Main Menu

cbn

 
 

ఏపీసీఎం ఒక్క రోజు ఖ‌ర్చు సుమారు 9 ల‌క్ష‌లు!

ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇది నిజం. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభవంగా సాగిన విష‌యం తెలిసిందే. దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకి శ్రీకారం ప‌డిందా అన్న‌ట్టుగా సాగిన ఆ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో ప‌లువురు అతిర‌థ‌మ‌హార‌ధులు హాజ‌ర‌య్యారు. అందులో ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా భాగ‌స్వామి అయ్యారు. ఈసంద‌ర్భంగా మే 23 వ తేదీ ఉద‌యం నుంచి మ‌రుస‌టి తెల్ల‌వారు వ‌ర‌కూ బెంగ‌ళూరులో ఉన్న ఆయ‌న కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు ఏకంగా 8,72, 485 రూ.లుగా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం మే 23 సాయంత్రం జ‌రిగింది. దానికి దేశంలోని వివిధ పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. రాజ‌కీయంగా వివిధ పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించినందున పాల‌క జేడీఎస్ ఆయా నేత‌ల ఖ‌ర్చు భ‌రించాలి. కాద‌నుకుంటే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి స‌క‌ల సదుపాయాల‌తో ఉన్న గెస్టుహౌసులున్నాయి.Read More


జ‌గ‌న్, ముద్ర‌గ‌డ క‌లిసి బాబుని ముంచేస్తారా?

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఓవైపు వైఎస్ జ‌గ‌న్ ఇరికించేలా వ్య‌వ‌హ‌రించ‌డం, దానికి త‌గ్గ‌ట్టుగా కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ స్పందించ‌డంతో టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రాజ‌కీయంగా త‌ల‌బొప్పి క‌ట్టే అంశంగా మారుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారాన్ని ఎలా అధిగ‌మించాల‌న్న దానిపై టీడీపీ తీవ్రంగా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. కాపుల‌ను బీసీల‌లో చేర్చాల‌నే డిమాండ్ తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింది. దానికి కార‌ణం వైఎస్ జ‌గ‌న్, సుమారు నెల రోజులు దాటి తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్ అనూహ్యంగా కాపుల మీద గురిపెట్టారు. నిజానికి ప‌శ్చిమ గోదావ‌రి అంతటా పాద‌యాత్ర పూర్తిచేసినా ఎక్క‌డా ఈ అంశాన్ని ప్ర‌స్తావించ‌లేదు. పైగా కోన‌సీమ‌లాంటి కాపులు కీల‌క‌మైన ప్రాంతంలో కూడా మాట్లాడ‌లేదు. పైగా జ‌గ‌న్ అభిప్రాయం చెప్పాల‌నిRead More


చంద్రబాబుకి కొత్త క‌ష్ట‌మే…!

వాస్త‌వానికి దేశంలోనే అంద‌రిక‌న్నా తానే సీనియ‌ర్ అని, త‌న‌కు మించిన అనుభ‌వ‌జ్ఞుడు ఎవ‌రూ లేర‌ని ప‌దే ప‌దే చెప్ప‌డంలో చంద్ర‌బాబు సిద్ధ‌హ‌స్తులు. అలాంటి చంద్ర‌బాబుకి అనూహ్య ప‌రిణామం ఎదురుకావ‌డం ఆయ‌న‌కు కొత్త స‌మ‌స్య‌గా మారింది. ముఖ్యంగా త‌న క్యాబినెట్ లో కూడా చోటు ద‌క్క‌క‌, బ‌య‌ట‌కు పోయి కొత్త పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ని త‌న‌కు మించిన ఉత్త‌మ సీఎంగా నేరుగా ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన‌డం చంద్ర‌బాబుకి మింగుడుప‌డ‌డం లేదు. అది కూడా నేరుగా పార్ల‌మెంట్ వేదిక‌గా మాట్లాడ‌డంతో దేశ‌మంతా త‌న‌కు గొప్ప ఇమేజ్ ఉంద‌ని భావిస్తున్న చంద్ర‌బాబుకి పెద్ద డ్యామేజ్ గా భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు చంద్ర‌బాబు రెండు ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌ట్టు తాజాగా ఆయ‌న రెండు మీడియా స‌మావేశాల్లో మాట్లాడిన మాట‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. కేసీఆర్ కి, చంద్ర‌బాబు కి మ‌ధ్య స‌మ‌స్య‌లు సృష్టించేందుకుRead More


జ‌గ‌న్ ఇలాకాలో బాబు స‌ర్థుబాట్లు!

