Main Menu

COLLECTIONS

 
 

రూ. 100 కోట్ల క్లబ్‌లో’గ్యారేజ్‌’ ..

ntr

విడుదలైన వారం రోజులకే ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.ఇక వివరాల్లోకి వెళితే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం విశేషమైన వసూళ్లను రాబడుతోంది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండో వారంలో రూ. 100 కోట్లు వసూలు చేసిందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత బాక్సాఫీసు వద్ద అత్యంత వేగంగా 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జనతా గ్యారేజ్‌’ రికార్డు సృష్టించినట్లు సమాచారం. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటించారు. ఇందులో ప్రకృతిని ప్రేమించే కుర్రాడిగా ఎన్టీఆర్‌, మనుషులను ప్రేమించేRead More


గ్యారేజ్ కి గట్టి దెబ్బేతగిలింది…

ntr-janatha-garage2

ప్రస్తుతం ‘జనతాగ్యారేజ్’ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడు రోజుల్లో 50 కోట్లు వసూళ్లు రాబట్టుకుని తెలుగు సినీపరిశ్రమలో తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల జాబితాలో జనతాగ్యారేజ్ ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందా ? లేదా ? అనే విషయంపైనే ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన ఇంకొక్కడు సినిమా తప్ప పెద్ద హీరోల సినిమాలేవి ఈ నెలలో విడుదలయ్యే పరిస్థితి లేదు. అందువల్ల జనతాగ్యారేజ్‌కు వచ్చిన ప్రమాదమేమి లేదని, 100 కోట్లు కచ్ఛితంగా రాబడుతుందని జూనియర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే జనతా గ్యారేజ్ ఆ మార్క్‌ను చేరుకుంటుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. దీనికి ప్రధాన కారణం పైరసీ. అయితే పైరసీ నియంత్రణకు ఎన్నిచర్యలుRead More


ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

ntr

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదో గుడ్ న్యూస్. ఓవ‌ర్సీస్ లో ఇప్పుడీ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసే ప‌నిలో ప‌డింది. జ‌న‌తా గ్యారేజ్ ఇక్క‌డ‌న్నీ రిపేర్లు చేయ‌బ‌డును అంటూ ముందుకొచ్చిన ఈ కొరటాల శివ సినిమా తాజాగా అన్ని రికార్డులు రిపేర్లు చేసే దిశ‌లో సాగుతోంది. తొలి నాలుగు రోజుల‌కే 1.5 మిలియ‌న్ డాల‌ర్ల చేరువ‌లోకి వ‌చ్చేసింది. దాంతో టాప్ త్రీ మువీస్ లో ఒక‌టిగా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఓవ‌ర్సీస్ వ‌సూళ్ల‌లో బాహుబ‌లి అగ్ర‌స్థానంలో ఉండ‌గా..ఆ త‌ర్వాత కొర‌టాల శివ మువీ శ్రీమంతుడు ఉన్నాడు. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ ద్వారా శ్రీమంతుడు ని చేరుకుంటారా లేదా అన్న‌దే చ‌ర్చ‌. ఇదే విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. శనివారం నాటికి 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టిందని ఆయన తెలిపారు. ఆదివారంతోRead More


ఫిఫ్టీ కొడుతున్న ఎన్టీఆర్..!

janatha garage

ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ పాజిటివ్ రెస్పాన్స్ తో ప‌రుగులు పెడుతోంది. బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో కొత్త రికార్డులు సృష్టింస్తోంది. ఎన్టీఆ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మువీగా నిలుస్తుంద‌ని అంచ‌నా. వ‌సూళ్ల‌లో తొలి మూడు రోజుల్లోనే ఆంధ్రా, తెలంగాణా క‌లిపి 30 కోట్ల‌కు చేరింది. మిగిలిన ఓవ‌ర్సీస్ ఇత‌ర ప్రాంతాల వ‌సూళ్లు క‌లుపుకుంటే సుమారు ఫిఫ్టీకి చేరువ‌లో క‌నిపిస్తోంది. ఇక వ‌రుస‌గా సండే, పండుగ సెల‌వులు తోడు కావ‌డంతో ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్ల‌లో రికార్డ్స్ క్రాస్ కావ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వర్గాల అంచ‌నా. సౌత్, ఇత‌ర ప్రాంతాల్లో కూడా మంచి వ‌సూళ్లు క‌నిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన రెండో రోజు భార‌త్ బంద్ కావ‌డంతో కొంత ప్ర‌భావం పడింది. కొన్ని చోట్ల వ‌సూళ్ల మీద బంద్ క‌నిపించింది. కానీ యూఎస్ లోRead More


జ‌న‌తా గ్యారేజ్ లో రికార్డుల ప‌ర్వం..!

Janatha-Garage-target-1

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్ జ‌న‌తా గ్యారేజ్ కి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా తొలిరోజు నుంచే స‌క్సెస్ రివ్యూస్, మంచి రేటింగ్స్ రావ‌డంంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అనేక చోట్ల కొత్త రికార్డుల దిశ‌గా సాగుతోంది. ఆల్ టైమ్ రికార్డ్స్ సరిచేస్తోంది. సినిమా లెంగ్త్ ఎక్కువ‌య్యింద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో యూనిట్ కూడా దానిమీద దృష్టిపెట్టింది. అయితే థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ సంద‌డితో బాక్సాఫీస్ కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇక వీకెండ్ లో మిగిలిన మూడు రోజుల‌తో సినిమా క‌లెక్ష‌న్లు హోరెత్తిపోవ‌డం ఖాయ‌మ‌ని బ‌య్య‌ర్లు విశ్వ‌సిస్తున్నారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం రాష్ట్రంలోని అనేక చోట్ల జ‌న‌తా గ్యారేజ్ వ‌సూళ్లు ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. వైజాగ్ లో ఈ సినిమా తొలిరోజు 2,29,94,416/- షేర్ కొల్ల‌గొట్ట‌డం ద్వారా కొత్త చ‌రిత్ర సృష్టించింది. ఈస్ట్ లో 2.28 కోట్లతోనూ కొత్తRead More


యూఎస్ టాప్ లిస్టులో జ‌న‌తాగ్యారేజ్..!

janatha-garage-stills-photos-pictures-24

యూఎస్ లో మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓపెనింగ్ డే బెస్ట్ గా నిలిచిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్ గా టాప్ 5లో చోటు ద‌క్కించుకుంది గ‌తంలో నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ద్వారా ఓవ‌ర్సీస్ మార్కెట్ లో హ‌వా సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ తో టాప్ 5 కి చేరుకున్నారు. తొలిరోజు ప్రీమియ‌ర్ షోల‌తో క‌లుపుకుని 60వేల డాల‌ర్లు వ‌సూళ్లు సాధించగ‌లిగారు. ఈ విష‌యంలో బాహుబ‌లి రికార్డ్ ని ఎప్పుడు చేరుకుంటారో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. బాహుబ‌లి ద్వారా రాజ‌మౌళి ఏకంగా 2.42 మిలియ‌న్ల ఓపెనింగ్ డే వ‌సూళ్లు సాధించ‌డం విశేషం. ఆ త‌ర్వాత అందులో స‌గం క‌లెక్ష‌న్ల‌తో శ్రీమంతుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 1.13 మిలియ‌న్ డాల‌ర్లను మ‌హేష్ సాధించాడు. స‌ర్థార్ గ‌బ్బ‌ర్ సింగ్, బ్ర‌హ్మోత్స‌వ‌రం వ‌రుస‌గా త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు జ‌న‌తాగ్యారేజ్Read More


క‌బాలి ఛేజ్ చేసేశాడు.!

Kabali-3

గత కొద్ది రోజుల క్రితం ప్రపంచాన్ని ‘కబాలి’ మానియా ఊపేసింది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా కబాలి జపమే. టాలీవుడ్, బాలీవుడ్‌లలోని సినీ రికార్డులను ‘కబాలి’ తిరగరాసేస్తాడాడని అందరూ ఊహించారు. అయితే, సినిమా విడుదల అయ్యాక డివైడ్ టాక్ రావడంతో కబాలి కనెక్షన్లలో రికార్డులు సృష్టించడం కష్టం అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తూ కబాలి దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక సంచలన వార్త మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటివరకూ కబాలి దాదాపు రూ.600కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకూ బాహుబలి రూ.600కోట్లకు పైగా వసూళ్లు సాధించి కలెక్షన్లలో ముందంజలో ఉంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేటర్లలో కొనసాగుతూ సంచలనం రేపుతున్న కబాలి వసూళ్లు ఆ స్థాయిలో ఉంటే భారత సినీ కలెక్షన్లలో ఈRead More


బాహుబ‌లి బీ హ్యాపీ..!

484072-kabali-bahubali

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన రజనీకాంత్ ‘కబాలి’ మొదటి వారం తర్వాత నెమ్మదించింది. అయితే ఫస్ట్ వీక్ లో మాత్రం రికార్డు వసూళ్లు సాధించింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ట్రేకర్ బి. రమేశ్ వెల్లడించారు. ‘కబాలి’ సినిమా ఇండియా రూ.149 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ.172 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా మొదటి వారంలో రూ. 262 కోట్లు కొల్లగొట్టిందని ట్విట్టర్ ద్వారా రమేశ్ తెలిపారు. ‘బాహుబలి’ రికార్డును తమ సినిమా బ్రేక్ చేస్తుందని కబాలి’ నిర్మాత కళైపులి ఎస్. థాను అంతకుముందు ప్రకటించారు. అయితే కలెక్షన్లు తగ్గిపోవడంతో ‘బాహుబలి’ రికార్డును ‘కబాలి’ చేరుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. విడుదలైన మొదటి నుంచే భారీ వసూళ్లు రాబట్టినRead More


ర‌జ‌నీ సినిమా రికార్డులు ‘క‌బాలిం’చింది…!

rajinikanth-as-kabali

ర‌జ‌నీకాంత్ క‌బాలీ క‌ల‌కం కొన‌సాగుతోంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ర‌జ‌నీ స్టైల్ మేనరిజ‌మ్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. దాంతో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తూ ఇప్పటి వరకూ రజనీకాంత్ నటించిన ఏ మూవీకి రానంత క్రేజ్ ఈ కబాలి మూవీకి వచ్చింది. బాలీవుడ్ హీరోల రేంజ్ ను మించిపోయిన వ‌సూళ్లు సాధిస్తోంది. తొలిరోజు రికార్డుల‌క‌యితే తిరుగులేదు. .దాదాపు 4,500 స్క్రిన్స్ లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. క‌బాలీ మేనియా మ‌హిమ‌తో మొదటి రోజు బాక్సాపీస్ ని మరింత ప్రభావితం చేసింద‌ని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ థియోటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీతో కబాలి మూవీ ప్రదర్శన జరుపుకోవటంతో ఈ మూవీRead More


సబీర్‌ అన్సారీ VS సల్మాన్‌ ‘సుల్తాన్‌’

salman

బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘సుల్తాన్‌’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ ఆనందం నుంచి తేరుకోకముందే ‘సుల్తాన్‌’ చిత్ర బృందానికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఈసారి సల్మాన్‌తో పాటు చిత్రబృందం అంతా వివాదంలో చిక్కుకుంది. సుల్తాన్‌ సినిమాను నా జీవితం ఆధారంగానే తెరకెక్కించారు అంటూ బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి సల్మాన్‌ ఖాన్‌, అనుష్కశర్మ, దర్శకుడు అలీ అబ్బాస్‌ జఫర్‌, నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌పై చీటింగ్‌ కేసు పెట్టాడు. బిహార్‌కి చెందిన సబీర్‌ అన్సారీ అనే వ్యక్తి తన జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ ముజఫర్‌పూర్‌లోని న్యాయస్థానంలో ‘సుల్తాన్‌’ చిత్రంపై కేసు వేశాడు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరపనుంది. అయితే ఈ కేసు విషయమై ఇప్పటి వరకూ సల్మాన్‌ కానీ చిత్ర బృందం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.Read More