GOSSIPS

 
 

గౌతమీపుత్రుడి కోసం ‘బాహుబలి’ టీం…..

BAAHU

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతంగా దూసుకెళుతోంది. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కలెక్షన్ల పరంగా సంతోషంగా ఉన్నారు. దీంతో సినిమాను జనాల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే బాలయ్య, డైరెక్టర్ క్రిష్‌, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌లతో కలిసి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి దర్శక ధీరుడు రాజమౌళి, భల్లాలదేవుడు రానా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ అనంతరం కలెక్షన్లు పడిపోకుండా బాలకృష్ణతో రానా, క్రిష్‌తో జక్కన్నల ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఓ చానల్ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించిందట. ఈ వీకెండ్‌లోనే ఆ చానల్ సదరు ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుందని టాక్. బాహుబలి ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నRead More


బన్నీకి చెర్రీకీ మద్యలో….

Ram_Charan

ఇటీవల బన్నీకి వరుస హిట్లు రావడం, అభిమానుల లిస్టు పెరుగుతుండడంతో అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య అంతరం పెరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదికపై అల్లు హీరోలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న టాక్ వినిపిస్తోంది.వివరాల్లోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో మెగా బ్రదర్ నాగబాబు సంచలన కామెంట్లు చేయడం.. ఆ కామెంట్లకు ఘాటైన రిప్లైలు రావడం గురించి తెలిసిందే. ఆ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. దానిపై పవన్ అభిమానులు నానా యాగీ చేశారు. అల్లు అర్జున్‌ను చుట్టుముట్టారు. పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలు పొడసూపాయని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. కారణం.. ఆ ఫంక్షన్‌లో బన్నీకి కావాల్సినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడమేనని ఫంక్షన్‌కు హాజరైన పలువురు అభిమానులు అనుకుంటున్నారు.


ఎన్టీఆర్ కన్నా వెనుకంజలో చిరు…

Jr-NTR-Chiranjeevi

టాలీవుడ్లో ఎన్టీఆర్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జనతాగ్యారేజ్. ఈ సినిమాతో ఎన్టీఆర్ పలు రికార్డులను తన ఒరలో చేర్చుకున్నాడు. ఇక, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం విడుదలకు సిద్ధమైంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఎందుకూ అంటే.. ఓ విషయంలో చిరు ఖైదీ నంబర్ 150 సినిమా తారక్‌ను దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ సినిమా విడుదల కాబోతోంది. దానికన్నా ముందు స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు కర్ణాటకలో. ఆ ప్రీమియర్ షోల విషయంలో జనతాగ్యారేజ్‌ను దాటలేకపోయింది చిరు ఖైదీ నంబర్ 150. కన్నడ నాట జనతాగ్యారేజ్‌కు 24 ప్రీమియర్ షోలు వేస్తే.. ఖైదీ నంబర్ 150కి మాత్రం 18 స్పెషల్ షోలే వేస్తున్నారట. వాస్తవానికి ధృవ సినిమాతోనే జనతాగ్యారేజ్Read More


బన్నీ అస్త్రాలు ఎవరిమీద?

Allu-Arjun-At-Sukumarudu-Triple-Platinum-Disc-new-action-photo-shoot-193

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగ ఫంక్షన్లో చురకలు అంటించారు. బన్నీ అస్త్రాలు ఎవరిమీద అనేగా మీ అనుమానం.అయితే ఇక చదవండి.. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా సినీ హీరో అల్లు అర్జున్ కూడా పరోక్షంగా అస్త్రాలు సంధించారు. ఎన్నో మాట్లాడలేని విషయాలు, చెప్పలేని విషయాలకు ఈ సినిమానే సమాధానమన్నారు. ఇప్పటివరకు ఎత్తిన ప్రతీ వేలు ముడుచుకోవాలని. జారిన ప్రతీ నోరు మూసుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. ఖైదీ నెంబర్‌ 150 అన్నింటికి సమాధానం ఇస్తుందన్నారు. ఈ సినిమా ఒక స్వీట్‌ వార్నింగ్‌ కావాలని కోరుకొంటున్నానని బన్నీ చెప్పారు. చిరంజీవి నుంచి నేర్చుకోవాల్సింది.. డ్యాన్స్, ఫైట్లు కావని సంస్కారమని చెప్పుకోచ్చాడు. ఆ సంస్కారంతోనే మాట్లాడుతోన్నానన్నారు. సంక్రాంతికి మరో సినిమా విడుదలౌతోందని. ఆ సినిమా కూడా హిట్‌ కావాలని చిరు అభిమానులRead More


