congress

 
 

ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన‌ట్టు చేస్తే..?

Jagan-and-prashant-kishor

ఏపీ రాజ‌కీయాల‌కు క‌న్స‌ల్టెంట్ క‌లిసొస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. వైసీపీ ని స‌క్సెస్ బాట ప‌ట్టించ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. మంద‌స్తు ఎన్నిక‌ల సంకేతాల నేప‌థ్యంలో తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ హైద‌రాబాద్ రావ‌డం, వైసీపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దాంతో ఇప్పుడు ఆపార్టీలో ఎలాంటి మార్పులు వ‌స్తాయ‌నే అంశం అంద‌రిలో నానుతోంది. ముఖ్యంగా విభిన్న ప్ర‌చార పోక‌డ‌ల‌కు పెట్టింది పేర‌యిన ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. గ‌తంలో చాయ్ పే చ‌ర్చ అంటూ మోడీని, కాట్ పే చ‌ర్చ అంటూ రాహుల్ ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన ప్ర‌శాంత్ కిషోర్ స‌గ‌మే స‌క్సెస్ అయ్యారు. నితీష్ కుమార్ ని మోడీ హ‌వాకి ధీటుగా నిల‌బెట్టిన ప్ర‌శాంత్ ఇప్పుడు బాబు ముందు జ‌గ‌న్ చేతRead More


టీ కాంగ్రెస్ లో డిష్షుం..డిష్షుం

congress

నల్లగొండ జిల్లా డీసీసీ సమీక్ష సమావేశం రసా బాసగా మారింది. గాంధీభవన్‌లో దిగ్విజ రుసింగ్‌ సాక్షిగా జరిగిన కాంగ్రెస్‌ జిల్లా సమావేశం ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నేతలు డిగ్గీ, కె జానా రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వం టి నేతల సమక్షంలోనే కాంగ్రెస్‌ నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. కొట్టుకున్నారు. తిట్ల పురాణం పెట్టా రు. ఒకరు బ్రోకరంటే…మరొకరు కాంట్రాక్టర్‌గా దోపిడీ చేస్తున్నవంటూ బాహబాహీ తలపడ్డారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న పార్టీ నేతలు నివ్వేరపోయారు. ఈ సంఘటనపై దిగ్విజరుసింగ్‌ సీరియస్సయ్యారు. చివరకు ప్రతిపక్ష నేత కె జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య వారిద్దరి మధ్య నిలబడి వారించడంలో ఘర్షణ సద్దుమణిగింది. వారు శాంతించారు. నల్లగొ ండ జిల్లా పున ర్విభజన జరిగింది కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్‌ నల్ల గొండ జిల్లాకు పరిమితమైతే బాగుంటుందని టీపీRead More


మ‌హిళా నేత‌పై చేయి చేసుకున్న విష్ణు

Congress leader Malladi Vishnu

విజ‌య‌వాడ న‌గ‌ర కాంగ్రెస్ లో క‌ల‌క‌లం రేగింది. మ‌హిళా నేత‌పై మ‌ల్లాది విష్ణు చేయి చేసుకోవ‌డం పెను వివాదానికి దారితీసింది. న‌గ‌ర మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలిపై మాజీ ఎమ్మెల్యే దాడి చేశార‌నే వార్త పెద్ద సంచ‌నంగా మారుతోంది. కాంగ్రెస్ కార్యాల‌యంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో పార్టీ పెద్ద‌లు స్పందించారు. విచార‌ణ జ‌రిపిస్తామ‌ని పీసీసీ చీఫ్ ర‌ఘువీరా చెప్పుకొచ్చారు. అయితే ప్ర‌త్యేక హోదా మీద కాంగ్రెస్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జ‌రిగిన చిన్న పాటి చ‌ర్చ‌లో ఆమె ఏదో అన్న‌ద‌నే సాకుతో కెంబూరి శ్రీల‌క్ష్మిపై మ‌ల్లాది విష్ణు దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను ప‌లువురు ఆక్షేపిస్తున్నారు. పార్టీ కార్యాల‌యంలోనే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేని ప‌రిస్థితి ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. క‌న్నీరు కారుస్తూ శ్రీల‌క్ష్మి మ‌హిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షురాలికి ఫిర్యాదు చేయ‌డంతో ఆమె ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇది సీరియ‌స్ గాRead More


కాంగ్రెస్ బాట‌లో చంద్ర‌బాబు..!

Chandrababu-Naidu-slams-Chief-Minister1

ఏపీ రాజ‌కీయాలు కొన్నిసార్లు ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. మ‌రికొన్ని సార్లు విస్మ‌య‌క‌రంగా సాగుతాయి. తాజాగా చంద్ర‌బాబు నిర్ణ‌యం గ‌మ‌నిస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న‌కు ఇప్పుడు రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లున్నాయి. అందులో ఒక‌టి నారా లోకేష్ ని ప్ర‌జ‌ల ముందు నాయ‌కుడిగా నిల‌బెట్ట‌డం, అదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ ని ఎదుర్కోవ‌డం. ఈ ల‌క్ష్యాల కోసం చంద్ర‌బాబు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతున్నారు. తాను త‌ప్ప‌ని చెప్పిన ప‌నుల‌ను తానే చేయ‌డానికి సంకోచించ‌డం లేదు. త‌న‌ను న‌మ్మిన‌వాళ్ల‌ను న‌ట్టేట ముంచ‌డానికి వెన‌కాడ‌డం లేదు. త‌న ల‌క్ష్యాల కోసం అంద‌రినీ వంచించ‌డానికి సంశ‌యం క‌నిపించ‌డం లేదు. అందుకే నాలుగు రోజుల క్రితం చంద్ర‌బాబును వీరాధి వీరుడ‌ని అసెంబ్లీ సాక్షిగా పొగిడిన నేత‌లే ఇప్పుడు తెగుడుతున్నారు. ఆయారం గయారాం ల పార్టీగా టీడీపీని మార్చేశార‌ని నిందిస్తున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డితే క‌నిక‌రం లేదా అనిRead More


సి రామ‌చంద్ర‌య్య టీడీపీలో..

tdp

ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఆయ‌న‌తో సంబంధం లేకుండానే టీడీపీ ఈ ప‌ని పూర్తి చేసింది. హైటెక్ పాల‌న‌లో ఆయ‌న్ని పార్టీలో చేర్చుకుని గుర్తింపు కార్డు కూడా విడుద‌ల చేసింది. సి.రామచంద్రయ్య తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు. 30ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్‌ పార్టీల్లో కీలక నేతగా వెలిగారు. ఈయనకు టీడీపీ సభ్యత్వ నమోదు కల్పించారు. కడప నగరంలో ఆయన ఉంటున్న వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ ఉషారాణి భర్త సూర్యనారాయణరావు, ఆయన సోదరుడు అశ్వర్థనారాయణకూ టీడీపీ సభ్యత్వాలు వచ్చాయి. ఇక పలువురు జర్నలిస్టులు, సామాన్యులకూ సభ్యత్వాలు జారీ చేశారు. రామచంద్రయ్య, తదితరుల ప్రమేయం ఏమాత్రం లేకుండానే టీడీపీ సభ్యత్వం నమోదు కావడం వెనుక, ఓటర్ల జాబితానే ఆధారంగా ఉన్నట్లు తెలుస్తోంది. పింఛనుదార్లనుంచి బలవంతంగా రూ.100 వసూలు చేసి సభ్యత్వం కట్టబెట్టారు. ఈ వ్యవహారం అప్పట్లోRead More


కాంగ్రెస్ కి బాహుబ‌లి వ‌స్తున్నాడు..!

kcr-k-jana-reddy

‘వచ్చే ఎన్నికల్లో మా పార్టీని గెలిపించేందుకు బాహుబలి వస్తాడు..’ అని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడం, రాహుల్ ఐరన్ లెగ్ అంటూ వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, ఐరన్ లెగ్గో కాదో భవిష్యత్తులో మీకే తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రశ్నించగా, వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగు లేదని, గెలిపించేందుకు బాహుబలి వస్తాడని ఆయన తెలిపారు. ఎవరాయన అని ప్రశ్నించగా, ఓపిక పట్టాలంటూ ఆయన సమాధానాన్ని దాట వేశారు.


జ‌గ‌న్ కేసుల వెనుక ఎవ‌రెవ‌రున్నారు..!?

Jagan-Mohan-Reddy

ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కేసులు వ్య‌వ‌హారం నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఆయ‌న కేసులు ప్ర‌స్తావించ‌కుండా అధికార పార్టీ నేత‌ల‌కు కాలం గ‌డ‌వ‌ద‌నడంలో సందేహం లేదు. అయితే ఈ కేసుల‌కు సంబంధించి ఇటీవ‌ల ఒక్కో నేత నోరు తెరుస్తున్న వైనం ఆస‌క్తి రేపుతోంది. నేత‌లే కాకుండా అధికారులు కూడా ఆనాటి ప‌రిణామాల‌పై త‌మ వాణీ వినిపిస్తున్న తీరు కేసుల వెనుక అస‌లు క‌థ వేరే అన్న అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది. జ‌గ‌న్ కేసుల వెనుక రాజ‌కీయ కోణాన్ని వెలికితీస్తోంది. రాజ‌కీయాల మూలంగా వ‌చ్చిన కేసులు ఎన్నాళ్లు నిలుస్తాయోన‌న్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక తాజాగా డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ చ‌ర్చ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. అస‌లు జ‌గ‌న్ కేసుల‌కు సంబంధించి ఎవ‌రెవ‌రు ఎలా స్పందించారన్న‌ది ఓమారు ప‌రిశీలిద్దాం.. జగన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో వేస్తున్నRead More


కిర‌ణ్ రీ ఎంట్రీ క‌న్ఫ‌ర్మ్..!

kiran kumar reddy

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌రోసారి పొలిటిక‌ల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్నారు. మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆయ‌న త‌న సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అయితే శాస‌న‌స‌భ్యుడు, చీఫ్ విప్, స్పీక‌ర్, సీఎంగా అవ‌కాశాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీని కాద‌ని సొంత పార్టీని పెట్టుకుని కిర‌ణ్ ఇప్పుడు మ‌ళ్లీ త‌న సొంత ఇంటికి ప‌య‌నం ప్రారంభించ‌డం ఖాయంగా మారుతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌రోసారి కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని కిర‌ణ్ స‌న్నిహితులే చెబుతుండ‌డం విశేషం. 2012 నుంచి 14 వ‌ర‌కూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి గ‌డిచిన సాధార‌ణ ఎన్నిక‌ల అనంత‌రం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఏపీ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించిన ఆయ‌న ఆత‌ర్వాత కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీని పెట్టుకున్న‌ప్ప‌టికీ త‌మ్ముడిని కూడా గెలిపించుకోలేకRead More


చేతులు మారుతున్న తెలుగు దినప‌త్రిక‌..!

breaking-news1

మీడియాలో క‌మ్యూనిస్టులు అంద‌రిక‌న్నా ముందే ప్ర‌వేశించారు. మిగిలిన పార్టీల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారి పేరుతో ప‌త్రిక‌లు ప్రారంభిస్తే క‌మ్యూనిస్టులు మాత్రం దానికి భిన్నంగా నేరుగా తామే సిద్ధ‌ప‌డి ప‌త్రిక‌లు ప్రారంభించారు. అలాంటి వాటిలో విశాలాంధ్ర ఒక‌టి. ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో విశాలాధ్రను విభ‌జించి మ‌న తెలంగాణా అంటూ తెలంగాణా కోసం ప్ర‌త్యేకంగా ప్రారంభించారు. మూడేళ్ల‌కే తెలంగాణాలో ఆ ప‌త్రిక ముప్పు తిప్పులు ప‌డుతోంది. అస‌లే ఆర్థిక‌వ‌న‌రులు అంతంత‌మాత్రంగా ఉన్న త‌రుణంలో ప‌త్రిక నిర్వ‌హ‌ణ క‌త్తిమీద సాములా మార‌డంతో చాలా చిక్కులు ప‌డుతున్నారు. ఆ ప‌త్రిక ఎడిట‌ర్ గా ఉన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కుడు శ్రీనివాస‌రెడ్డి కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్న‌ట్టు స‌మాచారం. దానికితోడు తెలంగాణాలో సొంత మీడియా లేక‌పోవ‌డంతో ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ చాలా ఇబ్బందులు ప‌డుతోంది. త‌మ గొంతు వినిపించేRead More


యూపీలో పొత్తు పొడించింది..!

congress

కీలక రాష్ట్రం యూపీలో కొత్త పొత్తు పొడిచింది. మ‌ధ్య‌లో ఊగిస‌లాట‌కు గుర‌యినప్ప‌టికీ చిర‌వ‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్యవర్తిత్వంతో వ్య‌వ‌హారం కొలిక్కి వ‌చ్చింది. ఎస్పీ, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు కుద‌ర‌డంతో ఇరు పార్టీల నేత‌లు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తం స్థానాల్లో 403 స్థానాల్లో కాంగ్రెస్‌కు 105 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం తెలిపింది. మిగిలిన 298 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది. దీంతో రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించినట్లు అయింది.ఇప్పుడు ఇరు పార్టీలు నియోజకవర్గ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.