Bala Krishna

 
 

పైసా వ‌సూల్ ఫిక్స్ చేసిన బాల‌య్య‌

paisavasool balayya

సెప్టెంబర్‌ 1 నుంచే ‘పైసా వసూల్’ నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు పూరి టీం బాలయ్య అభిమానులకు మరో శుభవార్త చెప్పింది. పైసా వసూల్ ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌Read More


బాల‌య్య‌తో పూరీ ‘ట‌పోరి’

balayya

ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ కి కేరాఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. విచిత్ర సినిమా పేర్ల‌తో ఆక‌ట్టుకునే ల‌క్ష‌ణం పూరీ జ‌గన్నాథ్ ది. ఇప్పుడు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా టైటిల్ ద‌శ నుంచే అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డం విశేషం. ఈడియ‌ట్, లోఫ‌ర్, దేశ‌ముదురు వంటి సినిమా పేర్లు మాత్ర‌మే కాకుండా తాజాగా ‘రోగ్‌’ సినిమాతో పూరీ ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు. ఆ త‌ర్వాత బాల‌య్య సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు ట‌పోరి అనే టైటిల్ ను సిద్ధం చేస్తున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. టైటిల్ క్యాచీగా ఉండాల‌ని ఆలోచించిఏ పూరీ జ‌గ‌న్నాద్ ట‌పోరీ అనే పేరుతో మాస్ ఆడియెన్స్ కి ద‌గ్గ‌ర కావ‌చ్చ‌నే అభిప్రాయంతో పూరీ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. టపోరీ అంటే రౌడీ అనే అర్థం వ‌స్తుంది కాబ‌ట్టి ప‌క్కా మాస్ మ‌సాలాRead More


ప్రీ రిలిజ్ లో బాల‌య్య సంచ‌ల‌నం..!

goutami putra

నంద‌మూరి న‌ట‌రత్న సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. నూరో చిత్రంతో కొత్త చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. ప్రీ రిలీజ్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అది కూడా బాలకృష్ణ కెరీర్లోనే అత్యథిక మొత్తాలకు రైట్స్ అమ్ముడైనట్టుగా సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్లో దాదాపు 75 కోట్ల వరకు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రకు అత్యధికంగా 30 కోట్లు రాగా సీడెడ్ 9 కోట్లు, నైజాం 11 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి మరో 25 కోట్ల వరకు వచ్చుంటాయన్న టాక్Read More


శ్రియ వశిష్టి దేవి…

shriya

బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. భారీ బడ్జెట్తో దర్శకుడు క్రిష్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్ ఎంపిక కోసం చాలా ఆలస్యం చేసిన చిత్రయూనిట్ ఫైనల్గా శ్రియను కన్ఫామ్ చేసింది. ఇటీవలే ప్రారంభమైన షెడ్యూల్లో గౌతమీ పుత్ర శాతకర్ణి యూనిట్తో జాయిన్ అయ్యిందీ అందాల భామ. ఈ రోజు (ఆదివారం) శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని శ్రియ లుక్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రియ క్లోజప్తో రిలీజ్ అయిన ఈ పోస్టర్లో రాణి లుక్లో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈRead More


అమ్మకు షాక్ ఇచ్చిన బాలయ్య..

balakrishna-hemamalini

ప్రస్తుతం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తొలిసారి బాలయ్యతో కలసి నటిస్తున్నారు సీనియర్ నటీమణి హేమా మాలినీ. తొలిసారి ఆమె ఇటీవలే సెట్లో అడుగుపెట్టారు.అయితే వెండితెరపై గంభీరమైన పాత్రల్లో ఒదిగిపోయే బాలయ్య ,బయట మాత్రం అందరితో కలివిడిగా కలసిపోతుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా సరదాగా ఉంటారు. సీరియర్లంటే గౌరవం చూపిస్తుంటారు. అందులో బాగంగానే బాలయ్య తొలిసారి సెట్లో అడుగుపెట్టిన సందర్భంగా హేమా మాలినికి ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తొలిరోజున షూటింగ్ ముగిసి పేకప్ చెబుతున్నప్పుడు హేమా మాలినీకి ఓ చీర బహూకరించారట బాలయ్య. ఊహించని గిఫ్ట్ లభించినందుకు… హేమా మాలినీ కూడా షాకయ్యారని, ఆ చీర చూసి మురిసిపోయారని తెలుస్తోంది. స్త్రీలను గౌరవించే చక్రవర్తి గౌతమి పుత్రగా.. నటిస్తున్నారు బాలకృష్ణ. బాలయ్య తల్లి పాత్రలో హేమాRead More


శాతకర్ణి తరువాత ఏంటో తెలుసా?

balayya

బాలక్రిష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ వెంటనే 101వ చిత్రమూ పట్టాలెక్కిస్తారట. ఆ సినిమా దాదాపుగా కృష్ణవంశీతోనే అన్నది లేటెస్ట్ టాక్. బాలకృష్ణ – కృష్ణవంశీల కలయికలో వందో చిత్రంగా ‘రైతురాజ్యం’ అనే సినిమా తెరకెక్కాల్సింది. అయితే కృష్ణవంశీ స్థానం లో అనూహ్యంగా క్రిష్ వచ్చాడు. అయినా సరే. కృష్ణవంశీతో తాను అనుకొన్న ప్రాజెక్టుని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానంటున్నాడట బాలయ్య. రైతు కథ బాలయ్యకు అంతగా నచ్చిందని, అందుకే కృష్ణవంశీ తో రైతు కథని 101వ సినిమాగా బాలయ్య తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడని విశ్వసనీయ వర్గాల మాట. ప్రస్తుతం నక్షత్రంతో బిజీగా వున్నారు కృష్ణ వంశీ. ఈ సినిమా పూర్తికావచ్చింది. దీని తర్వాత బాలయ్య సినిమా పనులు మొదలుపెడతారని తెలిసింది.అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


బాల‌య్య‌తో హాలీవుడ్ హీరో..!

Hollywood-Actor-Nathan-Jones-To-Cast-In-Balakrishnas-Gowthamiputra-Satakarni

బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం విదేశాల్లో మరో భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో సినిమాకు సంబందించిన మరో వార్త నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యతో ఓ హాలీవుడ్ విలన్ ఢీ కొనబోతున్నాడు. ట్రాయ్ సినిమాలో నటించిన ఇంగ్లీష్ విలన్ నూతన్ జోన్స్ బాలయ్య సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రపంచాన్ని జయించాలన్న ఆశయంతో వరుస దండయాత్రలు చేసే గ్రీకు రాజుగా కనిపించనున్నాడు జోన్స్. ప్రస్తుతం జార్జీయాలో జరుగుతున్న షెడ్యూల్ లోనే నూతన్ జోన్స్తో యుద్ద సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.