క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ కోట‌నే చేధిస్తామ‌ని చంద్ర‌బాబు అండ్ కో ప్ర‌క‌టిస్తున్నారు. కానీ అది అంత సులువు కాద‌ని అంద‌రికీ తెలుసు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉన్న‌ట్టుగా జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఉండ‌దు. దానికితోడు త‌మ్ముళ్ల త‌గాదాలు క‌డ‌ప జిల్లాలో కోకొల్ల‌లు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌ర్గ విబేధాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. రానురాను తీవ్ర‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వాటిని స‌ర్థుబాటు చేసుకుని ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్నా, నేత‌లు బేఖాత‌రు చేస్తున్న దాఖ‌లాలు లేవు. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో ఉంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని గ్ర‌హించిన బాబు రాజీ ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఒక్కొక్క‌రినీ ఒక్కో రీతిలో సంతృప్తి ప‌రిచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. అయితే అవి ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది సందేహంగా మారింది. అదే స‌మ‌యంలో టీడీపీ వ్య‌వ‌హారం కాంగ్రెస్ కి క‌లిసొచ్చేలాRead More


బాబు తీరుపై ఐపీఎస్ ల అసంతృప్తి

ఏపీకి మ‌రో పోలీస్ బాస్ అనివార్యం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు బాసుల ప‌ద‌వీకాలం ముగియ‌గా, తాజాగా మాల‌కొండ‌య్య‌కు కూడా ముహూర్తం ముంచుకొస్తోంది. ఆయ‌నకి కూడా ప‌దవీ విర‌మ‌ణ స‌మ‌యం స‌మీపించింది. ఈ నేప‌థ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. కానీ కొలిక్కి వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. ముఖ్యంగా ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో కొత్త డీజీపీ ఎంపిక కీల‌కం కాబోతోంది. రాజ‌కీయ ప్రాధాన్య‌త‌లే ప్ర‌ధానం అవుతాయ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఈనేప‌థ్యంలో ప్ర‌స్తుతం పోటీ ప‌డుతున్న న‌లుగురిలో ఇద్ద‌రు నార్త్ అధికారులు, ఇద్ద‌రు ఏపీకి చెందిన వారు క‌నిపిస్తున్నారు. వారిలో చంద్ర‌బాబుకి స‌న్నిహితుడైన విజ‌య‌వాడ సీపీ గౌత‌మ్ స‌వాంగ్, ఏసీబీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పేర్లు ఉన్నారు. ఇక రాష్ట్రానికి చెందిన అధికారుల్లో హోం శాఖ కార్య‌ద‌ర్శి అనురాధ‌, ఆర్టీసీ ఎండీ సురేంద్ర‌బాబు రేసులో క‌నిపిస్తున్నారు. స్థానిక‌తRead More


మోడీతో మేలు ఎవ‌రికి? కీడు ఎవ‌రికి?

అనూహ్య నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆఖ‌రికి దేశాన్నంతా అతలాకుత‌లం చేసేని నోట్ల ర‌ద్దు విష‌యం కూడా అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మే. ఆఖ‌రికి ఆర్థిక‌మంత్రికి కూడా తెలియ‌ని విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సంబంధించి సంచ‌న‌ల నిర్ణ‌యంతో మోడీ ముందుకొచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ముంద‌స్తు ఆలోచ‌న‌తో సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏక్ష‌ణాన నిర్ణ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని మోడీ స‌న్నిహితులు సైతం భావిస్తున్నారు. అయితే ముంద‌స్తు ఎన్నిక‌లొస్తే ఏపీలో ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అనే అంశంపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఏపీలో పాల‌క‌ప‌క్షం తీవ్ర ఒత్తిడిలో ఉంది. దాదాపు రాజ‌కీయంగా ఒంటరిగా మారిపోయింది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకి వ‌చ్చే ఎన్నిక‌లు అతి పెద్ద స‌వాల్ గా చెప్ప‌వ‌చ్చు. అధిగ‌మించ‌డానికి ఆయ‌న శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. రెండు ల‌క్ష్యాల‌తో సాగుతున్నారు. ఒక‌టి బీజేపీని ఏపీకిRead More


దక్షత లేకుండా దీక్షలేల..!

