AP

 
 

క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ

625109-shah-modi-bir-bahadur

దేశ రాజ‌కీయాల్లో ఇప్పుడు క‌ర్ణాట‌క కీల‌కం కాబోతోంది. వ‌రుస‌గా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తున్న న‌రేంద్ర‌మోడీకి అస‌లైన ప‌రీక్ష క‌ర్ణాట‌క గ‌డ్డ మీద ఎదురుకాబోతోంది. ముఖ్యంగా ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి, సొంత పార్టీలో పెరుగుతున్న అస‌మ్మ‌తి స్వ‌రాలు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో నిర‌స‌న‌లు, చివ‌ర‌కు పార్ల‌మెంట్ ని కూడా న‌డిపించ‌లేక చేతులెత్తేసిన వైఫ‌ల్యాలు క‌లిసి మోడీని ఇర‌కాటంలోకి నెట్టాయి. ఈ ద‌శ‌లో కాంగ్రెస్ కి కొత్త ఊపు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో క‌న్న‌డ ఓట‌ర్ల తీర్పు వెలువ‌రించాల్సి రావ‌డం క‌మ‌ల‌ద‌ళానికి కాస్త క‌ష్టంగా మారింది. అదే ఇప్పుడు మోడీ వ్య‌తిరేకుల‌కు ఆశాభావంగా మారింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాల‌యితే అది దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మ‌లుపు కాగ‌ల‌ద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. విప‌క్షాల‌కు కొత్త శ‌క్తి చేకూరుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొత్త ఫ్రంట్ కోసం ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండ‌డం, విప‌క్షాల‌నుRead More


బాబు ఆశ‌ల‌కు నీళ్లొదులుకోవాల్సిందే..!

Chandra-babu-naidu-with-modi

తెలుగు రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామాలు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ, టీఆర్ఎస్ ఉమ్మ‌డిగా చేసిన ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మ‌య్యింది. ఇరు అధికార పార్టీల‌ను ఇరుకున‌పెట్టేలే కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంది. ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి, ప్ర‌తీ ఒక్క‌రికీ సీటు గ్యారంటీ అని చెప్పిన హామీలు వ‌మ్మ‌య్యేలా క‌నిపిస్తోంది. ఇద్ద‌రు చంద్రులు ఇచ్చిన మాట‌ల‌ను నిల‌బెట్టుకోలేని స్థితి క‌నిపిస్తోంది. నియోజ‌క‌ర్గాల పునర్విభ‌జ‌న‌కు మోడీ అడ్డంగా త‌లూపేశారు. దాంతో ఆశ‌లు ఆవిర‌న‌యిన‌ట్టే చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు విప‌క్షాల నుంచి అధికారం వైపు మొగ్గు చూపిన అనేక‌మందికి అవ‌స్థ‌లు త‌ప్పేలా లేదు. అభివృద్ధి కోస‌మేనంటూ పార్టీ మారిన‌ప్పుడు చెప్పిన మాట‌లు ఇప్పుడు అవ‌స్థ‌ల‌కు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. అన‌వ‌స‌రంగా పార్టీ మారామా అనే అనుమానం మొద‌ల‌య్యింది. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ భ‌విష్య‌త్తు ఏమిట‌నే బెంగ కొంద‌రిలో బ‌య‌లుదేరింది. వాస్త‌వానికి ఏపీలో టీడీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ చాలా ఆశ‌ప‌డ్డాయి.Read More


చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భూ క‌బ్జాలు

p madhu cpm

ఏపీలో ప్ర‌భుత్వ తీరును సీపీఎం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. చంద్ర‌బాబు పెద్ద భూ క‌బ్జాకోరులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆపార్టీ నాయ‌కుడు పి మ‌ధు వ్యాఖ్యానించారు. మార్క్సిస్టు పార్టీ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన మాకినేని బసవ పున్నయ్య 25వ వర్ధంతి సభ విజయవాడలోని ఎంబీ భవన్ లో జరిగింది. సభలో సమాకలిన భారతదేశంలో ప్రభుత్వ భూకబ్జాలు అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొ. ప్రవీణ్, సీపీఎం ఏపీ కార్యదర్శి హాజరైయ్యారు. నేతలు బసవ పున్నయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. మాకినేని బసవ పున్నయ్య గొప్ప వ్యక్తి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఆయన ఆశయాలు, సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు జిల్లాల్లో బసవ పున్నయ్య కేంద్రాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం భూసేకరణ పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతోందని, శ్రీకాకుళం జిల్లాలో దళితుల సాగులో ఉన్న 173 ఎకారలనుRead More