కిలో పచ్చిమిర్చి రూ.2900.

green chilli

ఇది మనకు కొంచెం ఊరటనిచ్చేదే.అదేంటి కిలో పచ్చిమిర్చి రూ.2900, అయితే ఊరట నివ్వడమేమిటి అనుకుంతున్నారా.మరేంలేదండి. కేజీ పచ్చిమిరపకాయులు ధర రూ.2,900. అయితే అది మన దేశంలో కాకపోవడం మనకు ఊరటనిచ్చే విషయం.నిజంగానే కేజీ పచ్చిమిరపకాయులు ధర రూ.2,900. మనకు పొరుగుదేశమైన భూటాన్‌లో ఇప్పుడీ పరిస్థితి ఉంది. కొత్తసంవత్సరానికి గుర్తుగా భూటాన్ ప్రజలు జరుపుకునే పండుగలో పచ్చిమిరపకాయలను విపరీతంగా వినియోగిస్తారు. డిసెంబరు,జనవరి, ఫిబ్రవరిలో పచ్చిమిరపకాయలకు ఇక్కడ భలే గిరాకీ. వారు జరపుకునే ‘లోంబా’ పండుగ సందర్భంగా చేసే వంటల్లో పచ్చిమిరపకాయలను విపరీతంగా ఉపయోగిస్తారు. ‘హొయెంటో’ అనే కూరనైతే అచ్చంగా పెరుగు, పచ్చిమిరపకాయలతోనే వండుతారు. ఈ కారణంగానే ఈ మూడునెలల్లో ఇక్కడ పచ్చిమిర్చికి అంతటి డిమాండ్.అయితే గతంతో పోలిస్తే ఈసారి భూటాన్‌లో మిరపకాయల ధర మోతెక్కిపోతోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల మిరపకాయలను గత జూన్‌లో భూటాన్Read More


వ్యభిచార గృహంలో విద్యాబాలన్‌…

vidya

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ గత రెండేళ్ళ కాలంలో సాదించిన అనూహ్య విజయాలగురించి మనకు తెలిసిందె.ఆమె వినూత్న తరహాలో కథల్ని ఎంచుకుని వీటికి జీవం పోస్తూ విజయాల దిసగా సాగుతోంది.ఈ క్రమంలో ‘డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘కహానీ-2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న తర్వాతి చిత్రం ‘బేగం జాన్‌’. ఇందులో ఆమె వ్యభిచార గృహ నిర్వాహకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ స్టిల్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో విద్యా హుక్కా తాగుతూ కనిపించిన తీరు చిత్రంపై అంచనాలు పెంచుతోంది. బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇది. బెంగాలీలో ‘రాజ్‌కహిని’ పేరుతో శ్రీజిత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ షా, రాజేశ్‌ శర్మ, గౌహర్‌ఖాన్‌, పల్లవీRead More


షారుక్‌ అల్లుడు ఇలా…

srk

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ హీరోగా ఎలాఉన్నా, తన పిల్లల విషయంలో మాత్రం అందరు తండ్రుల్లాగే వ్యవహరిస్తాడు. ఎంత సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా షారుక్‌కి తన ముగ్గురు పిల్లలు ఆర్యన్‌, సుహానా, అబ్రామ్‌లకు మించింది ఏమీ లేదు. తాజాగా షారుక్‌ తన కుమార్తె సుహానాతో డేటింగ్‌ చేసే కుర్రాడికి ఉండాల్సిన లక్షణాలేంటో ఫెమీనా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు. * ఉద్యోగం ఉండాలి * నాకు ‘నువ్వంటే ఇష్టం లేదు’ అన్న విషయం అర్థంచేసుకోవాలి. * నేను సుహానా ఎక్కడుంటే అక్కడుంటాను. * తను నా ఇంటి యువరాణి. ‘నీ సొంతం’ అనుకుంటే నేనూరుకోను. * నువ్వు తన పట్ల ఎలా ఉంటే.. నేను నీతో అలాగే వ్యవహరిస్తా. .. అంటూ తన కుమార్తెపై ఎంతప్రేముందో నాలుగు ముక్కల్లో వివరించి చెప్పారు బాద్‌షా. షారుక్‌ నటించిన రయీస్‌Read More


నాని కూడా అది మొదలెట్టేశాడు..

nani

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియో విడుదలకు సంబందించి,ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది.సినిమా లోని అన్ని పాటలూ ఒకేసారి విడుదల చేస్తే సినిమాకు సరిగ్గా ప్రమోషన్ జరగదనో ఏమో ఒక్కో పాటను విడుదల చేస్తూ సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు. ఈ ఒక్కో పాట సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారో కానీ చాలామంది హీరోలు ఈ మధ్య ఇదే ఫాలో అవుతున్నారు. నేచులర్ స్టార్ నాని కూడా దీన్నే మార్గంగా ఎంచుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను లోకల్’. దిల్‌రాజు నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నెక్ట్స్ ఏంటి’ అనే బాణీలో సాగుతుందట. ఈ పాటను జనవరి 6న సాయంత్రం 6గంటలకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు నాని తనRead More


నేను భయపడేది ఆ ఒక్కరికే…

mohanbabu

మోహన్‌బాబు భయపడేది ఎవరికో తెలుసా?అయితే ఇక చదవండి, తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మోహన్‌బాబు క్రమశిక్షణకు, ముక్కుసూటితనానికి మారు పేరు. దాంతో చాలా మంది ఆయనంటే భయపడతారు. బయటివారే కాదు.. మనోజ్‌, విష్ణు, లక్ష్మీ కూడా ఇప్పటికీ తమ తండ్రి అంటే భయమేనని చెబుతుంటారు. మరి, ఇంతమందిని భయపెట్టే మోహన్‌బాబు ఎవరంటే భయపడతారో తెలుసా? ఈ ప్రపంచంలో మోహన్‌బాబును భయపెట్టే ఏకైక వ్యక్తి.. ఆయన భార్య నిర్మలా దేవి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. నిర్మలా దేవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మోహన్‌బాబు.. ‘ఈ ప్రపంచంలో నేను భయపడేది నా భార్యకు మాత్రమేన’ని అసలు రహస్యాన్ని బయటపెట్టారు.


ఆ సినిమా లేకపోతే…

Jagapathi-Babu

“కష్టకాలంలో ఆ సినిమా లేకపోతే పరిస్తితి వేరేలా ఉండేది” జగపతిబాబు ఈ మాట స్వయంగా చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు మధ్యలో కొంత కష్టకాలం ఎదుర్కొన్నాడట! హీరోగా అవకాశాలు రాక, ఉన్న డబ్బులు ఖర్చయిపోయి చాలా ఇబ్బంది పడ్డాడట! అలాంటి సమయంలో ‘లెజెండ్‌’ తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతున్నాడు. ఆ సినిమా తరువాత డబ్బు కష్టాలు తెలియలేదు. ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నాయి. పాత రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది అంటున్నాడు. నిజం చెప్పాలంటే హీరోగా కంటే కూడా విలన్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నాను అని చెబుతున్నాడు.