Main Menu

jagan

 
 

జ‌న‌సేనాని వెళ్ల‌గానే జ‌గ‌న్ సేన‌ ఎంట్రీ

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన గోదావ‌రి జిల్లాల‌పై అంద‌రి దృష్టి ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌న‌సేనాని ప్ర‌త్యేకంగా కేంద్రీక‌రించారు. ఏకంగా రెండున్న‌ర నెల‌ల పాటు రెండు గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు. ఈనెలాఖ‌రుతో తూర్పు గోదావ‌రి టూర్ ముగుస్తోంది. అనంత‌రం రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం ప‌య‌న‌మ‌వుతున్నారు. రెండో తేదీ నుంచి క‌రువుపై క‌వ‌తాకి సిద్ధ‌మ‌వుతున్నారు. అదే స‌మ‌యంలో ఈనెల 29న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి ప‌ర్య‌ట‌న ముగుస్తుండ‌గా 30 నుంచి వైసీపీ ఎంట్రీ ఇస్తోంది. వంచ‌న‌పై గ‌ర్జ‌న పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతోంది. ఆపార్టీ నేత‌లంతా క‌లిసి కాకినాడ‌లో కార్య‌క్ర‌మానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో అవినీతి, అక్ర‌మాలు స‌హా వివిధ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో తూర్పు ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ ప్ర‌ధానంగా జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ మీదేRead More


వైసీపీ ని టెన్ష‌న్ పెడుతున్న తెలంగాణా!

రాజ‌కీయాల్లో చిన్న అవ‌కాశాన్ని కూడా సానుకూలంగా మ‌ల‌చుకున్న వారే రాణిస్తారు. చిన్న చిన్న అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌యితే చివ‌ర‌కు చేతులెత్తేయ‌క త‌ప్ప‌దు. అందుకే తెలంగాణా ఎన్నిక‌ల రూపంలో కేసీఆర్ అందించిన అవ‌కాశం త‌న‌కు ఉప‌యోగ‌పడాల‌ని జ‌గ‌న్ ఆశిస్తున్నారు. మ‌హాకూట‌మి పేరుతో తెలంగాణా టీడీపీ మిత్ర‌ప‌క్షాల‌తో జ‌త‌గ‌ట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలో దిగింది. 14 స్థానాల‌కు పోటీ చేస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో 14మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న టీడీపీ ఈసారి అదే నెంబ‌ర్ కి పోటీ చేయాల్సి రావ‌డం విచిత్ర‌మే. అయితే తెలంగాణా ఎన్నిక‌ల్లో పోటీకి వైసీపీ దూరంగా ఉంది. త‌న‌కు తాను జాతీయ అధ్య‌క్షుడిగా చెప్పుకున్న జ‌గ‌న్ కూడా తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలో దిగితే అది కాంగ్రెస్ ఓట్ల‌కు గండికొట్టేది. రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో కొంత ఫాలోయింగ్ ఉన్న జ‌గ‌న్ కి ఏమేర‌కు ఓట్లుRead More


ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఉండ‌వ‌ల్లిది ఒక్క‌టే మాట‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ పై దాడి ఘ‌ట‌న‌పై సాగుతున్న చ‌ర్చ‌ను దారి మ‌ళ్లించాల‌ని ఆశించిన టీడీపీకి తాజా ప‌రిణామం ఉప‌యోగ‌ప‌డింది. అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో చంద్ర‌బాబు చేతులు క‌ల‌ప‌డంపైనే మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, వైసీపీ శ్రేణులు మ‌రింత దూకుడుగా వ్యాఖ్య‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. త్వ‌ర‌లో చంద్ర‌బాబు మ‌ళ్లీ మోడీకి మ‌ద్ధ‌తిచ్చినా ఆశ్చ‌ర్యం లేదంటూ ఉండ‌వ‌ల్లి కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత మోడీకి మంచి సీట్లు వ‌స్తే ఆయ‌న‌కు మద్ధ‌తివ్వ‌డానికి చంద్ర‌బాబు అంద‌రిక‌న్నా ముందుంటార‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో ఎవ‌రితోనైనా, ఎప్పుడైనా క‌లిసే అవ‌కాశం చంద్ర‌బాబుకే ఉంద‌ని, దానిని దేశం కోసం, ప్ర‌జ‌ల‌కోస‌మేన‌ని చెప్పుకోవ‌డంలో ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడ‌ని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు. దాదాపుగా అవేRead More


జ‌గ‌న్ గుట్టు బాబుకి చిక్కిన‌ట్టేనా..!

