Main Menu

cpi

 
 

కోదండరాం అరెస్ట్‌

kodanda

ధర్నాచౌక్‌ తరలించాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 2కే రన్‌లో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్నాచౌక్‌ తరలింపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కే రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసుల మొహరింపుతో ఆ ప్రాంతం కర్ఫ్యూను తలిపిస్తోంది.


ఫ్యాన్ కి లెఫ్ట్ చేరువ‌యిన‌ట్టేనా..?

ysrcp left

ఏపీలో ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య స‌ఖ్య‌త‌కు సానుకూల‌త క‌నిపిస్తోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో వామ‌ప‌క్షాలు, వైఎస్సార్సీపీ మ‌ధ్య బంధానికి మార్గం సుగ‌మం అవుతోంది. ఇప్ప‌టికే గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌లు దానికి అవ‌కాశాలు క‌ల్పించాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా వామ‌ప‌క్షాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కొత్త ఊపునిచ్చాయి. ఒక్క ఎమ్మెల్యే కూడా లేక విల‌విల్లాడిపోతున్న పార్టీల‌కు ఏకంగా ఐదు సీట్ల‌కు మూడు స్థానాలు క‌ట్ట‌బెట్టిన మేథావులు త‌మ మ‌ద్ధ‌తు వామ‌ప‌క్షాల‌క‌న‌ని చాటి చెప్పారు. అదే స‌మ‌యంలో వారికి అండ‌గా నిలవ‌డం ద్వారా జ‌గన్ కూడా కొంత రాజ‌కీయ చాతుర్యం ప్ర‌ద‌ర్శించిన‌ట్టే క‌నిపిస్తోంది. త‌న‌కు బ‌ల‌మున్న ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌లో మాత్ర‌మే పోటీ చేసి, మిగిలిన స్థానాల్లో లెఫ్ట్ కి రైట్ చెప్ప‌డం ద్వారా వారికి మ‌రింత ఊపునిచ్చారు. త‌ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ‌కు లెప్ట్ స‌ఖ్య‌త దొరుకుతుంద‌ని ఆశిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌డంRead More


రోజాని చూడ‌గానే కాళీమాత క‌నిపిస్తోంది..!!

cpi narayana

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కే నారాయ‌ణ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. ఆర్కే రోజా అంటే టీడీపీ నేత‌ల‌కు భ‌య‌మ‌ని నారాయ‌ణ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. కాళిమాతను చూసినట్లుగా రోజాను చూసి వణికిపోతున్నారన్నారు. ఏపీలో టీడీపీతో పాటుగా తెలంగానాలో టీఆర్‌ఎస్ కూడా ప్రతిపక్షాలను చూసి ప్యాంటులు తడుపుకుంటున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఏళ్ల త‌ర‌బ‌డి ఎమ్మెల్యే మీద వేటు వేయ‌డం త‌గ‌ద‌న్నారు. అసెంబ్లీలో ఇలా సస్పెండ్‌ చేసుకుంటూ వెళితే ఎవరు మిగలరని నారాయణ అన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…అమెరికాలో భారతీయులపై దాడులను పట్టించుకోవడం లేదని నారాయణ విమర్శించారు. మన దేశంలో కూడా మత విద్వేషాలు కొనసాగడం విచారకరమని ఆయన అన్నారు.


సీపీఐ నేత‌ల‌తో జ‌న‌సేనాని

janasena cpi

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సీపీఐ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌తో పాటు మరికొంద‌రు నేత‌లు ప‌వ‌న్ క‌లిశారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమా షూటింగ్ లో ఉన్న ప‌వ‌న్ ఇటీవ‌ల అనంత‌పురంలో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. అనంత క‌రువు అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌త్యేక హోదా మీద ఆయ‌న ప్ర‌భుత్వాల‌ను త‌ప్పుబ‌ట్టారు. అంత‌కుముందు కాకినాడ స‌భ‌లో క‌మ్యూనిస్టులను ఆయ‌న కొనియాడారు ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సీపీఐ నేత‌ల స‌మావేశం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఇప్ప‌టికే టీడీపీతో జ‌న‌సేన సంబంధాలు బ్రేక‌ప్ ఖాయ‌మ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇలాంటి త‌రుణంలో క‌మ్యూనిస్టుల‌తో కాట‌మ‌రాయుడు స‌మావేశం కావ‌డం ఆస‌క్తిదాయ‌క‌మే.


ఆ శాఖ‌లో కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం

kamineni

మంత్రి కామినేని శ్రీనివాస్ కి సీపీఐ నేత‌లు బ‌హిరంగ స‌వాల్ విసిరారు. మంత్రికి చిత్త‌శుద్ధి ఉంటే ఈనెల 26న ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ లో చ‌ర్చ‌కు రావాల‌ని సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామకృష్ణ ఛాలెంజ్ చేశారు. బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని యూఎస్ నుంచి స్టేట్ మెంట్ ఇచ్చిన మంత్రి ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయార‌ని ఎద్దేవా చేశారు. మెడిక‌ల్ కౌన్సిలింగ్ ముసుగులో భారీ కుంభ‌కోణం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. 371డి కి వ్య‌తిరేకంగా ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్నారు. మంత్రి కామినేని మాత్రం వ్యాపారుల అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ వ్య‌వ‌హ‌రించ‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే ఈ కౌన్సిలింగ్ పై హైకోర్ట్ విచార‌ణ సాగిస్తోంద‌ని తెలిపారు. ప్రైవేటు కాలేజీల‌కు తొత్తుల మారిన కామినేని తీరు వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంద‌న్నారు. విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి వెళ్లిన విద్యార్థినేత‌ల‌ను కూడా మంత్రి అనుమ‌తించ‌లేద‌న్నారు. వైద్య ఆరోగ్యRead More


వెంక‌య్య రాజీనామా చేయాలి

suravaram cpi

ప్రధానమంత్రి నరేంద్రమోదీది నియంతృత్వ ధోరణి అని సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్యాకేజికి చట్టబద్దత గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అడిగితే.. చట్టంలో ఉన్నవే కదా అంటున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు నిజంగా వెంకయ్య నాయుడుకు ఆత్మగౌరవం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సురవరం డిమాండ్ చేశారు.


ప‌వ‌న్ పొలిటిక‌ల్ గా ఎదుగుతాడు..!

cpi narayana

పవన్ కళ్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు బావున్నా.. నడకలో తడబడుతున్నాడని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదానే 2019 ఎన్నికల్లో సీపీఐ ప్రధాన ఎజెండాగా ఉంటుందని ఆయన అన్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాటలు తప్ప చేతలు లేవని నారయణ అన్నారు. ఏపీలో టీడీపీ,వైసీపీ కాకుండా మరో పార్టీకి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని నారయణ అన్నారు. పవన్ సరిగా ముందుకెళ్తే కచ్చితంగా మూడో ప్రత్నామ్నాయ శక్తిగా పవన్ ఎదిగే అవకాశముందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అవసరం అనుకుంటే పవన్‌తో చర్చలకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని, జగన్‌ను సైతం పార్టీలో చేర్చుకుంటాననడంRead More


నారాయ‌ణ‌- నారా మ‌ధ్య బంధం ఏమిటి..!?

cpi narayana

నారా చంద్ర‌బాబు, కంక‌ణాల నారాయ‌ణ‌. ఈ ఇద్ద‌రు తెలుగు రాజ‌కీయాల‌లో చెరో గ్రూపులో ఉద్దండులే. రాజ‌కీయంగా ఎక్కువ కాలం ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలే. కానీ వాస్త‌వంగా ఇద్ద‌రి మ‌ధ్య మాత్రం చిరకాల స్నేహం మాత్రం కొన‌సాగుతోంది. రాజ‌కీయంగా ఎలా ఉన్నా..వ్య‌క్తిగ‌త స్నేహం మాత్రం న‌డుస్తోంది. అంతే కాదు అది అసాధార‌ణ స్నేహంగా కూడా చెప్ప‌వ‌చ్చు. చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్ప‌టికీ నువ్వు..నువ్వు అని పిలుచుకుంటూ త‌మ సాన్నిహిత్యాన్ని చాటుకోవ‌డం వీరిద్ద‌రి స్పెషాలిటీ. ఒకే జిల్లాకు చెందిన ఇద్ద‌రూ ఒకే క్యాంప‌స్ నుంచి విద్యార్థి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. ఆ త‌ర్వాత చెరో దారి ప‌ట్టిన‌ప్ప‌టికీ క్యాంప‌స్ మితృత్వంతో మాత్రం కొనసాగుతోంది. కామ్రేడు, సీఎం మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు మాత్రం న‌డుస్తున్నాయి. అందులో భాగ‌మే ఇటీవ‌ల కొద్దికాలం క్రితం నారాయ‌ణ విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ఆసంద‌ర్భంగా ప‌లు సూచ‌న‌లు చేసి చంద్ర‌బాబునిRead More