Main Menu

BLACK MONEY

 
 

మరో చేదువార్త – డిసెంబర్ 30 తర్వాత….

ATM-rush

ప్రస్తుతం ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త నోట్ల వల్ల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పైగా విత్‌డ్రాపై విధించిన పరిమితులు ప్రజలకు గుదిబండగా మారాయి. అయితే ఇటీవల బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో నగదు విత్‌డ్రాపై విధించిన పరిమితులను డిసెంబర్ 30తో ఎత్తివేయనున్నట్లు వార్తలొచ్చాయి.ఇవాళ తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 30 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిసింది. నోట్ల డిమాండ్‌కు తగినంత సప్లయ్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌ల్లో 2వేల నోట్ల ముద్రణను తగ్గించారు. 5వందల నోట్ల ముద్రణను పెంచారు. అయినప్పటికీ ఇవి అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పట్టే అవకాశముందని సమాచారం. చాలామంది విత్‌డ్రా పరిమితులు పూర్తిగా తొలగిస్తారని భావిస్తున్నారని, కానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకుRead More


నోట్ల కష్టాలకి ముగింపు ఇదే…

new currency

నిజంగా సామాన్యులు సంబరపడే వార్త ఇది. రూ.2 వేల కోసం కాళ్లు నొప్పులు పుట్టేలా క్యూలలో నిల్చుంటున్న సామాన్యులు పండగ చేసుకునే వార్త ఇది.వివరాల్లోకి వెళితే, ప్రస్తుత నోట్ల కష్టాలు జనవరి మధ్యలో దాదాపుగా తగ్గి ఫిబ్రవరి నాటికి పూర్తిగా కనుమరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం జోరుగా సాగుతున్న నోట్ల ముద్రణ అదే తరహాలో కొనసాగితే జనవరి రెండో వారం నాటికి 9 లక్షల కోట్ల రూపాయలు ముద్రితమవుతాయని సీనియర్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల నుంచి వెనక్కి వచ్చిన సొమ్ములో ఇది 50 శాతం కంటే ఎక్కువ. ఈ నెలాఖరు నాటికి ప్రజల నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే రద్దయిన నోట్ల విలువ రూ.15 లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నోట్ల ముద్రణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఫిబ్రవరిRead More


ఎస్‌బీఐ నుంచి రూ.25వేల పరిమితి కార్డులు..

SBI_Gold_Credit_Card

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా,ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రూ.25,000 పరిమితి గల క్రెడిట్‌ కార్డులు జారీ చేయనుంది. ఖాతాదారులకు ఎలాంటి క్రెడిట్‌ చరిత్ర లేకున్నా కార్డులు జారీ చేస్తామని తెలిపింది. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కొంత నగదు నిల్వను గ్యారంటీగా ఉంచుకొంటామని ఎస్‌బీఐ కార్డ్స్‌, పేమెంట్‌ సేవల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ్‌ జసుజా పేర్కొన్నారు.ప్రజల సమస్య డబ్బు లేకపోవడం కాదని కొనుగోలు చేయడానికి కార్డులు లేకపోవడమే అసలు సమస్యన్నారు. రెండు మూడు నెలల్లో ఇది కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. నోట్ల రద్దుతో కార్డుల వినియోగం, లావాదేవీల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఏడాదిలో 9-10 లక్షల కార్డుల వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు, వీరిలో కనీసం 25% కొత్త వినియోగదారులు ఉంటారన్నారు. ప్రస్తుతం 9-11 రోజుల్లో క్రెడిట్‌ కార్డులు ఇస్తుండగా దీనిని కనీసంRead More


స్వైప్ చేస్తే రూ.కోటి మీదే..కేంద్రం బంపరాఫర్..

