kadapaking

 
 

సందిగ్ధంలో ప‌వ‌ర్ స్టార్ సినీ ఫ్యూచ‌ర్..!

pawan-kalyan-gabbar-singh-2-launch-photos-8

ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఎలా ఉన్నా సినిమా కెరీర్ మాత్రం కొంత సందిగ్ధంలో ప‌డుతోంది. తాజా సినిమా వ్య‌వ‌హారం అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఉంది. సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌యి నాలుగు నెల‌లు గ‌డిచిపోయినా సినిమా ముందుకు సాగ‌డం లేదు. తొలుత ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో ‘కడప కింగ్‌’ అని ప్రకటించారు. తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి ఎస్‌జే సూర్య తప్పుకున్నాడు. ఆ స్థానంలో డాలీ రంగ ప్రవేశం చేశాడు. షూటింగ్‌ కూడా మొదలైపోయింది. అయితే పవన్‌ మాత్రం ఆ షూటింగ్‌లో పాల్గొనలేదు. ఆ సినిమా షూటింగ్‌ పవన్‌ లేకుండా కేవలం రెండు రోజులు మాత్రమే జరిగి ఆగిపోయింది. ఇప్పుడు పవన్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తిరుపతి బహిరంగ సభలో ప్రకటించాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతి జిల్లాలోనూ బహిరంగ సభలు పెడతానని యాక్షన్‌ ప్లాన్‌ కూడాRead More


గోవులు కాస్తున్న కళ్యాణుడు…..

pawan

టాలీవుడ్ లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ స్టైల్‌కు పెట్టిందిపేరు. గడ్డం పెంచి సాధువులా కనిపించాలన్నా, మీసాలు తిప్పి ‘పులి’లా గర్జించాలన్నా పవన్‌కే చెల్లింది. అలాంటి పవన్ కల్యాణ్ గోపాలగోపాల కోసం వైట్ అండ్ వైట్ వేసి కృష్ణుడి అవతారమెత్తాడు. అయితే రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్‌లోనూ పవన్ కృష్ణుడిలానే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ నిర్మాత శరత్ మరార్ రియల్ లైఫ్‌లో పవన్‌ ఎంత సింపుల్‌గా ఉంటారో అభిమానులకు చూపించారు. పశువులన్నా, పొలాలన్నా ఎంతో ఇష్టపడే పవన్‌కు ఫాం హౌస్‌ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు నిర్మాత శరత్ మరార్ ఫాం హౌస్‌కు వెళ్లారు. అక్కడ గోవుల మధ్య శ్రీకృష్ణుడిలా పవన్ కనిపించారు. వెంటనే శరత్ ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సినిమా గురించి మాట్లాడటానికి ఫాం హౌస్‌కు వెళ్లిన తనకుRead More


ఈనెల‌లోనే ప‌వ‌న్..!

pawan kalyan_0

పవన్‌ కళ్యాణ్‌ కొత్త చిత్రం ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఉంటుందని ఊహాగానాలు అంతటా ఉన్నాయి. అందుకే ఈ చిత్రానికి ‘కడప కింగ్‌’ అని గానీ, ‘సేనాధిపతి’ అని గానీ టైటిల్స్‌ పెట్టే యోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ముహూర్తం షాట్‌ అయితే పూర్తయిందని కానీ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు. అసలు ఈ సినిమా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. కానీ ఆయన దీనికి ముందు అంగీకరించిన ప్రాజెక్టుల ఒత్తిడి వల్ల పవన్‌ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈయన స్థానంలో తడాక, గోపాల గోపాల దర్శకుడు డోలీ వచ్చాడు. మొత్తానికి ఈ సినిమా ఈనెల చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. ప్రొడక్షన్‌ టీమ్‌ దీనికి రంగం సిద్ధం చేస్తోంది. మొదటి షెడ్యూల్‌లోనే ఎక్కువ చిత్రీకరణ జరిగేలా ప్లాన్‌ చేస్తున్నట్టు నిర్మాత శరత్‌Read More


పవన్ క్లారిటీ..

pawan

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పవన్ అభిమానులను నిరాశపరచడంతో ఇక వరుస సినిమాలతో వేగం పుంజుకుందామనుకున్నాడు కళ్యాణ్ బాబు. ఆ కోవలోనే సర్దార్ విడుదలైన కొన్ని రోజులకే ఎస్.జే.సూర్యతో సినిమా మొదలుపెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి దర్శకుడు ఎస్.జే.సూర్య తప్పుకోవడం డైరెక్టర్ డాలీని ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగి మూడు నెలలు, అలాగే దర్శకుడిని మార్చి మరో నెల కావస్తున్నా ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో ఈ సినిమా రద్దయ్యే అవకాశం ఉందనే వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గాసిప్స్‌కు చిత్ర నిర్మాత, పవన్ స్నేహితుడు శరత్ మారార్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును పక్కన పెట్టలేదంటూ ఈ సినిమా తెరకెక్కించి తీరుతామని చెప్పారు. పవన్, డాలీ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అందరూRead More