అధికారంలో ఉన్నవారు దీక్షలు చేయడం ఒకప్పుడు కొంత చిత్రంగా కనిపించేది. విపక్షంలో ఉన్నవాళ్లు చేయకపోయినా, పాలనలో ఉన్నవాళ్లు చేసినా అది పెద్ద విశేషంగా భావించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మోడీ పాలనలో వారు వీరయ్యారన్నట్టుగా ఉంది. అధికారంలో ఉండి దీక్షలు చేయడం సీఎంగా ఉన్న కాలంలో మోడీ ప్రారంభించిన ఆనవాయితీ కావడం విశేషం. దానిని చంద్రబాబు మరింత ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకు తోడుగా మంత్రులు, ఇతర నేతలు, అధికార యంత్రాంగం అంతా దీక్షలు సాగించాల్సిన పరిస్థితి తీసుకొచ్చేశారు. తాజాగా నవనిర్మాణ దీక్ష నాలుగో దశ సాగుతోంది. చంద్రబాబు ప్రారంభించిన ఈ దీక్ష రాష్ట్రమంతా సాగుతోంది. అంతకుముందు ధర్మపోరాట దీక్ష కూడా సాగింది. ఈ దీక్షల పలితాలేమిటన్నదే ప్రశ్నగా తయారయ్యింది. ముఖ్యమంత్రి ఎవరి మీద దీక్ష చేస్తున్నారన్నది నాలుగేళ్లుగా నేటికీ స్పష్టత రాలేదు. ధర్మపోరాటంRead More


చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?

అనుమానం వ‌స్తోంది. ఆయ‌న వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీసీఎం హోదాలో చంద్ర‌బాబు చేస్తున్న బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మ‌యంలో ఐబీ చీఫ్ ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు తోడు చంద్ర‌బాబుని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తేలేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. సీఎం త్వ‌ర‌లోనే ఇరుక్కుంటార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం ప్రారంభించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌నే పీల‌ర్లు వ‌దులుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. త‌న మీద దాడి జ‌రుగుతోంద‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు చెబుతున్నారు. అంటే సీఎంగా ఆయ‌న మీద దాడి ఎలాంటిద‌న్న‌ది స్ప‌ష్టం చేయ‌క‌పోయినా ఆయ‌న ఆ వెంట‌నే చెప్పిన మాట‌లు దానికి కొన‌సాగింపుగానే భావించాలి. కేసులుRead More


బీజేపీ మంత్రి భార్య‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. బీజేపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం చివ‌ర‌కు బాల‌య్య తొడ‌లు కొట్టే వ‌ర‌కూ వ‌చ్చేసింది. చంద్ర‌బాబు దీక్ష‌లు చేయాల్సిన స్థితికి చేరింది. అలాంటి స‌మ‌యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీటీడీలో నియామ‌కాలు పెద్ద వివాదాస్ప‌దం అవుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మ‌న్ గా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నియామ‌క‌మే పెద్ద దుమారం రేపింది. అదింకా పూర్తిగా చ‌ల్లార‌క‌ముందే తాజాగా వంగ‌ల‌పూడి అనిత వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ఆమె స్వ‌యంగా తాను క్రిస్టియ‌న్ అని ప్ర‌క‌టించ‌డంతో వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ఆమెకు ప‌ద‌వి కేటాయించ‌డం ప‌ట్ల చివ‌ర‌కు టీడీపీ నేత‌లే తీవ్రంగా స్పందించే ప‌రిస్థితి వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం అటు టీడీపీ నేత‌ల‌తో పాటు ఇటు బీజేపీ నేత‌ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ముఖ్యంగా టీటీడీRead More


జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!

కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏకంగా 40మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌నే రీతిలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు కూడా. వైసీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చాలాకాలంగా త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారంద‌రికీ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని చెప్పాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రోసారి ఫిరాయింపుల జోరు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి ప‌లువురు నేత‌లు సైకిల్ స‌వారీకి సెండాఫ్ చెప్పేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావుRead More