Main Menu

janasena

 
 

అమ‌రావ‌తి వైసీపీలో ఆస‌క్తిక‌ర మలుపు

విప‌క్ష వైసీపీలో వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లాకు చెందిన ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ఇప్ప‌టికే గుంటూరు జిల్లా ప‌రిణామాలు వైసీపీలో తొలుత గంద‌ర‌గోళంగా మారినా, ఆవెంట‌నే మ‌ళ్లీ స‌ర్థుకుంటున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చిల‌క‌లూరిపేట‌లో ఇప్ప‌టికే అలాంటి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. తాజాగా రాజ‌దాని నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అమ‌రావ‌తి రాజ‌ధాని నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో ప్ర‌స్తుతం టీడీపీ ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానం మీద వైసీపీ క‌న్నేసింది. అందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ ను మార్చడం దానికి నిద‌ర్శ‌నంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన క్రిస్టియానా స్థానంలో కొత్త అభ్య‌ర్థిని ముందుకు తెస్తున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్‌ శ్రీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు విడుద‌లయ్యాయి. కత్తెర క్రిష్టియానాను తప్పించి శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు.Read More


తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలోకి ప‌వ‌న్


జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

రాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతిన కూడా పెద్ద‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేని నాయ‌కుడు ఆయ‌న‌. ప‌వ‌న్ వ‌స్తున్నార‌ని తెలిస్తే చాలు సొంత ఖ‌ర్చుతో వ‌చ్చి వాలిపోయే వేలాది మంది అభిమానులున్నారు. అదే ఇప్పుడు జ‌న‌సేన‌కు బ‌లం. అదే పెట్టుబ‌డి కూడా. అలాంటి అభిమానులున్న స‌మ‌యంలో దానిని అందిపుచ్చుకుని పార్టీని నిర్మించుకోవ‌డం ద్వారా ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌లు పండించుకోవాల్సి ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ వాస్త‌వంలో దానికి భిన్నంగా ఉంది. అందుకు కార‌ణం నిజాలు జ‌న‌సేన నాయ‌కుడి వ‌ద్ద‌కు చేర‌క‌పోవ‌డ‌మేన‌ని సందేహం వ‌స్తోంది. జ‌న‌సేన‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ కి పూర్వం ప‌వ‌న్ చుట్టూ ఉన్న వారంతా దాదాపుగా ఉద్యోగులే. లేక ప‌వ‌న్ కి పాత స్నేహితులే. రాజ‌కీయ నేత‌లుRead More


గుడ్ బై చెప్పిన ప‌రిటాల ర‌వి అనుచ‌రుడు

ప‌చ్చ పార్టీలో మ‌రో వికెట్ ప‌డింది. అధికార ప‌క్షానికి హ‌స్తం పార్టీ జ‌త‌గ‌ట్ట‌డం ప‌ట్ల ప‌లువురు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. దానినే కార‌ణంగా చూపించి జంపింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో పరిటాల ర‌వి అనుచ‌రుడొక‌రు చేరారు. టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు రేగాటిపల్లి (చిలకం) మధుసూదన్‌రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో తనకు 26 సంవత్సరాల అనుబంధముందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. దాంతో ఇన్నాళ్లుగా ప‌రిటాల కుటుంబానికి అండ‌గా ఉన్న సీనియ‌ర్ నేత టీడీపీని వీడ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆపార్టీకి న‌ష్టం త‌ప్ప‌ద‌నే అబిప్రాయం వినిపిస్తోంది. కార్యకర్తల నిర్ణయం మేరకు ఏ పార్టీలో చేరేదీ వెల్లడిస్తాన మ‌ధుసూద‌న్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఆయ‌న‌కు ప‌వ‌న్ పార్టీలో లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు స‌మాచారం.Read More


టీడీపీకి దూరమవుతున్న ఎంపీ

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు దూరమయ్యే ప్రమాదం దాపురిస్తోంది. ఎన్నికల వేళ ఇది మరింత వేగంగా జరగవచ్చనే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే కొందరు నేతలు ఇతర పార్టీలతో టచ్ లోకి వెళుతున్నారు. తమకు సేఫ్ జోన్ అనుకుంటే గోడ దూకేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటకిే పలువురు టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో ఓ కీలక నేత పేరు చేరింది. చాలాకాలంగా ఆయన వచ్చే ఎన్నికల కోసం సురక్షిత స్థానాల కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు ప్రచారం సాగింది. దానికి తగ్గట్టుగానే వైసీపీ వైపు ఆలోచన చేసినప్పటికీ తగిన హామీ దక్కలేదని చెబుుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున బరిలో దిగేందుకు టీడీపీ లోక్ సభ పక్షా నాయకుడు తోట నరసింహం నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులే చెబుతుండడం విశేషం.Read More


ప‌వ‌న్,జ‌గ‌న్ ని క‌లుపుతున్న సీనియ‌ర్ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో విప‌క్షాల మ‌ధ్య స‌ఖ్య‌త త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ముఖ్యంగా జ‌నాద‌ర‌ణ క‌లిగిన ఇద్ద‌రు నేత‌లు చేతులు క‌లిపేందుకు రంగం సిద్ధ‌మ‌వుతుంద‌నే వాద‌న ఎక్కువ‌గా టీడీపీ శిబిరం నుంచి వినిపిస్తోంది. బీజేపీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్, జ‌గ‌న్ క‌లిసి సాగేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు ప‌లుమార్లు ప్ర‌చారం చేస్తోంది. దాంతో అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన వ‌ర్గాల్లో క‌ల‌యిక‌పై పెద్ద స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ నేత‌, ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్ కారెం శివాజీ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ప్ర‌ధానంగా విశాఖ కేంద్రంగా ప‌వ‌న్, జ‌గ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు సాగిన‌ట్టు ఆయ‌న ఆరోపిస్తున్నారు. వారిద్ద‌రినీ ఓ గూటికి తెచ్చేందుకు ఇన్నాళ్లుగా బీజేపీ నేత‌ల ఆదేశాలే కార‌ణ‌మ‌ని చెప్పిన టీడీపీ నేత‌ల్లో తాజాగా వ‌ట్టి ర‌మేష్ పేరు ముందుకు రావ‌డం విశేషంగా మారింది. మాజీ మంత్రి, ఇటీవ‌లRead More


జ‌నసేన‌లోకి మ‌రో సీనియ‌ర్ నేత‌

కాంగ్రెస్ పార్టీలో ప‌లువురు సీనియ‌ర్లు సెల‌వు చెబుతున్నారు. సుదీర్ఘ‌కాలంగా న‌మ్ముకున్న పార్టీకి రాంరాం చెబుతున్నారు. ఇప్ప‌టికే వ‌ట్టి వ‌సంత‌కుమార్, సి రామ‌చంద్ర‌య్య ఆపార్టీని వీడ‌గా తాజాగా మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు కూడా అదే ప‌రంప‌ర‌లో చేరారు. విశాఖ జిల్లా పాడేరు కి చెందిన ఈ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్ కి గుడ్ బై చెబుతూ త‌న రాజీనామా లేఖ‌ను రాహుల్ గాంధీకి పంపించిన బాల‌రాజు ఆ వెంట‌నే జ‌న‌సేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. గ‌తంలో చింత‌ప‌ల్లి, పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత పాడేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మూడు సార్లు బాల‌రాజు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున బ‌రిలో దిగి ఓట‌మిపాల‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా జ‌న‌సేన నేతRead More


చిక్కుల్లో చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్


జ‌న‌సేన కింగ్ మేక‌ర్ అత‌డే..!

రాజ‌కీయాల్లో స్నేహితుల‌కు కొద‌వ ఉండ‌దు. ఏపార్టీలో ఉన్న‌ప్ప‌టికీ స్నేహాన్ని కొన‌సాగించేవారు కొంద‌రుంటారు. కానీ రాజ‌కీయంగా కలిసే ఉంటూ క‌ష్టం, సుఖం పంచుకోవ‌డానికి కొంద‌రే సిద్ధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారిలో ఏపీ రాజ‌కీయాల పేరు చెప్ప‌గానే కేవీపీ, వైఎస్సార్ గుర్తుకొస్తారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్-విజ‌య‌సాయి రెడ్డి వ్య‌వ‌హారం కూడా వారినే త‌ల‌పిస్తోంది. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కేవీపీలా ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌యార‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే కింగ్ అవుతాన‌ని జ‌న‌సేనాని చెబుతుంటే కింగ్ మేక‌ర్ ఖ‌చ్చితంగా నాదెండ్ల మ‌నోహ‌ర్ అవుతార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు త‌న‌యుడిగా మ‌నోహ‌ర్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అంత‌కుమించి వివాద‌ర‌హితుడైన విద్యావంతుడైన రాజ‌కీయనేత‌గా మంచి ప్రాధాన్య‌త ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన రెండోసారే ఆయ‌న స్పీక‌ర్ ప‌ద‌వి ద‌క్కించుకుని అత్యంత హూందాగాRead More


మీడియాలో మైన‌స్ అవుతున్న జ‌న‌సేన‌!

రాజ‌కీయాలు, మీడియా మిళితం అయిపోయాయి. మీడియా అండ ఉంటేనే రాజ‌కీయంగా రాణించ‌గ‌ల‌మ‌న్న విష‌యం అంద‌రికీ అర్థ‌మ‌యిపోయింది. సోష‌ల్ మీడియాలో ఎంత‌గా ప్ర‌చారం చేసినా రెగ్యుల‌ర్ మీడియాలో ప్ర‌భావం చూప‌కుండా సామాన్యుల‌ను ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఆఖ‌రికి త‌మ‌కు సోష‌ల్ మీడియా ఉంద‌ని, మీ మీడియా సంస్థ‌ల‌తో మాకు ప‌నిలేద‌ని చెప్పుకున్న జ‌న‌సేన కూడా సొంతంగా చానెల్ పెట్టుకోవాల్సి వ‌చ్చింది. మ‌రో నాయ‌కుడికి సంబంధించిన ప‌త్రిక‌ను అధికార ప‌త్రిక‌గా మ‌ల‌చుకోవాల్సి వ‌చ్చింది. అయితే 99 న్యూస్ చానెల్ ని తోట చంద్ర‌శేఖ‌ర్ టేకోవ‌ర్ చేసిన త‌ర్వాత జ‌న‌సేన కార్య‌క్ర‌మాల‌ను ఆ చానెల్ ప్ర‌సారాలు చేస్తోంది. మిగిలిన మీడియా సంస్థ‌ల‌కు అవుట్ పుట్ ఇస్తోంది. అయితే క్వాలిటీ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్న దాఖ‌లాలు లేవు. ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌గిన సాంకేతిక బృందంRead More