bjp

 
 

అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…

amit-shah-son-wedding_650x400_41424024405

అమిత్ షా…బీజేపీ జాతీయ అధ్యక్షుడు..ఆయన ఆస్తుల గురించి తెలిస్తే అవాక్కవుతారు. మీరే కాదు…ఎవరు విన్నా సరే అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దానికి కారణం లేకపోలేదు. ఆయన తనయుడి పేరుతో పెరిగిన ఆస్తుల ఆ స్థాయిలో ఉన్నాయి. సబ్ కా వికాస్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలనలో అంబానీ, అదానీ తెగబలుస్తుండా సామాన్యుడు నోట్లరద్దు, జీఎస్టీల దెబ్బతో తల్లడిల్లుతున్న విషయం తాజా అధికారిక లెక్కలు చాటుతున్నాయి. కానీ ఆలయం పేరుతో అధికారం సాధించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి తనయుడు టెంపుల్ పేరుతో కంపెనీ పెట్టి ఏ రీతిన వ్యవహరించాడో తాజాగా వెల్లడయ్యింది. ది వైర్ వెల్లడించిన వివరాల ప్రకారం అమిత్ షా తనయుడి రూపంలో సాగిన కుంభకోణం బయటపడింది. అమిత్ షా తనయుడు జే అమిత్ భాయ్ షా ఆస్తులు గడిచిన కొంత కాలంలోనే 16వేల శాతంRead More


బీజేపీకి వరుస ఓటములు

bjp

బీజేపీకి వరుస ఎదురదెబ్బలు తగులుతున్నాయి. అన్ని చోట్లా ఆశాభంగం అవుతుంది. ఇప్పటికే విద్యార్థి సంఘం ఎన్నికల్లో కాషాయి కూటమి పరాజయాలు మూటగట్టుకుంటోంది. కేరళ నుంచి అసోం వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ విభాగం ఓటమి పాలయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మరో ఓటమి చవిచూసింది. ఇక వాటికితోడుగా హర్యానాలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోగా ఇప్పుడు రాజస్తాన్ లో ఆపార్టీకి పరాజయం ఎదురయ్యింది. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందస్తు వ్యూహరచన చేస్తున్న బీజేపీకి ఇది పెద్దదెబ్బగానే భావిస్తున్నారు. . రాజస్థాన్‌లోని పంచాయతీ ఉపఎన్నికల్లో బీజేపీ కుదేలైంది. ఇటీవల జరిగిన ఈ ఉపఎన్నికల్లో 26 స్థానాలకు గాను బీజేపీ కేవలం 12 స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్ సైతం పోటాపోటీగా 12 స్థానాలు గెలుచుకోగా, ఒక ఇండిపెండెంట్Read More


బాబుకి ఆ ఇద్దరిలో ఒక్కరే..!

pawan bjp tdp

ఏపీ రాజకీయాలు ఆసక్తిగానే ఉంటాయి. దానికి కారణం ఆ రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా విపక్షాల బలం ఉండడమే. ప్రధాన ప్రతిపక్షం కూడా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో సాగడమే. గడిచిన ఎన్నికలకు ముందు కూడా విపక్ష వైసీపీ ఊపు మీద కనిపించింది. ఆపార్టీదే అధికారం అని చాలామంది అంచనాలు వేశారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు అటు మోడీని , ఇటు పవన్ కల్యాణ్ ని వెంటపెట్టుకుని అనుకున్న ఫలితాలు సాధించారు. మోడీ పుణ్యాన పట్టణ ఓటర్లను, పవన్ పుణ్యాన యువత, కాపు సామాజికవర్గ ఓట్లను కొల్లగొట్టి కుర్చీని దక్కించుకున్నారు. ఇక గడిచిన మూడున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పక్షాలు కలిసి పోటీ చేయాలని ఆశించేవాళ్లు కొందరున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దానికి కారణం మోడీ, పవన్Read More


బాధ్యతల నుంచి తప్పుకుంటానంటున్న మంత్రి

kamineni

ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్దమంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యం రేకెత్తించారు. మంత్రి ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి పరిణామాలతో ఆయన మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. తీవ్రంగా కలత చెందిన ఆయన తన మంత్రి పదవిని సైతం వదులుకోవడానికి అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యానించారు. తాను ఎంతో బాధ్యతగా వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, అయినప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖపై ఇటీవల తరచూ ఆరోపణలను గుప్పిస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. వైద్యారోగ్యశాఖపై చేసిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ టెండర్ల ద్వారానే నిర్మాణ పనులు గుత్తేదార్లకు అప్పగిస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులను పారదర్శకంగానే నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నాపై నిందలుRead More


జగన్ కి ఝలక్!

