Main Menu

cases

 
 

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రైతుల పక్షాన నిలబడ్డారనే అక్కసుతో విపక్ష ఎమ్మెల్యేపై చంద్రబాబు సర్కారు కేసులో ఇరికించింది. రాజధానికి భూసేకరణ కోసం నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణలతో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13 మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. మరికొంత మంది రైతులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. తమపై తప్పుడు కేసులు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. న్యాయం చేయమని అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మీటింగ్‌ మినిట్స్‌ ఎందుకు రాయడం లేదని, అంతా ప్రభుత్వం ఇష్టమేనా అని నిలదీశారు. రైతులను బెదిరించి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కే, రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. పెనుమాక రైతులపై కేసులు పెట్టడాన్నిRead More


జ‌గ‌న్ క‌ట్ట‌డికి బాబు బ్ర‌హ్మాస్త్రం..!

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు కొత్త వార్ ముదురుతోంది. ఇప్ప‌టికే హోరాహోరీగా త‌ల‌బ‌డుతున్న పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల స‌మ‌రం కొత్త పుంత‌లు తొక్కుతోంది. అందులో భాగంగా వ్య‌వ‌హారం న్యాయ స్థానాల‌కు చేరుతోంది. గ‌తంలో జ‌గ‌న్ ని కోర్టుల సాయంతో క‌ట్ట‌డి చేసిన చంద్ర‌బాబు మ‌ళ్లీ అదే బ్ర‌హ్మాస్త్రం బ‌య‌ట‌కు తీస్తున్నారు. దానికి ప్ర‌తిగా జ‌గ‌న్ కూడా కేసులను ఆయుధంగా మ‌ల‌చుకుంటున్నారు. చంద్ర‌బాబును చిక్కుల్లో నెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పాత కేసులు తిర‌గ‌దోడాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తే..చంద్ర‌బాబు మీద ఉన్న కేసుల‌ను అస్త్రంగా చేసుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. దాంతో ఇరు వ‌ర్గాల వైరం న్యాయ‌స్థానాల ముందుకు చేరుతోంది. జ‌గ‌న్ పై టీడీపీ నేత‌లు వేసిన కేసుకి తోడు ఆనాటి కాంగ్రెస్ కూడా చేతులు క‌ల‌ప‌డంతో వైఎస్సార్సీపీ నేత‌ను కొంత ఇర‌కాటంలో పెట్ట‌గ‌లిగారు. అయితే ఇప్పుడు అదే కేసుల అస్త్రం జ‌గ‌న్Read More


హ‌డ‌లెత్తిస్తున్న ఆర్కే..!

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌లో ఇప్పుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడు అధికార ప‌క్షానికి ఆందోళ‌న క‌లిగిస్తుంటే విప‌క్షంలోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. దాంతో ఇప్పుడు రాజ‌ధాని ప్రాంత ఎమ్మెల్యేగానే కాకుండా లీగ‌ల్ వ్య‌వ‌హారాల‌తో చంద్ర‌బాబుకి చుక్క‌లు చూపిస్తున్న ఎమ్మెల్యేగా ఆర్కే అంద‌రి నోళ్ల‌లో నానుతున్నారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా రాజ‌ధాని ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆర్కే వ్య‌వ‌హారాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని గ్రామాల్లో అధికార ప‌క్షం ఆగ‌డాల‌పై జ‌నానికి ఆయ‌న అండ‌గా నిలుస్తున్నారు. దాంతో ఆయ‌న హవా పెరుగుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా ఏకంగా చంద్ర‌బాబుని టార్గెట్ చేసిన ఆర్కే వ‌రుస‌గా కేసుల‌తో క‌ల‌క‌లం సృష్టి స్తున్నారు. అంద‌రూ దాదాపు మ‌ర‌చిపోయే ద‌శ‌కు చేరుతున్న స్థితిలో ఆర్కే చొర‌వ‌తో ఓటుకు నోటు వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. హైకోర్ట్ ఆదేశాల‌తోRead More