chandrababu

 
 

బాబుకి బీజేపీ బ్రేకులు వేసిందా..?

amit shah

ఇదో చర్చ ఇప్పుడు మొదలయ్యింది. చాలామంది నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీ శిబిరాల్లో ఆసక్తిగా మారింది. నంద్యాల ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఆశలపై కేంద్రంలో కమలం నేతలు నీళ్లు జల్లారనే వార్త చర్చనీయాంశంగా మారింది. దాంతో టీడీపీ శిబిరం మరింత ఢీలా పడిందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు భిన్నంగా కేంద్రం ఎన్నికల సంఘం వ్యవహరించడం ఆశ్చర్యకరమే అయినా అదే వాస్తవం అని అర్థమవుతోంది. నిజానికి ఉప ఎన్నికలను అక్టోబర్ నెలలో జరిగేలా చూసుకోవాలని టీడీపీ భావించింది. రోడ్ల విస్తరణ సహా వివిధ పనులు ఇప్పుడే ప్రారంభించడంతో వాటి ఫలితాలు ప్రజలకు చేరడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకూ ఎన్నికలను వాయిదా వేయాలని భావించింది. కనీసం సెప్టెంబర్ చివరిలో అయినాRead More


నంద్యాలపై ఆధారపడి జనసేన భవిష్యత్

chandrababu pawan

మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలైన స్నేహితుడని అందరికీ తెలుసు. కానీ ఆపదలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చి తాను తటస్థం అని ప్రకటించిన పవన్ కల్యాణ్ తీరు టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. నమ్మకమైన మిత్రుడిగా తాము బావిస్తే తమ ఆశలను నీరుగార్చేశారని ఆపార్టీ నేతలు తల్లడిల్లుతున్నారు. చివరి క్షణం వరకూ ఊరించి ఉసూరుమనిపించిన జనసేనాని వ్యవహారం వారికి మింగుడుపడడం లేదు. తాజాగా తెలుగుదేశం అనుకూల పత్రికల్లో పవన్ కి వ్యతిరేక వస్తున్న రాతలు, పలు టీవీ చానెళ్లలో జనసేన విధానం మీద వస్తున్న విమర్శల కూతలు గమనిస్తే పవన్ తీరుతో టీడీపీ చాలా అప్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి మూలస్తంభంగా ఉన్న పవన్ కల్యాణ్ , ఆతర్వాత తానేమీ టీడీపీకి బానిసను కాదని ప్రకటించారు. రాజధానిRead More


గందరగోళంలో తెలుగుదేశం

Jagans-Generation-Next-Vs-Chandrababus-political-experience

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అంతస్థిమితంగా ఉండలేకపోతోంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీ పరిస్థితి తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈలోగానే వచ్చి పడిన నంద్యాల ఉప ఎన్నికలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీని తీవ్రంగా కలచివేస్తున్నాయి. దాంతో టీడీపీ వ్యూహాకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. నంద్యాలలో గట్టెక్కడానికి ఆర్థిక దన్నునే ఆసరాగా తీసుకున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. అయినా అది ఏమేరకు ఫలిస్తుందో తెలియక తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ అనే పేరుతో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను బరిలో దింపితే ఆయన కొంపముంచారు. దురుసు ప్రవర్తనతో వివాదంలో ఇరుక్కున్నారు. డబ్బులు పంచుతూ దొరికిపోయి పెద్ద సమస్యకు కారణంగా మారబోతున్నారు. ఎన్నికల్లో డబ్బులు భారీగా పంచుతున్నారన్న ప్రతిపక్షం ఆరోపణలకు ఊతమిచ్చేలా ప్రవర్తించారు. దాంతో బాలయ్య ప్రచారం నంద్యాలలో టీడీపీకి మేలు కన్నా కీడు ఎక్కువ చేసిందనే వాదన వినిపిస్తోంది.Read More


టీడీపీ కార్యకర్తపై బాలయ్య దాడి

balakrishna_12

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి రంగంలో దిగిన నందమూరి బాలయ్య వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన అభిమానులు, ఇతర సహాయకుల మీద దాడికి పాల్పడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక తాజాగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో తనకు నీరాజనాలు పలకడానికి వచ్చిన టీడీపీ కార్యకర్త చెంపచెళ్లు మనిపించారు. జై బాలయ్య అని నినాదాలు చేస్తున్న సమయంలో తనకు అడ్డంగా ఉన్నారని చెప్పి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాంతో బాలయ్య తీరు దుమారం రేపుతోంది. ఉదయం నుంచి ప్రచారంలో బాలక్రుష్ణ విస్త్రుతంగా పర్యటించారు. భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడానికి ఓటు అనే తూటాతో ప్రత్యర్థులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చారు. రాత్రి ప్రచారం ముగిసిన తర్వాత బసచేయడానికి హోటల్ కి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హోటల్ వద్ద కారు దిగగానే బాలయ్య తనకు దండ వేసిన కార్యకర్త పైRead More


విశాఖ సమరం షురూ..

ysrcp tdp

ఇప్పటికే రాయలసీమలో నంద్యాల, గోదావరి జిల్లాల్లో కాకినాడ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు తెలుసుకునే అవకాశం కూడా వస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. జీవీఎంసీ ఎన్నికలతో ఉత్తరాంధ్ర ప్రధాన నగరంలో ప్రజల నాడి పట్టుకునే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. తద్వారా ఏపీలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్న అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. విశాఖ ఎన్నికలను చాలాకాలంగా ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. గడిచిన సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పటికీ మిగిలిపోయిన అతి కొద్ది కార్పోరేషన్లలో విశాఖ ఒకటి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించడమే తప్ప ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. దాంతో జీవీఎంసీ ఎన్నికల కోసం ఎదురుచూసిన చాలామందిRead More


నంద్యాలలో జగన్ కి షాక్

2563_ganjula

వైసీపీకి షాక్ తగిలింది. ఆపార్టీ అధినేత అహర్నిశలు కష్టపడి నంద్యాలలో గెలవాలని భావిస్తున్న నేపథ్యంలో వైెెఎస్ జగన్ కి చుక్కెదురయ్యింది. సీనియర్ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డి జగన్ కి ఝలక్ ఇచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చెన్నాయుడు, ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిసి గంగుల ప్రతాప్ రెడ్డి చంద్రబాబుని కలిశారు. టీడీపీ లో చేరుతున్నట్టు ప్రకటించారు. శిల్పా బ్రదర్స్ లో అన్న కోసం తమ్ముడు చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఏకం కాగా, ఇప్పుడు గంగుల బ్రదర్స్ లో ఒకరు వైసీపీని కాదని టీడీపీలో చేరడం విశేషంగా మారింది. గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్చార్జ్ గా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డిని నంద్యాల ఎంపీ సీటుకి ఖరారు చేసినట్టు ప్రచారం సాగింది. దానికి తగ్గట్టుగానే ఆయనRead More


రెచ్చిపోయిన రోజా

ROJA

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయారు. అటు సీఎం చంద్రబాబుని, ఇటు ఎమ్మెల్యే బాలయ్యని కూడా వదిలిపెట్టలేదు. ఇద్దరు నేతల మీద ఘాటు వ్యాఖ్యలతో హీటు పెంచారు. అధికార పార్టీ తీరు మీద రోజా విరుచుకుపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రోజా.. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరువుకు ప్యాంట్, షర్ట్ వేస్తే.. అది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి ఇప్పటి వరకు 600 హామీలిచ్చిన చంద్రబాబు.. ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బాలమృతం పథకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రలో నెలకొందన్నారు. దీనికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఈ రోడ్లపై నడవవద్దని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇవేమైనా ఖర్జూరపుRead More


సీఎం ఒక్కరోజు ఖర్చు 10కోట్లు

chandrabau kurnool

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్న మాటలకు , చంద్రబాబు ప్రభుత్వ చేతలకు పొంతన కనిపించడం లేదు. 16వేల కోట్ల బడ్జెట్ లోటు ఉందని చెబుతూనే భారీగా వ్యయం చేయడానికి వెనకాడడం లేదు. అందుకు ఉదాహరణ తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పర్యటన కనిపిస్తోంది. గోదావరి నది మీద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆయన ప్రారంభించారు. అయితే అది పేరుకే ప్రారంభోత్సవం. ఎందుకంటే ఆయన రెండు మోటార్లకు స్విశ్ఛాన్ చేశారు. రెండూ పురుషోత్తపట్నం కాకపోవడం విశేషం. హంద్రీనీవా నుంచి అరువు తెచ్చిన రెండు మోటార్లకు ఆయన స్విశ్ఛాన్ చేశారు. అయితే వాటి ద్వారా నీరు కోసం మాత్రం కాదు. చంద్రబాబుకి చెప్పుకోవడానికి మాత్రమే ఆ ప్రారంభోత్సవం అన్నట్టుగా ఉంది. వాస్తవానికి తాజాగా ప్రారంభించిన ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించే అవకాశం లేదు. దానికి కారణంRead More


నంద్యాలలో అవి అవసరం..

nandyal

ఉప ఎన్నికల్లో భాగంగా నంద్యాలలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ, వైసీపీ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమంటున్నాయి. అందుకు తగ్గట్టుగా రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. ఎత్తులు, పైఎత్తులతో హోరెత్తిస్తున్నారు. సర్వేలతో ముందుకు సాగుతున్నారు. దాంతో వాటి మీద ఈసీ స్పందించింది. ఎన్నికల ముందు సర్వేలు చేపడితే చర్యలు తప్పవని రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున సర్వేల నిర్వహించవద్దని ఆయన తెలిపారు. కొంత మంది విద్యార్థులు, స్వచ్చంధ సంస్థల పేరుతో సర్వేల చేస్తున్నట్లు మా దృష్టికొచ్చిందని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి శిల్పా మోహన్‌ రెడ్డి టీడీపీ తరపున భూమా బ్రహ్మనందా రెడ్డిలు పోటీ చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌ నూతన విధానాన్ని ప్రవేశ పెట్టిందని కర్నూలు జిల్లా కలెక్టర్‌ సత్యానారయణ తెలిపిన విషయం తెలిసిందే.Read More


గవర్నర్ విందులో కలిసిన కేసీఆర్ , బాబు

babu kcr

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌రావులు హాజరయ్యారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, డీజీపీ అనురాగ్ శర్మ, తదితరులు హాజరయ్యారు. జనసేన అదినేత పవన్ కల్యాణ్ కూడా హాజరుకావడం విశేషం. కొంత విరామం తర్వాత తెలంగాణా , ఏపీ సీఎంలు కలిసి గవర్నర్ విందులో పాల్గొనడం విశేషం.. ఉమ్మడి గవర్నర్ చివరి విందుగా కొందరు గుసగుసలాడుకోవడం విశేషం. త్వరలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.