Main Menu

chndrababu

 
 

చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నిత్య బాట‌సారి. ఇన్నాళ్లుగా ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో గ‌డిపేవారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. బీజేపీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా అన్ని పార్టీల‌ను ఏకంగా చేస్తానంటూ ఆయ‌న కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. దేశంలో మోడీ స‌ర్కారుని సాగ‌నంప‌డమే త‌న ల‌క్ష్యం అని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు, తానే స్వ‌యంగా బాధ్య‌త తీసుకుని రాష్ట్రాల‌లో నేత‌ల‌ను క‌లిసి వస్తున్నారు. బెంగ‌ళూరు, చెన్నై ప‌ర్య‌ట‌న‌ల త‌ర్వాత మ‌రిన్ని రాష్ట్రాల‌కు ఆయ‌న వెళ్లే అవ‌కాశాలున్నాయి. అయితే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో మోడీకి వ్య‌తిరేకంగా ముందుకొచ్చే నేత‌లు ఎంత‌మ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. అదే స‌మ‌యంలో బాబుతో ఇటీవ‌ల భేటీ అయిన ప‌లువురు నేత‌లు చివ‌రి నిమిషం వ‌ర‌కూ మోడీ వ్య‌తిరేక క్యాంపెయిన్ లో కొనసాగే అవ‌కాశాలు కూడా అనుమానమే. దాంతో బాబు శ్ర‌మ చివ‌ర‌కు బూడిద‌లోRead More


బాబుకి బడ్జెట్ భయం!

కేంద్ర బడ్జెట్ కాక పూర్తిగా తగ్గలేదు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలివిడత సమావేశాలు ముగుస్తుండడంతో సీన్ కొంత మారే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో అమరావతిలో వేడి రాజుకోవడం ఖాయంగా ఉంది. ఈసారి ఏపీ బడ్జెట్ గురించి ఆసక్తికర చర్చ మొదలవుతోంది. హామీల అమలు విషయంలో కేంద్రాన్ని అన్ని పక్షాలు నిలదీస్తున్నాయి. ఎవరి మార్గంలో వారు మోడీ సర్కారు తీరుని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతున్నారు. ఇప్పటికే మోడీ, జైట్లీ ప్రకటనలు కూడా వారిని సంత్రుప్తి పరచలేదని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ లో కూడా పలు హామీలు నెరవేర్చాల్సి ఉంది. నిరుద్యోగభ్రుతి, రుణమాఫీ వంటి కీలకాంశాలు సహా పలు మాటలు నీటిరాతలుగానే ఉన్నాయి. కొన్ని అరకొరగా అమలయినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా లేవు. దాంతో చంద్రబాబు వ్యవహారం చర్చల్లోకి రాబోతోంది. బీజేపీRead More


అమరావ‌తి డిజైన్ల‌లో అన్నీ సందేహాలే

నార్మ‌న్ ఫోస్ట‌ర్ రాజ‌ధాని డిజైన్ల పై ఎమ్మెల్యేలు పెద‌వి విరిచారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు డిజైన్లు తీసుకొచ్చి , వాటిని ప‌క్క‌న పెట్టేసిన నేప‌థ్యంలో తాజా డిజైన్ల‌తో ఎప్పుడు నిర్మాణం జ‌రుగుతుంద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో డిజైన్ల ప్ర‌జెంటేష‌న్ సాగించారు. దాని మీద ఎమ్మెల్యేలు ప‌లు భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా 900 ఎక‌రాల విస్తీర్ణంలో రాబోతున్న ఈ నిర్మాణాల‌కు సంబంధించి స్ప‌ష్ట‌త లేద‌ని అంటున్నారు. మ‌రోసారి మ‌భ్య‌పెట్ట‌డానికేనా అంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ దాని మీద పెద‌వి విరిచారు. స‌భా స‌మ‌యం వృధా చేయ‌డానికే ఈ డిజైన్ల డ్రామా అంటూ కొట్టి పారేశారు. ఏకంగా 51 శాతం గ్రీన‌రీతో రాజ‌ధాని నిర్మిస్తామ‌ని చెప్ప‌డం వింత‌లా ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా డిజైన్ల మీద వివ‌ర‌ణ ఇచ్చిన నార్మన్ ఫోస్ట‌ర్స్ ను ప‌లువురుRead More


క‌ర‌ణం బ‌ల‌రాంకి షాకిచ్చిన సీఎం

చంద్ర‌బాబు షాకిచ్చారు. క‌ర‌ణం బ‌ల‌రామ్ కి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఏకంగా స‌మావేశంలో మాట్లాడుతుండ‌గానే ఆపేయ‌మ‌ని ఆదేశించడం ద్వారా అద్దంకిలో బ‌ల‌రామ్ అవుట్ అని చెప్పేశాడు. అక్క‌డ అల్టిమేట్ గొట్టిపాటి అని స్ప‌ష్టం చేశారు. దాంతో క‌ర‌ణం వ‌ర్గీయుల్లో క‌ల‌క‌లం రేగుతోంది. చాలాకాలంగా దీటుగా నిల‌బ‌డిన చోట ఇప్పుడు త‌ల‌వంచుకుని పోవాల్సిన ప‌రిస్థితి రావ‌డంతో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ప్ర‌కాశం జిల్లా నేత‌ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో అద్దంకి, చీరాల, కందుకూరు,గిద్దలూరు నియోజకవర్గాల ప‌రిస్థితి మీదే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది.ఆ నాలుగు చోట్ల ఎమ్మెల్యేలే సుప్రీమ్‌లని ముఖ్యమంత్రి తేల్చిచెప్పేశారు. జిల్లాలోని అన్ని స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నించాల‌ని ఆదేశించారు.కాగా ఈ సమావేశంలో నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కరణం బలరామ్‌కృష్ణమూర్తి, పోతుల సునీత ఉన్నారు. కానీ గిద్దలూరు, కందుకూరు ఇన్‌చార్జి అన్నా రాంబాబు, దివి శివరామ్‌లకుRead More


రోజా సాయంతో గ‌ట్టెక్కాల‌ని చూస్తున్న టీడీపీ

ఏపీలో వ‌రుస ప‌రిణామాల‌తో తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేదు. చంద్ర‌బాబుకి నోటీసులు, చిన‌బాబు ఆస్తుల వివాదం, వాట‌న్నంటికీ తోడుగా పార్టీలో అల‌క‌లు, అసంతృప్తులు అన్నీ క‌లిసి అధికార పార్టీకి మ‌న‌స్తిమితం లేకుండా చేసేస్తోంది. ఈ ప‌రిణామాల నుంచి గ‌ట్టెక్కాలంటే ఏదో విష‌యం తెర‌మీద‌కు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఆపార్టీ ముందు క‌నిపిస్తోంది. విప‌క్షాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించే ప‌రిస్థితి లేక‌పోతే ప‌ట్టు సాధించ‌లేమ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన టీడీపీ వ్యూహ‌క‌ర్త‌లు దానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు. అసెంబ్లీలో చ‌ర్చ‌ల‌న్నీ సామ‌ర‌స్యంగా సాగితే ఏం జ‌రుగుతుంద‌న్న‌ది మొన్న‌టి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానం మీద చ‌ర్చ‌ను గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది. అందుకే టీడీపీ త‌న పాత అస్త్రాల‌కు మ‌ళ్లీ ప‌దును పెడుతోంది. జ‌గ‌న్ మీద టార్గెట్ చేసి, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత ఏమీ ప‌ట్ట‌న‌ట్టే ప్ర‌భుత్వం మీదRead More


క్యాబినెట్ కి చేరిన సెటిల్ మెంట్లు..?

ఏపీలో మంత్రుల వ్య‌వ‌హారాల‌కు తోడుగా త‌న‌యుల త‌గాదాలు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఏకంగా క్యాబినెట్ వ‌ర‌కూ వెళుతున్నట్టు క‌థనాలు వ‌స్తున్నాయి. విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి త‌న‌యుడి వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చిన మ‌రో ముగ్గురు మంత్రుల కొడుకుల వ్య‌వ‌హారంతో క‌థ అనేక మ‌లుపులు తిరుగుతున్న‌ట్టు స‌మాచారం. చివ‌ర‌కు విష‌యం సీఎం వ‌ద్ద‌కు చేర్చినా ఆయ‌న పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డంతో సాగ‌ర‌తీర మంత్రి చిన్న‌బుచ్చుకున్న‌ట్టు చెబుతున్నారు. సీనియ‌ర్ మంత్రి త‌న‌యుడికి, మ‌రో కంపెనీకి మ‌ధ్య వ‌చ్చిన త‌గాదాలో అదే జిల్లాకు చెందిన మంత్రి త‌న‌యుడు సాయంతో రాయ‌ల‌సీమ‌కు చెంద‌ని మంత్రి త‌న‌యుడు, గుంటూరు జిల్లాకి చెందిన మ‌రో మంత్రి త‌న‌యుడు క‌లిసి బిగ్ డీల్ కుదుర్చుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో కూర్చుని సెటిల్ మెంట్ చేశార‌న్న విష‌యం కూడా వెల‌గ‌పూడిలో హాట్ టాపిక్ అయ్యింది. దాంతో ఏం చేయాలో పాలుపోనిRead More


నోట్ల మార్పిడి నిష్ప్ర‌యోజ‌న‌మే..!

