Main Menu

apupdates

 
 

భూమా ఫ్యామిలీకి బాబు హ్యాండ్..!

నంద్యాల టీడీపీలో ముసలం పుట్టింది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో చంద్ర‌బాబుకి సైతం ఎటూపాలుపోని ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. భూమా కుటుంబానికి సానుభూతి క‌లిసి వ‌స్తుంద‌నుకుంటే అఖిల ప్రియ తీరుతో ఒక్కొక్క‌రుగా దూర‌మ‌య్యే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. ఇప్ప‌టికే కీల‌క నేత శిల్పామోహ‌న్ రెడ్డి చేజారిపోయారు. ఆయ‌న వెంట భారీ సంఖ్య‌లో నేత‌లు వెళుతున్నా క‌నీసం జాగ్ర‌త్త‌లు తీసుకోలేక‌పోయామ‌ని టీడీపీ అధిష్టానం చింతిస్తోంది. మునిసిప‌ల్ చైర్మ‌న్, కౌన్సిల‌ర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు పెద్ద సంఖ్య‌లో చేజారిపోవ‌డంతో ఇప్పుడు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అందుకు తోడు భూమా ముఖ్య అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా కాలుదువ్వ‌డంతో క‌థ కొత్త మ‌లుపు తిరిగింది. వేరుకుంప‌టి కోసం ప్ర‌త్యేకంగా త‌న వ‌ర్గంతో స‌మావేశం నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపింది.దాంతో న‌ష్ట‌నివార‌ణ కోసం ఇప్పుడు అధినేత ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. క‌ర్నూలు జిల్లా కీల‌క‌నేత‌లు, నంద్యాలRead More


చంద్ర‌బాబుకి తొలి ప‌రీక్ష‌…!

ఏపీలో క్యాబినెట్ విస్త‌ర‌ణ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఊగిస‌లాడిన చంద్ర‌బాబు ఆత‌ర్వాత ఉసూరుమ‌నిపించారు. ఆశావాహులను నిరాశ‌ప‌రిచారు. ముఖ్యంగా ప్రాంతీయ‌, సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో త‌లనొప్పులు ఎందుక‌ని భావించిన చంద్ర‌బాబు చివ‌ర‌కు త‌న‌యుడు నారా లోకేష్ ఆశ‌ల‌ను కూడా నెర‌వేర్చ‌లేక‌పోయారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను వాయిదాలు వేస్తూ మూడేళ్లుగా కాలం గ‌డుపుతున్నారు. ఖాళీలున‌ప్ప‌టికీ కూడా భ‌ర్తీకి ఆయ‌న ముంద‌డుగు వేయ‌డం లేదు. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు కి ప‌రీక్షా కాలం వ‌చ్చింది. ఏపీ శాస‌న‌మండ‌లిలో ఖాళీల భ‌ర్తీ అనివార్యంగా ముందుకొచ్చింది. దాంతో ఆశావాహుల జాబితా చాంతాడులా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సాదార‌ణ ఎన్నిక‌ల్లో అవ‌కాశం రానివాళ్లు, వ‌చ్చే సారికి అవ‌కాశం వ‌స్తుంద‌న్న ఆశ‌లు కూడా లేనివాళ్లు అనేక‌మంది క్యూలో నిలుచున్నారు. త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఒత్తిడి పెంచుతున్నారు. ర‌క‌ర‌కాల ఈక్వేష‌న్స్ తో త‌మ‌కు ఎమ్మెల్సీ కోటాలో ఛాన్స్Read More


ఏపీకి మ‌రో టోపీ పెట్టిన బాబు మిత్రుడు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెట్టుబ‌డుల కోసం ప్ర‌పంచ‌మంతా తిరుగుతున్నారు. ఏకంగా దావోస్ వెళ్లి గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో వ‌ణుకుతూ అంద‌రినీ వేడుకుంటున్నారు. ఏపీకి అండ‌గా నిల‌వాల‌ని కోరుతున్నారు. కానీ ఏపీలో ఆయ‌న మిత్రుడు టోపీ పెట్టాడు. ఏకంగా చంద్ర‌బాబు కి స‌న్నిహిత‌మైన రిల‌యెన్స్ సంస్థ భారీ ప‌రిశ్ర‌మ పెడ‌తాన‌ని ఆశ పెట్టి ఇప్పుడు మొండిచేయి చూపుతోంది. దానికి కార‌ణాలు ప‌క్క‌న పెడితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప్ర‌చారాల‌కు వాస్త‌వానికి ఉన్న వైరుధ్యం అర్థ‌మ‌వుతోంది. పెట్టుబ‌డుల అస‌లు గుట్టు తేట‌తెల్ల‌మ‌వుతోంది. విశాఖ జిల్లాలో స‌ముద్ర తీరాన్ని ఆనుకుని భారీ ప‌రిశ్ర‌మ‌కు రిల‌యెన్స్ ముందుకొచ్చింది. ఇంకేముంది రిల‌యెన్స్ ప్ర‌తిపాదించిన డిఫెన్స్ ప‌రిశ్ర‌మ‌తో రాష్ట్రానికి ఎంతో మేలు క‌ల‌గ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగింది. ఏకంగా అనిల్ అంబానీ వ‌చ్చి అమ‌రావ‌తిలో బాబుతో ఫోటోలు కూడా తీయించుకున్నారు.చంద్ర‌బాబు సామ‌ర్థ్యం వ‌ల్లే , ఆయ‌న‌తో ఉన్నా సాన్నిహిత్యం వ‌ల్లేRead More


మునిసిపోరులో విజ‌య‌మెవ‌రిది? Update AP స‌ర్వే..!

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అధికార పార్టీ దానికి త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌తిప‌క్షం కూడా స‌న్నాహాల‌కు దిగింది. దాంతో 2014 లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌కుండా ఆగిపోయిన కార్పోరేష‌న్లు, మునిసిపాలిటీల‌లో ఎన్నిక‌లు ఖాయ‌మ‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డింది. రాజ‌కీయంగా కీల‌క‌మైన స‌మ‌యంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఎవ‌రి బ‌లాలు ఏమిటో తేల‌డానికి ఈ ఎన్నిక‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే అంచ‌నాలున్నాయి. అందులోనూ అటు ఉత్త‌రాంధ్ర నుంచి ఇటు రాయ‌ల‌సీమ వ‌ర‌కూ అన్ని ప్ర‌ధాన ప్రాంతాల్లోనూ జ‌రుగుతున్న ఎన్నిక‌ల కావ‌డంతో జ‌నం నాడి గుర్తించ‌డానికి దోహ‌ద ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. న‌వ్యాంధ్ర‌లో రెండున్న‌రేళ్ల చంద్ర‌బాబు పాల‌నలో ప్ర‌భుత్వానికి ఆద‌ర‌ణ పెరిగింద‌ని చంద్ర‌బాబు అండ్ కో చెప్పుకుంటున్నారు. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు కూడా త‌మ వైపు చేరిపోవ‌డం దానికో నిద‌ర్శ‌నంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో విప‌క్షRead More


టెన్ష‌న్ తొల‌గించిన నారా లోకేష్..!

తొలి రెండు రోజులు డుమ్మా కొట్టిన‌ప్ప‌టికీ చివ‌రి రోజు మాత్రం నారా లోకేష్ హాజ‌ర‌య్యారు. టీడీపీ నేత‌ల శిక్ష‌ణా శిబిరంలో పాల్గొన్నారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఆయ‌న వ‌రుస‌గా రెండు రోజులు గైర్హాజ‌రు కావ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ వాయిదా ప‌డ‌డ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మంత్రి హోదా కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న లోకేష్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లే రీతిలోచంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కు ఆశాభంగం అయిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. దాంతో ఆగ్ర‌హించిన లోకేష్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఎట్ట‌కేల‌కు లోకేష్ కూడా ఈ మూడు రోజుల క్యాంప్ కి ఆఖ‌రి రోజు హాజ‌రుకావ‌డంతో టీడీపీ నేత‌లు ఊపిరిపీ్ల్చుకున్నారు. పార్టీ అదినేత తీరుతో త‌న‌యుడే అసంతృప్తిగా ఉన్నార‌న్న ప్ర‌చారం పెనుRead More


అబ్బో..! జ‌గ‌న్ లో ఎంత మార్పు..!!

వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ లో పెను మార్పు క‌నిపిస్తోంది. చాలాకాలంగా ఆయ‌న‌పై ఉన్న ముద్ర‌లు చెరిపేసుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయ‌న వ్య‌క్తి జీవితం, విశ్వాసాల మీద ఉన్న ప్ర‌చారాన్ని తుడిచి వేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నారు. అందుకోసం యాగాలు, య‌జ్ఞాలు మాత్ర‌మే కాకుండా సాధువులు, పీఠాధిపుతుల చుట్టూ ప్ర‌దిక్ష‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం బొట్టు కూడా పెట్టుకుని అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. అనంంత‌పురం బ‌హిరంగ‌స‌భ‌లో ప‌క్కా హిందూ వాదిగా క‌నిపించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. గ‌త ఎన్నిక‌లకు ముందు జ‌రిగిన ప‌లు స‌భ‌ల్లో వైఎస్ విజ‌య‌మ్మ బైబిల్ తో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఆపార్టీ పై క్రైస్త‌వ ముద్ర ప‌డింద‌న్న‌ది ప‌లువురి వాద‌న‌. అందుకే దానిని తొల‌గించ‌డానికి శ‌తవిధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత ఉప‌యోగం కూడా క‌నిపిస్తోంద‌న్న‌ది ఆ పార్టీ శ్రేణుల న‌మ్మ‌కం.Read More


చంద్ర‌బాబు ‘క‌మ్మ‌’ని రాగ‌మే ఆల‌పిస్తారా..!

