Main Menu

kaikaluru

 
 

మోడీ-వెంక‌య్య-బాబు మ‌ధ్య‌లో కామినేనికి షాక్

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విర‌క్తి చెందారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు ఇక దూరం అంటూ ప్ర‌క‌టించేశారు. పోటీలో ఉండ‌డం లేద‌ని తేల్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారిగా విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్ట‌గానే ఆయ‌న‌కు అమాత్య హోదా ద‌క్కింది. బీజేపీ కోట‌లో ఎమ్మెల్యే సీటు, మంత్రి ప‌ద‌వి ఆయ‌న‌కు ద‌క్క‌డం వెనుక వెంక‌య్య నాయుడు ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న మాట కాద‌న‌లేని నిజం. తాజాగా త‌న రిటైర్మెంట్ విష‌యంలో కూడా వెంక‌య్య నాయుడు దారిలోనే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు క్రియాశీల రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇప్పుడు ఆయ‌న అదే బాట‌లో కామినేని న‌డుస్తున్నారు. కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కామినేని విజ‌యం సాధించారు. నాలుగేళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ, బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త చెడిన త‌ర్వాతRead More


కామినేని స్కెచ్ తో టీడీపీ నేత‌కు పొగ‌

ఏపీ మంత్రిగా ఆయ‌న దాదాపుగా నియోజ‌క‌వర్గానికి దూరంగా గ‌డిపారు, నాలుగేళ్ల పాటు రాష్ట్ర‌మంతా తిరిగారు. దాంతో కామినేని శ్రీనివాస్ సొంత నియోజ‌క‌వ‌ర్గం కైక‌లూరులో ఆయ‌న ప‌ట్ల కొంత అసంతృప్తి క‌నిపించింది. ముఖ్యంగా అనుచ‌రుల హ‌వాతో సామాన్యులు స‌త‌మతం అయ్యారు. మంత్రి అందుబాటులో లేకపోవ‌డం, సాధార‌ణ స‌మ‌స్య‌ల్లో కూడా కొంద‌రు కామినేని అనుచ‌రులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో కైక‌లూరు వాసులు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. ఈ ప‌రిస్థితిని మాజీ మంత్రి గ‌మ‌నించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముంగిట ప‌రిస్థితి చ‌క్క‌దిద్దుకోకపోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్టుంగా ఉంది. దాంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత గ‌త కొంత కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌యం కేటాయిస్తున్నారు. ప‌లువురితో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. బీజేపీకి ఎలానూ అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున బ‌రిలో దిగే యోచ‌న‌లో ఉన్న కామినేని ఉన్నారు. అదే స‌మ‌యంలో కైక‌లూరుRead More


కామినేనిపై కాపుల గుర్రు..!

బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ మంత్రి కామినేని తీరు మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఆయ‌న ప‌క్కా టీడీపీ నేత‌గానే వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. చివ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గం కైక‌లూరులో కూడా ఆయ‌న రాజ‌కీయాలు అదే తీరిన ఉంటాయి. తాజాగా కైక‌లూరు ఎంపీపీ వ్య‌వ‌హారంలో ఆయ‌న తీరు ప‌లువురు ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేసింది. ఏకంగా కామినేని మీద కులం ముద్ర ప‌డేసింది. ఆయ‌న మీద ఢిల్లీకి ఫిర్యాదు చేయ‌డానికి బీజేపీలోని మ‌రో వ‌ర్గం సిద్ధమ‌వుతుండ‌డం సంచ‌ల‌నంగా మారుతోంది. కైక‌లూరు ఎంపీపీగా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన బండి స‌త్య‌వ‌తి ఉన్నారు. అయితే ఆమెను ఆ ప‌దవి నుంచి దింపేయ‌డానికి మంత్రి కామినేని స్కెచ్ వేశారు. దాంతో బీజేపీలోనే విబేధాలు త‌లెత్తాయి. కృష్ణా జిల్లా బీజేపీలో దీని మీద భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ మంత్రి కామినేని మాత్రం బీజేపీ ఎంపీపీ రాజీనామాRead More