Main Menu

kamineni srinivas

 
 

మోడీ-వెంక‌య్య-బాబు మ‌ధ్య‌లో కామినేనికి షాక్

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విర‌క్తి చెందారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు ఇక దూరం అంటూ ప్ర‌క‌టించేశారు. పోటీలో ఉండ‌డం లేద‌ని తేల్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారిగా విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్ట‌గానే ఆయ‌న‌కు అమాత్య హోదా ద‌క్కింది. బీజేపీ కోట‌లో ఎమ్మెల్యే సీటు, మంత్రి ప‌ద‌వి ఆయ‌న‌కు ద‌క్క‌డం వెనుక వెంక‌య్య నాయుడు ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న మాట కాద‌న‌లేని నిజం. తాజాగా త‌న రిటైర్మెంట్ విష‌యంలో కూడా వెంక‌య్య నాయుడు దారిలోనే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు క్రియాశీల రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇప్పుడు ఆయ‌న అదే బాట‌లో కామినేని న‌డుస్తున్నారు. కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కామినేని విజ‌యం సాధించారు. నాలుగేళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ, బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త చెడిన త‌ర్వాతRead More


కామినేని స్కెచ్ తో టీడీపీ నేత‌కు పొగ‌

ఏపీ మంత్రిగా ఆయ‌న దాదాపుగా నియోజ‌క‌వర్గానికి దూరంగా గ‌డిపారు, నాలుగేళ్ల పాటు రాష్ట్ర‌మంతా తిరిగారు. దాంతో కామినేని శ్రీనివాస్ సొంత నియోజ‌క‌వ‌ర్గం కైక‌లూరులో ఆయ‌న ప‌ట్ల కొంత అసంతృప్తి క‌నిపించింది. ముఖ్యంగా అనుచ‌రుల హ‌వాతో సామాన్యులు స‌త‌మతం అయ్యారు. మంత్రి అందుబాటులో లేకపోవ‌డం, సాధార‌ణ స‌మ‌స్య‌ల్లో కూడా కొంద‌రు కామినేని అనుచ‌రులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో కైక‌లూరు వాసులు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. ఈ ప‌రిస్థితిని మాజీ మంత్రి గ‌మ‌నించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముంగిట ప‌రిస్థితి చ‌క్క‌దిద్దుకోకపోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్టుంగా ఉంది. దాంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత గ‌త కొంత కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌యం కేటాయిస్తున్నారు. ప‌లువురితో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. బీజేపీకి ఎలానూ అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున బ‌రిలో దిగే యోచ‌న‌లో ఉన్న కామినేని ఉన్నారు. అదే స‌మ‌యంలో కైక‌లూరుRead More


కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్

క‌త్తి మ‌హేష్..ఘాటు ట్వీట్ల‌తో హ‌ల్ చ‌ల్ చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్న క్రిటిక్. తాజాగా ఆయ‌న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పై దృష్టిపెట్టారు. తాజాగా రాజీనామా చేసిన కామినేని వ్య‌వ‌హారాల‌పై క‌త్తిలాంటి కామెంట్ చేశారు. దాంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అది వైర‌ల్ గా మారుతోంది. ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీ కూడా వెళ్లి, వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ధ‌ర్నా నిర్వ‌హించిన క‌త్తి మ‌హేష్ సెటైర్ హాట్ టాపిక్ అవ‌తోంది. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో ఇది చాలామందిని ఆక‌ట్టుకుంటోంది. దానికి ముందు టాలీవుడ్ హీరోల‌త మీద ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక హోదాపై స్పందించ‌ని హీరోల‌ను త‌ప్పుబ‌ట్టారు.Read More


బాధ్యతల నుంచి తప్పుకుంటానంటున్న మంత్రి

ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్దమంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యం రేకెత్తించారు. మంత్రి ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి పరిణామాలతో ఆయన మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. తీవ్రంగా కలత చెందిన ఆయన తన మంత్రి పదవిని సైతం వదులుకోవడానికి అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యానించారు. తాను ఎంతో బాధ్యతగా వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, అయినప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖపై ఇటీవల తరచూ ఆరోపణలను గుప్పిస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. వైద్యారోగ్యశాఖపై చేసిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ టెండర్ల ద్వారానే నిర్మాణ పనులు గుత్తేదార్లకు అప్పగిస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులను పారదర్శకంగానే నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నాపై నిందలుRead More


ఆ క్యాస్ట్ మంత్రులే సేఫ్..!

