BAAHUBALI

 
 

బాహుబలి నటితో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

scarlett-umakant-l

అసభ్యకరంగా ప్రవర్తించిన సహ నటుడి చెంప చెళ్లుమనిపించారు నటి స్కార్లెట్ విల్సన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ‘బాహుబలి’ పార్ట్ 1లో ‘మనోహరీ..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో స్కార్లెట్ ఆడిపాడారు. ప్రస్తుతం స్కార్లెట్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హన్సా-ఏక్-సన్యోగ్’. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం షూటింగ్ జరుగుతోంది. అయితే నటి స్కార్లెట్ తో సహ నటుడు ఉమాకాంత్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇలాంటి పనులు చేయవద్దని స్కార్లెట్ హెచ్చరించినా పట్టించుకోని ఉమాకాంత్.. అసభ్యకర సంకేతాలు పంపుతూ ఆమెను తాకాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె వెంటనే అతడి చెంప పగలకొట్టింది. ఈ ఘటనపై స్పందించిన మూవీ యూనిట్ ఉమాకాంత్‌ ను అక్కడి నుంచి పంపేందుకు చూడగా అతడు మరింతగా రెచ్చిపోయాడు. యూనిట్Read More


రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ..!

rajamouli

టాలీవుడ్ జ‌క్క‌న్న సినిమాల‌పై ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆస‌క్తి క‌నిపిస్తోంది. అందుకే రాజ‌మౌళి ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూసేవాళ్ల సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 సినిమా రిలీజ్ కి సిద్ధ‌మ‌య్యింది. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మూడేళ్లు పైగా అదే ప్రాజెక్ట్ లో ఉన్న రాజ‌మౌళి ఇప్పుడు త‌న త‌దుప‌రి మువీపై దృష్టి పెడుతున్న‌ట్టు ప్ర‌సారం సాగుతోంది. అందులో భాగంగానే మ‌హాభార‌తం తెర‌కెక్కించే ప‌నిలో ఉన్న‌ట్టు రూమ‌ర్స్ ప్ర‌చారం సాగుతోంది. ఇంత‌కుముందు ఒక‌నొక సంద‌ర్భంలో రాజమౌళి మాట్లాడుతూ మహాభారత గాథను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన ఉందని చెప్పారు. దీంతో రాజమౌళి తదుపరి సినిమా మహాభారతమేనని ఊహాగానాలు, కథనాలు వస్తున్నాయి. అయితే, రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత కే విజయేంద్రప్రసాద్‌ మాత్రం ఈ ఊహాగానాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇవిRead More


గౌతమీపుత్రుడి కోసం ‘బాహుబలి’ టీం…..

BAAHU

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతంగా దూసుకెళుతోంది. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కలెక్షన్ల పరంగా సంతోషంగా ఉన్నారు. దీంతో సినిమాను జనాల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే బాలయ్య, డైరెక్టర్ క్రిష్‌, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌లతో కలిసి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి దర్శక ధీరుడు రాజమౌళి, భల్లాలదేవుడు రానా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ అనంతరం కలెక్షన్లు పడిపోకుండా బాలకృష్ణతో రానా, క్రిష్‌తో జక్కన్నల ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఓ చానల్ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించిందట. ఈ వీకెండ్‌లోనే ఆ చానల్ సదరు ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుందని టాక్. బాహుబలి ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నRead More


బాహుబ‌లికి విముక్తి..!

bahubali

బాహుబ‌లికి విముక్తి ల‌భించింది. నాలుగేళ్లుగా అదే క‌థ‌లో లీన‌మ‌యిపోయిన ప్ర‌భాస్ కి రిలీఫ్ ద‌క్కింది. ఎట్ట‌కేల‌కు బాహుబ‌లి నుంచి ప్ర‌భాస్ కి ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. రెండు భాగాల సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన ప్ర‌భాస్ పాత్ర దాదాపు పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ రెబ‌ల్ స్టార్ రోల్ షూటింగ్ కి ముగింపు ప‌ల‌క‌బోతున్న‌రు. మొత్తం బాహుబ‌లి సినిమా డిసెంబర్ 27తో షూటింగ్ వర్క్ పూర్తి చేసుకోనుందని స‌మాచారం. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా మరింత ప్రతిష్టాత్మకంగా బాహుబలి ద కంక్లూజన్ను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి షూటింగ్కు ప్యాకప్ చెప్పేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు. ప్రభాస్ కూడా కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాRead More


అనుష్క పెళ్లికి అంతా ఓకే..!

anusha

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదన్న ప్ర‌చారం జోరందుకుంది. ఇప్ప‌టికే ఓ టాలీవుడ్ బ‌డా బాబుతో డేటింగ్ లో ఉన్న‌ట్టు సాగిన ప్ర‌చారం నేప‌థ్యంలో ఈ స్వీటీ శెట్టి పెళ్లి పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. వివాహితుడైన టాలీవుడ్ ప్ర‌ముఖుడిని పెళ్లి చేసుకుంటుంద‌న్న ప్ర‌చారం కూడా సాగ‌డంతో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్ప‌డు అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క మ‌నువాడ‌బోతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆమె ప్ర‌స్తుతం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’, ‘భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది.దాంతో అనుష్క పెళ్లి వార్త సంచ‌ల‌నంగా మార‌బోతోంది. ఇప్ప‌టికే మ‌రో బ్యూటీ స‌మంత త‌న ప్రియుడు నాగ చైత‌న్య‌ను వ‌చ్చే ఏడాది వివాహ‌మాడ‌బోతోంది. ఆమెకు తోడుగా ఇప్పుడు అనుష్క కూడా 2016లో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


బాహుబ‌లి వాయిదా..!?

bahubali

బాహుబలి-ది కంక్లూజన్‌.. టాలీవుడ్‌లో విపరీతమైన ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్‌ పార్ట్‌ దాదాపుగా ఫైనల్‌ స్టేజ్‌ కు తీసుకొచ్చేశారు. ప్యాచప్‌ వర్క్స తప్ప వేరే ఏమీ పెండింగ్‌ లేవని.. ఇక మిగిలిన టైం అంతా.. గ్రాఫిక్స్‌.. పోస్ట్‌ ప్రొడక్షన్‌.. ప్రపంచభాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు వీలుగా డబ్బింగ్‌ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. 2017 ఏప్రిల్‌ 28న బాహుబలి2 రిలీజ్‌ అవుతుందని ముందే చెప్పేశారు. ఇందుకు తగ్గట్లుగానే అన్ని వర్క్‌‌స జరిగిపోతున్నాయి. లేట్‌ అవుతుందనే రూమర్స్‌ ను యూనిట్‌ ఖండించేసింది కూడా. అయితే.. ఈ మూవీని ప్రీపోన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న న్యూస్‌ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇందుకు కారణం లీకేజ్‌ భయాలే అంటున్నారు. రీసెంట్‌ గా బాహుబలి2 కి సంబంధించిన 9 నిమిషాల వీడియో లీక్‌ అయింది. ఇప్పటికైతే బయటకు వచ్చిన ఫీడ్‌ కారణంగా పెద్దగా నష్టంRead More


బాహుబలికి ఘోర అవమానం..

baahubali

బాహుబలి లాంటి ఒక తెలుగు చిత్రం వందల కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తలమానికంగా చెప్పుకునే బాలీవుడ్ కూడా తెలుగోడికి జై కొట్టేలా చేసింది. తెలుగులో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ ఈ విషయం మన సినిమా పండితుల కంట పడినట్టు లేదు. తెలుగు సినీ పరిశ్రమను ఘోరంగా అవమానించారు.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2016కు ఇటీవల నామినేషన్స్ జరిగాయి. దాదాపు 230 సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. ఇందులో ఆరు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 22 సినిమాలను ఎంపిక చేశారు. అయితే వీటిల్లో ఏ ఒక్క తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొంది, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరుతెచ్చుకున్న బాహుబలి సినిమాను కూడాRead More


బాహుబ‌లి మువీలో తేడా అదే..!!

rajamouli

‘బాహుబలి’తో ఎవరికీ అందని రికార్డులను క్రియేట్‌ చేశాడు దర్శకుడు రాజమౌళి. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. ఈ సినిమా ఎందుకు నచ్చిందంటే.. చాలామంది వాటర్‌ఫాల్స్‌ సీన్స్‌ బాగున్నాయనో, వార్‌ సీన్లు బాగున్నాయనో చెబుతారు.. కానీ, కథ, కథనం గురించి మాట్లాడరు. నిజానికి రాజమౌళి ప్రధాన బలం భావోద్వేగాలను రేకెత్తించే సన్నివేశాలను సృష్టించడం, కథను అద్భుతంగా చెప్పడం. అవేవీ ‘బాహుబలి-1’లో లేవని చాలామంది ఫీలైయ్యారు. అందుకే ఆ లోటును ‘బాహుబలి-2’తో తీరుస్తున్నాడట జక్కన్న. ‘బాహుబలి-2’లోనూ గ్రాఫిక్స్‌ ఉన్నతంగానే ఉన్నప్పటికీ.. డ్రామా, ఎమోషన్‌కే పెద్దపీట వేశాడట. కథ, కథనంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం ప్రేక్షకులకు నిజమైన విందులా ఉంటుందని రాజమౌళి హామీ ఇచ్చాడు.


బాహుబ‌లి త‌ప్పు మ‌ళ్లీ చేయ‌నంటున్న జ‌క్క‌న్న‌..!

rajamouli

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి మ‌రో మారు సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. బాహుబ‌లి తొలిభాగంలో చేసిన త‌ప్పు మ‌ళ్లీ చేయ‌న‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు బాహుబ‌లిలో జ‌రిగిన త‌ప్పేంటి అని ప‌లువురు ఆరాతీస్తున్నారు. తీరా చూస్తే బాహుబ‌లి మొద‌టి భాగంలో న‌టించిన జ‌క్క‌న్న అదే త‌న త‌ప్పు అని చెబుతున్నాడు. అలాంటి పొర‌పాట్లు మ‌ళ్లీ చేయ‌నంటున్నాడు. అతిథి పాత్ర‌లో క‌నిపించ‌డం ఇక పై జ‌ర‌గ‌దంటున్నాడు. ‘బాహుబలి’ మొదటి పార్టును ఆదరించడంతో రెండో పార్టు తీయడం తేలికైందని, ఈ సినిమాను హిందీలో డబ్‌ చేయడంతో దక్షిణాది సినిమాకు బాలీవుడ్‌ కు మధ్య అంతరం తగ్గినట్టు అయిందని చెప్పాడు. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న అంశం ఇంత పెద్ద సెన్సేషన్‌ అవుతుందని తాము ఊహించలేదని చెప్పాడు. రెండో పార్టుపై ఆసక్తిని కొనసాగించడానికే ఈ అంశాన్ని సస్పెన్స్‌గా ఉంచామనిRead More


ఆ సినిమాలో ప్ర‌భాస్ క‌నిపించడం లేదు..!!

prabhas

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, పలు సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నాడంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్లో ప్రభాస్, ఓ చిన్న సీన్లో కనిపించటంతో మరిన్ని సినిమాల్లో కనిపించనున్నాడంటూ టాక్ మొదలైంది. ముఖ్యంగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం 3లో ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. అయితే ఈ వార్తలపై స్పందించిన నిర్మాత జ్ఞానవేల్ రాజా, ప్రభాస్ సింగం 3లో నటించలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటున్న సింగం 3 డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.