GOWTHAM REDDY

జగన్ కి ఝలక్ కి తప్పేలా లేదు. సన్నిహితుడు, బంధువుగా భావించి అందలం ఇస్తే హఠాత్తుగా హ్యాండివ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రాజధాని రాజకీయం రంజుగా మార్చేసిన నాయకుడు ఇప్పుడు మరో అడుగువేసే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశం అవుతోంది. బెజవాడ రాజకీయాల్లో మరో మలుపు ఖాయంగా ఉంది. వైసీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఇప్పుడు జగన్ కి గుడ్ బై చెప్పే యోచనలో ఉణ్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన కమలం గూటిలో కొలువు దీరబోతున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి గౌతమ్ రెడ్డి విజయవాడలో సీనియర్ రాజకీయ నాయకుడిగానే చెప్పాలి. వరుసగా పలుమార్లు కార్పోరేటర్ గా గెలిచిన అనుభవం గౌతమ్ రెడ్డిది. అంతకుముందు ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేశారు. ఆతర్వాత సీపీఐ నేతగా నగర ప్రజలకు సుపరిచితుడే. కానీ తర్వాతRead More


మోడీ క్యాబినెట్ లోకి 14మంది, ఏపీ నుంచి ఆయనే

modi

కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 14మందికి చోటు దక్కనుంది. నితిన్‌ గడ్కరీకి రహదారులు, నౌకాయానంతో పాటు పౌర విమానయాన శాఖ, ప్రకాష్‌ జవదేకర్‌కు రైల్వేశాఖ , సురేష్‌ ప్రభుకు రక్షణ శాఖ కి ఖరారయినట్టు సమాచారం. ఇక రవిశంకర్‌ ప్రసాద్‌, అశోక్‌ గజపతిరాజు శాఖల మార్పు ఖాయంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో మురళీధర్‌రావు, రాంమాధవ్‌, కిషన్‌రెడ్డి, హరిబాబు, గోకరాజు గంగరాజు వంటి పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకి బెర్త్ ఖాయం అయినట్టు కనిపిస్తోంది. హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ బయలుదేరడం దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణా నుంచి మురళీధర్ రావు కి ఖాయం అయ్యింది. ధర్మేంద్రప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, మనోజ్‌సిన్హాలకు పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. వినయ్‌ సహస్రబుద్దే, ఓం మాధూర్‌, భూపేంద్ర యాదవ్‌లకు ఛాన్స్‌ ఉండవచ్చు.Read More


కమలంలో కాక రాజేసిన టీడీపీ

bjp-tdp

కమలంలో కాక రాజుకుంది. టీడీపీలో కొత్త తగాదా తెరమీదకు వచ్చింది. కాకినాడ , నంద్యాల ఎన్నికల విషయంలో పార్టీలో తీవ్ర విబేధాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షం తమను చీపురుపుల్లలా చూస్తున్నా సహించాల్సిన స్థితి మీద చాలామంది చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ నెలాఖరులో అమిత్ షా పర్యటన సందర్బంగా తమ అసంత్రుప్తిని, ఆవేదనను వెలిబుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. నంద్యాల ఎన్నికల్లో మిత్రపక్షమైన టీడీపీ తమను అంటరాని పార్టీగా చూడడం చాలామంది బీజేపీ నేతలకు మింగుడుపడడం లేదు. చివరకు జెండా, కండువా లేకుండా ప్రచారానికి రావాలంటూ సూచించడం తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. మైనార్టీలున్నంత మాత్రాన బీజేపీ ఒక వర్గానికి వ్యతిరేక పార్టీ అని చిత్రీకరించడానికి తగ్గట్టుగా టీడీపీ వ్యవహరిస్తున్నా బీజేపీ నేతలు నోరుమెదకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. టీడీపీ ఆడింది ఆటగా సాగుతుంటే ఏపీ శాఖ నాయకత్వం కూడా దానికి తందాన తాన అన్నట్టుగా సాగడంRead More


కార్పోరేట్ బీజేపీ

bjp

కార్పొరేట్‌ సంస్థలు ఎప్పుడూ అధికార పార్టీ వైపు మెగ్గు చూపుతున్నాయన్న విషయం తెలిసిందే. వివిధ అవసరాల రీత్యా ఆయా సంస్థలు పాలకపార్టీలను మచ్చిక చేసుకుని పనులు చేయించుకుంటాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కార్పోరేట్లు బీజేపీ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆపార్టీకి భారీగా నిధులు అందిస్తున్నారు. అనధికార వ్యవహారాలు పక్కన పెడితే అధికారికంగా గడిచిన మూడేళ్లలో అత్యధిక కార్పోరేట్ నిధులు సంపాదించిన పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలో అన్ని పార్టీలకు కలిపి 900 కోట్ల రూపాయలు నిధులుగా దక్కితే అందులో అత్యధిక భాగం రూ.705 కోట్లు బీజేపీకే దక్కడం గమనార్హం. అందులో సుమారు 150 కోట్లకు కనీసం పాన్ కార్డ్ కూడా లేని నిధులు కావడం విశేషం. దాంతో ఈ వ్యవహారాల మీద పలువురు మండిపడుతున్నారు. బీజేపీ ప్రజల పేరు చెబుతూ కార్పోరేట్ల కోసం పనిచేసే పార్టీగా ఈRead More


బాబుకి బీజేపీ బ్రేకులు వేసిందా..?

amit shah

ఇదో చర్చ ఇప్పుడు మొదలయ్యింది. చాలామంది నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీ శిబిరాల్లో ఆసక్తిగా మారింది. నంద్యాల ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఆశలపై కేంద్రంలో కమలం నేతలు నీళ్లు జల్లారనే వార్త చర్చనీయాంశంగా మారింది. దాంతో టీడీపీ శిబిరం మరింత ఢీలా పడిందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు భిన్నంగా కేంద్రం ఎన్నికల సంఘం వ్యవహరించడం ఆశ్చర్యకరమే అయినా అదే వాస్తవం అని అర్థమవుతోంది. నిజానికి ఉప ఎన్నికలను అక్టోబర్ నెలలో జరిగేలా చూసుకోవాలని టీడీపీ భావించింది. రోడ్ల విస్తరణ సహా వివిధ పనులు ఇప్పుడే ప్రారంభించడంతో వాటి ఫలితాలు ప్రజలకు చేరడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకూ ఎన్నికలను వాయిదా వేయాలని భావించింది. కనీసం సెప్టెంబర్ చివరిలో అయినాRead More


బీజేపీకి ఝలక్: యువ ఎంపీ గుడ్ బై

varungandhi-lead-m

పార్టీ అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా సంజయ్‌గాంధీ కుమారుడు, సుల్తాన్‌పూర్ లోక్‌సభ సభ్యుడు వరుణ్‌గాంధీ త్వరలోనే బిజెపికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటినుండి తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఆయన తీవ్ర అసంతృత్తితో ఉన్నారు. వరుణ్‌గాంధీ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కలిసి పార్టీ తనను నిర్లక్ష్యం చేయటం గురించి చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర లభిస్తుందని ఆశించిన వరుణ్‌గాంధీకి నిరాశ ఎదురైంది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఆయను పక్కనపెట్టి గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు యోగి అధిత్యనాథ్‌కు పట్టం కట్టారు. అప్పటినుండి వరుణ్‌గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన వరణ్‌గాంధీకి నచ్చ జెప్పేందుకు పలువురు కేంద్ర మంత్రులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదని తెలుస్తోంది.Read More