Main Menu

harish rao

 
 

హ‌రీష్ కి అండ‌గా ఉంటా..!

kcr harish

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు తన ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన హరీశ్‌రావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆద్యంతం హరీశ్‌రావును పొగడ్తల్లో ముంచెత్తారు. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి వెళ్లేటప్పుడు రెండు కళ్లలో నీళ్లు తిరిగాయని.. ఈ ప్రాంతం ఏమైపోతుందో అని తాను బాధపడ్డానని, కానీ హరీశ్ రావు కూడా తనకు దీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సిద్దిపేటను స్వర్గసీమ చేస్తున్నారని కితాబిచ్చారు. హరీశ్ కోరినట్లుగా సిద్దిపేట ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వందకోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇక్కడకు ప్రభుత్వ వైద్యకళాశాలను కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషంగా బతకాలని,Read More


‘పీఎంకేఎస్‌వై’ కోసం నేడు ఢిల్లీ కి ..

HARISH

తెలంగాణ మంత్రి హరీష్ రావు ‘పీఎంకేఎస్‌వై’ కోసం నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ ప్రయాణంలో మరికొన్ని ప్రయోజనాలున్నాయి.అవేంటంటే.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయాలున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో ఇవాళ ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. కేంద్రం నిధులిచ్చే వాటిలో రాష్ట్ర ప్రాజెక్టులు కూడా ఉండటంతో.. ఇక్కడి ప్రాజెక్టుల పరిస్థితిపై కేంద్రానికి హరీష్ వివరించనున్నారు.


హ‌రీష్ రావుని జిల్లాలో అడుగుపెట్ట‌నివ్వం..!

jagga reddy

తెలంగాణా మంత్రి హ‌రీష్ రావుకి గ‌ట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయకపోతే మంత్రి హరీశ్‌రావును జిల్లాలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. మన పాలన, మన రాష్ట్రం అని చెప్పి పోలీసులతో ప్రజలను కొట్టిస్తారా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. 8గ్రామాల రైతులు ఒప్పుకుంటే రైతులు రోడ్లపైకి ఎందుకొస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్ర‌భుత్వం మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని సూచించారు. బాధితుల‌కు న్యాయం చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.


పూర్వజన్మ సుకృతమే….

HARISH

పాలమూరు బీడు పొలాలకు నీటిని ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని మంత్రి హరీష్‌రావు అన్నారు.ఆత్మకూరు మండలం నందిమళ్ల దగ్గర బీమా సమాంతర కాలువను తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. కృష్ణా జలాలపై తొలిహక్కు పాలమూరు జిల్లాకే ఉందని హరీశ్ తెలిపారు. ఖరీఫ్‌లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఏడాది నాలుగు ప్రాజెక్టుల ద్వారా 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఉద్యమంలో కలిసిరాని నాయకులు.. అభివృద్ధి చెందుతుంటే దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారని హరీశ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 3 వేల ఎకరాలకే సాగునీరు ఇచ్చారని మంత్రి హరీశ్‌ అన్నారు.


హ‌రీష్ రావు బెదిరిస్తున్నారు..!

11-1436610119-thammineni-veerabhadram-867

తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ అన్యాయంగా రైతుల పాలిటి శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు చేస్తున్న భూ సేకరణ వ్యతిరేకంగా పాదయాత్రలు చేస్తున్నామని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో పర్యటించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ సర్కారు చాలా అక్రమంగా వ్యవహరిస్తోందని, 2013 చట్టం ప్రకారం లేదా 123 జోవో ప్రకారం రెండు విధానాల్లో పరిహారం ఇస్తామంటున్నా సీఎం దానిపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నదానికి వ్యతిరేకంగా ఓ వైపు హరీశ్ రావు బెదిరింపులకు దిగుతున్నారని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. భూ నిర్వాసితుల కోసం పాదయాత్రలు చేస్తున్న వారిపై పోలీసులతో అణిచివేస్తున్నారన్నారు. ఉద్యమRead More