బాబు తో చ‌ర్చించి చెబుతామ‌న్న ఏపీ మంత్రులు

miisters on telangana ap issues

చంద్రబాబు నాయుడుతో చర్చించాకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ స్పష్టంచేసింది. ఇప్పటికీ హైదరాబాద్‌ నుంచి కొన్ని విభాగాలు పని చేస్తున్నాయని, ముఖ్యమైన ఫైళ్ళు, ఇతర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్‌కు తెలిపారు. రాజ్‌భవన్‌లో ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీలు మూడో విడత సమావేశమయ్యాయి. ఏపీ తరుపున మంత్రులు యనమల రామకృష్ణ, అచ్చెన్నాయుడు, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ హాజరయ్యారు. ఉద్యోగుల తుది కేటాయింపు, భవనాల అప్పగింత, తొమ్మిది,పది షెడ్యూల్‌ సంస్థల విభజన, తదితర అంశాలపై చర్చించారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై రెండు రాష్ట్రాల ఉన్నతాధకారులు రూపొందించిన నివేదికలపై చర్చRead More


అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకి సిద్ధం

Politician-Rajnath-Singh

బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల‌కు సంబందించిన బిల్లు పార్ల‌మెంట్ లో ప్ర‌వేవ‌పెడ‌తామ‌ని కేంద్రం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల‌లో అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. ఏప్రిల్ 12 వ‌ర‌కూ జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లోగా బిల్లు సిద్ధం చేస్తామ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ఈ స‌మావేశాల్లో సాధ్యం కాక‌పోతే వ‌చ్చే స‌మావేశాల్లోగా బిల్లును సిద్ధం చేస్తామ‌ని హోం మంత్రి తెలిపారు. దాంతో కేంద్రం ప్ర‌క‌ట‌న తెలుగు రాష్ట్రాల అధికార ప‌క్షాల‌కు ఊర‌ట‌నిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. స‌రిగ్గా 24 గంట‌ల క్రితం కేంద్రం ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో చేసిన ప్ర‌క‌ట‌న‌కు తాజాగా రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్య‌లు భిన్నంగా ఉండ‌డం విశేషం అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నియోజ‌క‌ర‌వ‌ర్గాల పెంపుద‌ల ప్ర‌క‌ట‌న చేయ‌డం వ‌ల్ల ఏపీ తో పాటు తెలంగాణాలోనూ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుద‌ల ఖాయ‌మ‌నే ప్ర‌చారంRead More


హోదా లేదు- ప్యాకేజీ ఇప్పుడే రాదు..!

jaitly

ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయమై కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడులు బుధవారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ఉదయం నుంచి కొనసాగిన హైడ్రామాకు ముగింపుగా ఏపీ హోదా ఇవ్వబోమని, అలాగని ప్రత్యేక ప్యాకేజీనీ ప్రకటించలేమని కేవలం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మాత్రమే అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమైన సుజనాచౌదరి, ఎంపిలు సిఎం రమేష్‌, కొనకళ్ల నారాయణలు ప్రకటన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కార్యాలయానికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. తరువాత మళ్లీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో హోదా అంశాన్ని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(ఎన్‌డిసి)కి పంపాలని కేంద్రం యోచిస్తున్నట్లుRead More


కొత్త‌దారిలో ఇద్ద‌రి చంద్రులు..!

telangana-chief-minister-k-chandrasekhar-rao-and-371436

ఉభ‌య తెలుగురాష్ట్రాల‌లోనూ ఇద్ద‌రు చంద్రుల వెలిగిపోతున్నారు. తెలుగు ప్ర‌జ‌ల‌ను పంచుకుని ఏలుతున్నారు. అయితే విధానాల ప‌రంగా ఇద్ద‌రిలో పెద్ద తేడాలు క‌నిపించ‌క‌పోవ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఇద్ద‌రూ చ‌దువుకున్న‌ది ఒకే బ‌డి కాబ‌ట్టి పెద్ద‌గా వైరుధ్యం క‌నిపించ‌డం లేదు. ప్ర‌చారంలోనూ, ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్టడిచేయ‌డంలోనూ ఉన్న సావ‌కాశాలు వినియోగించుకోవ‌డంలో బేధాలు ఉండ‌వ‌చ్చు గాక కానీ ప‌నుల్లో పెద్ద మార్పు ఉండ‌దు. అయితే ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల స్వ‌రాల్లో కొంత వైరుధ్యం క‌నిపించింది. స్వ‌తంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సాక్షిగా ఇటు హైద‌రాబాద్ లోనూ, లఅటు అనంత‌పురంలో అదే ప‌రిస్థితి. చంద్ర‌బాబు , కేసీఆర్ కూడా దారి మార్చేస్తున్న‌ట్టు సంకేతాలు వినిపించాయి. కేసీఆర్ చాలాకాలంగా స్వ‌తంత్ర్య రాజ‌కీయ విధానాన్ని అవ‌లంభిస్తున్నారు. కేంధ్రంతో క‌య్యానికి దిగ‌కుండానే వియ్యం మాత్రం పొంద‌లేదు. అదే స‌మ‌యంలో తెలంగాణా బీజేపీని మాత్రం వెంటాడుతున్నారు. క‌మ‌లం తెలంగాణా శ్రేణుల్లో కాక‌పుట్టిస్తున్నారు.Read More


మీరు తేల్చ‌క‌పోతే రోడ్డెక్కేస్తాం..!

Mudragada

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే తాము అడుగుతున్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు ఈ నెల ఆఖరుతో ముగుస్తుందని, అలాగే మంత్రివర్గ ఉపసంఘం గడువు కూడా సెప్టెంబర్ 7న ముగుస్తుందని.. అందువల్ల ఇచ్చిన హామీ నెరవేరుస్తారో.. రోడ్డెక్కమంటారో చంద్రబాబు తేల్చుకోవాలని పేర్కొన్నారు. కడపలో ఒక వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని ఘటనలో చంద్రబాబు చాలా మందిని ఇబ్బందులకు గురి చేశారన్నారు. గడువు ముగిసేలోగా హామీల అమలు ప్రక్రియ మొదలు కాకపోతే మరలా తాము రోడ్డెక్కక తప్పదని ఆయన హెచ్చరించారు. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడటం తగదని విమర్శించారు.


ఏపీ, తెలంంగాణా ఒక‌టే కోరుకున్నాయి..!

ap telangana

కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు మళ్ళీ పంపకం చేయాలని ఏపి, తెలంగాణలు వాదించాయి. కృష్ణా నది జలాల కేటాయింపులపై జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట రెండో రోజు జరిగిన విచారణలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు వాదనలు వినిపించాయి. తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ తొలుత ట్రిబ్యునల్‌ ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించారు. కేవలం రెండు రాష్ట్రాల మధ్యే నీటి పంపకాల కోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదని, మొత్తం నదీ జలాల పంపకానికి ఏర్పాటుచేశారన్నారు. ప్రాజెక్టుల వారీగా నదీ జలాల కేటాయింపులు జరపాలన్నారు. ఏపి, తెలంగాణ మధ్యే నీటి కేటాయింపులు జరపాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. పునర్విభజన చట్టాన్ననుసరించి నీటి కేటాయింపులు ఎందుకు జరపకూడదని ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌ 500 టిఎంసిల నీటిని కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు మళ్ళిస్తోందని,Read More


బోగీల వర్క్‌షాప్‌ అక్కడే…

workshop

కర్నూలు జిల్లాలో రైల్వేశాఖ రైలు బోగీల మధ్యంతర పునరుద్ధరణ  కేంద్రం ఏర్పాటు చేయనుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ వర్క్‌షాప్‌ ఏర్పాటుపై త్వరలోనే టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. యూపీఏ హయాంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కర్నూలుకు రూ.282 కోట్లతో ఎంఎల్‌డబ్ల్యూను కేటాయింపజేశారు. తదనుగుణంగా ఈ ప్రాజెక్టును 2013 రైల్వేబడ్జెట్‌లోనూ ప్రకటించగా దీనికి దాదాపు 283 ఎకరాలు అవసరమవుతాయి. ఇందులో ఇ.తాండ్రపాడు, పంచలింగాల గ్రామాల్లో 123 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు కేటాయింది. అయితే, ఈ ప్రదేశానికి రైల్వేలైన్‌ అవసరం కాగా అది ప్రారంభమయ్యే ప్రాంతం తెలంగాణలో ఉండటంతో ఆ రాష్ట్రంలో 20 ఎకరాలు సేకరించాల్సి వచ్చింది. దీనిపై ఏడాదిగా అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ప్రాజెక్టుకు కావాల్సిన మొత్తం భూమిని ఇటీవలేRead More