Main Menu

KAPU RESERVATION

 
 

ఉరివేసుకుంటా: కాపు కార్పోరేష‌న్ చైర్మ‌న్

kapu

కాపు కార్పోరేష‌న్ చైర్మ‌న్, చంద్ర‌బాబు ముఖ్య అనుచ‌రుడు చ‌ల‌మ‌ల‌శెట్టి రామానుజ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంలో ఆయ‌న సూటిగా స్పందించారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖాయం అని ప్ర‌క‌టించారు. రిజ‌ర్వేష‌న్లు ద‌క్క‌క‌పోతే తాను ఉరివేసుకుంటాన‌ని కూడా ప్ర‌క‌టించేశారు. నూజివీడులో జ‌రిగిన కాపు వ‌న స‌మారాధ‌న‌లో చంద్ర‌బాబును పొగ‌డ‌డానికి రామానుజ ప్ర‌య‌త్నించిన‌ప్పుడు కొంద‌రు అడ్డుకున్నారు. దాంతో సీరియ‌న్ రామానుజయ మైక్‌ తీసుకుని.. మంజునాథ కమిషన్‌ నివేదిక ఇచ్చిన తరువాత కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని ప్రకటించారు. మంజునాథ కమిషన్‌ ఇప్పటికే పది జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించిందని, నివేదిక ఇచ్చిన తరువాత క్యాబినేట్‌లో ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపుతారని ఆయన చెప్పారు.


తుని విధ్వంసం కేసులో కీలక మలుపు…

tuni

కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ తునిలో జరిగిన బహిరంగ సభ విధ్వంసానికి దారితీసి రత్నాచల్ రైలును తగులబెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తునిలో జరిగిన విధ్వంసం కేసులో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, నెంబర్‌ వన్‌ న్యూస్‌ చానెల్‌ యజమాని సుధాకర్‌నాయుడులకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.


మీరు తేల్చ‌క‌పోతే రోడ్డెక్కేస్తాం..!

Mudragada

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే తాము అడుగుతున్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు ఈ నెల ఆఖరుతో ముగుస్తుందని, అలాగే మంత్రివర్గ ఉపసంఘం గడువు కూడా సెప్టెంబర్ 7న ముగుస్తుందని.. అందువల్ల ఇచ్చిన హామీ నెరవేరుస్తారో.. రోడ్డెక్కమంటారో చంద్రబాబు తేల్చుకోవాలని పేర్కొన్నారు. కడపలో ఒక వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని ఘటనలో చంద్రబాబు చాలా మందిని ఇబ్బందులకు గురి చేశారన్నారు. గడువు ముగిసేలోగా హామీల అమలు ప్రక్రియ మొదలు కాకపోతే మరలా తాము రోడ్డెక్కక తప్పదని ఆయన హెచ్చరించారు. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడటం తగదని విమర్శించారు.


వారిని బీసీల్లో చేర్చవద్దు….

bc's

ప.గో.జిల్లా ఆచంటలో కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ బీసీ కులాల నాయకులు ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం కాపులను బీసీలో చేర్చితే ఉద్యోగ, ఆర్థిక, సామాజిక పరంగా వెనుకబడిన కులాలు తీవ్రంగా నష్టపోతాయని మంజునాథ్‌ కమిషన్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.దీనివల్ల బి సి కులాలకు సంబంధించి అన్ని తరగతుల వారూ,ప్రత్యేకంగా విద్యార్ధులు తీవ్రంగా నస్టపోతారు.అంతేకాకుండా మా కులస్తులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని వాపోయారు.అంతేకాకుండా ఒకవేళ బి సి ల్లో చెర్చితే తరువాత జరగబోయె పరిణామాలకు ప్రభుత్వమే బద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.