Main Menu

hyderabad

 
 

మీటూ ఎఫెక్ట్ – ఆయ‌న ఉద్యోగం ఫ‌ట్

మీటూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. లైంగిక వేధింపుల‌కు నిర‌స‌న‌గా మొద‌ల‌యిన ఉద్య‌మం తీవ్ర దుమారం రేపుతోంది. దాంతో ఈ వ్య‌వ‌హారంలో తాజాగా ఓ సీనియ‌ర్ ఉద్యోగం కోల్పోవాల్సి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మీడియాలోని ప్రముఖలపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఆఖ‌రికి ఎడిట‌ర్ సైతం ఉద్యోగం వ‌దిలి వెళ్ళాల్సి వ‌చ్చింది. గ‌తంలో ప‌లు సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో త‌మ‌ను లైంగికంగా వేధించారంటూ ప్ర‌స్తుత ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రెసిడెంట్ ఎడిటర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాంతో కేఆర్ శ్రీనివాస్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. వ‌రుస‌గా పెరిగిన ఒత్తిడి కార‌ణంగా ఆయ‌న ఉద్యోగం వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. తమకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడని, తన కోరిక తీర్చాలంటూ ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ప‌లువురు మ‌హిళా జర్న‌లిస్టులు ఆయ‌న మీద‌ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ‘టైమ్స్‌ ఆఫ్Read More


చంద్ర‌బాబుకి నోటీసులు ఎందుకిస్తున్నారో తెలుసా?

ఏపీ ముఖ్య‌మంత్రికి నోటీసులు అంద‌బోతున్న‌ట్టు మ‌రోసారి ప్ర‌చారం మొద‌ల‌య్యింది. అప్ప‌ట్లో ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ క‌ల‌కలం రేపిన సినీ న‌టుడు శివాజీ చాన్నాళ్ల‌కు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చాడు. రెండు రోజుల్లో చంద్ర‌బాబుకి నోటీసులు వ‌స్తాయ‌ని, పెద్ద‌స్థాయిలో కుట్ర సాగుతోంద‌ని చెప్పుకొచ్చాడు. గ‌త ఏప్రిల్ లో ఆయ‌న ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దాంతో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే క‌మ‌ల‌నాధులు చంద్ర‌బాబుని చిక్కుల్లో నెడ‌తార‌ని చాలామంది విశ్వ‌సించారు. ఏకంగా చంద్రబాబు కూడా అదే విష‌యం చెప్పారు. త‌న మీద పెద్ద‌స్థాయిలో కుట్ర సాగుతోంద‌ని, జ‌న‌మంతా త‌న‌కు వ‌ల‌యంగా నిల‌వాల‌ని కూడా విజ్ఞ‌ప్తి చేశారు. క‌ట్ చేస్తే క‌ర్ణాట‌క ఎన్నిక‌లు అయిపోయాయి, ఆ త‌ర్వాత చాలా ప‌రిణామాలు జ‌రిగాయి, నాలుగు నెల‌లు కూడా గ‌డిచిపోయాయి. అయినా ఇలాంటి విష‌యంలో ఒక్క అడుగు కూడా ప‌డ‌లేదు. శివాజీ క‌నిపించ‌లేదు. చంద్ర‌బాబు త‌నRead More


మీడియా సంద‌డి మొద‌ల‌య్యింది..!

మ‌ళ్లీ క‌ద‌లిక మొద‌ల‌య్యింది. తెలుగు మీడియాకి జోష్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాలు మారుతున్నాయి. మ‌రికొన్నింటిలో మార్పుల‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే 99 చానెల్ ని జ‌న‌సేన స్వాధీనం చేసుకుంది. ఆపార్టీ నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్ సార‌ధ్యంలో ఆదిత్య గ్రూప్ నుంచి న్యూస్ వేవ్ మీడియా ఈ చానెల్ న‌డుపుతోంది. ఇక త్వ‌ర‌లో 10టీవీ కూడా చేతులు మారుతోంది. ఈ చానెల్ వైసీపీ సానుభూతిప‌రుడైన జ‌గ‌న్ స‌న్నిహితుడు కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. ఇక వాటికితోడుగా స్టూడియో ఎన్ చానెల్ కూడా ప్ర‌స్తుతం తాత్కాలికంగా మూత‌ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త ఆఫీసులో ప్రారంభిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. క‌ల్కి భ‌గ‌వ‌న్, అమ్మ భ‌గ‌వాన్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఈ చానెల్ లో మార్పులు కూడా ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. ఇక కొత్త‌గా ఎట్ రిప‌బ్లిక్ పేరుతో కొత్త‌చానెల్ తెరంగేట్రానికి రంగంRead More


