Main Menu

chiranjeevi

 
 

చిరంజీవి సాహ‌సాలు

స్టార్‌ హీరోలు సైతం తమ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఎలాంటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు. ఇటీవల ‘118’ చిత్రంలోని వాటర్‌ సీక్వెన్స్‌ కోసం డీప్‌ డ్రైవ్‌ చేసి కళ్యాణ్‌రామ్‌ పెద్ద సాహసం చేశారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ తరహా సాహసం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ (నీటి లోపల యుద్ధం) చేయబోతున్నారు. ఈ సినిమాలో కొన్ని అండర్‌వాటర్‌ వార్‌ సీక్వెన్స్‌లున్నాయట. వాటిని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ముంబయిలో జరుగనుంది. ఇప్పటికే టీమ్‌ ముంబయికి చేరుకుంది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన భారీ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. దీని కోసమై హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా యాక్షన్‌ టీమ్‌ను రప్పించారట. వారి సారథ్యంలో ఇప్పటికే చిరంజీవి ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్టు, అందుకోసంRead More


ప‌వ‌న్ క్లోజ్ ఫ్రెండ్ తో జ‌త‌గ‌డుతున్న మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి స్నేహితులు కొంత త‌క్కువ‌గానే ఉంటారు. అలాంటి అత్యంత స‌న్నిహితుల్లో మాట‌ల మాంత్రికుడు ఒక‌రు. త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ స్నేహం గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి ప‌వ‌ర్ స్టార్ స్నేహితుడితో సినిమాకి మెగాస్టార్ ముందుకొస్తున్నారు. ప్ర‌స్తుతం సైరా అంటూ 151 వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న చిరంజీవి ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో చిరంజీవి సినిమా చెబుతున్నారు. త్రివిక్ర‌మ్ తో సినిమాకు రెడీ అన్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చాలామంది తెలుగు డైరెక్టర్లకు ఒక కల. ఆయన ఓ పదేళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉండడంతో చాలామంది ఈ జెనరేషన్ స్టార్ దర్శకులకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఆ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ త్రివిక్రమ్‌కు గ్రీన్Read More


చిరు జాగ్ర‌త్త‌లు

మెగాస్టార్ అప్ క‌మింగ్ మువీ అంద‌రిలో ఆస‌క్తి రేపుతోంది. చారిత్ర‌క సినిమా కావ‌డంతో సంచ‌ల‌నం అవుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా 151వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నేప‌థ్యంలో భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి పై ప‌లు చ‌ర్చ‌లు సాగుతున్నాయి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరు ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చిరు అన‌గానే ఫాన్స్ చాలా ఆశిస్తారు. ముఖ్యంగా చిరు మార్క్ డాన్స్‌ మూమెంట్స్ కోసం ఎదురుచూస్తారు. అయితే సైరా విష‌యంలో అలాంటి వాటికి చోటు ఉండ‌ద‌ని తెలుస్తోంది. పీరియాడిక్‌ సినిమా అది కూడా స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్ర కావటంతో అనవసరమైన డ్యాన్స్‌లు బాగుండవన్న భావనలో చిరు ఉండ‌డ‌మేRead More


త‌మ‌న్నా ద‌శ తిరిగిన‌ట్టేనా?

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీకి మిశ్ర‌మ అనుభ‌వాలున్నాయి. ఒకానొక ద‌శ‌లు ఆమెకు తిరుగులేదు. అంద‌రూ స్టార్ హీరోల‌తో ఆడిపాడి హ‌ల్ చల్ చేసింది. ఆఖ‌రికి ఖాళీ లేనంత బిజీగా గ‌డిపింది. కానీ అనూహ్యంగా ఆమెకు ఫ్లాఫులు ఎదురుకావ‌డంతో సీన్ మారిపోయింది. ఇటీవ‌ల టాలీవుడ్ లో ఆఫ‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. బాహుబ‌లి వంటి బంప‌ర్ హిట్ ద‌క్కినా తోడ్ప‌డింది లేదు. అయితే ఇప్పుడు సీన్ మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. గత కొంత కాలంగా ఫ్లాపులు తప్ప సక్సెస్‌ అన్న మాట విన‌ని త‌మ‌న్నాకు మ‌ళ్లీ ఆఫ‌ర్ల పరంప‌ర మొద‌ల‌వుతోంది. చిన్నా చితకా సినిమాలు చేస్తున్న తమన్నాకు భారీ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఈసారి ఏకంగా మెగాస్టార్ తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన‌ట్టు స‌మాచారం. ‘సైరా’ తరువాత మెగా స్టార్‌ నటించే సినిమాలో తమన్నాకు మంచి పాత్ర లభించనుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.Read More


ద‌స‌రా నాటికి చెర్రీ సంద‌డి

మొన్న‌టి వేస‌విలో రంగ‌స్థ‌లం స‌క్సెస్ తో చెర్రీ దూకుడు మీదున్నాడు. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా రంగ‌స్థ‌లం నిలిచింది. న‌టుడిగా రామ్ చ‌రణ్ కి మంచి గుర్తింపు సాధించి పెట్టింది. చిట్టిబాబు క్యారెక్ట‌ర్ లో చిర‌స్థాయిగా గుర్తుండిపోయే రీతిలో చెర్రీ చెల‌రేగిపోయాడు. ఇక ప్ర‌స్తుతం నెక్ట్స్ ప్రాజెక్ట్ ప‌నిలో బిజీగా ఉన్న చెర్రీ, ఓవైపు త‌న సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప్రొడ్యూస‌ర్ గా సైరా సినిమా వ్య‌వ‌హారాల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ప్ర‌స్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ యూర‌ప్ లో జ‌రుగుతోంది. అజర్‌బైజాన్ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. చరణ్‌తోపాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ పాల్గొంటున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ మువీ విడుదలకానుంది. సినిమాపై మెగాRead More


చాన్నాళ్ల‌కు సినిమా సెట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత ఇటీవ‌ల జెండా ఎత్తారు. అటు చంద్ర‌బాబు, ఇటు వైఎస్ జ‌గ‌న్ పై ఏక‌కాలంలో దండెత్తారు. ఇరు పార్టీలకు ప్ర‌త్యామ్నాయంగా తానే సీఎం కాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఆయ‌న రాజ‌కీయంగా బిజీగా గ‌డుపుతున్నారు. దాంతో సినిమాల‌కు ఆయ‌న కామా పెట్టేశారు. ఫుల్ స్టాప్ కూడా పెట్టి ఉంటార‌ని కొంద‌రు చెబుతున్న‌ప్ప‌టికీ దానికి భ‌విష్య‌త్తు స‌మాధానం చెప్పాలి. ఇక తాజాగా ఆయ‌న సినిమా షూటింగ్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. దాంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల పూర్తిగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి సినిమా సెట్లో క‌నిపించ‌డం విశేషంగా మారింది. దానికి సంబంధించిన ఫోటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అన్న‌య్య చిరంజీవి 151 వ సినిమా సైరా న‌ర‌సింహంరెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెట్లో త‌మ్ముడుRead More


అభిమానుల కోసం చిరు గిఫ్ట్

మెగాస్టార్ అభిమానుల‌కు ఆగ‌స్ట్ 22 ఓ అసాధార‌ణ పండుగ‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే కార్య‌క్ర‌మాలుంటాయి. అయితే ఈసారి చిరంజీవి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు ఓ చిరు కానుక సిద్దం చేస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం కథ ఆధారంగా ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం టీజ‌ర్ రిలీజ్ కి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రమిది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, విజరు సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. బ్రిటీష్‌ సైన్యంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసే సుదీర్ఘ యుద్ధ సన్నివేశాలను ఇటీవలే తెరకెక్కించారు. అయితే స్వాతంత్య్రదినోత్సవం పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా వార్త వస్తుందని ఎదురు చూసినRead More


మెగాస్టార్ తో జేజ‌మ్మ‌!

టాలీవుడ్ జేజ‌మ్మ , మెగాస్టార్ కాంబినేష‌న్ లో మువీకి ఇప్ప‌టికే చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ చివ‌ర‌కు అది సెట్స్ పైకి వెళ్ల‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. వ‌చ్చే డిసెంబ‌ర్ లో ప్రారంభం కాబోతున్న సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న అనుష్క న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. దాంతో అ కాంబినేష‌న్ లో మువీ ఫ్యాన్స్ లో ఆస‌క్తిని రాజేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాపై అంద‌రి దృష్టి ప‌డ‌బోతోంది.గ‌తంలో చిరంజీవితో ఐటెమ్ సాంగ్ చేసి ఈ భామ మెప్పించింది. రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారనిRead More


సైరా సినిమాకి స‌ర్కార్ షాక్

మెగా మువీకి షాక్ త‌గిలింది. మాజీ కేంద్ర‌మంత్రి మెస్టార్ చిరంజీవి హీరోగా వ‌స్తున్న సినిమాకు అనుకోని ఆటంకం ఎదుర‌య్యింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ నిర్మాత‌గా వ‌స్తున్న చిరంజీవి 151 సినిమా ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌ల‌తో సాగుతోంది. గ‌త ఏడాది ప్రారంభించిన సినిమా నేటికీ ఓ కొలిక్కి రాలేదు. కాస్టింగ్ విష‌యం నుంచి టెక్నీషియ‌న్స్ వ‌ర‌కూ ప‌లు మార్పులు జ‌రుగుతూనే ఉన్నాయి. దాంతో షూటింగ్ ఆల‌శ్య‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక దానికి తోడుగా తాజాగా తెలంగాణా రెవెన్యూ శాఖ అధికారులు ఏకంగా ఓ సెట్ ను కూల్చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క సైరా సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్స్ కి అనుమ‌తులు లేవంటూ అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ జరిగిన సెట్స్‌లోనే ప్రస్తుతం సైరా షూటింగ్ జరుగుతుంది. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలోRead More


మెగాస్టార్ చెప్పాడు..ప‌వ‌ర్ స్టార్ చేశాడు!

ప్ర‌స్తుతం తెలుగు సెల‌బ్రిటీల మ‌ధ్య ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అంతా ఛాలెంజ్ ల‌తో సాగుతున్నారు. ఛాలెంజ్ ల‌ను స్వీక‌రిస్తూ ప‌లువురు మొక్క‌లు నాటుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌ను నాటారు. అదే స‌మ‌యంలో అమితాబ్ బ‌చ్చ‌న్ తో పాటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఛాలెంజ్ చేశారు. దాంతో వెంట‌నే స్పందించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేను సైతం అంటూ సిద్ధ‌మ‌యిపోయారు. అన్న‌య్య పిలుపునందుకుని మాదాపూర్ లోని త‌న పార్టీ కార్యాలయంలో మొక్క‌ను నాటేశారు. తెలంగాణా స‌ర్కారు హ‌రిత‌హారంలో భాగంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ సాగుతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు మొక్క‌లు నాటారు. తాజాగా జ‌న‌సేన చీఫ్ కూడా అందులో భాగ‌స్వామి అయ్యారు. హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్Read More