atm swipe

కోటీశ్వరుల జాబితాలో మీరూ ఉండాలనుకుంటున్నారా?ఎవ్వరనుకోరు చెప్పండి.ఒకవేళ ఉండాలనుకుంటే, ప్రస్తుతం కరెన్సీ కష్టాల గురించి ఆలోచించకుండా మీ లావాదేవీలను డిజిటల్‌ బాట పట్టించండి. మీ అదృష్టం బాగుంటే కనీసం రూ.10 లక్షలు, అత్యధికంగా రూ.1 కోటి గెలుచుకోవచ్చు.అవును నిజమేనండి.. పేద, మధ్యతరగతి వర్గాలను డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించేందుకు ప్రోత్సాహక పథకాన్ని నీతి ఆయోగ్ రచించింది. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించినవారికి భారీ నగదు బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)ని కోరింది. దీనికోసం జాతీయ ఆర్థిక సమ్మిళిత నిధి నుంచి నుంచి రూ.125 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.ఎన్‌పీసీఐ పరిథిలో రిటెయిల్ పేమెంట్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా,Read More


వినియోగదారుల కల్పవల్లి ఈ ‘ఏటీఎం’..

nagarampalem

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్లా అన్ని శాఖల ఏటీఎంలు 95 శాతం పైగా మూతబడ్డాయి.ఈ తరుణంలో ఒక ఏటీఎం మాత్రం వినియోగదారుల కల్పవల్లిగా వెలసింది.ఇక వివరాల్లోకి వెళితే, జిల్లా కేంద్రంలో కేవలం నగరంపాలెం ఎస్‌బీఐ ఏటీఎం మాత్రమే ప్రజలకు కల్పవల్లిలా మారింది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా అక్కడ ప్రజలు డెబిట్‌ కార్డులు పట్టుకొని నగదు డ్రా చేసుకొనేందుకు బారులుదీరుతోన్నారు. పెద్దనోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తొలి నెల డిసెంబర్‌ కావడంతో నగదు కోసం ప్రతీ ఒక్కరూ బ్యాంకులు, ఏటీఎంలకు పరుగులు పెడుతోన్నారు. మరోవైపు ఆర్‌బీఐ నుంచి జిల్లాలోని బ్యాంకులకు అరకొరగా నగదు వస్తుం డటంతో అవి ప్రజల అవసరాలను ఏమా త్రం తీర్చలేకపోతోన్నాయి. చెస్టు బ్యాంకుల నుంచి మిగ తా బ్యాంకు శాఖలకు నగదు బట్వాడా జరగడం లేదు. బ్యాంకర్లు నిత్యంRead More


ఈపోస్‌, మైక్రో ఏటీఎంలే తాజా లక్ష్యం..

micro

స్వైపింగ్‌ మిషన్‌పై మీ ఏటీఎం కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారా?అయితే ఇది మీకోసమే.ఇక చదవండి త్వరలో ఈ-పోస్‌లు, స్వైపింగ్‌ మెషిన్లు, మైక్రో ఏటీఎంలపై దాడి చేసి లక్షల మంది కార్డుదారులను మోసం చేసేందుకు కుట్ర జరుగుతోంది. పెద్దనోట్లు రద్దు చేసిన ప్రభుత్వం దేశాన్ని క్యాష్‌లె్‌సగా చేసేందుకు వ్యాపారులందరినీ ఈ-పో్‌సలను వాడాలని చెబుతోంది. దీంతో భవిష్యత్తులో వీటి వినియోగం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ దొంగలు స్వైపింగ్‌ యంత్రాలు, మైక్రో ఏటీఎంలను హ్యాక్‌ చేసి వాటి ద్వారా కార్డుల వివరాలను, కార్డుల్లో డబ్బును కాజేయాలని వ్యూహం రచిస్తున్నారు. దీన్ని పసిగట్టిన దేశ సైబర్‌ భద్రతా సంస్థ సెర్ట్‌… ఈ-పోస్‌, మైక్రో ఏటీఎంల వినియోగదారులకు సైబర్‌ భద్రతపై అవగాహన పెంచాలని పేర్కొంది. స్కిమ్మింగ్‌, మాల్‌వేర్‌ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని వ్యాపారులు, బ్యాంకర్లు, ప్రజలనుRead More


కొత్త నోటును నూనెలో వేస్తే..