ఏపీలో కులాధారిత రాజ‌కీయాలు కొత్త కాదు. కానీ ఇటీవ‌ల చంద్ర‌బాబు పాల‌న‌లో వాటి ప్ర‌భావం చాలా పెరిగిపోయింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు సొంత సామాజిక‌వ‌ర్గ పెత్త‌నం అన్నింటా క‌నిపిస్తోంది. రాజ‌ధాని ఎంపిక నుంచి క్యాబినెట్ బెర్తుల వ‌ర‌కూ అన్నింటా వారిదే ఆధిప‌త్యమ‌న్న విష‌యం సుస్ప‌ష్టం. దాంతో ఇప్పుడు క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో కూడా మ‌ళ్లీ చంద్ర‌బాబు క‌మ్మ ని రాగ‌మే ఆల‌పిస్తారా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు క్యాబినెట్ లోని 19 మంది మంత్రుల్లో ఆయ‌న‌తో క‌లుపుకుని 5గురు క‌మ్మ సామాజిక‌వ‌ర్గ మంత్రులున్నారు. చంద్ర‌బాబు, కామినేని, దేవినేని, ప్ర‌త్తిపాటి, ప‌రిటాల సునీత క్యాబినెట్ లో ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక రావెల కిషోర్ బాబు, పీత‌ల సుజాత ద‌ళిత కోటాలో మంత్రులు కాగా, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, పొదిలి నారాయ‌ణ‌, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు,Read More


ఆ ఘ‌ట‌న ధోని పై బ‌ల‌మైన ముద్ర‌వేసింది..!

2007లో జరిగిన వరల్డ్ కప్ తర్వాత జరిగిన పరణామాలు తనను బాగా ప్రభావితం చేశాయని పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోనీ చెప్పాడు. వెస్టిండీస్‌లో జరిగిన 2007 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ నాకౌట్ ధశలోనే ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌పై 191 పరుగులకే ఆలౌటై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండోది శ్రీలంక జట్టుపై 69 పరుగుల తేడాతో ఓడింది. ఒక్క బెర్ముడా జట్టుపై మాత్రం 257 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే టోర్నీ నుంచి నిష్క్రమించిన అనంతరం భారత్ చేరుకున్న టీం ఇండియాపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అప్పటి ఒక సన్నివేశాన్ని ధోని తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి తాను, సెహ్వాగ్ పోలీస్ వ్యాన్‌లో వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పుడు చికటి పడుతున్నప్పటికీRead More


ఏపీ క్యాబినెట్ లో వీరికే అవ‌కాశం..!

చంద్ర‌బాబు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు కూడా ప్రారంభించారు. తొలిసారి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆశించి..చివ‌రి క్ష‌ణంలో కోల్పోయిన వాళ్లు, ఎమ్మెల్యేలుగా ఓడిపోవ‌డంతో అవ‌కాశాలు చేజార్చుకున్న‌వాళ్లు.. సామాజిక పొందిక‌లో ఛాన్స్ ద‌క్క‌ని వాళ్లు…మంత్రి ప‌ద‌వుల మీద ఆశ‌తో సైకిల్ ఎక్కిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇలా అనేక‌మంది ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే రెండున్న‌ర సంవ‌త్స‌రాలు పూర్తికావ‌స్తున్నా..మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఊసే వినిపించ‌క‌పోవ‌డం..ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ ఉండ‌డంతో నిరాశ చెందిన వారంతా ఇప్పుడైనా మోక్షం ద‌క్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. అమాత్యా అనిపించుకోవాల‌ని ఆశ‌తో ఉన్నారు. అయితే చంద్ర‌బాబు నుంచి ఈ విష‌యంలో ఇప్ప‌టికీ స్పష్ట‌త రాలేదు. ఇటీవ‌ల రెండు మూడు సంద‌ర్భాల‌లో లోకేష్ కు అవ‌కాశం ఇవ్వ‌బోతున్న‌ట్టు చేసిన సూచ‌న త‌ప్ప అధినేత నుంచి అస‌లుRead More


కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎపిఎస్‌ఎల్‌పిఆర్‌బి)- పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో కింది విభాగాల్లో స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ (కానిస్టేబుల్‌) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. విభాగం: మెకానిక్స్‌ఖాళీలు: 25 అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఐటిఐ(వైర్‌మెన్/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ డీజిల్‌ మెకానిక్‌/ ఫిట్టర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. విభాగం: డ్రైవర్‌ఖాళీలు: 134 అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటిఐ (వైర్‌మెన్/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ డీజిల్‌ మెకానిక్‌/ ఫిట్టర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. లైట్‌ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్సతోపాటు డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ద్వారా రాత పరీక్ష:Read More