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు కావ‌డంతో అంద‌రిలో క‌ల‌క‌లం రేగుతోంది. పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తుంది. ఉండేదెవ‌రు, ఊడేదెవ‌ర‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. ఇప్ప‌టికే కొంద‌రికి ఊస్టింగ్ త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జోరుగా ఉంది. అయినా వారు కూడా చివ‌రి వ‌ర‌కూ త‌మ ప్ర‌య‌త్నాలు సాగించాల‌ని చూస్తున్నారు. ఇక ఆశావాహులు మాత్రం గ‌ట్టి ప‌ట్టు ప‌డుతున్నారు. ఏకంగా ఒకేసారి ప‌ది మంది వ‌ర‌కూ అవ‌కాశం ఉండ‌డంతో త‌మ అదృష్టానికి ప‌రీక్ష‌గా భావిస్తున్నారు. ఇద్ద‌రు బాబుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో య‌మ బిజీగా గ‌డుపుతున్నారు. అయితే ఈసారి క్యాబినెట్లో సేఫ్ గా సేఫ్ గా క‌నిపిస్తున్న ప‌ది మందిలో ఏకంగా ఐదుగురు క‌మ్మ సామాజిక‌వ‌ర్గ మంత్రులు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఏపీ క్యాబినెట్ లో చంద్ర‌బాబుతో క‌లుపుకుని 19మందికి ఐదుగురు క‌మ్మ నేత‌లున్నారు. వారిలో దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, ప్ర‌త్తిపాటిRead More


మ‌ళ్లీ నోరుపారేసుకున్న మంత్రి

మొన్న అనంత‌పురం..ఇప్పుడు క‌డ‌ప‌. ..ప్లేసులు మారినా..ఆ మంత్రి తీరు మార‌లేదు. అప్ప‌ట్లో అధికారుల మీద‌..ఇప్పుడు కార్మికుల మీద‌..కామినేని శ్రీనివాస్ ధోర‌ణి మాత్రం దూకుడుగానే సాగింది. నోరు అదుపు త‌ప్పి అడ్డ‌గోలుగా న‌డిచింది. ‘ఎవర్రా మీరు.. మీకేం పని పన్రా ఇక్కడ’ అంటూ సాక్షాత్తు కడప కలెక్టరు కె.వి.సత్యనారాయణ నోరుపారేసుకున్నారు. పనికి రాని నా..ళ్లంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానినేని శ్రీనివాసరావు బూతుల పారాయణం అందుకున్నారు. మంత్రి ఏంటి, బూతుపురాణాలేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది అక్షరాల నిజం. వైద్యసేవల్లో చేదోడు వాదోడుగా తమవంతు సహకారం అందించే రిమ్స్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించమని అడిగినందుకే ఈ ఆక్రోశమంతా. కడప జిల్లాలోని రిమ్స్‌ వైద్యశాలను పరిశీలించడానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడానికిRead More


ఎంసెట్ లీక్ కాలేదు:సాక్షి కుట్ర‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష పత్రం లీకు కాలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. విద్యార్ధుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఏపీలోను ఎంసెట్ లీకు అయ్యిందంటూ పనిగట్టుకొని వైకాపా చేస్తున్న దృష్ప్రచారాని మంత్రి కామినేని ఖండించారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడారు. పోలీసులు,ఆధికారులతో మాట్లాడిన తరువాతే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని మంత్రి కామినేని స్పష్టం చేశారు. ఏపీ ఎంసెట్ లో ఎలాంటి తప్పు జరుగలేదని పునరుద్ఘాటిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్ట్ 6,7,8 తేదిల్లో ఏపీ లో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. ఏపీలో ఎంసెట్ పేపరులో లీక్ అయ్యినట్లు ఒక పత్రికలో వచ్చిన విషయం అబ్ధధం అని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేసే కుట్రలో భాగంగానే వైకాపాకుRead More


వెంక‌య్య‌కు మ‌రో షాక్: సోము వీర్రాజుకే పట్టం..!

ఏపీ క‌మ‌ల‌ధారిగా సోము వీర్రాజు ఖాయ‌మ‌యిన‌ట్టు స‌మాచారం. గ‌తంలోనే అమిత్ షా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డిన‌ట్టు తెలుస్తోంది. అనేక‌మంది అడ్డంకులు పెట్టిన‌ప్ప‌టికీ ఆఖ‌రికి సోముకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు మురళీధర్ రావు, రాం మాధవ్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వీరితో పాటు ఏపీకి చెందిన నేతలు పురందేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశంRead More