kabali
ఆ హీరోయిన్ ని రూమ్ కి రమ్మన్నారట..!

ఒక్కసారి ఆ పురాణాలు దాటి వచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు.. విలన్లు.. ఎవరూలేరీ నాటకంలో.. ఇది ప్రస్థానం సినిమాలో డెలాగ్. అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా సినిమావాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఏంచేస్తారు. ఒక్కఛాన్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూసే వాళ్లెందరో..! ఇలాంటి పరిస్థితితే కబాలి కథానాయిక రాధికాఆప్టేకు కూడా ఎదురైందట. నటిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో తాను సినిమా కష్టాలు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చింది ఈ కబాలి సుందరి. సాంఘిక దురాచారాలపై అమ్మాయిల పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన పార్చ్డ్లో రాధికా నటించారు. వాస్తవికతకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల సినీ వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడుతూ.. నా తొలినాళ్లలో అందరిలానే నాకూRead More
తలైవాను కాపీ కొట్టిన ధోనీ..

కబాలి.. ఇప్పుడు ఇదో మేనియా,పిచ్చి,క్రేజ్, స్టైల్ ఇలా ఏమనుకున్నా ఫరవాలేదు.. తలైవా ప్రతి సినిమాకు కూడా ఇంత హైప్ ఉంటుంది. దానికి ప్రధాన కారణం రజినీ స్టైల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీ అంటేనే స్టైల్, స్టైల్ అంటేనే రజినీ అంతలా మారిపోయింది పరిస్థితి. సినీ జనాలే కాకుండా, ఇతర రంగాల నుంచి కూడా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్న స్టార్ రజినీకాంతేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంట్లో క్రికెటర్ ధోనీ కూడా చేరిపోయాడు. కబాలీ సినిమాలోని ఓ రజినీ ఫొటోను పోలిన ఫొటోతో తన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ‘ఏకైక తలైవా ఫొటోను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నా’ అంటూ తన టైమ్‌లైన్‌లో రాసుకొచ్చాడు. ధోని ఐపిల్‌లో చెన్నై జట్టుకి సారధ్యం వహించిన విషయం తెలిసిందే.
కృష్ణా పుష్కరాలకు కబాలి..!

సూపర్‌స్టార్ రజనీకాంత గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం చింతపల్లిలోని విష్ణుపంచాయతన దివ్య మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పుష్కరాల సందర్భంగా రజనీకాంత ఇక్కడికి రానున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.కబాలి రాకతో కృష్ణా తీరం పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యతినిచ్చే రజనీకాంత్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఛాన్స్ ఉంది.
కబాలి ఛేజ్ చేసేశాడు.!

గత కొద్ది రోజుల క్రితం ప్రపంచాన్ని ‘కబాలి’ మానియా ఊపేసింది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా కబాలి జపమే. టాలీవుడ్, బాలీవుడ్‌లలోని సినీ రికార్డులను ‘కబాలి’ తిరగరాసేస్తాడాడని అందరూ ఊహించారు. అయితే, సినిమా విడుదల అయ్యాక డివైడ్ టాక్ రావడంతో కబాలి కనెక్షన్లలో రికార్డులు సృష్టించడం కష్టం అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తూ కబాలి దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక సంచలన వార్త మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటివరకూ కబాలి దాదాపు రూ.600కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకూ బాహుబలి రూ.600కోట్లకు పైగా వసూళ్లు సాధించి కలెక్షన్లలో ముందంజలో ఉంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేటర్లలో కొనసాగుతూ సంచలనం రేపుతున్న కబాలి వసూళ్లు ఆ స్థాయిలో ఉంటే భారత సినీ కలెక్షన్లలో ఈRead More
బాహుబలి బీ హ్యాపీ..!

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన రజనీకాంత్ ‘కబాలి’ మొదటి వారం తర్వాత నెమ్మదించింది. అయితే ఫస్ట్ వీక్ లో మాత్రం రికార్డు వసూళ్లు సాధించింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ట్రేకర్ బి. రమేశ్ వెల్లడించారు. ‘కబాలి’ సినిమా ఇండియా రూ.149 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ.172 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా మొదటి వారంలో రూ. 262 కోట్లు కొల్లగొట్టిందని ట్విట్టర్ ద్వారా రమేశ్ తెలిపారు. ‘బాహుబలి’ రికార్డును తమ సినిమా బ్రేక్ చేస్తుందని కబాలి’ నిర్మాత కళైపులి ఎస్. థాను అంతకుముందు ప్రకటించారు. అయితే కలెక్షన్లు తగ్గిపోవడంతో ‘బాహుబలి’ రికార్డును ‘కబాలి’ చేరుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. విడుదలైన మొదటి నుంచే భారీ వసూళ్లు రాబట్టినRead More
భారతరత్న రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాతో దేశమొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా కలెక్షన్ల వర్షం భారీగా కురుస్తూ.. తలైవా స్టామినా ఏమిటో చాటుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ఓ అరుదైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను రజనీకాంత్‌కు ప్రదానం చేయాలని ఆయన కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను రజనీకాంత్‌కు ఇవ్వాలని ఆయన దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారుకు ప్రతిపాదించారు. పనిలో పనిగా రజనీకాంత్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. రజనీని మహారాష్ట్ర భూమిపుత్రుడిగా అభివర్ణించిన ఎమ్మెల్యే గోటే.. ఆయన అభిమానులకు దేవుడితో సమానమని, తాజాRead More
కబాలి సింప్లిసిటీ…!

‘సూపర్ స్టార్’ అంటే చాలు ఎంతమంది స్టార్లు ఉన్నా రజనీకాంతే గుర్తొస్తాడు.. ఈ పేరుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదని మనకి తెలుసు. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. సినిమాల్లో స్టైల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే రజనీ నిజ జీవితంలో చాలా సాధారణంగా ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఇటీవల జరిగింది. విశ్రాంతి నిమిత్తం రెండు నెలల కిత్రం అమెరికా వెళ్లిన రజనీ ఆదివారం భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో రజనీ ఉన్న ఫొటోను ప్రముఖ నటుడు రిషి కపూర్ ట్వీట్ చేస్తూ ‘రజనీ సింప్లిసిటీకి ఇదో నిదర్శనం. అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ నిమిత్తం సాధారణ ప్రయాణీకులతో కలిసి నిలబడ్డారు. మీ అణకువకు ఇదే నా వందనం’ అంటూ పేర్కొన్నారు.