‌న్ కి సీఎం ఫోన్

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌పై జ‌రిగిన దాడి క‌ల‌క‌లం రేపుతోంది. వివిధ వ‌ర్గాల నేత‌లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే స‌మ‌యంలో అధికార‌ప‌క్షం ఎదురుదాడికి దిగుతోంది. ఈ వ్య‌వ‌హ‌రం ఇలా సాగుతుండ‌గానే సీఎం నేరుగా జ‌గ‌న్ కి ఫోన్ చేశారు. దాంతో కేసీఆర్ ఫోన్ లో ప‌రామ‌ర్శ చేయ‌డం విశేషంగా మారింది. ఘ‌ట‌న జ‌రిగిన ఆరేడు గంట‌ల‌యినా స్పందించ‌క‌పోయినా పోరుగు రాష్ట్ర సీఎం వెంట‌నే స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. వైఎస్‌ జగన్ పై జరిగిన దాడి ఘ‌ట‌న ప‌ట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను ఫోన్లో పరామర్శించారు. గాయం తీవ్రత, చికిత్స వివరాలు జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.


ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది. ఆయ‌న‌కు నోటీసులు సిద్ధ‌మ‌వుతున్నాయి. దాదాపుగా ఈడీ రంగంలో దిగ‌డం ఖాయ‌మ‌నే క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. అయితే ఈడీ ఒక్క‌టే సిద్ధ‌మవుతోందా లేక సీబీఐ కూడా తోడ‌వుతుందా అన్న‌దే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబుని ఇక్క‌ట్ల‌లో పెట్టే దిశ‌లో ప‌రిణామాలున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్టీఫెన్ స‌న్ ఓటుకోసం 5 కోట్లు ఇచ్చేందుకు ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లావాదేవీలు న‌డ‌ప‌డం, బ్రీఫ్డ్ మీ అంటూ చంద్ర‌బాబు ఆడియో టేపుల్లో దొరికిపోవ‌డంతో అడ్వాన్స్ గా ఇచ్చిన 50ల‌క్ష‌లు పోనూ మిగిలిన 4. 5 కోట్ల వ్య‌వ‌హారం మీద విచార‌ణ సాగుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఈడీ లేఖ రాయ‌డంతో కేసీఆర్ ప్ర‌భుత్వం నోటీసులిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌చారం మొద‌ల‌య్యింది. దాంతో మోడీ ప్ర‌భుత్వంRead More


కేసీఆర్ న‌మ్మినా…చంద్ర‌బాబు న‌మ్మ‌డం లేదు!

తెలంగాణా సీఎం కేసీఆర్ పెట్టిన ప‌రీక్ష ఇప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్ అధికార ప‌క్షాన్ని అత‌లాకుతలం చేసేలా ఉంది. సీట్ల కేటాయింపు విష‌యంలో కేసీఆర్ చేస్తున్న సాహ‌సం చంద్ర‌బాబుకి చిక్కులు తెచ్చిపెట్టేలా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో కేసీఆర్ ధైర్యంగా ముంద‌డుగు వేశారు. కొంద‌రి మీద వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ వెన‌కాడ‌లేదు. కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రిని మాత్ర‌మే త‌ప్పించారు. త‌న‌ను చూసి ఓటేస్తారని, తాను చేసిన కార్య‌క్ర‌మాలే మ‌ళ్లీ గెలిపిస్తాయ‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. అదే మాట అంద‌రికీ చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో చంద్రబాబు తీరు ఎలా ఉంటుందోన‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. కేసీఆర్ మాదిరిగా చంద్రబాబుకి ధైర్యం ఉందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. సిట్టింగుల‌ను కొన‌సాగించి, త‌న‌ను చూసి ఓటేయ‌మ‌ని అడ‌గ‌గ‌ల ద‌మ్ముందా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ప‌లువురు తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇసుక‌, మ‌ట్టిRead More


కేసీఆర్ అంచ‌నాలు త‌ప్పుతున్నాయా?

ఇదే అనుమానం మొద‌ల‌వుతోంది. ముఖ్యంగా ముంద‌స్తు విష‌యంలో కేసీఆర్ ఆశ‌ల‌కు,కేంద్ర‌లోని పెద్ద‌ల అంచ‌నాల‌కు మ‌ధ్య వైరుద్యం క‌నిపిస్తోంది. దాంతో మిగిలిన నాలుగురాష్ట్రాల‌తో క‌లిపి తెలంగాణాలో ఎన్నిక‌లు సందేహంగా మారుతున్నాయి. అదే జ‌రిగితే కేసీఆర్ ఆశ‌ల‌కు పెద్ద గండిప‌డుతుంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా ఈసీ చేసిన వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్‌ఎస్ ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని సీఈసీ రావత్ వ్యాఖ్యానించారు. రావత్ చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఈసీ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయని టీఆర్‌ఎస్Read More


కేసీఆర్ కొంప‌ముంచేలా క‌మ‌లం!

కేసీఆర్ క‌ల‌లు పండుతాయా..ఆయ‌న ప్ర‌క‌టించిన‌ట్టుగా న‌వంబ‌ర్ లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసి, డిసెంబ‌ర్ లో కొత్త అసెంబ్లీలో మ‌ళ్లీ అధికార‌ప‌క్షంగా అడుగు పెడ‌తారా..ఆయ‌న ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు గెలుపు గుర్రాలేనా..ఉద్య‌మ కాలంలో మాదిరిగా ఇప్పుడు కూడా కేసీఆర్ ఎవరిని నిల‌బెడితే వారికే ఓట్లేసే ప రిస్థితి ఉందా..ఇదే చ‌ర్చ ఇప్పుడు సాగుతోంది. అదే స‌మ‌యంలో అస‌లు ఎన్నిక‌లు జ‌రుగుతాయా లేదా అన్న అంశం మీద కూడా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. వాస్త‌వానికి ప్ర‌స్తుం బంతి కేసీఆర్ కోర్ట్ నుంచి కేంద్రం ప‌రిధిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏం చేసినా కేంద్రం నిర్ణ‌యం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక్క‌డే క‌మ‌ల‌నాధుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడే ఎన్నిక‌లు నిర్వ‌హించడం ద్వారా కాంగ్రెస్ దృష్టి మ‌ర‌ల్చ‌డం అనే ల‌క్ష్యంతో పాటుగా చంద్రబాబుకి చెక్ పడుతుంద‌నే అంచ‌నాలో మోడీ ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే కేసీఆర్ కి సంపూర్ణంగాRead More