note

ప్రభుత్వం విడుదలచేసిన కొత్త నోటుకు సంబంధించి తాజాగా ఓ పుకారు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మధ్య 2వేల నోటును నీళ్లలో వేయడం, నిప్పుతో కాల్చడం లాంటి పనులు చేసి కొందరు యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంగ్లడ్‌లో కరెన్సీని జంతువుల కొవ్వుతో తయారుచేస్తున్నట్లు స్వయంగా బ్యాంకే ప్రకటించడంతో మన నోటు పైనా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే ఈ నోటును ఉపసంహరించుకోవాలని వెజిటేరియన్స్ గొడవ చేస్తున్నారు. కొత్తగా ఆర్బీఐ చలామణీలోకి తెచ్చిన 2వేల నోటు తయారీలో కూడా జంతువుల కొవ్వును వాడారని ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు హిందువులు నోటును చేత్తో ముట్టుకున్న వెంటనే సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నారట. అయితే ఈ విషయం నిజమో, కాదో తెలుసుకోవడానికి కొందరు ఇప్పటికే నూనెలో వేసి నోటును ఉడికిస్తున్నారు. ఇదే గానీRead More


ప్రజలకు క్షమాపణలు చెప్పిన డీజీపీ

dgp samabasivarao ips

ఆంధ్రప్రదేశ్ డీజీపీ, నండూరి సాంబశివరావు,ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నారు.వివరాల్లోకి వెళితే,నగదు మార్పిడి కోసం గత కొన్ని రోజులుగా ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే.అయితే నగదు కోసం బ్యాంకుల వచ్చిన ప్రజలపై పోలీసులు దాడి చేసిన ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. ఈ రకంగా జరిగిన దాడులను ఖండిస్తున్నానని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. పోలీసు శాఖ తరపున ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్నారు. బ్యాంకు వద్ద వ్యక్తిపై దాడి చేసిన డీఎస్పీ కమలాకరరావుపై విచారణకు ఆదేశించామని డీజీపీ తెలిపారు. గురువారం మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన డీజీపీ అనంతరం పలు ఏటిఎంలు, బ్యాంకుల వద్ద పరిస్థితిని సమీక్షించారు.


దేవుడికీ డిజిటల్ డబ్బులు…

siddhivinayak

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేవుడికీ ఇక్కట్లు తెచ్చింది.అయితే, భక్తుల సౌకర్యార్థం, కొన్ని ప్రముఖ దేవాలయాలు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఈ-వేలెట్లు, డిపాజిట్ సదుపాయం ఉన్న ఏటీఎం, స్వైపింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. నగదు రహిత విరాళాలను స్వీకరించేందుకు ఇప్పటికే గుజరాత్‌లో పలుచోట్ల వీటిని నెలకొల్పారు. ద్వారకా మందిర్ వ్యవస్థాపక సమితి అధ్యక్షుడు ధనరాజ్ నట్వానీ మాట్లాడుతూ… ‘‘ద్వారకాధీశుని దర్శనం కోసం లక్షలాది మంది ప్రజలు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. నోట్ల రద్దుతో కరెన్సీ కొరత కారణంగా భక్తులు కానుకలు ఇచ్చేందుకు ఇబ్బంది పడకూడదనే ఈ విధానాన్ని తీసుకువచ్చాం..’’ అని వెల్లడించారు. నగదు రహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బానస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయంలో డిజిటల్ డొనేషన్ సిస్టమ్‌ను ప్రారంభించారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో స్వైపింగ్ మెషిన్Read More


సెహ్వాగ్‌నూ తాకిన పాతనోట్ల వేడి…

sehwag

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటూ భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలితో ట్వీట్లు చేస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటాడు. ఈ భారత మాజీ క్రికెటర్‌ మరోసారి తనదైన శైలిలో ఓ ట్వీటు చేశాడు. ఈసారి రవీంద్ర జడేజాను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు.ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మంగళవారం మూడో టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌, బంతితోనూ రాణించిన జడేజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. అవార్డు కింద లక్ష రూపాయల పేటీఎం క్యాష్‌ ప్రైజ్‌ దక్కించుకున్నాడు. ‘వాహ్‌ జడ్డూ భాయ్‌! పెద్ద నోట్ల రద్దుతో రూ.2వేలకు చిల్లర దొరక్కనేను నానా ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఏకంగా నీ పేటీఎమ్‌లో లక్ష రూపాయలు జమ చేసేసుకున్నావు. అందులో నుంచి నాకూ కొంచెంRead More