90శాతం మందికి పైగా ఐపీఎస్ లు ఫెయిల్డ్

కాబోయే ఐపీఎస్ అధికారులు దాదాపుగా ఫెయిల‌య్యారు. పోలీసు ఉన్నతాధికారులుగా నియామకం కావాల్సిన ద‌శ‌లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో గ‌ట్టెక్క‌లేక‌పోవ‌డం విశేషంగా మారింది. 2016 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు తమ అకాడమీ పరీక్షలో ఘోరంగా విఫలమయ్యారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లబ్‌భాయి పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)నుంచి గ్రాడ్యుయేషన్‌ పొందేందుకు కచ్చితంగా పాస్‌ కావాల్సిన పరీక్షలో 2016 (రెగ్యులర్‌ రిక్రూట్‌) అధికారులు ఊహించనంతగా..122మందిలో ఏకంగా 119అధికార్లు విఫ‌ల‌మ‌య్యారు. అకాడమీ చరిత్రలో ఇంత మంది తప్పడం ఇదే మొదటిసారి. మొత్తం 136మంది అధికార్ల(14 మంది నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులకు చెందినవారు ఉన్నారు)లో 133 మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరీక్షల్లో తప్పారు. అయినప్పటికీ ఆ అధికారులు తమ తమ క్యాడర్‌లో ప్రొబేషనరీగా విధుల్లో కొనసాగుతున్నారు. కాగా, ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు వారికి మూడు అవకాశాలుంటాయి. మూడు సార్లూ పెయిల్‌ అయితేRead More


సీరియస్ గా సినీ ప్రముఖుడి ఆరోగ్యం

సీనియర్ నటుడు, దర్శకుడు మాదాల రంగారావు ఆరోగ్యం విషమించింది. గుండెపోటుతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారించారు. వైద్య సహాయం అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు డా మాదాల రవి మాట్లాడుతూ… తన తండ్రికి గతేడాది గుండె ఆపరేషన్ జరిగిందని.. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. అయితే శనివారం మరోసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు. ఎర్ర సినిమాల దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన రంగారావు ఒంగోలులో జన్మించారు. ప్రజా నాట్యమండలిలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేసేవారు. మరో ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ, నిర్మాత పోకూరి బాబురావులు రంగారావుకి సహాధ్యాయిలు. చైర్మన్ చెలమయ్య రంగారావు మొదటి సినిమా. యువతరం కదిలింది సినిమాకుRead More


ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన

ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన సాగింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారీకేడ్లు ఏర్పాట్లు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి వివిధ పీఎస్ లకు తరలించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో గడిచిన కొన్ని రోజులుగా మోడీ పై వస్తున్న కథనాలతో బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. వాటిని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ వారిని పోలీసులు నిలువరించారు. మోడీ మానసిక స్థితిగతులపై ఆంధ్రజ్యోతి విశ్లేషణాత్మక కథనాలు ఇస్తోంది చాలాకాలంగా సోషల్ మీడియాలో సాగుతున్న విషయాలను వివరించి ప్రచురిస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య బంధం పూర్తిగా తెగిపోయిన తర్వాత వస్తున్న ఈ కథనాలతో బీజేపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. మోడీ మీద ఆంధ్రజ్యోతి రాతలను సహించలేకపోతోంది. దాంతో ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఆందోళన సాగించింది. సి నరసింహరావుRead More


మండపాలపై మంచు లక్ష్మి ఫిర్యాదు

తెలంగాణా ప్రభుత్వానికి మంచు లక్ష్మీ లేఖాస్త్రం సంధించారు. హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ మండపాల కోసం రోడ్లను ఇష్టానుసారంగా తవ్వుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని మంచు లక్ష్మి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. వినాయక చవితి సందర్భంగా నగరానికి జరుగుతున్న నష్టం గురించి ప్రస్తావించారు. వినాయక మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్‌ నగర్‌ రోడ్డు నంబరు1లో రోడ్లను తవ్వుతున్నారన్నారు. భారీ గణపతి విగ్రహాలను తరలించడానికి అడ్డంగా ఉన్న కేబుల్‌ వైర్లను కూడా కట్‌ చేశారని, వీటిని తిరిగి బాగు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారో ఓ సిటిజన్‌గా తాను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. వినాయక చవితి పండగను మతపరంగా భావించకుండా ఓ పోటీగా భావిస్తున్నారన్నారు. వేడుకను ఇతరుల కన్నా వైభవంగా జరపాలని, వ్యయ ప్రయాసలకు వెనకాడటం లేదన్నారు. ఓ ప్రాంతానికిRead More


ప్ర‌గ‌తిశీల శాస్త్ర‌వేత్త పీఎం భార్గ‌వ‌ మృతి

అభ్యుదయ శాస్త్రవేత్త సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ ( సిసిఎంబి ) వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పిఎం భార్గవ కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు పుష్ప మిత్ర భార్గవ. వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో హైదరాబాద్‌, ఉప్పల్‌ ప్రశాంత్‌ నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భార్గవకు కుమారుడు మోహిత్‌, కుమార్తె వినీత ఉన్నారు. ఆయున సతీమణి మనోరమ గతేడాది మరణించారు. కాగా భార్గవ మరణవార్త తెలుసుకున్న సిసిఎంబి డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, మాజీ డైరెక్టర్లు మోహన్‌రావు, లాల్‌జీ సింగ్‌, పలువురు శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భార్గవ పార్థివదేహానికి నివాళులర్పించారు. భార్గవ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆధునిక శాస్త్రRead More


వైసీపీ యాగం: ఎందుకో తెలుసా?

వైఎస్ జ‌గ‌న్ నాయ‌త్వంలోని వైసీపీ ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు చేస్తోంది. వివిధ రూపాల్లో అది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాల పేరుతో మ్యానిఫెస్టోని కూడా జ‌గ‌న్ ప్లీన‌రీలో ప్ర‌క‌టించ‌డం ద్వారా ఓ అడుగు ముందుకేశారు. ఇక ఇప్పుడు సీఎం ప‌ద‌వి కోసం ఓ యాగం కూడా ప్రారంభించారు. సీఎం కావాలంటూ హైద‌రాబాద్ లో స‌హ‌స్ర చండీయాగం ప్రారంభించారు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ యాగం కొన‌సాగుతుంది. ఈ యాగాన్ని ఆపార్టీ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ప్రారంభించారు. శివ‌రామ ప్ర‌సాద శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఈ యాగం నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. జ‌గ‌న్ ని సీఎం పీఠం మీద నిల‌బెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ యాగం సాగుతుంద‌న్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిల వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మీద క్రిస్టియ‌న్ ముద్ర కొంత‌మేర‌కు పనిచేసిన సంగ‌తి తెలిపిందే. దానికిRead More


విక్ర‌మ్ సూసైడ్ మిస్ట‌రీకి ముడి వీడింది

డ్రగ్స్ కేసులో మరో సంచలన విషయం బయట పడింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కేసుకు డ్రగ్స్‌కు లింకులు బయటపడుతున్నాయి. ఓ పబ్‌లో భాగస్వామిగా ఉన్న విక్రమ్ గౌడ్ డ్రగ్స్ కేసు బయటపడినప్పటి నుంచి ఆయన ఆందోళనలో ఉన్నారు. విచారణ అంశాలు బయటకు వస్తుండడంతో తీవ్ర వత్తిడికి లోనయ్యారు. దీనికితోడు అప్పుల్లో కూరుకుపోయారు. తండ్రి ఇచ్చిన ఇంటిని అమ్మేశారు. దీంతో ఫైనాన్షియర్ల వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వాట్సప్ మెసేజ్‌లతో విక్రమ్ గౌడ్‌ను హెచ్చరించారు. విక్రమ్ గౌడ్‌కు వచ్చిన ఓ మెసేజ్‌లో రూ. 20 లక్షలు, మరో మెసేజ్‌లో రూ. 35 లక్షలు చెల్లించాలంటూ ఫైనాన్షియర్లు అల్టిమేటమిచ్చారు. విక్రమ్ గౌడ్‌కు సినిమా వాళ్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. నిర్మాతగా రెండు సినిమాలు కూడా తీశారు. పబ్ భాగస్వామిగా ఉన్న విక్రమ్Read More