ఏపీలో విప‌క్ష నేత అధికారం కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌లువురు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన నిర్ణ‌యం తీసుకున్నారు. అందుకు తోడుగా దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న ప్ర‌శాంత్ కిషోర్ ని తీసుకొచ్చి క్యాంప్ లో చేర్చుకున్నారు. భారీ ప్యాకేజ్ గా ఏకంగా 250 కోట్లు ఆయ‌న‌కు చెల్లించిన‌ట్టు ప్ర‌చారం సాగింది. అయినా చివ‌ర‌కు ప్ర‌శాంత్ కిషోర్ మ‌ధ్య‌లోనే కాడి వ‌దిలేశారు. ఆయ‌న సొంతంగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డంతో జ‌గ‌న్ కి హ్యాండివ్వ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం జేడీయూ నేత‌గా మారిన ప్ర‌శాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్ లో రాజ‌కీయ ప‌ద‌సోపానంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు దాంతో ఇప్పుడు జ‌గ‌న్ వ్య‌వ‌హారం బెడిసికొట్టింది. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌తో తానా పాగా వేయ‌గ‌ల‌న‌ని ఆశిస్తే ఆఖ‌రికి ప్ర‌శాంత్ కిషోర్ మ‌ధ్య‌లో చేయి వ‌దిలివెళ్లిపోవ‌డం స‌త‌మ‌తం చేస్తోంది. ఎన్నో ఆశ‌లుRead More


వైసీపీకి అదే అస‌లు స‌మ‌స్య‌..!

అదేంటో గానీ..జ‌గ‌న్ అన‌గానే జ‌నం వ‌స్తారు. మామూలుగా కాదు..వంతెన‌లు వ‌ణికిపోయే స్థాయిలో జ‌న ప్ర‌వాహం ఉంటుంది. కానీ వ‌చ్చిన జ‌న‌మంతా ఓట్లేస్తార‌నుకునే నేత‌ల కార‌ణంగా చివ‌ర‌కు ఉసూరుమ‌నాల్సి వ‌స్తోంది. గ‌డిచిన సాధార‌ణ ఎన్నిక‌లే కాదు..మొన్న‌టి నంధ్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల‌కు కూడా అదే స్ప‌ష్టం చేశాయి. అందుకే గ‌తం నుంచి పాఠాలు నేర్చుకుంటేనే వైసీపీకి మంచి రోజులొస్తాయి. లేకుంటే పార్టీలో అంత‌ర్గ‌త విబేధాల‌ను మించిన కార‌ణాలు మ‌రోటి అవ‌స‌రం లేకుండానే ఫ‌లితాలు చేజారిపోయే ప్ర‌మాదం ఉంటుంది. తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో ఓ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార మార్పిడి ఖాయ‌మ‌నే వాద‌న పెరుగుతోంది. త‌ట‌స్థంగా ఉన్న వారిలో కూడా జ‌గ‌న్ వైపు మొగ్గు మొద‌ల‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన వైసీపీ చేజేతులా స‌మ‌స్య‌లు కొనితెచ్చుకునేలా క‌నిపిస్తోంది. కొత్త స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం కావ‌డానికి సిద్ధ‌ప‌డుతోంది.Read More


మోడీతో మేలు ఎవ‌రికి? కీడు ఎవ‌రికి?

అనూహ్య నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆఖ‌రికి దేశాన్నంతా అతలాకుత‌లం చేసేని నోట్ల ర‌ద్దు విష‌యం కూడా అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మే. ఆఖ‌రికి ఆర్థిక‌మంత్రికి కూడా తెలియ‌ని విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సంబంధించి సంచ‌న‌ల నిర్ణ‌యంతో మోడీ ముందుకొచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ముంద‌స్తు ఆలోచ‌న‌తో సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏక్ష‌ణాన నిర్ణ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని మోడీ స‌న్నిహితులు సైతం భావిస్తున్నారు. అయితే ముంద‌స్తు ఎన్నిక‌లొస్తే ఏపీలో ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అనే అంశంపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఏపీలో పాల‌క‌ప‌క్షం తీవ్ర ఒత్తిడిలో ఉంది. దాదాపు రాజ‌కీయంగా ఒంటరిగా మారిపోయింది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకి వ‌చ్చే ఎన్నిక‌లు అతి పెద్ద స‌వాల్ గా చెప్ప‌వ‌చ్చు. అధిగ‌మించ‌డానికి ఆయ‌న శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. రెండు ల‌క్ష్యాల‌తో సాగుతున్నారు. ఒక‌టి బీజేపీని ఏపీకిRead More


జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

జ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ కూడా వారిని ఆద‌రించారు. ఏకంగా జ‌క్కంపూడి త‌న‌యుడిని వైసీపీ యువ‌జ‌న విభాగానికి అధ్య‌క్షుడిని చేశారు. అయినా తాజాగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన ప‌రిణామాల‌తో జ‌క్కంపూడి కుటుంబం చిన్న‌బుచ్చుకోవ‌డం విశేషంగా మారింది. జ‌గ‌న్ ప‌ట్ల కోప‌గించ‌డం, అల‌కపూని ఏకంగా పాద‌యాత్ర‌కు దూరంగా ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింది. అయితే అంత‌లోనే వైసీపీ నేత‌ల బుజ్జ‌గింపుల‌తో జ‌క్కంపూడి త‌న‌యులు రాజా, గ‌ణేష్ ఇద్ద‌రూ క‌లిసి వ‌చ్చి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చేతులు క‌లిపారు. అయితే జ‌క్కంపూడి విజ‌య‌ల‌క్ష్మీ ఆగ్ర‌హం మాత్రం చ‌ల్లార‌లేద‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో త‌మ కుటుంబం ప‌ట్ల ఇన్నాళ్ళుగా ఎంతో సానుకూల‌త ప్ర‌ద‌ర్శించిన జ‌గ‌న్ హ‌ఠాత్తుగా ఎందుకు మారిపోయారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని జ‌క్కంపూడి కుటుంబీకుల వాద‌న‌గా వినిపిస్తోంది.Read More


జ‌గ‌న్ కి జ‌న‌సేన‌ని ద‌గ్గ‌ర చేస్తున్న బాబు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. టీడీపీ ఇప్ప‌టికే ఒంట‌రిగా మారింది. వామ‌ప‌క్షాల‌తో క‌లిసి జ‌న‌సేన సాగుతోంది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ విడివిడిగా పోరాడుతున్నాయి. అయితే కాంగ్రెస్ తో క‌లిసి సాగ‌డానికి టీడీపీలో ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ శ్రేణులు కూడా దానికి సై అన‌డానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతో కొత్త స్నేహం, అనూహ్య అనుబంధం అనివార్యంగా మారుతోంది. అదే స‌మ‌యంలో బీజేపీతో క‌లిసి సాగ‌డానికి ఎవ‌రూ సిద్ధ‌ప‌డే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు, ప్ర‌స్తుతం బీజేపీ నుంచే ప‌లువురు నేత‌లు జారిపోతున్నారు. దాంతో ఏపీలో ఆపార్టీకి క‌ష్ట‌కాలం దాపురించిన‌ట్టే చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో లెఫ్ట్ తో క‌లిసి న‌డుస్తున్న జ‌నసేనాని త్వ‌ర‌లోనే జ‌గ‌న్ తో చేతులు క‌లిపే అవ‌కాశాలు పెరుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరిద్ద‌రి మ‌ధ్య కూడా వైరం స్థానంలో స్నేహం చిగురించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్Read More


జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!

కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏకంగా 40మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌నే రీతిలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు కూడా. వైసీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చాలాకాలంగా త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారంద‌రికీ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని చెప్పాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రోసారి ఫిరాయింపుల జోరు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి ప‌లువురు నేత‌లు సైకిల్ స‌వారీకి సెండాఫ్ చెప్పేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావుRead More


మోడీ, జ‌గ‌న్ కి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అత‌డే…!

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయంగా ఉంది. ఇప్ప‌టికే బీజేపీ, టీడీపీ బంధం పూర్తిగా తెగిపోయింది. ఇరువైపులా ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తామ‌ని చెబుతున్నారు. క‌య్యానికి కాలు దువ్వ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అదే స‌మ‌యంలో కొత్త బంధాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. చాలాకాలంగా ఆంత‌రంగీకంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు స్క్రీన్ మీద‌కు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పొత్తు పొడుస్తుందా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. పొత్తు ఉన్నా లేకున్నా ఒక ఒప్పందం మాత్రం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల త‌ర్వాత న‌యా మిత్రులు ఒక్క‌ట‌వుతార‌నే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా చంద్ర‌బాబు అవిశ్వాసం పేరుతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ పెద్ద స్థాయిలో ప్ర‌చారం సాగిస్తున్నారు. తెలుగు మీడియాలో అయితే హోరెత్తిపోతోంది. అస‌లు అవిశ్వాసం చ‌ర్చ‌కు వ‌స్తుందో లేదో అన్న‌ది స్ప‌ష్ట‌త లేకుండానే సంఖ్య‌ల ప‌రంప‌ర వినిపిస్తున్నారు. ఎవ‌రు ఎటువైపు అనే అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి.Read More