Main Menu

bollywood

 
 

ఎన్టీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

నంద‌మూరి తార‌క రామారావుసంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ యంగ్ టైగ‌ర్ టాలీవుడ్ నుంచి త‌న కీర్తిని విస్త‌రించుకునే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా ఆయ‌న క‌న్ను ముంబై పై ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అక్కినేని నాగార్జున సుదీర్ఘ విరామం త‌ర్వాత బాలీవుడ్ మువీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కూడా అదే రీతిలో బాలీవుడ్ మువీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత‌, ఆత‌ర్వాత రాజ‌మౌళితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ మువీస్ కి సిద్ధ‌మ‌యిన ఎన్టీఆర్ వాటితో పాటుగా బాలీవుడ్ లో వ‌రుణ్ ధావ‌న్ తో సినిమాకు సై అన్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి వ‌రుణ్ ధావ‌న్ చాలాకాలంగా ఎన్టీఆర్ కి మంచి అభిమాని. ఎన్టీఆర్ డ్యాన్సులంటే వ‌రుణ్ ధావ‌న్ కి అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని వ‌రుణ్ ధావ‌న్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.Read More


స‌న్నీలియోన్ కి అనారోగ్యం

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ వ‌ర‌కూ ప‌రిణ‌తి సాధించిన స‌న్నీలియోన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆమెను హుటాహుటీన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటున్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని రామ్ నగర్ జిల్లాలో ఆమె షూటింగ్ లో పాల్గొన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా క‌డుపునొప్పితో అవ‌స్థ‌లు ప‌డ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. పాపులర్ టీవీ రియాల్టీ షో అయిన ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే సీజన్-11 షూటింగ్ జ‌రుగుతుండ‌గా హటాత్తుగా కడుపు నొప్పి వ‌చ్చింది. దాంతో హూటాహుటినా ఉత్తరాఖండ్ లోని కాషీపూర్ లో ఉన్న బ్రిజేష్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. త్వ‌ర‌లోనే ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని సన్నీ మేనేజర్ తెలిపారు. షూటింగ్‌లో సన్నీతోపాటు తన కో-హోస్ట్‌, స్నేహితుడు రాన్విజయ్ సింగ్ సింఘా ఉన్నారు.


బిపాసా క్షేమమే!

బాలీవుడ్ బ్యూటీ బిపాసబసు కి సంబంధించిన వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కలకలం రేపింది. బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆమె తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. తాను క్షేమంగా ఉన్నానని ప్రకటించారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీీ మందుకు వస్తానంటూ తేల్చిచెప్పారు. దాంతో ఆమె ట్వీట్ తర్వాత మరింత చర్చ మొదలయ్యింది. అసలు బిపాసా ఆరోగ్యానికేమయ్యిందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు విషయం ఏమంటే బాలీవుడ్ బ్యూటీ బిపాసా బ‌సు కొంత కాలంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమెని ముంబైలోని ఆసుప‌త్రికి త‌ర‌లించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. కొంత కాలంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ప‌లుమార్లు ఆసుప‌త్రికి వెళ్ళింది. ఇప్పుడు ఆ స‌మ‌స్య తీవ్ర‌త‌రం కావ‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించార‌ని ప్రచారంRead More


మిసెస్ కోహ్లీకి అరుదైన ఘ‌న‌త‌

మిసెస్ కోహ్లీ క‌న్నా ముందే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించిన అనుష్క శ‌ర్మ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకోబోతోంది. స్టార్ క్రికెట‌ర్ ని వివాహం చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ కి ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వ‌రించ‌బోతోంది. సినిమాల్లో న‌టిస్తూనే సినిమాలు నిర్మిస్తూ నిర్మాత‌గా రాణిస్తున్న మ‌హిళ‌గా అనుష్క‌కు గుర్తింపు ద‌క్కింది. ప్రియాంక చోప్రా త‌ర్వాత నిర్మాత‌గానూ రాణిస్తున్న హీరోయిన్ గా అనుష్క శ‌ర్మ‌కు త్వరలో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌’ పురస్కారం ద‌క్క‌బోతోంది. ఎప్పుడు ఈ అవార్డు అందజేస్తున్నది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. కానీ అధికారికంగా స‌ద‌రు ఫౌండేష‌న్ నుంచి ప్ర‌క‌ట‌న రావ‌డంతో అనుష్క‌శ‌ర్మ ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అనుష్క శర్మ తన క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో మూడు సినిమాలను నిర్మించింది. ఎన్‌హెచ్‌ 10, ఫిలౌరీ, పరి..ఈRead More


పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆన్ ఫీల్డ్ తో పాటు ఆఫ్ ఫీల్డ్ లోనూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కోహ్లీకి త‌గ్గ‌ట్టుగానే ఈ యంగ్ స్టార్ కూడా అప్పుడే డేటింట్ వ్య‌వ‌హారాల‌తో టాప్ స్టోరీస్ లో క‌నిపిస్తున్నాడు. తాజాగా మ‌రోసారి స్వీడన్ మోడల్ ఎల్లీ అవ్రామ్‌తో షికార్ చేస్తూ కెమెరా కంట‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే త‌న అన్న‌య్య కృనాల్ పెళ్లితో ఎల్లీతో క‌లిసి క‌నిపించిన పాండ్యా, ఇప్పుడు మ‌రోసారి హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డంతో నెట్ లో వారి ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి బాయ్.. బాయ్ చెప్పేసినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది. అయితే మీడియాతో సహా కొందరు ఈ క్రికెట్ అభిమానులు వీరి వాహనం వద్దకు రాగానే ఎల్లీ అవ్రామ్Read More


పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ

ఏదో ఒక సంచలన చర్యతో నిత్యం వార్తల్లో ఉండే నటి రాయ్‌లక్ష్మి. ఈత దుస్తులే కాదు ఎలాంటి గ్లామరస్‌ పాత్రనైనా చేయడానికి రెడీ అనే ఈ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌లకు సై అంటుంది. ఆ మధ్య క్రికెటర్‌ ధోనీతో డేటింగ్‌ అంటూ కలకలం సృష్టించిన రాయ్‌లక్ష్మి, ఇటీవల ధోని ఎవరూ అంటూ అందరికీ షాక్‌ ఇచ్చింది.ఆ తరువాత ధోని మంచి ఫ్రెండ్‌ అంటూ సవరించుకుందనుకోండి. ఈ అమ్మడు కోలీవుడ్‌ తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. లారెన్స్‌ సరసన మొట్టశివ కెట్టశివ చిత్రంలో ఒక సింగిల్‌ సాంగ్‌లో నటించిన రాయ్‌లక్ష్మి ఆపై కోలీవుడ్, బాలీవుడ్‌ అంటూ చక్కర్లు కొడుతోంది. తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైధీనంబర్‌ 150లో రత్తాలు రత్తాలు అంటూ ఆయనతో చిందులేసి తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కించిన రాయ్‌లక్ష్మి తాజాగా బాలీవుడ్‌లో జూలి–2 చిత్రంతో తెరపైకిRead More


హార్థిక్ ఫోకస్ ఆట నుంచి అమ్మడి మీదకు…

అవునా..అంటే ఆశ్చర్యమే అయినప్పటికీ అప్పుడే పాండ్యా సెలబ్రిటీ స్టేజ్ కి వచ్చేశాడు. ఇటీవల రాణిస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ క్రికెట్ తోనే కాకుండా మరో రకంగానూ వార్తల్లోకి వస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలతో సరసాలకు సిద్ధమయ్యాడనే ప్రచారం సంచలనంగా మారుతోంది. ఇంకా పూర్తిగా టీమ్ లో నిలదొక్కుకోకుండానే అప్పుడే ఎఫైర్లు మొదలుపెట్టాడనే ప్రచారం షికార్లు చేస్తోంది. దాంతో చివరకు ఈ విషయంలో హార్థిక్ పాండ్యా తండ్రి స్పందించాల్సి వచ్చింది. తనయుడి మీద సాగుతున్న ప్రచారాన్ని ఖండించాల్సి వచ్చింది. పుకార్లపై ఆయన తండ్రి హిమాన్షు పాండ్యా స్పందించారు. ప్రతి క్రికెటర్‌కు ఇటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయని, అయితే పాండ్యా మాత్రం చాలా దృఢంగా ఉంటాడని, కాబట్టి ఆటపై అతడికి ఆసక్తి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాండ్యా దృష్టి ఇటీవల అమ్మాయిలపైకి మళ్లిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.Read More


టాప్ 5లో ప్రభాస్

ఆశ్చర్యకర ఫలితం వెలువడింది. ప్రభాస్ కి అనూహ్య గౌరవం దక్కింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ మంచి స్థానం దక్కింది. దాంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఓ సర్వేలో ‘బాహుబలి’ చిత్రం మరోసారి బాలీవుడ్‌లో సత్తా చాటింది. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్ టాప్ స్టార్స్‌ను వెనక్కునెట్టి తొలి ఐదు స్థానాల్లో ఒకడిగా నిలచాడు ప్రభాస్. ‘బాహుబలి-2’ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన విషయం తెలిసిందే. వసూళ్ల రూపంలోనే కాదు,సర్వేల్లో కూడా ‘బాహుబలి’ సిరీస్ సత్తా చాటుతోంది. ఇటీవల ఇంటియాటుడే సంస్థ.. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 26% ఓట్లతో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలచింది ‘బాహుబలి-2. ఇక బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ ‘షోలే’ రెండవRead More


ఐశ్వర్యారాయ్ అప్ సెట్!

బాలీవుడ్‌ అందాల భామ ఐశ్వర్యరాయ్‌ నైరాశ్యంలో మునిగిపోయారా..తాజాగా జరిగిన పరిణామాలతో అప్ సెట్ అయ్యారా..బాలీవుడ్ లో రీ ఎంట్రీ చేస్తున్న ఒకనాటి ఈ ప్రపంచ సుందరికి ఇప్పుడు చేదు అనుభవాలు తప్పడం లేదా…అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఐశ్వర్యారాయ్ అప్ సెట్ అయినట్టు చెబుతున్నారు,. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం ‘ఫ్యానీ ఖాన్‌’. ‘యే దిల్‌హై ముష్కిల్‌’ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన వార్తలతోనే ఐశ్వర్యా కలత చెందినట్టు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో ఐష్‌కి జోడీగా నటుడు మాధవన్‌ను ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు పుట్టుకొచ్చారు. పలు పత్రికలు ప్రచురించిన ఈ వార్తను చూసి ఐశ్వర్య అప్‌సెట్‌ అయ్యారట. ఈ విషయాన్ని రాకేశ్‌ మీడియాతో చెప్పారు. మాధవ్‌కు జోడీగా ఐశ్వర్య నటిస్తున్నట్లు వచ్చిన వార్తలుRead More


జోష్ పుట్టిస్తున్న జాహ్నవి

ఇంకా సినిమా ఎంట్రీ జరగనే లేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. కాని అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి మాత్రం అప్పుడే హీరొయిన్ రేంజ్ బిల్డప్ ఇచ్చేస్తోంది. స్టార్ హీరొయిన్ కూతురు కాబట్టి మొహమాటపడాల్సిన అవసరం లేదని తన లైఫ్ స్టైల్ ద్వారా చెప్పకనే చెబుతోంది. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా అరేంజ్ చేసిన ఒక పార్టీలో బ్యాక్ లెస్ టాప్ తో వచ్చి అందరు మతులు పోగొట్టేసింది జాహ్నవి. ఈ మధ్య తనని సోషల్ లైఫ్ లోకి బాగా తీసుకొస్తోంది శ్రీదేవి. అమ్మ అంత కళ్ళు చెదిరే అందం జాహ్నవిలో లేదు కాని ముందు ముందు మేజిక్ చేసే అవుట్ ఫిట్ అయితే తనలో కనిపిస్తోంది. తన తెరంగేట్రం గురించి తండ్రి బోనీ కపూర్ వైపు నుంచి వ్యతిరేకత రాకపోవడం, చిన్నాన్నRead More