పెద్ద నోట్ల రద్దుతో ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని, భవిష్యత్‌లో నోట్ల కట్టలు మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నోట్ల రద్దుతో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికలకు ఇదే పెద్ద నోట్లను ఉపయోగించే అవకాశం ఉందన్నారు. నల్లధనాన్ని పూర్తిగా నివారించలేమని, అయినా కొంత నియంత్రించొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. దీనిపై రిజర్వు బ్యాంకు గవర్నర్‌, నీతి అయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ తదితరులతో మాట్లాడుతానని, రాష్ట్రంలో తీసుకున్న చర్యలను కేంద్రానికి వివరించి, అక్కడ అనుసరించిన అనుభవనాలనూ పరిగణన లోకి తీసుకుంటామని చెప్పారు. రెండున్నరేళ్ల లో జిఎస్‌డిపిలో కేంద్రంతో పోల్చుకుంటే ముందున్నా మని, పర్‌ క్యాపిటా ఇన్‌కంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మిగతా 10 లో మరింత మెరుగవుతున్నామని సిఎం తెలిపారు. ఈ ఏడాది అర్థ సంవత్సరానికి రాష్ట్రం 12.23 శాతం జిఎస్‌డిపిRead More


స‌తీష్ చంద్ర వైపు బాబు మొగ్గు..!

ఏపీలో ఐఏఎస్ అధికారుల‌తో ఒక్కో సీఎం ఒక్కో రీతిలో వ్య‌వ‌హ‌రిస్తారు. అందుకే కొంత పాటు వెలుగు వెలిగిన అధికారులు ఆత‌ర్వాత క‌నుమ‌రుగు కావ‌డం, మ‌ళ్లీ వారి మిత్రులు పాల‌న‌లోకి వ‌స్తే హ‌ఠాత్తుగా తెర‌మీద‌కు రావ‌డం చాలాకాలంగా ఉన్న‌ ఆన‌వాయితీ. తాజాగా చంద్ర‌బాబు పాల‌న‌లో చ‌క్రం తిప్పుతు స‌తీష్ చంద్ర లాంటి ఐఏఎస్ అధికారుల తీరును గ‌మ‌నిస్తే ఇదే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. కొంద‌రు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఎవ‌రు అధికారంలో ఉంటే వారితోనే స‌ఖ్య‌త ప్ర‌ద‌ర్శిస్తూ ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటూ ఉంటారు. కానీ స‌తీష్ చంద్ర లాంటి వారి తీరు దానికి పూర్తిగా భిన్నం. గ‌తంలో తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు పాల‌న‌లో స‌తీష్ చంద్ర కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గా ఉన్న స‌తీష్ చంద్ర ప‌లు విష‌యాల‌లో చంద్ర‌బాబుతో సానుకూలంగా మెలుగుతూRead More


మ‌రుగుదొడ్డి లేక‌పోతే పోటీ లేదు..!

వ‌చ్చే పంచాయితీ ఎన్నిక‌ల్లో పోటీకి కొత్త అర్హ‌త ముందుకు వ‌స్తోంది. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. పంచాయితీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ఖ‌చ్చితంగా ఇంటికి మ‌రుగుదొడ్డి ఉండాల్సిందేన‌న్నారు. అందుక‌నుగుణంగా చ‌ట్టాన్ని స‌వ‌రించ‌బోతున్న‌ట్టు వెల్ల‌డించారు. ఏపీని తెలంగాణా ర‌హిత రాష్ట్రంగా మార్చడ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌కటించారు. స్వ‌శ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో ఏపీని దేశంలోనే అత్యున్న‌త స్థానంలో నిలుపుతామ‌న్నారు. రాజ‌ధానిని అడ్డుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల‌ను తాము తిప్పొకొట్టామ‌న్నారు. ప‌ట్టిసీమ మూలంగా కృష్ణా జిల్లా స‌శ్య‌శ్యామ‌లం చేశామ‌ని తెలిపారు.


చీఫ్ క‌మాండ‌ర్ చంద్ర‌బాబు..!

కమాండ్‌ కంట్రోలు రూమ్‌ను కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌గా మార్పు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి చీఫ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తారు. అన్ని జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. సిఎం మాట్లాడుతూ కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ రియల్‌టైమ్‌ పరిపాలన అందిస్తుందన్నారు. దీని ద్వారా అన్ని పనులనూ సకాలంలో చక్కబెట్టొచ్చని వివరించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు వీలుంటుందన్నారు. ఇటీవల డ్రోన్లు ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగించారని, దీనివల్ల భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు. కేంద్రం కూడా దీనిపై సీరియస్‌గా వ్యవహరిస్తోందన్నారు. డ్రోన్లు బాంబులను కూడా మోసుకుని పోగలవన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలోనే అవి ఉంటాయని, వీటిని వినియోగించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కొన్ని పెద్ద రెవెన్యూ డివిజన్లు గుర్తించామని అవసరమైతే వాటిని రెండు మూడు డివిజన్లుగా మార్పు చేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిRead More